DailyDose

అవినీతి విభాగాల ప్రక్షాళన.. ఏసీబీకి ప్రత్యేక యాప్ – TNI తాజా వార్తలు

అవినీతి విభాగాల ప్రక్షాళన.. ఏసీబీకి ప్రత్యేక యాప్ – TNI తాజా వార్తలు

*అవినీతి జరుగుతున్న విభాగాలను ప్రక్షాళన చేయాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. “దిశ” తరహాలో అవినీతిపై ఫిర్యాదులకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు ప్రత్యేక యాప్‌ రూపొందించాలన్నారు. అనిశా, దిశ, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), దిశ, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్ర జగన్‌ అధికారులను ఆదేశించారు. హోంశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. అవినీతి జరుగుతున్న విభాగాలను ప్రక్షాళన చేయాల్సిందేనని అన్నారు. దిశ తరహాలో అవినీతిపై ఫిర్యాదులకు అనిశాకు ప్రత్యేక యాప్‌ రూపొంచాలని అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో యాప్ రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు.మండల స్థాయి వరకు ఏసీబీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. అంతేకాకుండా ఇతర విభాగాల్లో అవినీతి ఫిర్యాదులపైనా ఏసీబీ పర్యవేక్షణ ఉండాలని వెల్లడించారు. నేర నిర్ధరణకు ఫోరెన్సిక్‌ విభాగం బలోపేతం చేస్తామని సీఎం జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ వ్యవహారాలను చోటు ఉండకూడదని.. దాన్ని కూకటివేళ్లతో సహా పెకలించాలన్నారు. డ్రగ్స్‌ విషయంలో విద్యాసంస్థలపై ప్రత్యేక నిఘా పెట్టాలని.. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోకి ప్రత్యేక కాల్‌ సెంటర్‌ నంబరు ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో హోమంత్రి తానేటి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

*గవర్నర్‌ తమిళిసై రాజకీయాలు మాట్లాడుతున్నారని.. ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు మావని.. మేము నామినేటెడ్‌ వ్యక్తులం కాదని మంత్రి అన్నారు. సీఎంతో పనిచేయడం ఇష్టం లేదని చెప్పడం సరికాదన్నారు.

*నెల్లూరు జిల్లా వైసీపీ నేతల పంచాయితీ తాడేపల్లి చేరింది. నెల్లూరు జిల్లా వైసీపీ నేతల మధ్య విభేదాలపై సీఎం జగన్‌ ఫోకస్‌ పెట్టారు. ఇటీవల మాజీమంత్రి అనిల్‌మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డిలపై సీఎం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరినీ జగన్‌క్యాంపు ఆఫీస్‌కు పిలిపించారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై సీఎం జగన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం అనిల్‌ జగన్‌ను కలిశారు. మంత్రి కాకాణిపై చేసిన విమర్శలపై సీఎంకు అనిల్‌ వివరిచ్చినట్లు తెలుస్తోంది.

*నెల్లూరు వైసీపీ పంచాయతీ సీఎం జగన్ వద్దకు చేరింది. మంత్రి కాకాణిఆనం వేంరెడ్డి వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అనిల్‌కు ముఖ్యమంత్రి నుంచి పిలుపు వచ్చింది. దీంతో బుధవారం సాయంత్రం గంటలకు సీఎం జగన్‌ను మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్ కలిశారు. పరస్పరం ఆరోపణలు చేసుకున్న అనిల్‌కాకాణిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి కాకాణిపై చేసిన విమర్శలుఫ్లెక్సీల చించివేతపై సీఎంకు అనిల్‌ వివరణ ఇచ్చారు

*హోంశాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో డ్రగ్స్‌కు చోటు ఉండొద్దన్నారు. అవినీతి జరిగే అవకాశం ఉన్న శాఖలను క్లీన్‌ చేయాల్సిందేనని చెప్పారు. దిశ తరహాలో అవినీతిపై ఫిర్యాదులకు ఏసీబీ యాప్‌ రూపొందించాలన్నారు. నెల రోజుల్లోగా యాప్‌ రూపకల్పన చేయాలని ఆదేశించారు. బాధితుల ఆడియోను కూడా ఫిర్యాదుగా పంపొచ్చన్నారు. మండల స్థాయి వరకూ ఏసీబీస్టేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇతర విభాగాల్లో అవినీతి ఫిర్యాదులపైనా ఏసీబీ పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి డ్రగ్స్‌ను కూకటి వేళ్లతో పెకలించాలని జగన్ ఆదేశించారు.

*నెల్లూరు వైసీపీ పంచాయతీ సీఎం జగన్ వద్దకు చేరింది. మంత్రి కాకాణి, ఆనం వేంరెడ్డి వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అనిల్‌కు ముఖ్యమంత్రి నుంచి పిలుపు వచ్చింది. దీంతో బుధవారం సాయంత్రం 3గంటలకు సీఎం జగన్‌ను మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్ కలిశారు. పరస్పరం ఆరోపణలు చేసుకున్న అనిల్‌, కాకాణిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి కాకాణిపై చేసిన విమర్శలు, ఫ్లెక్సీల చించివేతపై సీఎంకు అనిల్‌ వివరణ ఇచ్చారు.

*నెల్లూరు జిల్లా వైసీపీ నాయకుల ఆధిపత్య పోరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీల వివాదం, మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనిల్ మధ్య మాటల యుద్ధంపై మండిపడ్డారు. ఈ విషయానికి సంబంధించి తాడేపల్లి రావాలని మంత్రి కాకాణి, అనిల్‌లకు సీఎం నుండి పిలుపు అందింది. కాకాణి, అనిల్‌లకు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఫోన్ వెళ్లింది. దీంతో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఇద్దరు నేతలు క్యాంపు కార్యాలయానికి రానున్నారు. సీఎం జగన్‌తో మంత్రి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ భేటీ కానున్నారు

*తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా చిత్తూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక టీడీపీ తలుకార్యకర్తలు అభిమానులు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పలువురు నాయకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబుటీడీపీ ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజీమాజీ మేయర్ కటారి హేమలతవసంత నాయుడు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబును సీఎం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని టీడీపీ నేతలు స్పష్టం చేశారు.

*మూడేళ్ల జగన్ పాలనలో ప్రజలు చాలా నష్టపోయారనిఅన్ని రంగాల్లో ఇబ్బంది ఏర్పడిందని టీడీపీ నేత కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన కర్నూలు జిల్లాకోడుమూరులో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమనిశ్రీలంక పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ప్రతి గ్రామానికి తాగు సాగు నీరందిస్తామన్నారు. ఫ్లెక్సీలపై వైసీపీ చిల్లర రాజకీయాలు చేస్తోందనిఆ పార్టీలో మంత్రులు కేవలం ప్రొటోకాల్ కొరకే వున్నారని విమర్శించారు. కాంగ్రెస్ తర్వాత టీడీపీకే క్యాడర్ వుందనివైసీపీకి క్యాడర్ లేదన్నారు. కేవలం రాజశేఖర్ రెడ్డి హవా ఉందనిఆ హవాతోనే జగన్ గెలిచారన్నారు. ప్రజలు రాజశేఖర్ రెడ్డి పాలన వస్తుందనుకున్నారు..అక్కడే పాలన గాడి తప్పిందని సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు.

*73వ పుట్టిన రోజు జరుపుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో చంద్రబాబు అధికారులు స్వాగతం పలికారు. జన్మదినోత్సవం సందర్భంగా వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం అమ్మవారి చిత్ర పటం, తీర్ధ ప్రసాదాలను చంద్రబాబుకు ఆలయ ఈవో భ్రమరాంబ అందజేశారు.

*కేంద్ర ప్రభుత్వ విధానాలపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా విమర్శనాస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు. విద్యాసంస్థల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మొండిచేయి చూపిందని మండిపడ్డారు. మోదీ సర్కారు ఏడు ఐఏఎంలను దేశవ్యాప్తంగా మంజూరు చేసినప్పటికీ తెలంగాణకు రిక్తహస్తం చూపిందన్నారు. ఏడు ఐఐటీల్లో రాష్ట్రానికి ఒక్కటి కూడా దక్కకపోవడం శోచనీయమన్నారు. మిగతా విద్యాసంస్థల కేటాయింపుల్లోనూ తెలంగాణ ఊసే లేదని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.ఎన్‌ఐటీలు 4, మెడికల్‌ కళాశాలలు 157, నవోదయాలు 84 వివిధ రాష్ట్రాలకు కేటాయించినప్పటికీ తెలంగాణకు చోటు ఇవ్వలేదని తెలిపారు. రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం హామీని విస్మరించారన్న మంత్రి.. తెలంగాణపై వివక్ష కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వచ్చిన సంప్రదాయ వైద్య కేంద్రం యథావిథిగా గుజరాత్‌కు తరలిపోయిందన్నారు. ఈ వైద్య కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు గతంలో కిషన్‌రెడ్డి చేసిన ట్వీట్‌ను కేటీఆర్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు

*ఆపదలో ఉన్న మహిళలు, చిన్నారుల రక్షణ కోసమే ’దిశ’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. భద్రతలో భాగంగానే ‘ఓటీపీ’ తెచ్చామని, రెండంచెల నిర్ధారణ వ్యక్తిగత సమాచార రక్షణ కోసమేనని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు, మహిళా సంరక్షణ కార్యదర్శులు దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటూ కనిపించిన ప్రతి ఒక్కరినీ అడుగుతున్నారు. డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత ఫోన్‌ నెంబర్‌, ఓటీపీ కూడా అడుగుతుండడంతో తమ వ్యక్తిగత సమాచారంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

*నంద్యాలలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్‌తో పాటు నంద్యాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల వివరాల రికార్డులను కోర్టు ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన 50 ఎకరాల భూమిని వైద్య కళాశాల నిర్మాణం కోసం బదలాయిస్తూ ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలకమండలి గతేడాది జూన్‌ 20న చేసిన తీర్మానాన్ని సవాల్‌ చేస్తూ బొజ్జా దశరథరామిరెడ్డి, మరో నలుగురు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై న్యాయవాది ఎన్‌.ఆదిరామకృష్ణుడు మరో వ్యాజ్యం వేశారు. వీటిపై విచారణ జరిపిన న్యాయస్థానం యథాతథ స్థితి పాటించాలని గతంలో మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. మంగళవారం మరోసారి విచారణ జరుపగా, పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.అర్జున్‌ రెడ్డి వాదనలు వినిపించారు. ‘వ్యవసాయ పరిశోధన కేంద్రానికి 120 ఏళ్ల చరిత్ర ఉంది. రైతులకు ఉపయోగపడే ఎన్నోరకాల విత్తనాలను ఆ కేంద్రం ఉత్పత్తి చేసింది. ఆ భూమిలో 50 ఎకరాలను మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కోసం ప్రభుత్వం తీసుకుంటోంది. దీన్ని వ్యతిరేకిస్తూ యునివర్సిటీ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. తదనంతరం ప్రభుత్వ ఒత్తిడితో వర్సిటీ పాలకమండలి భూమిని బదలాయించేందుకు అంగీకరించింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా కర్నూలు జిల్లా, తంగడంచలో పరిశోధన కేంద్రానికి 50 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ భూమి విత్తనోత్పత్తికి పనికిరాదు. పరిశోధనా కేంద్రం ప్రయోజనానికి తప్ప, ఇతర అవసరాల కోసం భూములను కేటాయించే అధికారం పాలకమండలికి లేదు. మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు ప్రత్యామ్నాయ భూములు ఉన్నా, ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదు. మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు’ అని వాదించారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ నంద్యాల ప్రభుత్వాస్పత్రికి 10 కిలోమీటర్ల దూరంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని నిబంధనలు ఉన్నాయన్నారు. మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు ఆ సమీపంలో ప్రభుత్వ భూమి అందుబాటులో లేదని తెలిపారు. పరిశోధన కేంద్రం స్థలం తీసుకొని, ప్రత్యామ్నాయంగా మరోచోట 50ఎకరాల భూమిని కేటాయించామన్నారు. పరిశోధన కేంద్రం కార్యకలాపాల కొనసాగింపునకు ఎలాంటి అవరోధమూ లేదని చెప్పారు. మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్నారు.

*పశుపోషకులకు ఉత్పత్తి వ్యయం తగ్గించి, పశువులకు అవసరమైన ఔషధాలను అందుబాటులో ఉంచేందుకు రాష్ట్రంలోని ప్రతి పశువైద్యశాలలో పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సహకరించాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ కేంద్రాన్ని కోరింది. గుజరాత్‌లోని కవాడియాలో సర్ధార్‌ సరోవర్‌ డ్యామ్‌ వద్ద మంగళవారం జరిగిన జాతీయ స్థాయి వేసవి భేటీలో కేంద్రపశుసంవర్ధకశాఖ మంత్రి పరషోత్తం రూపాలాతో పాటు ఏపీ నుంచి రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి అప్పలరాజు, డైరెక్టర్‌ అమరేంద్ర, మత్స్యశాఖ కమిషనర్‌ కన్నబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాడి రైతులకు అవసరమైన పలు అంశాలపై కేంద్రమంత్రికి ప్రతిపాదనలు అందజేశారు. సంపూర్ణ మిశ్రమ దాణా పంపిణీలో రాయితీ కోసం రూ.56.40కోట్లు, పశు బీమా పథకం అమలుకు రూ.167.22కోట్లు జాతీయ పశుగణాభివృద్ధి పథకం కింద ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారని డైరెక్టర్‌ అమరేంద్ర తెలిపారు.

*క్లైమేట్‌ స్మార్ట్‌ సిటీస్‌ అసె్‌సమెంట్‌ ఫ్రేమ్‌వర్క్‌లో బెజవాడ స్టార్‌ రేటింగ్‌ అవార్డు సాధించింది. గుజరాత్‌లోని సూరత్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర పురపాలకపట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిసూరత్‌ మేయర్‌ హేమలి కల్పేష్‌ కుమార్‌ బోఘవాల చేతులమీదుగా విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి ఈ అవార్డును అందుకున్నారు. కేంద్ర గృహనిర్మాణపట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈనెల వరకు సూరత్‌లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది. కమిషనర్‌ దినకర్‌మేయర్‌ భాగ్యలక్ష్మి కలిసి క్లైమేట్‌ స్మార్ట్‌ సిటీస్‌ ప్యానల్‌ డిస్కషన్‌లో పాల్గొన్నారు. నగరాల్లో వాతావరణ స్థితిస్థాపకతను ఎలా పొందుపరచవచ్చో వివరించారు.

*బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలో పోలీసులు మంగళవారం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎంపీ అనుచరుడువరుసకు సోదరుడైన ఐనవోలు సుధీర్‌ బైకును కూడా ఆపారు. నేను ఎంపీ అనుచరుడినిబంఽధువును.. నన్నే ఆపుతారాఅంటూ వారిపై అతడు విరుచుకుపడ్డాడు. వెంటనే సురేశ్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. వెంటనే పోలీసు అధికారికి ఎంపీ నుంచి ఫోన్‌ వెళ్లింది. తన అనుచరుడిని ఆపిన కానిస్టేబుల్‌ తన ఇంటికి వచ్చి సంజాయిషీ చెప్పాలని ఎంపీ హుకుం జారీ చేశాడు. సీఐ సూచనతో ఎంపీ ఇంటికి కానిస్టేబుల్‌తోపాటు తనిఖీల్లో ఉన్న పోలీసు సిబ్బంది బయల్దేరారు.

*నాకు మంత్రి పదవిరాదని కొం తమంది ప్రచారం చేస్తూ వచ్చారు. ఇప్పుడు వచ్చిం ది కాబట్టికోర్టులో చోరీ.. కుట్రపూరితంగా పథకం ప్రకారం చేయించారా అ నే అనుమానం కలుగుతోందిఅని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవా రం నెల్లూరులో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో సోమిరెడ్డి తనపై పెట్టిన కేసుకు సంబంధించి పోలీసులు దాఖలు చేసిన చార్జిషీటులో ప్రాథమిక ఆధారాల్లేవని కోర్టు మూడుసార్లు రిట ర్న్‌ చేసిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పోలీసులు మళ్లీ చార్జిసీటు వేశారని.. తాను పట్టించుకునేవాడినైతే అసలు దాఖలు చేసేవారేకాదని చెప్పారు. అలాంటిది ఇప్పుడు తాను చోరీ చేయించానని ప్రతిపక్షాలు మాట్లాడుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను దొంగతనం చేయించి ఉంటే డాక్యుమెంట్లుఆధారాలు కోర్టు ప్రాంగణంలోనే ఎందుకు మిగులుస్తానని ప్రశ్నించారు.

*మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు మంగళవారం పులివెందుల కోర్టుకు వచ్చారు. కోర్టులో పలుపత్రాలు సమర్పించి వెళ్లినట్లు తెలిసింది. వివేకా హత్య కేసులో ఇప్పటికే సునీల్‌ యాదవ్‌ సెంట్రల్‌ జైలులో ఉన్నాడు. ఆయన తమ్ముడు కిరణ్‌ యాదవ్‌ను విచారణకు రమ్మని సీబీఐ నోటీసులు జారీచేసినట్లు తెలిసింది. దీంతో కిరణ్‌యాదవ్‌ తన లాయర్‌తో కలిసి వస్తానని చెప్పినట్టు సమాచారం. కాగా.. వివేకా కేసులో ఐదుగురు నిందితులను చేర్చుతూ సీబీఐ పులివెందుల కోర్టులో ఇప్పటికే రెండు చార్జిషీట్లు దాఖలు చేసింది. అందులో ఎర్రగంగిరెడ్డి, సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డి ఉన్నారు. వీరిలో దస్తగిరి అప్రూవర్‌గా మారారు. దస్తగిరి, ఎర్రగంగిరెడ్డి బెయిల్‌పై బయటే ఉన్నారు. మిగిలిన వారు కడప సెంట్రల్‌ జైలులో ఉన్నారు.

*ప్రకృతి వైద్యం కోసం విశాఖపట్నంలో బసచేసిన హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో మంగళవారం సీఎం జగన్‌ భేటీ అయ్యారు. ఇందుకోసం ఆయన అమరావతి నుంచి వచ్చారు. రుషికొండలోని పెమా వెల్‌నెస్‌ సెంటర్‌(బే పార్క్‌)లో మనోహర్‌లాల్‌ వైద్యం చేయించుకుంటుండగా, సీం జగన్‌ అక్కడే కలిసి మాట్లాడారు. ఇరువురి మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయనేది అధికార వర్గాలు వెల్లడించలేదు. ఈ భేటీ అనంతరం జగన్‌ తిరిగి మధ్యాహ్నం 3.30 గంటలకు వెళ్లిపోయారు.

*సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు మరింత సమయం ఇవ్వాలని ప్రత్యేక కోర్టును సీబీఐ మంగళవారం కోరింది. సీబీఐ కేసుల నుంచి తనకు విముక్తి కలిగించాలంటూ జగన్‌ గతంలో డిశ్చార్జి పిటిషన్‌ దాఖలు చేసుకున్న విష యం విదితమే. దీనిపై సమాధానం ఇవ్వాల్సిన విచారణాధికారి ఢిల్లీలో శిక్షణ పొందుతున్నారనిఅందువల్ల సకాలంలో కౌంటర్‌ దాఖలు చేయలేకపోయామని సీబీఐ తరఫు న్యాయవాది వివరించారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న ప్రిన్సిపల్‌ జడ్జి మధుసూదన్‌రావు విచారణను వాయిదా వేశారు.

*క్లైమేట్‌ స్మార్ట్‌ సిటీస్‌ అసె్‌సమెంట్‌ ఫ్రేమ్‌వర్క్‌లో బెజవాడ 4 స్టార్‌ రేటింగ్‌ అవార్డు సాధించింది. గుజరాత్‌లోని సూరత్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి, సూరత్‌ మేయర్‌ హేమలి కల్పేష్‌ కుమార్‌ బోఘవాల చేతులమీదుగా విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి ఈ అవార్డును అందుకున్నారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈనెల 18 నుంచి 20 వరకు సూరత్‌లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది. కమిషనర్‌ దినకర్‌, మేయర్‌ భాగ్యలక్ష్మి కలిసి క్లైమేట్‌ స్మార్ట్‌ సిటీస్‌ ప్యానల్‌ డిస్కషన్‌లో పాల్గొన్నారు. నగరాల్లో వాతావరణ స్థితిస్థాపకతను ఎలా పొందుపరచవచ్చో వివరించారు.

*వైసీపీకి రంగుల పిచ్చి ఇప్పట్లో వదిలేలాలేదు. పంచాయతీ ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేసిన ప్రభుత్వం.. హైకోర్టు మొట్టికాయలతో కాస్త వెనక్కి తగ్గింది. ఇక పార్టీ రంగులు వేయడం మానుకుంటారని అంతా భావించారు. తిరుపతిలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్లు నిర్మించి అందజేసింది. ఇప్పుడు వాటికి వైసీపీ శ్రేణులు రంగులు వేశారు. దీంతో వైసీపీ ప్రభుత్వ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.

*అధికార పార్టీ వేధింపులతో ఖమ్మంలో ఇటీవల పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న బీజేపీ నేత సాయి గణేష్‌ కుటుంబసభ్యులను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. మంగళవారం ఫోన్‌లో పరామర్శించారు. సాయిగణేష్‌ అమ్మమ్మసోదరితో మాట్లాడారు. అధైర్య పడొద్దని వారి కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఘటనపై అన్ని రకాలుగా విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం త్రీ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఇటీవల పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న బీజేపీ నేత మజ్దూర్‌ సంఘ్‌ జిల్లా కన్వీనర్‌ సాయి గణేష్‌ ఉదంతం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మంత్రి పువ్వాడ అజయ్‌ పోలీసుల వేధింపులు తట్టుకోలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని బాధితుడు సెల్ఫీ వీడియోలో చెప్పడం కలకలం రేపింది. దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం భగ్గుమంది. ఘటనకు నిరసనగా బుధవారం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. బాధిత కుటుంబానికి బీజేపీ జాతీయ నాయకత్వం కూడా అండగా నిలిచింది.
*