Movies

అప్పట్లో హీరోయిన్‌ మెటీరియలే కాదన్నారు..

అప్పట్లో హీరోయిన్‌ మెటీరియలే కాదన్నారు..

బాలీవుడ్‌లో అలనాటి హీరోయిన్ మాధురి దీక్షిత్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఈ నటి అందంతో పాటు అభినయంతో 1980 నుంచి 2000 మధ్య ఉన్న యువత మనసులను కొల్లగొట్టింది. ఇప్పటికీ ఈ సినీయర్ నటికి డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి లేదు. అయితే ఈ తార నటిగా కెరీర్ ప్రారంభించిన కొత్తల్లో అసలు హీరోయిన్ మెటీరియలే కాదంటూ కొందరు విమర్శలు చేశారంట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాధురి స్వయంగా తెలిపింది.‘అబోధ్’ అనే మూవీతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన మాధురి 1988లో వచ్చిన ‘తేజాబ్’తో తొలి సక్సెస్ అందుకుంది. అప్పటి నుంచి మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. తన నటనతో జాతీయ అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు సైతం అందుకుంది. ఈ సీనియర్ నటి నటించిన తాజా కిడ్నాప్ డ్రామా ‘ఫేమ్ గేమ్’. ఈ వెబ్‌సిరీస్ ఇటీవలే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి టాక్‌‌ని సొంతం చేసుకుంది. ఈ షో ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఈ తార కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న విమర్శల గురించి పంచుకుంది.