Business

ట్విటర్‌లో పెట్టుబడులకు ఇన్వెస్టర్ల ఆసక్తి- TNI వాణిజ్య వార్తలు

ట్విటర్‌లో పెట్టుబడులకు ఇన్వెస్టర్ల ఆసక్తి- TNI వాణిజ్య వార్తలు

* మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ను కొనుగోలు యత్నాల్లో ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా చీఫ్‌ ఈలాన్‌ మస్క్‌కు బాసటగా పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. ఒరాకిల్‌ సహ వ్యవస్థాపకుడు, టెస్లా బోర్డు సభ్యుడు ల్యారీ ఎలిసన్‌ సహా పలువురు ఏకంగా 7.1 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయడానికి ముందుకొచ్చారు. ఎలిసన్‌ (1 బిలియన్‌ డాలర్లు), సెకోయా క్యాపిటల్‌ ఫండ్‌ (800 మిలియన్‌ డాలర్లు), వైక్యాపిటల్‌ (700 మిలియన్‌ డాలర్లు) మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. ట్విటర్‌ మాజీ సీఈవో జాక్‌ డోర్సీ సహా పలువురితో మస్క్‌ చర్చలు జరుపుతున్నారు.ఒకవేళ ఈ పెట్టుబడులు సాకారమైతే.. ట్విటర్‌ కొనుగోలు కోసం మస్క్‌ తీసుకోవాల్సిన రుణాల భారం దాదాపు సగానికి తగ్గుతుంది. నగదు, ఈక్విటీ రూపంలో చెల్లించే పరిమాణం 21 బిలియన్‌ డాలర్ల నుంచి 27.25 బిలియన్‌ డాలర్లకు చేరుతుంది. దాదాపు 44 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు మస్క్‌ ఆఫర్‌ ఇచ్చారు.
*వాహన విడిభాగాల తయారీలో ఉన్న సుందరం క్లేటాన్‌ ఎండీగా లక్ష్మి వేణు నియమితులయ్యారు. కంపెనీలో ఇప్పటి వరకు ఆమె జాయింట్‌ ఎండీగా ఉన్నారు. అంతర్జాతీయంగా సంస్థ విస్తరణలో లక్ష్మి వేణు కీలక పాత్ర పోషించారు. కమిన్స్, హ్యుండాయ్, వోల్వో, ప్యాకర్, దైమ్లర్‌ తదితర కంపెనీలు సుందరం క్లేటాన్‌ క్లయింట్లుగా ఉన్నాయి.
*రుణ సవాళ్లు ఎదుర్కొంటున్న అనిల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీ రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో రూ. 4,522 కోట్లకుపైగా నికర నష్టాలు ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో దాదాపు రూ. 445 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం 16 శాతంపైగా క్షీణించి రూ. 162 కోట్లకు పరిమితమైంది.మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర నష్టం మూడు రెట్లు పెరిగి రూ. 5,440 కోట్లకు చేరింది. 2020–21లో రూ. 1,520 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం 65 శాతం పడిపోయి రూ. 294 కోట్లకు చేరింది. కాగా.. 2022 మార్చి31కల్లా కంపెనీ రూ. 10,123 కోట్ల రుణ చెల్లింపుల్లో విఫలమైంది.
*అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) సరికొత్త రికార్డు సృష్టించింది. 10,000 కోట్ల డాలర్ల వార్షికాదాయాన్ని నమోదు చేసుకున్న తొలి భారత కంపెనీగా అరుదైన ఘనత ను నమోదు చేసుకుంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2021-22) కంపెనీ ఆదాయం రూ.7.92 లక్షల కోట్లకు పెరిగింది. అమెరికన్‌ కరెన్సీలో ఈ విలువ 10,200 కోట్ల డాలర్లకు సమానం. 2021-22కి గాను రిలయన్స్‌ రూ.60,705 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతేకాదు, వాటాదారులకు రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.8 డివిడెండ్‌ చెల్లించనున్నట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో అన్ని వ్యాపార విభాగాల్లో కలిపి కొత్తగా 2.1 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు సంస్థ వెల్లడించింది. కరోనా సంక్షోభ సవాళ్లు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలోనూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గత ఆర్థిక సంవ త్సరానికి సమృద్ధికరమైన పనితీరు కనబరచగలిగిందని ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు.
*ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌.. 2021-22 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం ఏకంగా 64.90 శాతం వృద్ధితో రూ.1,666 కోట్లుగా నమోదైంది. వడ్డీ ఆదాయాలు గణనీయంగా పెరగటంతో పాటు మొండి పద్దులు తగ్గటం కలిసివచ్చిందని కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ఎల్‌వీ ప్రభాకర్‌ వెల్లడించారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2020 -21) ఇదే కాలంలో బ్యాంక్‌ నికర లాభం రూ.1,010,87 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.21,040.63 కోట్ల నుంచి రూ.రూ.22,323.11 కోట్లకు పెరిగింది. కాగా మార్చి త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 25 శాతం వృద్ధితో రూ.7,005 కోట్లుగా ఉందని ప్రభాకర్‌ తెలిపారు.
*శీయ ఐటీ రంగంలో మెగా విలీనం జరగనుంది. ఎల్‌ అండ్‌ టీ గ్రూప్‌నకు చెందిన రెండు ఐటీ కంపెనీలు ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ (ఎల్‌టీఐ), మైండ్‌ట్రీ ఒక్కటి కాబోతున్నాయి. ఈ విలీన ప్రతిపాదనకు మైండ్‌ట్రీ, ఎల్‌టీఐ బోర్డులు శుక్రవారం ఆమోదం తెలిపాయి. తద్వారా 350 కోట్ల డాలర్ల (రూ.26,600 కోట్లు) వార్షికాదాయ ఐటీ సంస్థగా అవతరించనుంది. అలాగే, విలీనం తర్వాత కంపెనీ పేరు ‘ఎల్‌టీఐమైండ్‌ట్రీ’గా మారనుంది. పూర్తిగా షేర్ల మార్పిడి ద్వారా జరగనున్న ఈ డీల్‌లో భాగంగా మైండ్‌ట్రీకి చెందిన ప్రతి 100 షేర్లకు గాను 73 ఎల్‌ అండ్‌ టీ షేర్లను కేటాయించనున్నారు.వచ్చే 9-12 నెలల్లో విలీన ప్రక్రియ పూర్తి కావచ్చని అంచనా. మెర్జర్‌ తర్వాత ఏర్పడే సంస్థలో ఎల్‌ అండ్‌ టీ 68.73 శాతం వాటా కలిగి ఉండనుంది. విలీనం పూర్తయ్యేవరకు రెండు కంపెనీలు విడివిడిగా కార్యకలాపాలు కొనసాగించనున్నాయని, ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ ఏఎం నాయక్‌ తెలిపారు.
*బొగ్గు కొరత దేశంలోని విద్యుదుత్పత్తి కేంద్రాలను వేధిస్తోంది. దేశంలోని చాలా బొగ్గు ఆధారిత థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు ఒకరోజు అవసరానికి మించిలేవు. కొన్ని విద్యుదుత్పత్తి స్టేషన్లలో ఆ మాత్రం నిల్వలు కూడా లేకపోవడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఈ గడ్డు పరిస్థితి నుంచి బయటడేందుకు ప్రభుత్వం మూతపడిన గనులను మళ్లీ తెరవాలని భావిస్తోంది. వచ్చే రెండు మూడేళ్లలో ఈ గనులను అందుబాటులోకి తీసుకురావటం ద్వారా 7.5 కోట్ల నుంచి 10 కోట్ల టన్నుల బొగ్గును వెలికితీయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని బొగ్గు శాఖ కార్యదర్శి ఏకే జైన్‌ వెల్లడించారు.
* ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) నాలుగో త్రైమాసిక ఫలితాలు వచ్చేశాయి. మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలంలో ఏకీకృత నికర లాభం 22 శాతం పెరిగి రూ.16,203 కోట్లకు చేరుకుంది. బంపర్ ఆయిల్ రిఫైనింగ్ మార్జిన్‌లు, టెలికం, డిజిటల్ సేవలలో స్థిరమైన వృద్ధి నమోదు చేసింది. కాగా, గతేడాది ఇదే కాలంలో రిలయన్స్ నికర ఆదాయం రూ.13,227 కోట్లుగా ఉంది.
*ఈ ఏడాది భారత కార్యకలాపాల కోసం 50,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 55,000 మందిని ఉద్యోగంలో చేర్చుకోనున్నట్లు త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా కాగ్నిజెంట్‌ ఇండియా చైర్మన్‌ రాజేశ్‌ నంబియార్‌ వెల్లడించారు. ఈ ఏడాది మార్చితో ముగిసిన మొదటి త్రైమాసికంలో కంపెనీ 9,800 మందిని నియమించుకుంది. తద్వారా కంపెనీ మొత్తం ఉద్యోగులు 3.40 లక్షలకు చేరుకున్నారు. ఫ్రెషర్లతో పాటు అవసరాన్ని బట్టి అనుభవజ్ఞుల నియామకాలనూ చేపట్టనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. కరోనా సంక్షోభంతో ఐటీ సేవలకు డిమాండ్‌తో పాటు ఉద్యోగుల వలసలు కూడా ఊపందుకోవడంతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ప్రాంగణ నియామకాల జోరును పెంచాయి.
*టాటా మోటార్స్‌.. మార్కెట్లో కి మినీ ట్రక్‌ ‘ఏస్‌’ ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ను తీసు కువచ్చింది. గురువారం నాడిక్కడ ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ ఏస్‌ ట్రక్‌ ను టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌, టాటా మోటార్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిరీష్‌ వాఘ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖరన్‌ మాట్లాడుతూ.. టాటా మోటార్స్‌ ఇప్పటికే ప్యాసింజర్‌ కార్ల విభాగంలో పలు ఎలక్ట్రిక్‌ మోడళ్లను తీసుకురాగా, వాణి జ్య వాహన విభాగంలో ఎలక్ట్రిక్‌ బస్సులను విడుదల చేసినట్లు చెప్పారు. తాజాగా పికప్‌ విభాగంలో మినీ ట్రక్‌ ఏస్‌తో ఈ-కార్గో మొబిలిటీ విభాగంలోకి ప్రవేశించినట్లు ఆయన తెలిపారు. ఏస్‌ ఈవీతో దేశంలోని ఔత్సాహికులందరీకి విద్యుత్‌ వాహనాలకు సంబంధించిన ఫలాలు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యం నెరవేరినట్లయిందని చంద్రశేఖరన్‌ తెలిపారు. కాగా ఈ-కామర్స్‌ సంస్థలైన అమెజాన్‌, బిగ్‌బాస్కెట్‌, సిటీ లింక్‌, ఫ్లిప్‌కార్ట్‌, డీఓటీ వంటి సంస్థలకు 39 వేల ఏస్‌ ఈవీలను సరఫరా చేసేందుకు టాటా మోటార్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది.
*రిటైల్‌ రుణాలు మరింత భారం కానున్నాయి. ఆర్‌బీఐ రెపో రేటు 0.40 శాతం పెంచడంతో బ్యాంకులూ అదే స్థాయిలో వడ్డింపులు ప్రారంభించాయి. కేంద్ర బ్యాంక్‌ ప్రకటన వెలువడిన మరుసటి రోజే ప్రైవేట్‌ రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్‌, ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) తమ రెపో ఆధారిత రుణాల కనీస వడ్డీ రేట్లు 0.4 శాతం చొప్పున పెంచేశాయి. దీంతో ఈ రెండు బ్యాంకుల రెపో ఆధారిత రుణాలపై కనీస వడ్డీ రేటు వరుసగా 8.10 శాతం, 6.90 శాతానికి చేరాయి. ఈ వడ్డీ రేట్ల పెంపు వెంటనే అమల్లోకి వస్తుందని రెండు బ్యాంకులు ప్రకటించాయి. మరోవైపు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ), సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (సీబీఐ) కూడా తమ రెపో ఆధారిత రుణాల కనీస వడ్డీ రేట్లను 7.25 శాతానికి పెంచాయి. రెపో రేటు ఆధారిత వడ్డీ రేటుతో పాటు బ్యాంకులు క్రెడిట్‌ రిస్క్‌ ప్రీమియం పేరుతో మరో 2.5 శాతం వరకు వడ్డిస్తుంటాయి.
*రోజువారీ ఉత్పత్తిని భారీగా పెంచేందుకు చమురు ఎగుమతి దేశాల కూటమి ‘ఒపెక్‌’ నో చెప్పింది. రష్యా వంటి ఇతర దేశాలూ ఇందుకు వంతపాడాయి. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ఆంక్షలతో ఈ నెల నుంచి రష్యా రోజు వారీ చమురు ఎగుమతి 30 లక్షల బ్యారళ్లు తగ్గనుంది. దీనికి అనుగుణంగా ఉత్పత్తి పెంచాలని అమెరికా, భారీగా చమురు దిగుమతులపై ఆధారపడిన భారత, చైనాలు కోరాయి. ఉత్పత్తి పెంచాలన్న విజ్ఞప్తికి చమురు ఉత్పత్తి దేశాలు ససేమిరా అన్నాయి. అయితే వచ్చే నెల నుంచి రోజు వారీ ఉత్పత్తిని స్వల్పంగా 4.32 లక్షల బ్యారళ్ల మేర పెంచేందుకు మాత్రమే అంగీరించాయి. ఈ వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్‌ బ్రెంట్‌ రకం చమురు ధర 110 డాలర్లకు చేరింది. ఈయూ దేశాలు వచ్చే ఆరు నెలల్లో రష్యా చమురుకు పూర్తిగా గుడ్‌బై చెబుతామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో చమురు ధర మరింత సెగలు కక్కుతుందని భావిస్తున్నారు.
*టాటా మోటార్స్‌.. మార్కెట్లో కి మినీ ట్రక్‌ ‘ఏస్‌’ ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ను తీసు కువచ్చింది. గురువారం నాడిక్కడ ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ ఏస్‌ ట్రక్‌ ను టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌, టాటా మోటార్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిరీష్‌ వాఘ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖరన్‌ మాట్లాడుతూ.. టాటా మోటార్స్‌ ఇప్పటికే ప్యాసింజర్‌ కార్ల విభాగంలో పలు ఎలక్ట్రిక్‌ మోడళ్లను తీసుకురాగా, వాణి జ్య వాహన విభాగంలో ఎలక్ట్రిక్‌ బస్సులను విడుదల చేసినట్లు చెప్పారు. తాజాగా పికప్‌ విభాగంలో మినీ ట్రక్‌ ఏస్‌తో ఈ-కార్గో మొబిలిటీ విభాగంలోకి ప్రవేశించినట్లు ఆయన తెలిపారు. ఏస్‌ ఈవీతో దేశంలోని ఔత్సాహికులందరీకి విద్యుత్‌ వాహనాలకు సంబంధించిన ఫలాలు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యం నెరవేరినట్లయిందని చంద్రశేఖరన్‌ తెలిపారు. కాగా ఈ-కామర్స్‌ సంస్థలైన అమెజాన్‌, బిగ్‌బాస్కెట్‌, సిటీ లింక్‌, ఫ్లిప్‌కార్ట్‌, డీఓటీ వంటి సంస్థలకు 39 వేల ఏస్‌ ఈవీలను సరఫరా చేసేందుకు టాటా మోటార్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది.
*ప్రముఖ పారిశ్రామిక సంస్థ అదానీ గ్రూప్‌ మీడియా రంగంలో తన స్థానాన్ని పటిష్ఠం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రాంతీయ మీడియాలోకి ప్రవేశించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త తెలియడంతో ఇప్పటికే కొన్ని ప్రాంతీయ టీవీ చానళ్లు, పత్రికల యాజమాన్యాలు తమ మీడియా వ్యాపారాల అమ్మకానికి అదానీ గ్రూప్‌తో చర్చలు జరిపినట్టు సమాచారం. మీడియా రంగం ప్రవే శం కోసం అదానీ గ్రూప్‌ ప్రధాన కంపెనీ ‘అదానీ ఎంటర్‌ప్రైజెస్‌’ ఇటీవలే ‘ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్‌’ పేరుతో ప్రత్యేక అనుబంధ కంపెనీ ఏర్పాటు చేసింది. తన సమీప ప్రత్యర్ధి ముకేశ్‌ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తరహాలో అన్ని వ్యాపారాల్లో దూసుకుపోవాలని గ్రూప్‌ ప్రధాన ప్రమోటర్‌ గౌతమ్‌ అదానీ భావిస్తున్నారు.