Devotional

సింహాద్రి అప్పన్నకు వైభవంగా.. రెండో విడత చందన సమర్పణ – TNI ఆధ్యాత్మికం

సింహాద్రి అప్పన్నకు వైభవంగా.. రెండో విడత చందన సమర్పణ – TNI ఆధ్యాత్మికం

వైశాఖ పూర్ణిమను పురస్కరించుకుని.. సింహాద్రి అప్పన్నకు ఇవాళ రెండో విడత చందన సమర్పణ వైభవంగా జరిగింది. వేదమంత్రాలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ సుప్రభాత సేవతో చందనోత్సవం ప్రారంభమైంది. రెండో విడత చందన సమర్పణలో భాగంగా… మూడు రోజుల పాటు అరగదీసిన 125 కిలోల చందనాన్ని.. స్వామివారికి సమర్పించారు.సింహాద్రి అప్పన్నకు వైభవంగా రెండో విడత చందన సమర్పణవైశాఖ పూర్ణిమను పురస్కరించుకుని.. సింహాద్రి అప్పన్నకు ఇవాళ రెండో విడత చందన సమర్పణ వైభవంగా జరిగింది. వేదమంత్రాలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ సుప్రభాత సేవతో చందనోత్సవం ప్రారంభమైంది. విశ్వక్షేణ ఆరాధనం, పుణ్యాహవచనం అనంతరం… స్వామివారికి చందన సమర్పణ ఉత్సవం నిర్వహించారు. చందనోత్సవం సందర్భంగా.. ఆలయంలో ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు. పుణ్యదినం సందర్భంగా.. మత్స్యకారులు, భక్తులు.. సాము గరిడీలు, సంకీర్తనలతో.. స్వామివారికి భక్తి సమర్పణ చేసుకున్నారు.రెండో విడత చందన సమర్పణలో భాగంగా.. మూడు రోజుల పాటు అరగదీసిన125 కిలోల చందనాన్ని.. స్వామివారికి సమర్పించారు. అర్చకులు స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా.. గ్రామీణ ప్రాంతాల నుంచి భక్తులు.. స్వామివారి దర్శనానికి పోటెత్తారు. స్వామివారిని కీర్తిస్తూ.. దర్శనం చేసుకుని పులకించిపోయారు.

1. నేడు వైశాఖ పూర్ణిమ
మహా వైశాఖి అనే పేరు వ్యవహారంలో కనబడుతున్నది. సంపూర్ణమైనటువంటి వ్రతం ఇది. ఈరోజున ఆధ్యాత్మిక సాధనలు ఏవి చేసినప్పటికీ అధికఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది. సంవత్సరంలో ప్రధానమైన కాలములు రెండు ఋతువులు చెప్పారు – వసంత ఋతువు, శరదృతువు. శరదృతువు ఆశ్వయుజ , కార్తికాలలో వస్తుంది. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలలో వస్తుంది. ఈ రెండింటినీ సంవత్సరారంభములుగా చెప్తారు. ఈ రెండు ఋతువులలోనూ భగవదారాధనకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ రెండు ఋతువులలో శరన్నవరాత్రులు , వసంత నవరాత్రులు చేయడం జరుగుతుంది. సమ ప్రాధాన్యం ఈ రెండింటికీ మనకు సంవత్సరంలో కనబడుతుంది. వాతావరణంలోనూ రెండింటిలోనూ ఒకవిధమైన సమ లక్షణం కనబడుతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కారణం చేతనే ఈ రెండు ఋతువులలో వచ్చిన పూర్ణిమలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది. ఈ రెండు ఋతువులలో మనకు మొత్తం నాలుగు పూర్ణిమలు వస్తాయి – చైత్ర పూర్ణిమ , వైశాఖ పూర్ణిమ , ఆశ్వయుజ పూర్ణిమ , కార్తిక పూర్ణిమ. ఈ నాలుగు పూర్ణిమలు ప్రత్యేకమైన ఆరాధనలు చేసి సంపూర్ణమైనటువంటి యజ్ఞఫలాన్ని పొందవచ్చు అని శాస్త్రములు చెప్తున్నటువంటి విషయం.ఆశ్వయుజ పూర్ణిమకు ‘ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజితా” అనే నామంలోనే ‘ముఖ్యరాకా’ అని చెప్పారు. అప్పుడు అమ్మవారి ఆరాధనలు అత్యంత విశిష్టమైన ఫలితాలను ఇస్తాయి అని చెప్తారు. అదేవిధంగా కార్తిక పూర్ణిమ కృష్ణ పూజకి , అమ్మవారి ఆరాధనకి , శివారాధనకు అత్యంత ప్రాధాన్యం కలిగినది. ఇవి కాకుండా సంవత్సర మధ్య కాలంలో ఆషాఢపూర్ణిమ ఒకటి. దానికొక ప్రాధాన్యం ఇచ్చారు. దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చేటటువంటి పూర్ణిమ అది. ఇవి ప్రధానమైన పూర్ణిమా వ్రతాలుగా మనకు శాస్త్రం చెప్తున్న అంశం. ఇవి కాకుండా మాఘమాసంలో యజ్ఞసంబంధమైన పూర్ణిమ. ఇలా ఆరు పూర్ణిమలు సంవత్సర కాలంలో ప్రధానం అని చెప్పారు.
అందులో అత్యంత ప్రధానమైన వైశాఖ పూర్ణిమలో మనం ఉన్నాం ఇప్పుడు.

2. భువనేశ్వర్‌లో టీటీడీ నిర్మించిన శ్రీవేకంటేశ్వరస్వామివారి ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమానికి హాజరు కావాలని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్రను టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆహ్వానించారు. తిరుమల గోగర్భం సమీపంలోని శారదా పీఠానికి ఆదివారం ఈవో వెళ్లి.. వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈనెల వ తేదీ నుంచి ఆలయ మహా సంప్రోక్షణకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తేదీన విగ్రహ ప్రతిష్ఠ ఉంటుందని వివరించారు.

3. ధర్మపురి క్షేత్రంలో భక్తుల రద్దీ
ధర్మపురి క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. దీంతో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అనుబంధ ఆలయాలు భక్తులతో కిట కిటలాడాయి. సెలవు దినం కావటం వల్ల ఉదయం వరకు క్షేత్రానికి అనేక మంది భక్తులు తరలి వచ్చారు. గోదావరి నదిలో అధిక సంఖ్యలో భక్తులు స్నానాలు ఆచరించారు. అనంతరం ఆలయాలకు చేరుకుని స్వామి వారలను దర్శనం చేసుకున్నారు. కొందరు భక్తులు టిక్కెట్లు కొనుగోలు చేసి కుంకుమార్చన, అభిషేకాది పూజలు, స్వామి వారి నిత్య కళ్యాణం చేయించారు. ఆలయాల్లో స్వామి వారలను అందంగా వివిధ రకాల పూలతో అలంకరణ చేశారు. స్వామి వారలకు వేదపండితులు బొజ్జ రమేష్‌శర్మ, సామవేద పండితులు ముత్యాలశర్మ, మంత్రోచ్ఛరణల మధ్య ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచారి, రమణాచార్యా, నరసింహమూర్తి, శ్రీధరాచార్యా, అర్చకులు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి వరకు భక్తులు స్వామి వారలను దర్శనం చేసుకోవటం అగుపించింది. ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సిబ్బంది భక్తులకు తగు సేవలు అందించారు.

4. తిరుమలలో వారంతపు భక్తుల రద్దీ నెలకొంది. శనివారం సాయంత్రం నుంచే కొండకు భక్తుల రాక పెరిగింది. సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూలైన్‌ లేపాక్షి సర్కిల్‌ మీదుగా లగేజీ సెంటర్‌ వరకు చేరింది. దీంతో సర్వదర్శనం భక్తులకు 10 నుంచి 12 గంటల వరకు దర్శన సమయం పడుతోంది. శ్రీవారి మాడ వీధులు, అఖిలాండంతోపాటు కాటేజీలు, బస్టాండ్‌, అన్నదాన భవన పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీ నెలకొనడంతో గదులకు డిమాండ్‌ పెరిగింది. చాలామంది గదులు లభించక ఇబ్బంది పడ్డారు. సోమవారం మధ్యాహ్నం వరకు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.

5. శారదా పీఠాధిపతికి TTD ఈవో ఆహ్వానం
భువనేశ్వర్‌లో టీటీడీ నిర్మించిన శ్రీవేకంటేశ్వరస్వామివారి ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమానికి హాజరు కావాలని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్రను టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆహ్వానించారు. తిరుమల గోగర్భం సమీపంలోని శారదా పీఠానికి ఆదివారం ఈవో వెళ్లి.. వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈనెల 21వ తేదీ నుంచి ఆలయ మహా సంప్రోక్షణకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, 26వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ ఉంటుందని వివరించారు.

6. ముగిసిన నృసింహుడి జయంత్యుత్సవాలు
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి జయంత్యుత్సవాలు ఆదివారం ముగిశాయి. ప్రధానాలయంలో నిత్య హవనాలు నిర్వహించిన అనంతరం ప్రథమ ప్రాకారంలోని యాగశాలలో పూర్ణాహుతి, ముఖమండపంలో సహస్ర కలశాలకు పూజలు, స్వయంభువులకు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావ ప్రవచనం, నివేదన, తీర్థ ప్రసాద గోష్టి, మంగళ నీరాజనం చేసి ఉత్సవాలను ముగించారు.
*యాదాద్రిలో భక్తుల రద్దీ
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవురోజు కావడం, స్వామి జయంతి, స్వాతి నక్షత్రం కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లు, కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణి, గండి చెరువుతో పాటు ఆలయ పరిసరాలన్నీ రద్దీగా మారాయి. 30 వేలకుపైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ధర్మ దర్శనానికి రెండున్నర గంటలు, అతి శీఘ్ర దర్శనానికి 45 నిమిషాలకుపైగా సమయం పట్టిందని భక్తులు తెలిపారు.

7. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.95 కోట్లు
తిరుమలలో నిన్న శ్రీవారిని 81,720 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 34,266 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. స్వామివారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. స్వామి వారి సర్వదర్శనానికి 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

8. బుద్ధ భూమిలో మోదీ.. చారిత్రక మాయాదేవి ఆలయంలో పూజలు
బుద్ధ పూర్ణిమ సందర్భంగా నేపాల్ పర్యటనకు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. బుద్ధుని జన్మస్థలమైన లుంబినిలోని చారిత్రక మాయాదేవి ఆలయాన్ని సందర్శించారు. నేపాల్ ప్రధాని షేర్ బహదుర్ దేవ్బాతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను మోదీకి వివరించారు నిర్వాహకులు. భారత్-నేపాల్ మధ్య స్నేహ బంధానికి సంకేతంగా దేవ్బా ఆహ్వానం మేరకు మోదీ ఈ పర్యటనకు వెళ్లారు.

9. భద్రాద్రి ఆలయానికి భారత్ బయోటెక్ కంపెనీ భారీ విరాళాన్ని ప్రకటించింది భద్రాద్రి రామయ్య సన్నిధిలో నిత్యాన్నదానానికి రూ. కోటి విరాళాన్ని కంపెనీ యాజమాన్యం అందించిం. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆలయంలో ప్రతిరోజు అన్నదాన సత్రంలో అన్నప్రసాదాన్ని అందిస్తారు. ఈ నేపథ్యంలో భక్తులకు అన్నదానం కోసం భారత్ బయోటెక్ కంపెనీ ప్రతినిధులు ఈ కోటి రూపాయల విరాళాన్ని స్వామి వారి ఖాతాలో జమ చేశారు.

10. నేపాల్‌ Maya Devi ఆలయంలో Modi ప్రత్యేక పూజలు
బుద్ధ పౌర్ణమి పర్వదినం సందర్భంగా నేపాల్లో ని చారిత్రక మాయాదేవి ఆలయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా, ఆయన భార్య డాక్టర్ అర్జు రాణా దేవుబా పాల్గొన్నారు. ఆలయం పక్కనే ఉన్న అశోక స్తంభం వద్ద ఇరువురు ప్రధానులు దీపాలు వెలిగించారు. అనంతరం బోధి వృక్షానికి నీళ్లు పోశారు. బౌద్ధ సంస్కృతి, వార‌సత్వ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. అనంతరం టెంపుల్ కాంప్లెక్స్‌లోని విజిటర్స్ బుక్‌లో మోదీ సంతకం చేశారు.దీనికి ముందు, నేపాల్‌లో నాలుగు రోజుల పర్యటన కోసం ఖాట్మండు చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. గౌతమబుద్ధుని జన్మస్థలమైన లుంబినిలోని ప్రఖ్యాత మాయాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం ద్వారా మోదీ నేపాల్ పర్యటన ప్రారంభమైనట్టు పీఎంఓ కార్యాలయం ఒక ట్వీట్‌లో తెలిపింది. నేపాల్‌లో అడుగుపెట్టగానే మోదీ ఓ ట్వీట్‌లో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. బుద్ధ పౌర్ణమి పర్వదినాన నేపాల్ ప్రజలతో కలిసి ఉండటం చాలా సంతోషంగా ఉందని, లుంబినిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నానని తెలిపారు