Movies

ఉపాస‌న మరో ఛారిటీ

ఉపాస‌న  మరో ఛారిటీ - Upasana Konidela Another Charity

అపోలో ఫౌండేషన్‌ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల తాజాగా బిలియన్‌ హార్ట్స్‌ బీటింగ్‌ అనే మరో ఛారిటీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఆమె దేశవ్యాప్తంగా వృద్ధాశ్రమాలకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఢిల్లీ, తమిళనాడు, కర్నాటక వంటి రాష్ర్టాల్లో 150 వృద్ధాశ్రమాలకు చేయూత అందివ్వాలని నిర్ణయించారు. ఇక్కడ నివసిస్తున్న వృద్ధులకు కావాల్సిన మందులు, ఆహార పదార్థాలు ఇతర సౌకర్యాలను ఉపాసన సమకూర్చనున్నారు. ప్రతి నెలా వారి అవసరాలకు కావాల్సినవి అందిస్తామని తెలిపారు. తాజాగా ఉపాసన ఒక వృద్ధాశ్రమంలో సీనియర్‌ సిటిజన్స్‌ను కలిసి ముచ్చటించారు. వారితో సరదాగా కాసేపు గడిపి అక్కడి పరిస్థితులు తెలుసుకున్నారు. ఈ ఫొటోలను సోషల్‌ మీడియాలో చూసిన వారంతా ఆమె సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తున్నారు.