Agriculture

ఏపీకి మళ్ళి మొండిచెయ్యి.. పోలవరం ప్రస్తావనే లేదు. – 01/02/2020

ఏపీకి మళ్ళి మొండిచెయ్యి.. పోలవరం ప్రస్తావనే లేదు. – 01/02/2020

బడ్జెట్ లో ఏపీకి మొండి చేయి..! ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు..విశాఖ రైల్వే జోన్ ప్రకటనా లేదు..పోలవరానికి నిధుల ఊసే లేదు..రెవిన్యూలోటు భర్తీ చేసే ప్రకటన చేయలేదు.. వేగంగా కొనసాగుతున్న ప్రైవేటీకరణ ప్రక్రియను మాత్రం..ఆపేది లేదని చెప్పకనే చెప్పింది సీతమ్మ తల్లి..! ఇంకెందుకు ఈ బడ్జెట్..

* ముగిసిన బడ్జెట్‌ ప్రసంగం.. లోక్‌సభ రేపటికి వాయిదా
ముగిసిన బడ్జెట్‌ ప్రసంగం.. లోక్‌సభ రేపటికి వాయిదా. దాదాపు గంటన్నరపాటు బడ్జెట్‌ ప్రసంగం కొనసాగింది. కేంద్ర బడ్జెట్‌ 2022 లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. 2022-23 మొత్తం బడ్జెట్‌ విలువ రూ. 39 లక్షల 45 వేల కోట్లు. 2022-23 మొత్తం వనరుల సమీకరణ రూ. 22.84 లక్షల కోట్లు. ద్రవ్యలోటు 6.9 శాతం. రూ.17 లక్షల కోట్ల లోటు బడ్జెట్‌.