Movies

ఆస్కార్​ హోస్ట్​గా రెజీనా!

ఆస్కార్​ హోస్ట్​గా రెజీనా!

ఈ సారి ఆస్కార్​ 94వ ఎడిషన్ అకాడమీ అవార్డ్స్​ కార్యక్రమానికి ముగ్గురు హోస్టులుగా వ్యవహరించనున్నారు. వాండా సైక్స్, అమీ షుమెర్, రెజీనా హాల్​లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.ఆస్కార్ 2022,​ 94వ ఎడిషన్ అకాడమీ అవార్డ్స్​ కార్యక్రమంలో హోస్ట్​గా ఈ సారి ముగ్గురిని నియమించారు. వాండా సైక్స్, అమీ షుమెర్, రెజీనా హాల్​లను ఎంపిక చేశారు. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని ‘గుడ్​ మార్నింగ్ అమెరికా’ తెలిపింది. మార్చి 27న ఈ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముగ్గురు హోస్ట్​లు ఎలా నిర్వహిస్తారనేది ఆసక్తి నెలకొన్న అంశం. అయితే.. ముగ్గురు షిఫ్ట్​ల వారీగా హోస్ట్​ విధులు నిర్వహిస్తారని సమాచారం. గత ఏడాది అవార్డ్స్​ కార్యక్రమాన్ని కరోనా కారణంగా పరిమిత సంఖ్యతో నిర్వహించారు. దీంతో అత్యంత తక్కువ రేటింగ్ వచ్చింది. ఒమిక్రాన్ ప్రభావం తగ్గిన కారణంగా ఈ సారి ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ముగ్గురు హోస్ట్​లను ఎంపిక చేశారు. ఇందులో వాండా సైక్స్, అమీ షుమెర్ కామిక్​లో పేరు పొందినవారు.