Movies

USలో 11 మిలియన్ల మార్క్‌ను అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’

USలో 11 మిలియన్ల మార్క్‌ను అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకున్న ఈ మూవీ కలెక్షన్ల పరంగాను కుమ్మేస్తోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో భారీగా కలెక్షన్లు కొల్లగొడుతోంది. యూఎస్‌లో ఈ మూవీని సరిగమ సినిమాస్, రఫ్తార్ క్రియేషన్స్ దాదాపు 1150కు పైగా లొకేషన్స్‌లో విడుదల చేయడంతో భారీ వసూళ్లు రాబడుతోంది. తాజాగా 11మిలియన్ల(రూ.83.59కోట్లు) మార్క్‌ను అందుకుంది. ఈ విషయాన్ని సరిగమ సినిమాస్, రఫ్తార్ క్రియేషన్స్.. ట్విటర్ ద్వారా వెల్లడించాయి. ఇక ప్రీమియర్స్, తొలిరోజు కలెక్షన్లు కలిపి 5మిలియన్ల మార్క్‌ను(రూ.38.13) దాటేసిన ఈ సినిమా.. ‘బాహుబలి-2′(4.59 మిలియన్ల) రికార్డును బద్దలు కొట్టింది. దీంతో పూర్తి రన్‌టైమ్‌లో ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.