DailyDose

ఎన్టీఆర్‌ శత జయంతికి ఏర్పాట్లు.. నిమ్మకూరుకు బాలయ్య

ఎన్టీఆర్‌ శత జయంతికి ఏర్పాట్లు.. నిమ్మకూరుకు బాలయ్య

డీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ‘శక పురుషుడి శత జయంతి’ పేరిట ఈనెల 28న జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు ఎన్టీఆర్‌ తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ )శుక్రవారం నిమ్మకూరు రానున్నారు. వేడుకల కోసం స్థానిక ఎన్టీఆర్‌ బసవతారకం ప్రాంగణాన్ని ముస్తాబు చేస్తున్నారు. నేటితరం సినీ, రాజకీయ నేతలకు స్ఫూర్తిదాయకుడిగా, యుగపురుషుడిగా సుస్థిరస్థానం పొందిన అన్న ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించనున్నారు. ఈ వేడుకలకు ఎన్టీఆర్‌ అభిమానులు, కుటుంబసభ్యులు, టీడీపీ ప్రముఖులు కూడా హాజరవుతారు. అతిరథుల రాకను పురస్కరించుకుని నిమ్మకూరులో స్వాగత బ్యానర్లు సిద్ధం చేస్తున్నారు.