DailyDose

ఆన్ లైన్ లో టిటిడీ దర్శనాలు – TNI నేటి తాజా వార్తలు – 16/02/20202

ఆన్ లైన్ లో టిటిడీ దర్శనాలు  – TNI నేటి తాజా వార్తలు – 16/02/20202

* ఉదయాస్తమాన సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. కోటి రూపాయలు విరాళమిచ్చే భక్తులకు సాధారణ రోజుల్లోనూ, 1.50 కోట్ల రూపాయలు విరాళమిచ్చే భక్తులకు శుక్రవారం నాడు ఈ సేవా టికెట్లు కేటాయించారు. ఉదయాస్తమాన సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. కోటి రూపాయలు విరాళమిచ్చే భక్తులకు సాధారణ రోజుల్లోనూ, 1.50 కోట్ల రూపాయలు విరాళమిచ్చే భక్తులకు శుక్రవారం నాడు ఈ సేవా టికెట్లు కేటాయించారు. సాధారణ రోజుల్లో 501, శుక్రవారం 38 సేవా టికెట్లను తితిదే కేటాయించింది. తిరుపతిలో చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మాణానికి తితిదే విరాళాలు స్వీకరిస్తోంది. ఖాళీ అయిన 531 ఉదయాస్తమాన సేవా టికెట్లను దాతలకు అందుబాటులో ఉంచారు. శుక్రవారమైతే రూ.1.5 కోట్లు, మిగిలిన రోజుల్లో రూ.కోటి దాతలు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. తిరుపతిలో చిన్నపిల్లల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి తితిదే దాతల నుంచి విరాళాలు ఆహ్వానిస్తోంది. ఇందుకోసం బుధవారం ఉదయం 9.30 గంటలకు ఆన్‌లైన్‌లో విరాళాల స్వీకరణ ప్రారంభమవుతుంది. తితిదే వెబ్‌సైట్ https://tirupatibalaji.ap.gov.in ద్వారా దాతలు విరాళాలు సమర్పించవచ్చు.

* శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వైభవంగా త్రిశూల స్నానం
మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తిలో సద్యోముక్తి వ్రతం నిర్వహించారు. సకల దేవతలు కొలువైన త్రిశూలానికి స్వర్ణముఖి నదిలో పండితులు త్రిశూల స్నానం చేయించారు. ర్ణముఖి నది వద్దకు తీసుకువచ్చారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య హోమ పూజలు నిర్వహించారు. సద్యోముక్తి వ్రతం గురించి వేద పండితులు ప్రవచనం చేశారు. అనంతరం నదిలో త్రిశూల స్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావటంతో… స్వర్ణముఖి నది తీరం భక్తజన సంద్రంగా మారింది.

* సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఆధ్యాత్మికం, ఆనందం, ఆహ్లాదం.. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అని చెప్పారు.అడవి తల్లి ఒడిలో కొలువుదీరి, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర బుధవారం ప్రారంభమవుతుందని చెప్పారు. వన దేవతల దర్శనం కోసం వచ్చే లక్షలాది భక్తజనానికి సకల సౌకర్యాలు కల్పిస్తూ రాష్ట్ర సర్కారు స్వాగతం పలుకుతున్నదని ట్వీట్‌ చేశారు. ‘ఆధ్యాత్మికం,ఆనందం,ఆహ్లాదం.. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. అడవి తల్లి ఒడిలో కొలువుదీరి, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర నేటి నుంచి ప్రారంభంకానుంది. వన దేవతల దర్శనం కోసం వచ్చే లక్షలాది భక్తజనానికి సకల సౌకర్యాలు కల్పిస్తూ రాష్ట్ర సర్కారు స్వాగతం పలుకుతోంది.’ అని ఎమ్మెల్సీ కవిత ట్విటర్‌లో పోస్టు చేశారు.

* సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌ రెడ్డి జీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన నేపధ్యంలో సీఎంతో భేటి.

* ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్‌లోని కత్రా-బనిహాల్ సెక్షన్‌లోని సుంబెర్- అర్పించాల రైల్వేస్టేషన్ మధ్య అతి పొడవైన సొరంగాన్ని పూర్తి చేసినట్లు ఉత్తర రైల్వే తాజాగా ప్రకటించింది.కత్రా-బనిహాల్ సెక్షన్‌లో 12.758 కిలోమీటర్ల పొడవు గల ఈ సొరంగం భారతీయ రైల్వేలలోనే అతిపెద్దదని రైల్వే అధికారులు చెప్పారు.పంజాబ్ రాష్ట్రంలోని బనిహాల్-ఖాజిగుండ్ సెక్షన్‌లో 11.2 కిలోమీటర్ల పొడవు గల సొరంగం దేశంలో నే పొడవులో రెండవదిగా రైల్వే అధికారులు పేర్కొన్నారు.ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్ యొక్క 272 కి.మీ పొడవులో, 161 కి.మీ ఇప్పటికే ప్రారంభించారు. కత్రా బనిహాల్ మధ్య 111 కి.మీ మేర పనులు శరవేగంగా సాగుతున్నాయని రైల్వే తెలిపింది

* కొత్తగా ప్రకటించిన పశ్చిమగోదావరి జిల్లాకు నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఖాళీ ప్లేట్లను కొడుతూ నిరసన తెలిపారు. అంతకుముందు నల్ల కండువాలు కప్పుకుని టీడీపీ నేతలు రిలే దీక్షలో పాల్గొన్నారు. మరోవైపు నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ మాజీ మహిళా కమిషన్ సభ్యురాలు రాజ్యలక్ష్య్మి ఆధ్వర్యంలో వనితా క్లబ్ మహిళలు వినూత్న నిరసన చేపట్టారు. కళ్లకు గంతలు, చెవిలో పూలు పెట్టుకుని వింత నిరసన తెలిపారు.

*పురపాలక సంఘాల ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు గురువారం సాయంత్రం 6 గంటల్లోపు ప్రచారం ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో 21 కార్పొరేషన్లు, 138 మున్సిపాలిటీలు, 489 పట్టణ పంచాయతీలకు ఈ నెల 19వ తేదీ ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమిగాను, ప్రతిపక్ష అన్నాడీఎంకే, బీజేపీ, మక్కల్‌ నీది మయ్యం, పీఎంకే, నామ్‌ తమిళర్‌ కట్చి సహా పలు పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పోటీచేస్తున్నారు. ఎన్నికలకు నాలుగు రోజులే ఉండడంతో అభ్యర్థులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. తొలుత ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ప్రచారానికి అనుమతించిన ఈసీ, అభ్యర్థుల కోరిక మేరకు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటలకు వరకు ప్రచార సమయాన్ని పొడిగించింది. ఈ నేపథ్యంలో, ఎన్నికలకు 48 గంటల ముందుగా ప్రచారం నిలిపివేయాల్సి ఉంది. ఆ ప్రకారం గురువారం సాయంత్రం 6 గంటల్లోపు ప్రచారాలు ముగించాలని, సమయం ముగిసిన తర్వాత సభలు, ఇంటింటి ప్రచారం, రోడ్‌షోలు చేపడితే చట్టపరమైన చర్యలు చేపడతామని ఈసీ హెచ్చరించింది.

*మావోయిస్టు లేఖలు కలకలం రేపాయి. తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దు వాజేడు మండలం ధర్మవరం గ్రామ శివారులో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. అధికార పార్టీ కార్యకర్త అల్లి సూరిబాబు పోలీసులకు కోవర్ట్‌గా వ్యవహరిస్తూ.. ఇసుక క్యారీలో దొంగ పట్టాలు చేస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నాడని లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టులు ఇలాంటి వారికి ప్రజా కోర్టులో గుణపాఠం తప్పదని హెచ్చరించారు

* జమ్ముకశ్మీర్‌లో భూమి స్వల్పంగా కంపించింది. కశ్మీర్‌లోని పహల్గామ్‌లో (Pahalgam) బుధవారం ఉదయం 5.43 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 3.2గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. పహల్గామ్‌కు 15 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.

*తెలుగు రాష్ట్రాల అభ్యంతరాలను పట్టించుకోకుండా గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై ముందుకే వెళ్లాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. ఈనెల 18న ఈ అంశంపై ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించనుంది. దీనికి హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నీటిపారుదల శాఖలకు జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) సమాచారం పంపింది. గోదావరి-కావేరి అనుసంధానానికి కట్టుబడి ఉన్నామని బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టంచేసిన విషయ విదితమే. ఆంధ్ర దిగువ రాష్ట్రమైనందున.. తమ ప్రాజెక్టులపై ప్రభావం పడకుండా నదుల అనుసంధానం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ఇదివరకే కోరింది. నీటి లభ్యతపై ఒక్కో అధ్యయనం ఒక్కో నివేదిక ఇస్తుందని, ఏ అధ్యయనంలోనూ సారూప్యత లేదని, సమగ్రంగా నీటి లభ్యతపై అధ్యయనం జరగాలని కూడా పట్టుబట్ఠింది. తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

*టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు, మంత్రి లోకేష్‌ను చంపుతానని ప్రకటించిన వైసీపీ నాయకుడు బూరగడ్డ అనిల్‌కుమార్‌పై టీడీపీ నరసాపురం పార్లమెంట్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు చుక్కా సాయిబాబా మంగళవారం భీమవరం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న అనిల్‌కుమార్‌ మాటలను పరిగణనలోకి తీసుకుని అతడిపై హత్యానేరకం కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశామన్నారు.

* శ్రీకాకుళం జిల్లాలో 25వేల వ్యవసాయ మోటార్లకు మీటర్లు కూడా పెట్టారు. ఇదో పెద్ద గోల్ మాల్.. మిగతా విద్యుత్‌ మీటర్లకు రూ.737 కోట్లతో టెండర్లు పిలిచారు. కేంద్రం చెప్పినట్టు విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయకపోతే తెలంగాణ రాష్ట్రం ఐదేళ్లలో రూ.25వేల కోట్లు నష్టపోయే అవకాశముంది. అయినా సరే, మోటార్లకు మీటర్లు పెట్టబోమని స్పష్టంగా చెప్పాం. కేంద్ర ప్రభుత్వ విధానాలపై మరోసారి విమర్శలు గుప్పించారు.