DailyDose

TNI నేర వార్తలు – 02/02/2022

TNI  నేర వార్తలు – 02/02/2022

* పని కోసం ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చిన కార్మికులను మోసం చేస్తున్న ఓ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సెంట్రల్ జోన్ జాయింట్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం హైదరాబాద్ సిటీలో కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు, ఆటో డ్రైవర్లు కుమ్మక్కై ఓ గ్యాంగ్‌లాగా ఏర్పడి అమాయక ప్రయాణికులను దోచుకుంటున్నారన్నారు. బతుకు దెరువు కోసం ఇతర రాష్ట్రాలు ప్రాంతాల నుంచి వచ్చే వారిని ఈ గ్యాంగ్ టార్గెట్ చేస్తోందన్నారు. సిటీ రూట్ తెలియని వాళ్ళను బెదిరించి ఆటోలో ఎక్కించుకుని తిప్పి వారిని దోచుకుంటున్నారని ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎనిమిది కార్మికులు ఈ నెల 29 న కరీంనగర్ లో ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పని కోసం వచ్చారని ఆయన పేర్కొన్నారు. అయితే ముందుగా వీరంతా ఎంజీబీఎస్‌లో దిగాలన్నారు. కానీ ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం దగ్గర అర్ధరాత్రి 12 గంటలకు దిగారన్నారు. తమకు సిటీ తెలియక పోవడంతో అదే అంబేడ్కర్ విగ్రహం ఉన్న ప్రాంతాన్ని ఎంజీబీఎస్‌ అనుకున్నారని ఆయన తెలిపారు.

* ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీ పేలిన ఘటన హైదరాబాద్‌లోని చింతల్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. చింతల్, భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన రఫి కొంతకాలంగా ఎలక్ట్రిక్ స్కూటీ నడుపుతున్నాడు. ప్రతి రోజు రాత్రి పూట బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెట్టేవాడు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి తన స్నేహితుడు సాయికుమార్ ఇంట్లో చార్జీంగ్ పెట్టాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో బ్యాటరీ నుంచి పొగలు రావడం సాయి గమనించాడు. వెంటనే అప్రమత్తమైన ఆయన పక్క రూమ్‌లో స్విచ్ ఆఫ్ చేసేందుకు వెళ్లగానే బ్యాటరీ పేలిపోయింది. ఆ పేలుడు ధాటికి ఇంట్లో సామానులు కొంత మేర దగ్ధమైనట్లు సమాచారం.

*రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో కల్తీ కల్లు తాగి నలుగురు గిరిజనులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడికి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్సను అందిస్తున్నారు. లోదొడ్డిలో కల్తీ కల్లు తాగిన ఐదుగురులో నలుగురు మృతి చెందటంతో గ్రామంలో విషాద చాయలు నెలకొంది. కల్తీ కల్లు తాగి మృతి చెందిన వారిలో వేమ లోవరాజు (28), చెదల సుగ్రీవ్ (70), లు బుసరి సన్యాసిరావు (65), పుత్తూరు గంగరాజు(36) ఉన్నారు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఏసుబాబు పరిస్థితి విషమంగా ఉంది. ఈరోజు ఉదయం కల్తీ కల్లు తాగిన ఐదుగురుకి కడుపులో మంట, వాంతులు అయ్యాయి. అనంతరం కొద్ది సేపటికే నలుగురు మృతి చెందారు. కల్తీ కల్లుపై జండంగి పోలీసులు విచారణ చేపట్టారు.

*రూ.30 అదనంగా ఇవ్వలేదని కస్టమర్ను టైలర్ కత్తెరతో పొడిచి గాయపరిచిన సంఘటన ముంబయిలోని అంధేరి ప్రాంతంలో జరిగింది. ప్యాంటు ఆల్ట్రేషన్ విషయంగా మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది.

* పోలీసుల వేధింపులు తాళలేక గుత్తిలో కోట ప్రాంతానికి చెందిన మట్కా నిర్వాహకుడు మహబూబ్ బాషా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రూ.5 లక్షలు తీసుకురావాలని ఒత్తిడి చేయడంతో పాటు చితకబాదడంతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బాషాను చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

* ప్రకాశం జిల్లాలోని దర్శి మండలం పోతవరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. భార్య కొత్తా పావని పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం పావనిని ఒంగోలు హాస్పిటల్‌కు తరలించారు. దాడి చేసిన భర్త సాయికుమార్‌ పరారీలో ఉన్నాడు.పావని దంపతులు గత నెల 18న ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్త వేధిస్తున్నాడని పావని పెట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త సాయికుమార్‌.. పావనిపై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది

* విశాఖ రైల్వే న్యూ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పాయిజన్ తీసుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అక్కయ్యపాలెంలో “గ్లాస్ వరల్డ్” అద్దాలు షాపును నడుపుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆత్మహత్యాయత్నానికి ఆర్థికఇబ్బందులు కారణంగా తెలుస్తోంది. పాయిజన్ తీసుకోవడంతో మతిస్థిమితం లేక నలుగురు బాధితులు తమ వివరాలను చెప్పలేకపోతున్నారు. నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

*ప్రముఖ పారిశ్రామికవేత్త, పల్లవా గ్రానైట్స్ అధినేత డాక్టర్ కొడవలూరు సుబ్బారెడ్డి ఇంట విషాదం నెలకొంది. చెన్నై – మదురై జాతీయ రహదారిలో చెంగల్పట్టు సమీపంలో జీపు అదుపు తప్పడంతో సోమవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో సుబ్బారెడ్డి సోదరుడి భార్యాకుమారులు భారతిరెడ్డి (60), డాక్టర్ శ్రీహిమవర్ష్ (27) దుర్మరణం చెందారు.

*రాణీపేట అన్నా అవెన్యూలో నివశిస్తున్న అన్నాడీఎంకే నాయకుడు, రాణీపేట నగర్ కో-ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ సుకుమార్ ఇంట్లో రూ.50 లక్షల చోరీ జరిగింది. గత శనివారం సుకుమార్ ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా చెన్నై వెళ్లారు. మంగళవారం ఉదయం ఆ ఇంటి తలుపు తెరిచివుండడం గుర్తించిన పనిమనుషులు లోనికి వెళ్లి చూడగా చోరీ జరిగినట్లు అర్థమైంది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ప్రభు, ఎస్సై పార్థసారధి తమ సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అదేవిధంగా నిపుణులు వేలిముద్రలను సేకరిం చారు. ఇంట్లో వున్న రూ.50 లక్షలు చోరీ జరిగినట్లు సుకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా ఇంట్లో వున్న బంగారు నగలు, విలువైన వస్తువులను కూడా దుండగులు దోచుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

*కృష్ణా జిల్లా వత్సవాయి మండలం పరిధిలోని కన్నెవీడు గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి బాణావతి ఆకాష్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. రావులపాలెం సమీపంలోని కన్యకా పరమేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో ఆకాష్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కళాశాల సమీపంలోని కాల్వలో మృతదేహాన్ని గుర్తించిన యాజమాన్యం… తల్లిదండ్రులకు సమాచారం అందించింది. ఆకాష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*అంతర్ర్రాష్ట్ర డ్రగ్స్ స్మగ్లర్ల ముఠాను రాచకొండ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నైజీరియన్తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాచకొండ సీపీ మహేష్ భగవత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటి పోలీసులు అరెస్టు చేశారన్నారు.

*అంతర్రాష్ట్ర డ్రగ్స్ స్మగ్లర్ల ముఠాను రాచకొండ ఎస్వోటీ అదుపులోకి తీసుకున్నారు. నైజీరియన్తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 9 లక్షల విలువైన 38 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

*డ్రగ్స్ కేసులో రాజాంకు చెందిన ప్రముఖ వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజాంలో ఈఎన్టీ వైద్యుడిగా పృథ్విరాజ్ గుర్తింపు పొందారు. డ్రగ్స్ కేసులో విశాఖలో పట్టుబడ్డ ముఠాతో డాక్టర్కు సంబంధాలు ఉన్నట్టు పోలీసులు అనుమానించారు. హైదరాబాద్కు చెందిన మాలవ్య అనే యువతికి డాక్టర్ పృథ్వి అకౌంట్ నుంచి నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. ఇదే కేసులో హైదరాబాద్కు చెందిన గీత, మాలవ్య, విశాఖకు చెందిన హేమంత్ అరెస్ట్ అయ్యారు. హేమంత్కు డాక్టర్ పృథ్విరాజ్ స్నేహితుడు.

*కడలూరు సమీపంలో శిధిలావస్థకు చేరిన ఇళ్లు కూలిన ఘటనలో ఇద్దరు ప్లస్ టూ విద్యార్థులు మృతిచెందిన ఘటన విషా దానికి దారితీసింది. ఎస్.పుదూర్ వండికుప్పం సమత్తువపురంలో 2013లో శ్రీలంక శరణార్ధుల కోసం కట్టిన ఇళ్లలో ప్రస్తుతం ఎవరూ లేక శిధిలా వస్థకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో, బుధవారం ఉదయం ఓ ఇంటి సమీపంలో వీరశేఖర్ (16), సుధీష్కుమార్ (16), భువనేశ్వరన్ (16) సహా మరికొందరు విద్యార్థులు ఆడుకుంటున్నారు. అంతలో ఊహించని విధంగా ఇళ్లు కూలిపడడంతో ముగ్గురు శిధిలాల కింద చిక్కుకు పోయారు. చుట్టు పక్కల వారు అక్కడకు చేరుకొని శిధిలాలు తొలగించి చూడగా, వీరశేఖర్, సుధీష్కుమార్ మృతిచెందగా, భువనేశ్వరన్కు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమ్తితం కడలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కడలూరు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

*కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్లలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గాండ్ల కిట్టు(50) అనే వ్యక్తిని ప్రత్యర్ధులు కిరాతకంగా హత్య చేశారు. బహిర్భూమికి వెళ్తున్న కిట్టుపై కత్తులు, ఇనుపరాడ్లతో ప్రత్యర్థులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన కిట్టు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పొలం తగాదా విషయంలోనే హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

*పాకిస్థాన్ దేశంలోని సింధ్ ప్రావిన్స్లోని ఘోట్కీ జిల్లాలో హిందూ వ్యాపారి సైతాన్ లాల్ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.ఈ ఘటన సింధ్లోని ఘోట్కీ జిల్లాలోని దహర్కి టౌన్లో జరిగింది.పాకిస్థాన్లో మైనారిటీ వర్గాలపై జరిగిన అకృత్యాలకు సంబంధించిన తాజా ఘటన ఇది. జనవరి 4న సింధ్ ప్రావిన్స్లోని అనాజ్ మండీలో మరో హిందూ వ్యాపారి సునీల్ కుమార్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. వ్యాపారవేత్త హత్య నగరంలో షట్డౌన్కు దారితీసింది.జనవరి 30న పాకిస్థాన్లోని వాయువ్య పెషావర్ నగరంలో గుర్తుతెలియని ముష్కరులు కాల్పులు జరిపి ఒక క్రైస్తవ మతగురువును కాల్చి చంపారు. పాకిస్థాన్ దేశంలో తరచూ మైనారిటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.

*సింగరేణి గని మేనేజర్ అనుమానాస్పద మృతి భూపాలపల్లి ఏరియాలో మంగ ళవారం కలకలం సృష్టించింది. నడిరోడ్డుపై సొంత కారు లో ఆయన విగతజీవిగా పడి ఉన్నారు. దీంతో కొందరు ఆత్మహత్యగా భావిస్తుండగా, ఒంటిపై చర్మం కాలిన గా యాల్లా ఊడిపోయి ఉండటంతో ఎవరైనా హత్య చేసి ఉంటారని మరికొందరు అనుమానిస్తున్నారు.

*నార్కట్ పల్లి మండలం, ఎల్లారెడ్డి గూడెం వద్ద ఐడిబిఐ బ్యాంక్ ఏటీఎంలో దొంగలు చోరీకి యత్నించారు. మిషిన్ లాకర్ తెరుచుకోక పోవడంతో వెనుదిరిగారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది.