WorldWonders

అక్కడ మట్టి పాత్రలే ఫ్రిజ్

అక్కడ మట్టి పాత్రలే ఫ్రిజ్

సాధారణంగా ద్రాక్ష పండ్లు రెండు మూడు రోజులు ఉండాలంటే కచ్చితంగా ఫ్రిజ్లో పెట్టాల్సిందే. అదే పెద్ద మొత్తంలో పండిన పంటనైతే కోల్డ్ స్టోరేజీలో ఉంచుతారు. ద్రాక్ష విరివిగా పండే ఆఫ్ఘనిస్థాన్ లో మాత్రం ‘కంగిణ’ అనే పురాతన పద్ధతిలో నిల్వ చేసి తాజాగా ఉంచుతున్నారు. మట్టి కుండలపై వేసే మూతల ఆకృతిలో బంకమట్టితో రెండు పాత్రల్ని తయారు చేసి వాటి మధ్యలో అరకేజీ పండ్లని ఉంచి చుట్టూ మట్టితో కప్పేస్తారు. ఏ మాత్రం గాలీ వెలుతురూ తగలకుండా ఆ విధంగా నిల్వ చేసే ద్రాక్ష పండ్లు ఆరునెలలపాటు తాజాగా ఉంటాయట. అక్కడ వీధి వ్యాపారులూ ఇలా నిల్వ చేసిన పాత్రల్ని రోడ్ల పక్కన బండ్ల మీద పెట్టి అమ్ముతుంటారు . కొనుక్కునేవారికి అప్పటికప్పుడు ఆ మట్టిపాత్రల్ని పగలగొట్టి ద్రాక్షపండ్లని ఇస్తుంటారు . అలా పురాతన పద్ధతిలో నిల్వ చేసిన పండ్లు చాలా రుచిగా ఉంటాయని చెబుతారు ఆప్షన్ ప్రజలు.
matti2