NRI-NRT

జర్మనీలో ఘనంగా ఉగాది వేడుకలు

జర్మనీలో ఘనంగా ఉగాది వేడుకలు

జర్మనీలో మన తెలుగు అసోసియేషన్(MATA) ఆధ్వర్యంలో ఉగాది-2022 పండుగ వేడుకలు వైభవంగా జరిగాయి. ఉగాది ఉత్సవాలను తెలుగు సంఘం సభ్యులు మ్యూనిచ్‌లోని సమావేశమై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలతో తెలుగుదనం ఉట్టిపడేలా వేడుకలను జరుపుకున్నారు.మంచు కారణంగా వాతావరణం చాలా అధ్వాన్నంగా ఉన్నప్పటికీ…ఉగాది-2022 పండుగ వేడుకలను జరుపుకోవడానికి తెలుగువారు భారీ సంఖ్యలో హాజరైనారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మ్యూనిచ్ కాన్సులేట్ జనరల్ (CGI) విచ్చేశారు.
nri-germany-3
గత 5 సంవత్సరాలుగా పిల్లల కోసం తెలుగు తరగతులను మన తెలుగు అసోసియేషన్ నిర్వహిస్తోంది. అంతేకాకుండా పిల్లల కోసం మన తెలుగు బడి బృందం ఒక పాఠ్య పుస్తకాన్ని తయారు చేసింది. దీనిని ముఖ్య అతిథి మ్యూనిచ్ కాన్సులేట్ జనరల్ (CGI) ఆవిష్కరించారు.
వేడుకలకు విచ్చేసిన అతిథులందరికీ ఉగాది పచ్చడిని, పంచాగం శ్రవణం కూడా నిర్వహించారు. సభ్యులందరికీ సంప్రదాయ వంటకాలను మన తెలుగు అసోసియేషన్ ఏర్పాటు చేసింది.

nri-germany-1
nri-germany-4
nri-germany