Politics

సింగరేణిలో అవినీతి పెరిగిపోయింది … – TNI రాజకీయ వార్తలు

సింగరేణిలో అవినీతి పెరిగిపోయింది … – TNI రాజకీయ వార్తలు

*సింగరేణిలో అవినీతి పెరిగిపోయిందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణి ప్రైవేటీకరణలో కేంద్రం పాత్ర ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌ను ప్రైవేట్‌పరం చేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే బాధ్యత బీజేపీపై ఉందన్నారు. కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన ఉండదని ఈటల రాజేందర్ దుయ్యబట్టారు.

*అప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వస్తే.. పరిస్థితేంటి ?: మంత్రి అవంతి
రాజధాని ఆగిందంటూ చాలామంది దుష్ప్రచారం ప్రచారం చేస్తున్నారని మరో 50 ఏళ్ల తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వస్తే పరిస్థితేంటని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు. అలాంటి ఇబ్బందులు రాకుండా.. 3 రాజధానులు ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు, ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.అప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వస్తే పరిస్థితేంటి ?రాజధాని ఆగిందంటూ చాలామంది దుష్ప్రచారం ప్రచారం చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలకు, అన్ని ప్రాంతాల అభివృద్ధికీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.మరో 50 ఏళ్ల తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వస్తే ఇబ్బందులు రాకుండా ఉండేందుకే.. 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందుతాయని అన్నారు. కర్ణాటక, ఝార్ఖండ్ కూడా 3 రాజధానులు పెట్టాలని చూస్తున్నాయని మంత్రి తెలిపారు.”రాజధాని ఆగిందని చాలామంది ప్రచారం చేస్తున్నారు. గతంలో అందరూ హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టారు. మరో 50 ఏళ్ల తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వస్తే ఏం చేస్తాం? అన్ని వర్గాల ప్రజలకు, అన్ని ప్రాంతాల అభివృద్ధికీ కట్టుబడి ఉన్నాం. కర్ణాటక, ఝార్ఖండ్ కూడా 3 రాజధానులు పెట్టాలని చూస్తున్నాయి. విశాఖ అంటే సీఎం జగన్‌కు అత్యంత ప్రేమ ఉంది. హిందూపురాన్ని జిల్లా చేయాలని బాలకృష్ణ అడిగారు. రైల్వే జోన్, స్టీల్‌ప్లాంట్‌పై భాజపా నేతలు మాట్లాడాలి.”-అవంతి శ్రీనివాస్, మంత్రి

*2047 తర్వాత దేశంలో యువత సంఖ్య తగ్గే అవకాశం: కిషన్‌రెడ్డి
2047 తర్వాత దేశంలో యువత సంఖ్య తగ్గే అవకాశం ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా చేగూరు కన్హ శాంతివనంలో గ్లోబల్‌ ఎస్ఏ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే 25 ఏళ్లు మనకు అత్యంత విలువైనవని, భారత్‌ను విశ్వగురువుగా మార్చేందుకు ఈ 25 ఏళ్లు కీలకమన్నారు. ఆగస్టు 15న ఇళ్ల ముందు అందరూ జాతీయజెండా ఎగురవేయాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి నటి కృతిశెట్టి, హార్ట్‌ఫుల్‌నెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ గైడ్‌ కమలేశ్‌ డి.పాటిల్‌, యునెస్కో ఎంజీఐఈపీ డైరెక్టర్‌ అనంత దురయప్ప తదితరులు హాజరయ్యారు.

*పంజాబ్‌కు నిజాయితీగల సీఎం దొరికాడు: కేజ్రీవాల్
పంజాబ్‌కు చాలా కాలం తర్వాత నిజాయితీ గల ముఖ్యమంత్రి దొరికాడని భగవంత్ మాన్‌ను ఉద్దేశించి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసుకున్న అనంతరం.. మొదటిసారి పంజాబ్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఈ షోకు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఇప్పుడు ఖర్చు చేయబోయే ప్రతి పైసా ప్రజలకే చేరుతుంది. ఎన్నికలప్పుడు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతాం. చాలా కాలం తర్వాత పంజాబ్‌కు నిజాయితీ గల ముఖ్యమంత్రి దొరికాడు. సంతోషమైన పంజాబ్‌ను మీరు తొందర్లోనే చూస్తారు’’ అని అన్నారు.

*ఏపీలో పోలీసుల పరిస్థితి దయనీయంగా ఉంది: అనగాని
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ రాశారు. ఏపీలో పోలీసుల పరిస్థితి దయనీయంగా ఉందని, డీఏ, అలవెన్సులు లేక పోలీసులు ఇబ్బంది పడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. పోలీసులకు ఇచ్చిన వారాంతపు సెలవు హామీని సీఎం జగన్‌ నిలబెట్టుకోవాలని కోరారు. పోలీసుల సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని ఎమ్మెల్యే అనగాని ఆ లేఖలో పేర్కొన్నారు.

*అది బీజేపీ కార్యకర్తలందరి సమిష్టి కృషి: పురంధేశ్వరి
ఉత్తరప్రదేశ్ గెలుపు ఒక నాయకుడి విజయం కాదని, అది బీజేపీ కార్యకర్తలందరి సమిష్టి కృషి అని ఆ పార్టీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి అన్నారు. ఆదివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి కార్యకర్తలే బలమని పేర్కొన్నారు. ఏపీ రాష్ట్రాభివృద్ధిపై సీఎం జగన్‌కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఏపీని అప్పుల ఊబిలోకి తీసుకెళ్లారని పురంధేశ్వరి ఆరోపించారు.రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చే పరిస్థితిలేదని పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. ఉన్న పరిశ్రమలు కూడా వెనక్కివెళ్లిపోతున్నాయని, ఏపీలో రహదారుల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రతి అభివృద్ధి పనిలో కేంద్రం సాయం ఉందని, జగన్ సర్కార్ చేస్తున్న అభివృద్ధి శూన్యమని పురంధేశ్వరి పేర్కొన్నారు.

**భవిష్యత్‌ బాగుపడాలంటే ప్రజలు వైసీపీకి ఓటు వేయొద్దు: విష్ణుకుమార్‌రాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్‌రెడ్డి ప్రభుత్వం దోపిడీ చేస్తోందని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్‌ బాగుపడాలంటే ప్రజలు వైసీపీకి ఓటు వేయొద్దని పిలుపిచ్చారు. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇంతవరకు ఎక్కడా చూడలేదన్నారు. తక్షణమే జీవో 36ను ప్రభుత్వం రద్దు చేయాలని విష్ణుకుమార్‌ రాజు డిమాండ్ చేశారు.

*జగన్ పాలనలో మద్యం ఏరులై పారుతోంది: జవహర్
సీఎం జగన్ పాలనలో మద్యం ఏరులై పారుతోందని మాజీమంత్రి జవహర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సారాయి సరఫరా ప్రభుత్వ కనుసన్నలలో జరగడం దారుణమన్నారు. జగన్ పాలన మొదటి ఏడాది గంజాయి, నాసిరకం మద్యంతో గడచిందని దుయ్యబట్టారు. రెండో ఏడాది డ్రగ్స్, మూడో ఏడాది నాటు సారాతో గడిచిందని తెలిపారు. ఇక మిగిలిన రెండేళ్లు ప్రభుత్వం దేనిపై దృష్టి పెట్టనుందో చెప్పాలని జవహర్ డిమాండ్ చేశారు.

*ఏపీలో పోలీసుల పరిస్థితి దయనీయంగా ఉంది: అనగాని
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ రాశారు. ఏపీలో పోలీసుల పరిస్థితి దయనీయంగా ఉందని, డీఏ, అలవెన్సులు లేక పోలీసులు ఇబ్బంది పడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. పోలీసులకు ఇచ్చిన వారాంతపు సెలవు హామీని సీఎం జగన్‌ నిలబెట్టుకోవాలని కోరారు. పోలీసుల సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని ఎమ్మెల్యే అనగాని ఆ లేఖలో పేర్కొన్నారు.

*సీబీఐకి పెద్దశక్తుల అడ్డంకులు: వర్ల
వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తునకు కొన్ని పెద్దశక్తులు అడ్డుపడుతున్నాయని అందరూ అనుకుంటున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పేర్కొన్నారు. ఈ అంతఃపుర రహస్యాన్ని ఛేదించడం సీబీఐకి పెద్ద పనేమీ కాదని, అయితే సీబీఐకి ఉన్న అడ్డంకులు తొలగిపోతే, వాస్తవాలన్నీ బయటకు వస్తాయని శనివారం ఆయన ట్వీట్‌ చేశారు.

*టీడీపీకి 5-10 ఎమ్మెల్యే సీట్లే: మంత్రి పెద్దిరెడ్డి
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి కేవలం ఒకటో, అరో పార్లమెంట్‌ సీటు, ఐదో, పదో ఎమ్మెల్యే సీట్లు తప్ప ఇంకేం మిగిలే పరిస్థితి లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎన్నికలకు సిద్ధమంటూ ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓడిపో యే పార్టీకి ఎన్నికలు ఎప్పుడొస్తే ఏంటని అన్నారు. చంద్రబాబు మతి లేకుండా తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. సంక్షేమం, అభివృద్ధి అనేవి సీఎంకు రెండు కళ్లని, అందుకే బడ్జెట్లో తగిన నిధులు కేటాయించారని ప్రశంసించారు.

*25 మంది మంత్రులనూ తొలగిస్తారు: బాలినేని
‘‘మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఖాయమని ఆరు నెలల క్రితమే చెప్పా. 25 మందినీ తొలగిస్తారని వెల్లడించాను. కొత్త కేబినెట్‌లో ఎవరు మంత్రులుగా ఉండాలన్నది సీఎం నిర్ణయిస్తారు. దాన్ని మేం శిరసావహిస్తాం’ అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

*ముందస్తు’కు వెళ్లే ప్రసక్తే లేదు: సజ్జల
రాష్ట్రంలో వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటు పరిపాలించేందుకు ప్రజలు తమను గెలిపించారని, తగ్గించుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. శనివారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలపై కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తన పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ముందస్తు రాగం తీస్తున్నారని వ్యాఖ్యానించారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సజ్జల వెల్లడించారు.

*టీఆర్ఎస్‌కు రెబ‌ల్‌గా మారాల్సిన అవ‌స‌రం లేదు : మాజీ మంత్రి తుమ్మ‌ల
టీఆర్ఎస్ నాయ‌కులు, మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ఎస్‌కు రెబ‌ల్‌గా మారాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. వ్య‌క్తిగ‌త ల‌బ్ధి కన్నా పార్టీ నిర్ణ‌య‌మే త‌న‌కు ముఖ్య‌మని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా ప్ర‌జాప్ర‌తినిధుల న‌డ‌వ‌డిక ఉండాల‌న్నారు. సీఎం కేసీఆర్ పాల‌నాద‌క్ష‌త‌పై ప్ర‌జ‌ల‌కు అపార న‌మ్మ‌కం ఉంద‌న్నారు. పార్టీ నిర్ణ‌యం, ప్ర‌జాభిప్రాయం మేర‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. పార్టీ మారుతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు తీవ్రంగా ఖండించారు.