ScienceAndTech

పాములకు రెండు నాలుకలు ఉండడానికి కారణమేంటో తెలుసా?

పాములకు రెండు నాలుకలు ఉండడానికి కారణమేంటో తెలుసా?

ఎవరైనా అక్కడి మాటలు ఇక్కడ చెప్పినా, లేదా రెండు రకాలుగా మాట్లిడినా రెండు నాలుకలున్న పాములా చేస్తున్నావంటారు.ఎందుకంటే పాముకు రెండు నాలుకలు ఉంటాయి.అసలు అలా ఎందుకు ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.దేవతలు, రాక్షసులు కలిసి క్షీర సాగర మథనం చిలికిన విషయం అందరికీ తెలిసిన విషయమే.అయితే వాసుకి అనే పామును తాడుగా వాడి, గిరి పర్వతాన్ని కవ్వంగా వాడి ఓ వైపు దేవతలు, మరోవైపు రాక్షసులు పట్టుకొని పాల సముద్రాన్ని చిలికారు.అయితే అందులోంచి ఎన్ని వస్తువులు ఉద్భవించిన అనంతరం అమృతం పుట్టింది.దాని కోసం దేవతలు, రాక్షసులు తెగ పోటీ పడ్డారు.ఒకరినొకరు కొట్టుకుంటా అమృతాన్ని చేజిక్కించుకోవాలనుకుంటారు.దేవతలు, రాక్షసుల గొడవను గుర్తించిన శ్రీ మహా విష్ణువు జగన్మోహిని రూపంలో వారి వద్దకు వస్తాడు.వయ్యారాలు ఒలకబోస్తూ… రాక్షసుల ముందు తిరగడంతో… ముగ్ధ మనోహరులైన వారు అమృతాన్ని దేవతలకు, రాక్షసులకు సమంగా పంచమని కోరతారు.అందుకు ఒప్పుకున్న జగన్మోహిని దేవతలను, రాక్షసులను కూర్చోబెట్టి… దేవుళ్లకు అమృతం పోస్తూ… రాక్షసులను తన అందంతో మభ్య పెడుతుంది.రాహువు అనే రాక్షసుడు ఆ విషయాన్ని గ్రహించి దేవతల పంక్తిలో కూర్చుంటాడు.అది గమనించిన సూర్య చంద్రులు శ్రీ మహా విష్ణువుకు సైగ ద్వారా తెలియ జేస్తారు.వెంటనే జగన్మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహా విష్ణువు తన సుదర్శన చక్రం ద్వారా రాహువు తల నరుకుతాడు.విషయం తెలియని రాక్షసులు అలాగే ఉండిపోతారు.జరిగిన విషయం అంతా చూసిన వాసుకి అనే పాము మాత్రం ఏమీ చేయలేక అలాగే ఉండిపోతుంది.అమృతం అయిపోయిందని తెలిసినప్పటికీ… అమృత కలశంలో ఏమైనా దొరుకుతుందని దానిని నాకుతుంది.కానీ కలశానికి ఉన్న దర్పల పదునుకి వాసుకి నాలుక రెండుగా చీరుకు పోయింది అప్పటి నుంచి వాసుకి సంతానమైన పాములకు నాలుక నిలువునా చీరుకుని ఉండి రెండు నాలుకలు ఉన్నట్లుగా కనిపిస్తుంటింది.