Business

అరరే.. బిర్లాలకు ఎంత కష్టమొచ్చింది!- TNI వాణిజ్య వార్తలు

అరరే.. బిర్లాలకు ఎంత కష్టమొచ్చింది!- TNI వాణిజ్య వార్తలు

* బిర్లా టైర్స్‌ లిమిటెడ్‌పై దివాలా చర్యలను ప్రారంభించాలని నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) కోల్‌కతా బెంచ్‌ ఆదేశించింది. బీకే బిర్లా గ్రూప్‌ సంస్థ– బిర్లా టైర్స్‌ రుణదాత, మల్టీ–బిజినెస్‌ కెమికల్స్‌ సంస్థ ఎస్‌ఆర్‌ఎఫ్‌ దాఖలు చేసిన కేసులో బెంచ్‌ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఐబీసీ చట్ట నిబంధనల ప్రకారం, బోర్డు ను సస్పెండ్‌ చేసి, మారటోరియం విధించిన ట్రి బ్యునల్, కంపెనీ కార్యకలాపాలను నిర్వహించడానికి సీక్‌ అబ్దుల్‌ సలామ్‌ను మధ్యంతర రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌ (ఐఆర్‌పీ)గా నియమించింది. టైర్‌ కార్డ్‌ ఫ్యాబ్రిక్‌ సరఫరాలకు సంబంధించి 2021 జూలై 8వ తేదీ నాటికి బిర్లా టైర్స్‌ తనకు రూ. 15.84 కోట్లు చెల్లించాలని ఎస్‌ఆర్‌ఎఫ్‌ దివాలా పిటిషన్‌లో పేర్కొంది. ఇందులో రూ. 10.06 కోట్ల అసలుకాగా, 5.78 కోట్లు వడ్డీ. రుణ డిఫాల్ట్‌కు సంబంధించి ఎస్‌ఆర్‌ఎఫ్‌ సమర్పించిన పత్రాలతో సంతృప్తి చెందినట్లు ట్రిబ్యునల్‌ పేర్కొంది. ఐబీసీ సెక్షన్‌ 9 కింద దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను బిర్లా టైర్స్‌ చాలా ఆషామాషీగా తీసుకుని, వాయిదాలు తీసుకోడానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కనబడుతోందని ట్రిబ్యునల్‌ సభ్యులు (టెక్నికల్‌) హరీష్‌ చందర్‌ మరో సభ్యులు (జుడీషియల్‌) సూరి రోహిత్‌ కపూర్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. ఎస్‌ఆర్‌ఎఫ్‌ పిటిషన్‌పై బిర్లా టైర్స్‌కు ఎన్‌సీఎల్‌టీ 2021 అక్టోబర్‌ 20న నోటీసులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. రిప్లై ఇవ్వడానికి మూడు ద ఫాలు బిర్లా టైర్స్‌ వాయిదాలు తీసుకోవడం గమనార్హం.

*ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌.. 2021-22 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం ఏకంగా 64.90 శాతం వృద్ధితో రూ.1,666 కోట్లుగా నమోదైంది. వడ్డీ ఆదాయాలు గణనీయంగా పెరగటంతో పాటు మొండి పద్దులు తగ్గటం కలిసివచ్చిందని కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ఎల్‌వీ ప్రభాకర్‌ వెల్లడించారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2020 -21) ఇదే కాలంలో బ్యాంక్‌ నికర లాభం రూ.1,010,87 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.21,040.63 కోట్ల నుంచి రూ.రూ.22,323.11 కోట్లకు పెరిగింది. కాగా మార్చి త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 25 శాతం వృద్ధితో రూ.7,005 కోట్లుగా ఉందని ప్రభాకర్‌ తెలిపారు.

*తెలుగు రాష్ట్రాల్లోని మ్యూజి క్‌ ప్రియుల కోసం టెలికాం కంపెనీ వీఐ.. యాప్‌ ద్వారా 3.9 లక్షల తెలుగు, హిందీ పాటలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకు హంగామా మ్యూజిక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వొడాఫోన్‌ ఏపీ, తెలంగాణ, కర్ణాటక క్లస్టర్‌ బిజినెస్‌ హెడ్‌ సిద్ధార్థ జైన్‌ తెలిపారు. ఖాతాదారులు వీఐ యాప్‌ ద్వారా ప్రకటనలు లేని మ్యూజిక్‌ వినవచ్చని అన్నారు.

*తెలుగు రాష్ట్రాల్లోని మ్యూజి క్‌ ప్రియుల కోసం టెలికాం కంపెనీ వీఐ.. యాప్‌ ద్వారా 3.9 లక్షల తెలుగు, హిందీ పాటలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకు హంగామా మ్యూజిక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వొడాఫోన్‌ ఏపీ, తెలంగాణ, కర్ణాటక క్లస్టర్‌ బిజినెస్‌ హెడ్‌ సిద్ధార్థ జైన్‌ తెలిపారు. ఖాతాదారులు వీఐ యాప్‌ ద్వారా ప్రకటనలు లేని మ్యూజిక్‌ వినవచ్చని అన్నారు.

*గత ఆర్థిక సంవత్సరాని (2021-22)కి సువెన్‌ ఫార్మా రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూపాయి (100ు) మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. దీంతోపాటు మరో 100 శాతం ప్రత్యేక డివిడెండ్‌ను కూడా వాటాదారులకు కంపెనీ చెల్లించనుంది. 2021-22 ఏడాది మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి గాను కంపెనీ ఏకీకృత ప్రాతిపదికన రూ.91.66 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.83.11 కోట్లతో పోలిస్తే 10.28 శాతం పెరిగింది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం రూ.262.46 కోట్ల నుంచి రూ.380.71 కోట్లకు పెరిగింది.

*అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లూ బలహీనంగా ట్రేడవుతున్న ప్రభావంతో పాటు మార్కెట్‌ దిగ్గజం రిలయన్స్‌ కంపెనీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడితో సోమవారం స్టాక్‌మార్కెట్‌ మరో పతనం నమోదు చేసింది. విదేశీ నిధుల తరలింపు నిరాఘాటంగా సాగిపోతూ ఉండడంతో అమెరికన్‌ డాలర్‌ మారకంలో రూపాయి జీవితకాల కనిష్ఠ స్థాయిని తాకడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బ తీసింది. ఫలితంగా సెన్సెక్స్‌ 364.91 పాయింట్ల నష్టంతో 54,470.67 వద్ద ముగియగా నిఫ్టీ 109.40 పాయింట్ల నష్టంతో 16,301.85 వద్ద ముగిసింది.

*రూపాయి విలువ తగ్గిపోతే ఆ ప్రభావం పలు రంగాలపై ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు చెబుతున్న దాని ప్రకారం.. మన దేశంలో నిత్యం వినియోగించే చమురులో మూడొంతుల మేర విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటాం. అంటే డీజిల్‌, పెట్రోల్‌ ధరలు మరిం త పెరుగుతాయి. దానివల్ల వస్తువుల ధరలు పెరుగతాయి. ఇది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. దాంతోపాటే దేశ వాణిజ్య లోటు భారీగా పెరిగిపోతుంది. అలాగే.. రూపాయి క్షీణతతో ఎలకా్ట్రనిక్స్‌ విడిభాగాల దిగుమతులు మరింత భారం కానున్నాయి. ఎందుకంటే, విదేశీ మారకం కోసం మన దేశం అదనంగా చెల్లించాల్సి వస్తుంది. దాంతో ఇంధనం, ఎలకా్ట్రనిక్స్‌ ఉత్పత్తులు, వాహనాలు, విదేశాల నుంచి నేరుగా దిగుమతి చేసుకునే లగ్జరీ కార్లతో పాటు దిగుమతి ఆధారిత ముడి సరుకులతో తయారయ్యే వస్తువుల రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

*గత ఆర్థిక సంవత్సరాని (2021-22)కి సువెన్‌ ఫార్మా రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూపాయి (100ు) మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. దీంతోపాటు మరో 100 శాతం ప్రత్యేక డివిడెండ్‌ను కూడా వాటాదారులకు కంపెనీ చెల్లించనుంది. 2021-22 ఏడాది మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి గాను కంపెనీ ఏకీకృత ప్రాతిపదికన రూ.91.66 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.83.11 కోట్లతో పోలిస్తే 10.28 శాతం పెరిగింది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం రూ.262.46 కోట్ల నుంచి రూ.380.71 కోట్లకు పెరిగింది.

*స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్(SCB), బార్క్లేస్ బ్యాంక్ PLC కన్సార్టియం నుండి మూడు సంవత్సరాల ఈసీబీ వెసులుబాటు ద్వారా 250 మిలియన్ డాలర్లను సేకరించినట్లు అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ (AAHL) సోమవారం వెల్లడించింది. ఇదే క్రమంలో… అదనంగా మరో USD 200 మిలియన్లను సేకరించే అవకాశం కూడా ఉన్నట్లు వెల్లడించింది. తాజాగా సేకరించిన మూలధన వ్యయం మరియు ఆరు విమానాశ్రయాలు, MSME అభివృద్ధి కోసం ఉపయోగించనున్నారు.

* విస్తరణ ప్రణాళికలో భాగంగా రెండేళ్లలో లారస్‌ లేబొరేటరీస్‌ రూ.2,000- 2,500 కోట్ల వరకూ పెట్టుబడు లు పెట్టనుంది. 2022-23, ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలో ఈ మేరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు లారస్‌ ల్యాబ్స్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ చావా సత్యనారాయణ తెలిపారు. గతంలో రూ.1,500-1,700 పెట్టుబడులు పెట్టాలని కంపెనీ భావించినప్పటికీ.. మార్కెట్లో అవకాశాలను పరిగణనలోకి తీసుకుని పెట్టుబడులను పెంచనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల డాలర్ల (దాదాపు రూ.7,500 కోట్లు) ఆదాయ లక్ష్యా న్ని చేరాలని కూడా కంపెనీ భావిస్తోంది. 2021-22లో లారస్‌ ల్యాబ్స్‌ రూ.4,936 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

*సాగర్‌ సిమెంట్‌కు రూ.350 కోట్ల నిధులు లభించనున్నాయి. ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్‌ ప్రేమ్‌జీ ఇన్వె్‌స్టకు చెందిన పీఐ ఆపర్చ్యునిటీస్‌ ఫండ్‌-1 స్కీమ్‌ 2కు ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ ద్వారా రూ.2 ముఖ విలువ కలిగిన 1,32,07,548 షేర్లను కేటాయించడానికి కంపెనీకి చెందిన సెక్యూరిటీస్‌ అలాట్‌మెంట్‌ కమిటీ అంగీకరించింది. రూ.2 ముఖ విలువ కలిగిన షేర్‌ను రూ.265కు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ ఫండ్‌కు షేర్లను ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ చేయడానికి గత నెలలో జరిగిన ఏజీఎంలో వాటాదారులు ఆమోదం తెలిపారు. ఈ షేర్ల కేటాయింపు తర్వాత సాగర్‌ సిమెంట్‌ చెల్లించిన మూలధనం రూ.23.5 కోట్ల నుంచి రూ.26.14 కోట్లను మించుతుంది. ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ ద్వారా లభించిన నిధులను కొత్త సిమెంట్‌ ప్లాంట్ల ఏర్పాటు, ఉన్న ప్లాంట్ల విస్తరణకు వినియోగించనుంది.

*ప్రస్తుతం ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే వారు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లేదా నైకా వంటి ఈ-కామర్స్‌ పోర్టల్‌ను సందర్శించినప్పుడు ఆ సైట్‌లో నమోదు చేసుకున్న విక్రేతలకు సంబంధించిన ఉత్పత్తులు మాత్రమే దర్శనమిస్తాయి. ఒకవేళ మీకు అమెజాన్‌లో కొన్ని, నైకా లేదా ఇతర ఈ-కామర్స్‌ సైట్‌లో కొన్ని ఉత్పత్తులు నచ్చితే..? ఆయా సైట్ల నుంచి విడివిడిగా కొనుగోలు చేయాలి. అందుకు విడివిడిగా చెల్లింపులు జరపాలి. పైగా మీకు అవసరమైన ఉత్పత్తుల కోసం పలు ఈ-కామర్స్‌ సైట్లను సందర్శించి, ధరలు పోల్చి చూసుకున్నాక ఏ పోర్టల్‌ ద్వారా కొనుగోలు చేయాలో నిర్ణయం తీసుకోవడం ప్రయాసతో కూడిన ప్రక్రియే. ఈ ఆన్‌లైన్‌ షాపింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు భారత ప్రభు త్వం కామన్‌ గేట్‌వేను అభివృద్ధి చేసింది. ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డీసీ) పేరుతో గతనెలాఖరులో ఢిల్లీ ఎన్‌సీఆర్‌, బెంగళూరు, భోపాల్‌, షిల్లాంగ్‌, కోయంబత్తూర్‌లో పైలట్‌ సేవలను ప్రారంభించింది. వచ్చే 6 నెలల్లో 100 నగరాలకు సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆన్‌లైన్‌ కొనుగోలుదారులు ఈ ఓపెన్‌ నెట్‌వర్క్‌ ద్వారా అన్ని పోర్టళ్ల నుంచి షాపింగ్‌ చేసే అవకాశం లభిస్తుంది. అంతేకాదు, విక్రేతలకూ ప్రయోజనకరమే.

*ఒక రాష్ట్రానికి చెందిన రవా ణా సంస్థకు 1,400 ఎలక్ట్రిక్‌ బస్సులను సరఫరా చేయడానికి ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌కు చెందిన ఈవీ ట్రాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అతి తక్కువ బిడ్‌ను దాఖలు చేసింది. లీస్ట్‌ కోటెడ్‌ (ఎల్‌-1) బిడ్డర్‌గా ఈవీని ఆ రవాణా సంస్థ ప్రకటించిందని ఒలెకా్ట్ర తెలిపింది. గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌ (జీసీసీ)/ఒపెక్స్‌ మోడల్‌ కింద కాంట్రాక్టు కాలపరిమితి 12 ఏళ్లు ఉంటుంది. ఎలక్ట్రిక్‌ బస్సులను సరఫరా చేయడంతో పాటు ఈ కాలంలో వాటి నిర్వహణ బాధ్యతలను కూడా చేపట్టాలి. రవాణా సంస్థ నుంచి లెటర్‌ ఆఫ్‌ అవార్డు లభించిన వెంటనే ఎలక్ట్రిక్‌ బస్సులను ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌ నుంచి ఈవీ ట్రాన్స్‌ పొందుతుంది. ఏడాది కాలంలో ఈ మొత్తం ఎలక్ట్రిక్‌ బస్సులను ఒలెకా్ట్ర సరఫరా చేస్తుంది. 1,400 బస్సుల విలువ దాదాపు రూ.2,450 కోట్లు ఉంటుంది.