Devotional

ఇంటి ముందు గుమ్మ‌డి కాయ ఎందుకు క‌డ‌తారు? – TNI ఆధ్యాత్మికం

ఇంటి ముందు గుమ్మ‌డి కాయ ఎందుకు క‌డ‌తారు?  – TNI ఆధ్యాత్మికం

1. ప్రతి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టి ఉండటాన్ని గమనిస్తాం. గుమ్మడికాయను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. గుమ్మడి శుభానికి సంకేతం. దృష్టి దోషాలను తొలగిస్తుందని నమ్మకం. అశుభాలను తొలగించి, శుభాలను ప్రసాదించే తత్తం గుమ్మడిలో ఉందని విశ్వాసం. ఆకారాన్ని బట్టి గుమ్మడికాయ భూగోళానికి ప్రతీకగా చెబుతారు. దానిలో అనంతమైన శక్తి ఉందని, అది దోషాలను పరిహరిస్తుందని పెద్దలు చెబుతారు. అందుకే ఇంటి గుమ్మానికి గుమ్మడిని కట్టే సంప్రదాయం స్థిరపడింది.

2. బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ
వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారి దేవాలయం మంగళవారం భక్తులతో రద్దీగా మారింది. వారం రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆనవాయితీ ప్రకారం మంగళవారం బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకొని బోనం మొక్కు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

3. కన్నుల పండువగా కోదండరాముడి పుష్పయాగం
ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి ఆలయశుద్ధి ఆరాధన చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన పుష్పయాగం రాత్రి 9 గంటల వరకు జరిగింది. తులసీదళాలు, మల్లెలు, మల్లియలు, రోజా, చామంచి, గన్నేరు, నూరువరహాలు, సంపంగి, మానసంపంగి, మొగళిదళం తదితర పుష్పాలు, పత్రాలతో స్వామి, అమ్మవారికి పుష్పనీరాజనం సమర్పించారు. బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టమైన ఏకాంతసేవను వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు.

4. శ్రీవారి దర్శన టికెట్ల కోసం ఫోర్జరీ సిఫార్సు లేఖలు వస్తున్నాయి. తెలంగాణ ఎమ్మెల్సీ నకిలీ సిఫార్సు లేఖతో వచ్చిన వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ సిఫార్సు లేఖతో వచ్చిన యాదయ్యపై చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

5. వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారి దేవాలయం మంగళవారం భక్తులతో రద్దీగా మారింది. సోమవారం రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆనవాయితీ ప్రకారం మంగళవారం బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకొని బోనం మొక్కు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

6. ఏడాది చివరకు జమ్మూలో శ్రీవారి ఆలయ పనుల పూర్తి
జమ్మూ సమీపంలోని మాజిన్‌ గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్‌ అధికారులు పనుల పురోగతిని చైర్మన్‌కు వివరించారు. ఆలయ నిర్మాణానికి ఉపయోగించాల్సిన వాటిలో ఏపీలోని కోటప్పకొండలో తయారు చేస్తున్న రాతి స్తంభాలు తదితరాలు అందాల్సి ఉందని, మరికొన్ని స్థానికంగా కొనుగోలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. పనులు ఈ ఏడాదిలోగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు తయారు చేసుకుని అమలు చేయాలని చైర్మన్‌ అధికారులను ఆదేశించారు.
*తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ కాస్త తగ్గింది. శ్రీవారిని సోమవారం 64,157 మంది భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా స్వామి వారికి 29,720 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో భక్తులు రూ.3.84 కోట్లు వేశారు. ఎలాంటి టికెట్‌ లేకపోయినా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది.

7. దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాల్లో హరిహరపుర పుణ్యక్షేత్రం ఒకటిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మ్తె పేర్కొన్నారు. ఆనాడు అగస్త్య మహర్షి యాగం చేసినదిలక్ష్మీనరసింహస్వామి ప్రత్యక్ష దర్శనం ఇచ్చినదిఆదిశక్తి శంకరాచార్యులు శ్రీ శారదా పరమేశ్వరిని ప్రతిష్ఠించిన జ్ఞానభూమి అనిఇలాంటి ఎంతో మహిమ కలిగిన పుణ్యస్థలం అన్నారు. షిమోగ జిల్లా హరిహరపురలో పరమపూజ్య శంకరాచార్యసచ్చిదానంద సరస్వతి గురువుల ఆధ్వర్యంలో ఈనెల వరకూ జరుగుతున్న మహా కుంభాభిషేక కార్యక్రమంలో మంగళవారం ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మ్తె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ భక్తులను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ హరిహరపుర స్థల ప్రభావం చాలా మహోన్నతమైదన్నారు. ఇక్కడ నిరంతరం సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారన్నారు. హరిహరపుర పుణ్యక్షేత్రానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారని తెలిపారు. సీఎంతో పాటు మఠం అడలిత అధికారి బీఎస్‌ రవిశంకర్‌ఎమ్మెల్యేఎంపీలు వేదికపై పీఠాధిపతి ఆశీర్వాదం పొందారు. మంగళవారం సహస్ర చండియాగ పారాయణం కోటి కుంకుమార్చన ఆంజనేయస్వామి మహాయాగం నిర్వహించారు. ప్రఖ్యాత విద్యాంసులు సురమణి పండిత్‌ ప్రవీణ్‌ వేణు వాయిద్య సంగీత కార్యక్రమాలు భక్తులను అలరించాయి. కోటి కుంకుమార్చన కార్యక్రమంలో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. నిరంతరం జరుగుతున్న ధార్మిక కార్యక్రమాలకు హాజరువుతున్న భక్తులకు హరిహరపుర మఠం ద్వారా ఉచిత ప్రసాద వినియోగం చేస్తున్నారు.