Politics

బీజేపీ అహంకారాన్ని దేశ రైతులు అణ‌చేశారు – TNI రాజకీయ వార్తలు

బీజేపీ అహంకారాన్ని దేశ రైతులు అణ‌చేశారు   – TNI రాజకీయ వార్తలు

* హ‌ర్యానా వేదిక‌గా ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. దేశంలోని రైతులంద‌రూ క‌లిసి… అధికార బీజేపీ అహంకారాన్ని తీసేశార‌ని పేర్కొన్నారు. త్రేతాయుగంలో రామ‌చంద్రుడు రావ‌ణుడి అహాన్ని అణ‌చి వేశార‌ని, ద్వాప‌ర యుగంలో కృష్ణుడు కంసుడి అహాన్ని తొల‌గించార‌ని, ఈ క‌లియుగంలో రైతులు బీజేపీ అహాన్ని అణ‌చేశార‌ని పేర్కొన్నారు.ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదివారం హ‌ర్యానాలోని కురుక్షేత్ర‌లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా బీజేపీపై తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. హ‌ర్యానాలో తాము ఏం చేశామో చెప్పుకోడానికి కూడా బీజేపీ ద‌గ్గ‌ర ఏమీ లేద‌ని ఎద్దేవా చేశారు. ఈసారి త‌మకు అధికారం ఇవ్వాల‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. హ‌ర్యానాలోని పాఠ‌శాల‌ల‌న్నింటినీ బాగు చేసేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇందుకు ఢిల్లీ పాఠ‌శాల‌లే తార్కాణ‌మ‌ని వివ‌రించారు.త‌మ‌కు ఒక్కసారి అధికార‌మిస్తే.. అంతా మార్చి చూపిస్తామ‌ని, పాఠ‌శాల‌ల‌ను పూర్తిగా మార్చేస్తామ‌ని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. అమెరికా మాజీ అధ్య‌క్షుడు ట్రంప్ భార్య భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు కేజ్రీవాల్ స్కూల్ చూస్తాన‌ని, మోదీతో అన్నార‌ని గుర్తు చేసుకున్నారు. గ‌త 7 సంవ‌త్స‌రాలుగా తాము ప్రైవేట్ పాఠ‌శాల‌ల ఫీజు పెంపుకు కూడా అంగీక‌రించ‌లేద‌న్నారు.

*YCPని ఇక నుంచి బొక్కలో పార్టీ అని పిలవాలి: బుద్దా వెంకన్న
మహానాడుకు మహాదరణ వచ్చిందని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. 2054 వరకు నారా కుటుంబం అధికారంలో ఉంటుందని, 2024 ఎన్నికల్లో YCP పూర్తిగా మునిగిపోవడం ఖాయమని బుద్దా వెంకన్న జోస్యం చెప్పారు. వైసీపీని ఇక నుంచి బొక్కలో పార్టీ అని పిలవాలని బుద్దా వెంకన్న సూచించారు. జగన్, విజయసాయిరెడ్డి బొక్కలో ఉన్నప్పుడు వైసీపీని మూసేయాలని ఎమ్మెల్యేలు నిర్ణయించారని బుద్దా వెంకన్న ఆరోపించారు. జగన్ తల్లి, చెల్లి రోడ్ల మీదకు వచ్చి పార్టీని నిలబెట్టారని, అధికారంలోకి వచ్చాక అదే తల్లి, చెల్లిని వెన్నుపోటు పొడిచారని వెంకన్న విమర్శించారు. మంత్రుల బస్సుయాత్రతో ప్రజలకేం ఉపయోగమని, జగన్, వైసీపీ నేతలు దోచుకున్న సొమ్మును చంద్రబాబు కక్కిస్తారని బుద్దా వెంకన్న తెలిపారు

*ప్రభుత్వంపై ఉద్యమించాలి : బాలకృష్ణ
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలయ్యిందని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా , కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. గుంటూరు జేకేసీ రోడ్డులో టీడీపీ ఆధ్వర్యంలో నెలకొల్పిన ‘అన్న క్యాంటీన్‌ ’ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు తదతరులు హాజరయ్యారు.తెలుగు ప్రజల స‌హకారంతో ప్రపంచ‌ వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాట‌వుతాయ‌ని తెలిపారు. ప్రతి పేద‌వాడి ఆక‌లి తీర్చాల‌నేదే ఎన్టీఆర్ ఆశ‌య మ‌ని పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే గ‌తంలో అన్న క్యాంటీన్ల ఏర్పాటయ్యాయ‌ని ఆయ‌న‌ తెలిపారు. రాజ‌కీయ ఉద్దేశంతోనే వైసీపీ స‌ర్కారు అన్న క్యాంటీన్లను ర‌ద్దు చేసిందని ఆరోపించారు. గడిచిన మూడేండ్ల లో వైసీపీ పాలకులు వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారని ఆరోపించారు. మరుగుదొడ్లపైనా పన్ను వేసే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ప్రజల్లో కూడా తిరుగుబాటు వస్తోందని ప్రభుత్వంపై ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

*రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది టీఆర్‌ఎస్సే : మంత్రి గంగుల
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది టీఆర్‌ఎస్‌ మాత్రమేనని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఆదివారం కరీంనగర్‌ కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రి గంగుల కమలాకర్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసిఫ్‌నగర్‌కు చెందిన పలువురు బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరగా.. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

*5వ విడత పల్లె ప్రగతికి ముందే పాతబిల్లులు విడుదల చేయండి:uttam kumar reddy
తెలంగాణలో 5వ విడతల పల్లెప్రగతి, పట్టణ ప్రగతికి ముందే పాత బిల్లులు విడుదల చేయాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. బిల్లలు రాకపోవడం వల్ల పంచాయితీలు, ఆయా పనులు నిర్వహించిన ఎంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గ్రామ పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఉత్తమ్‌ పేర్కొన్నారు.వేతనాలు చెల్లించలేని దుస్థితి ఏర్పడిందని అన్నారు.పంచాయతీలపై వేతనభారం పడకుండా చూడాలని ముఖ్యమంత్రిని కోరారు.

*పోడు భూములపై గిరిజనులకు హక్కులు ఇవ్వాలి:Bandi sanjay
గిరిజనులకు పోడుభూములపై హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు.పోడుభూముల సమస్యలు పరిష్కరించకుండా హరితహారం నిర్వహించడం గిరిజనులను వంచించడమేనని బండి సంజయ్ విమర్శించారు.పోడుభూముల్లో హరితహారం నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.హరితహారానికి బీజేపీ వ్యతిరేకం కాదని బండి సంజయ్ అన్నారు.ఇతర భూముల్లో హరితహారానికి అభ్యంతరం లేదని పేర్కొన్నారు.కేంద్ర అటవీ చట్టం ప్రకారం పోడుభూములపై గిరిజనులకు హక్కులు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

*ప్రణాళికాబద్దంగా చేపట్టడం వల్లనే అభివృద్ధి పథకాలు విజయవంతం:Errabellit
తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి పథకాలు ప్రణాళికాబద్ధంగా చేపట్టడమే విజయానికి కారణమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ఆ దేశానుసారం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేసే బాధ్యతను ప్రజా ప్రతినిధులు, అధికారులు తీసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జెడ్పి చైర్మన్లు జిల్లా స్థాయిలో, మేయర్ లు కార్పొరేషన్ పరిధిలో, మునిసిపల్ చైర్మన్లు మునిసిపల్ పరిధిలో ముందుండి ఈ కార్యక్రమాన్ని నడపాలని అన్నారు.గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు బాగా కష్టపడటం వల్ల మన రాష్ట్రానికి ఎన్నో పతకాలు వచ్చాయని అన్నారు.

*ఎన్నికలప్పుడే రాజకీయాలు..మిగతా అంతా అభివృద్ధి మీదే: Gangula
ఎన్నికలప్పుడే రాజకీయలని..మిగతా సమయంలోఅభివృద్ధిపైనే ధ్యాస వుంటుందని బీసీ,పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కొత్తపల్లి మండలం అసిఫ్ నగర్ లో బీజేపీ నుండి పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరికల కార్యక్రమనికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1956 నుండి చరిత్ర చుస్తే ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ గెలవలేదు.పోటీ కూడా చేయలేదు.మీ ఆశీర్వాదం తో మూడు సార్లు గెలిచానని అన్నారు.తెలంగాణ రాక ముందు ఈ ప్రాంత పరిస్థితి ఏందో మీరే చూసారు.ఎక్కడ కూడా అభివృద్ధి కి నోచుకోలేదని,తాగునీరు, సాగునీటి కి అరిగోస పడ్డామని గుర్తు చేశారు.

* వాజ్‌పాయ్ దారిలోకి బీజేపీ రావాల్సిందే : మెహ‌బూబా ముఫ్తీ
కేంద్ర ప్ర‌భుత్వంపై జ‌మ్మూ క‌శ్మీర్ మాజీ సీఎం మెహ‌బూబా ముఫ్తీ మ‌రోమారు విరుచుకుప‌డ్డారు. గుప్కార్ అల‌యెన్స్‌ను భ‌య‌పెట్టాల‌ని కేంద్రం చూస్తోంద‌ని ఆరోపించారు. అయినా తాము భ‌య‌ప‌డ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. తామంద‌రమూ క‌లిస్తే.. కేంద్రం అనుకున్న ప్ర‌ణాళిక‌లు ముందుకు సాగ‌వ‌న్న భ‌యం కేంద్రానికి ప‌ట్టుకుంద‌ని ఎద్దేవా చేశారు. కేంద్రం ఎప్ప‌టికైనా మాజీ ప్ర‌ధాని వాజ్‌పాయ్, ముఫ్తీ స‌యీద్ తోవ‌లోకి రావాల్సిందేన‌ని మెహ‌బూబా స్ప‌ష్టం చేశారు.

*బ్రిటిష్ పాలకులపై పోరాటాన్ని మొదలుపెట్టింది ఆదివాసీలే: బృందా కారత్‌
విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రం వేదికగా జరుగుతున్న ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్‌ జాతీయ సమావేశాలకు.. సీపీఎం జాతీయ నేతలు, ప్రముఖులు హాజరయ్యారు. బ్రిటిష్ పాలకులపై పోరాటాన్ని మొదలుపెట్టింది.. ఆదివాసీలేనని బృందా కారత్‌ అన్నారు. సాంస్కృతిక సంపద మూలాల పరిరక్షణ కోసం.. వారు గొప్ప త్యాగాలు చేశారని కొనియాడారు. అలాంటి ఆదివాసీలకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రం వేదికగా జరుగుతున్న ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్‌ జాతీయ సమావేశాలకు.. సీపీఎం జాతీయ నేతలు బృందా కారత్‌, మాజీ ఎంపీ జితిన్ చౌదరి సహా ప్రముఖులు హాజరయ్యారు. సమావేశాల్లో మాట్లాడిన నేతలు.. గిరిజనులు, ఆదివాసీ తెగల త్యాగాలను కొనియాడారు. వాస్తవానికి.. బ్రిటిష్ పాలకులపై పోరాటాన్ని మొదలుపెట్టింది.. ఆదివాసీలేనని బృందా కారత్‌ అన్నారు.ఈ నేల, సాంస్కృతిక సంపద మూలాల పరిరక్షణ కోసం.. ఆదివాసీలు, గిరిజన తెగలు గొప్ప త్యాగాలు చేశారని కొనియాడారు. అలాంటి ఆదివాసీలకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్ర వల్ల ప్రజలకు ఏం మేలు జరుగుతోందో చెప్పాలని.. త్రిపురకు చెందిన మాజీ ఎంపీ, ఆదివాసీ హక్కుల సమితి జాతీయ నేత.. జితిన్‌ చౌదరి ప్రశ్నించారు. సామాజిక న్యాయంపై గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. జీవో నెంబర్‌ 3పై.. ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు.

*ఇకపై నిరంతరాయంగా శ్రీవారి సర్వదర్శనం: వైవీ సుబ్బారెడ్డి
తిరుమల లో సెలవుల కారణంగా భక్తుల రద్దీ పెరిగిందని, భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. భక్తులు తిరుమలకు రావొద్దని చెప్పడం లేదని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. భక్తులు ఓపికతో శ్రీవారిని దర్శించుకోవాలని, ఇకపై నిరంతరాయంగా శ్రీవారి సర్వదర్శనం చేసుకోవచ్చని ఆయన చెప్పారు. సర్వదర్శనం టోకెన్ల జారీపై పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

*కేసీఆర్‌ను మళ్లీ మళ్లీ నమ్మి మోసపోవద్దు: షర్మిల
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శలు గుప్పించారు. సదాశివునిపేటలో రైతుగోస ధర్నాలో షర్మిల పాల్గొన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని, పంట వేయని రైతులకు ఎకరాకు 25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మోసం చేయని వర్గం లేదని, దొంగ హామీలు ఇచ్చేందుకు మళ్లీ రెడీ అవుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను మళ్లీ మళ్లీ నమ్మి మోసపోవద్దని షర్మిల ప్రజలకు సూచించారు.

*‘పీఎం కిసాన్’’ను నిర్లక్ష్యం చేస్తున్నారు: విజయశాంతి
తెలంగాణలో పీఎం కిసాన్ పథకం నిధులు.. సగం మందికి కూడా అందడం లేదని బీజేపీ నేత విజయశాంతి ఆరోపించారు. కేసీఆర్‌కు, ప్రధాని మోదీని విమర్శించడంలో ఉన్న శ్రద్ధ.. రైతులకు మేలు చేయడంలో లేదని విమర్శించారు. పీఎం కిసాన్ వర్తించాలంటే ఈ నెలాఖరులోపు ఈకేవైసీ చేసుకోవాలని, కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ విజయశాంతి.. సోషల్ మీడియా వేదికగా పలు విమర్శలు చేశారు. అవి ఆమె మాటల్లోనే..‘‘కేంద్ర ప్రభుత్వం రైతుల‌కు పెట్టుబడి సాయంగా అందించే పీఎం కిసాన్పథకం నిధులు తెలంగాణ రైతుల్లో సగం మందికి అందడం లేదు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా… పాస్‌బుక్ ఉన్న రైతుల్లో 50 శాతం మందికి మాత్రమే పీఎం కిసాన్ అందుతోంది. కొత్తగా పాస్బుక్లు వచ్చిన లక్షలాది మందిని లబ్ధిదారులుగా గుర్తించట్లేదు. చనిపోయిన రైతుల కుటుంబ సభ్యులకు పాస్‌బుక్‌లు బదిలీ అయినా… పీఎం కిసాన్‌కు అప్రూవ్చేయడం లేదు. ఫలితంగా లక్షలాది మంది రైతులు కేంద్రం సాయాన్ని పొందలేకపోతున్నారు. క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం, రాష్ట్ర, జిల్లా స్థాయిలో అప్రూవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే ప్రక్రియలో జాప్యంతో అర్హులైన వారు కూడా పెట్టుబడి సాయం పొందలేకపోతున్నారు.

*అంతర్జాతీయ ఉత్పాదకతను అందుకోవాలి: Niranjan reddy
ఉత్పాదకత పెంచుకుంటేనే మార్కెట్ డిమాండ్ ను తట్టుకొని నిలబడగలుగుతామని, చైనా లాంటి దేశాలలో ఎకరాలో వంద క్వింటాళ్లు పండిస్తే మనం ఎకరాలో 30 క్వింటాళ్లు మాత్రమే పండించ గలుగుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఉత్పత్తులను పెంచి అంతర్జాతీయ ఉత్పాదకతను అందుకోవాలని సూచించారు. హైదరాబాద్ చెంగిచెర్లలోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ ను వనపర్తి గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ప్రతినిధులు, పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి శనివారం సందర్శించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మాంసం అయినా, వ్యవసాయ ఉత్పత్తులు అయినా అంతర్జాతీయ సగటుకు సమానంగా పండించగలిగితేనే అంతర్జాతీయ మార్కెట్ లో పోటీ పడగలుగుతామని అన్నారు.

*పట్టణ అభివృద్ధికి పాటు పడాలి:ఎర్రబెల్లి
మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వీడి పట్టణ అభివృద్ధికి పాటు పడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. 5వ విడత పల్లె-పట్టణ ప్రగతిపై హన్మకొండ, వరంగల్ జిల్లా స్థాయి సన్నాహక సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని మాట్లాడారు.గతంలో కేవలం గంగాదేవి పల్లికే అవార్డులు వచ్చేవని చెప్పారు.ప్రస్తుతం 20గ్రామాలకు ఉత్తమ విలేజ్ అవార్డు లు వస్తున్నాయన్నారు. దేశంలో 500గ్రామాలు సెలెక్ట్ చేస్తే అందులో అన్నీ కూడా తెలంగాణలోనే ఉన్నాయన్నారు.అభివృద్ధి కానీ వాటి గురించి కాకుండా అభివృద్ధి చెందిన వాటిపై మాట్లాడాలని సూచించారు.వైకుంఠ, నర్సరీ, డంపింగ్ యార్డ్‌లు గతంలో ఉండేనా ఇది కదా తెలంగాణలో వచ్చిన మార్పు అన్నారు.ప్రతి ప్రజా ప్రతినిధుల నిధుల నుంచి ప్రతి ఏటా 10శాతం హరితహారానికి వెచ్చిస్తున్నామని చెప్పారు.సర్పంచ్‌లకు రావాల్సిన బకాయి ఫండ్స్ మంజూరు చేస్తామన్నారు.ఉపాధి హామీ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు.100మంది ఉన్న గ్రామాలకు కూడా ప్రతి ఏటా రూ.5లక్షలు మంజూరు చేస్తున్నామని ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు.

*దొంగే దొంగన్నట్లుగా కేసీఆర్ పరిస్థితి: ఈటల
దొంగే దొంగన్నట్లుగా కేసీఆర్ పరిస్థితి ఉందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. శనివారం శంకరపట్నం మండలంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈటల పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ తన చేతకాని తనాన్ని కేంద్రం పై నెడుతున్నారని మండిపడ్డారు.కేసీఆర్ 101 తప్పులు చేశాడు.. దేశంలో చట్టం ఉందని గుర్తుచేశారు.కాంగ్రెస్ ఢిల్లీలో ఆరిపోయింది ఇక్కడ వెలిగే పరిస్థితి లేదని దెప్పిపొడిశారు.రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఈటల రాజేందర్ తెలిపారు.

*ఆ పని చేసే వారిపై జరిమానా విధించాలి: హరీశ్‌రావు
అందమైన ఆకుపచ్చ, ఆహ్లాదకరమైన సిద్ధిపేట పట్టణం చేద్దామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శనివారం మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్మన్ కడవేర్గు మంజుల, అడిషనల్ జిల్లా కలెక్టర్ లోకల్ బాడీస్ ముజమ్మీల్ ఖాన్, వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈసమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు.
*రైతుల ఇబ్బందులు మంత్రికి పట్టవా? .. Jeevan Reddyt
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, మూడు కిలోల కోత‌పై ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ లక్ష్మణ్ దీక్ష బూనారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆయన దీక్షను విరమింపజేసి, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఇబ్బందులను తెలుసుకోవాల్సిన బాధ్యత మంత్రికి లేదా? ఒక్క కొనుగోలు కేంద్రమైనా తిరిగారా? అని ప్రశ్నించారు. మిల్లర్ల దోపిడీని అరికట్టేదెవరు అంటూనే.. విచారణకు ఆదేశిస్తే.. వాస్తవ పరిస్థితులను నిరూపిస్తానని సవాల్ విసిరారు.

*పల్లె ప్రగతి గ్రామాల స్వరూపాన్నే మార్చివేసింది:Kadiyam sri hari
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి గ్రామాల స్వరూపాన్ని మార్చి వేసిందని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. శనివారం జనగామ కలెక్టరేట్ లో జరిగిన పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రిజర్వాయర్ల ద్వారా వేసవిలో త్రాగునీరు అందుబాటులో ఉండటం ప్రగతికి నిదర్శనమన్నారు. గతంలో ఉన్న లోపాలను సవరించుకుంటూ మరింత అభివృద్ధి సాధించాలని అన్నారు. గ్రామ పరిధిలో ఉన్న హై స్కూల్స్ హాస్పిటల్స్ పరిశుభ్రంగా ఉంచాలని ఆకస్మిక తనిఖీలు చేపడతామన్నారు.

*అందుకే చంద్రబాబును పక్కన పెట్టారు: మంత్రి నాగార్జున
పల్నాడు జిల్లా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు క్విట్ జగన్ అంటున్నాడు.. మంచి చేసే జగన్‌ని సాగనంపాలా.. అందుకే చంద్రబాబును ప్రజలు ఓడించి పక్కన కూర్చోబెట్టారని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. శనివారం నరసరావుపేటలో సామాజిక బేరి సభ నిర్వహించారు. ఈసభకు వైసీపీ మంత్రులు , ఎమ్మెల్యే, నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. చంద్రబాబు తన పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎప్పుడైనా గౌరవించారా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో పరిపాలనా ఉందా అని చంద్రబాబు అడుగుతున్నాడు. అందుకే పదిహేడు మంది మంత్రులు రాష్ట్రంలో బస్సు యాత్ర చేసి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్తున్నారని మంత్రి నాగార్జున అన్నారు

*బీసీలను బెదిరించాడు: మంత్రి అప్పలరాజు
పల్నాడు జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బీసీల తొక్క తీస్తామని బెదిరించారని మంత్రి అప్పలరాజు అన్నారు. శనివారం నరసరావుపేటలో సామాజిక బేరి సభ నిర్వహించారు. ఈసభకు వైసీపీ మంత్రులు , ఎమ్మెల్యే, నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ.. రాజ్యాధికారం కోసం బీసీలకు అవకాశం చంద్రబాబు కల్పించారా అని ప్రశ్నించారు. ఏ నాయకుడు, ఏ రాష్ట్రం చేయని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సీఎం జగన్‌రెడ్డి పెద్ద పీట వేశారని చెప్పారు. ఇంతకుముందెన్నడూ ఏ ప్రభుత్వ హయంలోనూ అణగారిన వర్గాలకు ఇంత ప్రాధాన్యం లభించలేదని వైసీపీ ప్రభుత్వంలోనే అందరికి సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పారు. కనీసం నారా లోకేష్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేదని మంత్రి అప్పలరాజు ఎద్దేవా చేశారు.

*మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టారు: మంత్రి సురేష్
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా వాడుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శనివారం నరసరావుపేటలో సామాజిక బేరి సభ నిర్వహించారు. ఈసభకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే, నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ తెలిసినవేనని చెప్పారు.ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజకీయంగా పదవులు వస్తేనే అసమానతలు తొలిగి పోతాయని ఆలోచించిన నేతలు లేరని, అందరికీ పదవులు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌రెడ్డిదేనని అన్నారు.చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఓటు బ్యాంకుగా చూశారన్నారు. ఆయన మంత్రి వర్గంలో గిరిజనులకు, మైనార్టీలకు అవకాశమే లేదని చెప్పారు.మాల, మాదిగలకు జగన్ ఐదు మంత్రి పదవులిచ్చారన్నారు.సురేష్‌కు మంత్రి పదవి రాదు. సీఎం సొంత కులానికే మంత్రి పదవి ఇస్తారని కొంతమంది ప్రచారం చేశారని, కానీ సీఎం తనకు రెండోసారి కూడా అవకాశం కల్పించారని మంత్రి సురేష్ చెప్పారు.

*ఎన్నికల్లో వైసీపీని శ్మశానంలో తగులబెడతారు: అయ్యన్న
‘‘పదహారు నెలలు జైల్లో ఉన్న దొంగోడికి ఓట్లేసి రాష్ట్రాన్ని చేజేతులా సర్వనాశనం చేసుకున్నాం. చెత్త నా…ళ్లు, పనికిమాలిన వాళ్లు మంత్రులుగా ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకుంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేం’’ అని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఒంగోలులో మహానాడు సభా వేదిక నుంచి ప్రసంగించిన ఆయన తనదైన శైలిలో వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ‘‘ప్రతి తెలుగుదేశం కార్యకర్త, అభిమానికి పండుగ లాంటి మహానాడులో ప్రవేశపెట్టిన తీర్మానాలు చూసిన దౌర్భాగ్యుడు తమ్మినేని సీతారాం ఈ వేదికను వల్లకాడు, శ్మశానం అంటారా? రాబోయే ఎన్నికల్లో నీతో పాటు నీ పార్టీ వైసీపీని, జగన్‌ను అదే శ్మశానంలో ప్రజలు తగులబెడతారని గుర్తుంచుకో. అరగంట, గంట అంటూ రాత్రిపూట మల్లెపూలు అమ్ముకునే అంబటి రాంబాబు లాంటోడు మంత్రా? బూతులు మాట్లాడే రింగుల రాణి రోజా ఆంటీ మొగుడికి చీరకట్టి ఇంట్లో కూర్చోబెట్టింది. ఆమె తెలుగుదేశం వాళ్లకు చీరలు పంపుతుందట. రాజకీయాలంటే జబర్దస్త్‌ అనుకుంటోందా?’’ అని అయ్యన్న విమర్శించారు. ఎన్టీఆర్‌ దయవల్ల 40 ఏళ్లుగా ప్రజాసేవ చేస్తున్నానన్నారు. రాష్ట్రానికి ఏమి కావాలో పదేళ్ల ముందే ఆలోచించే నాయకుడు చంద్రబాబు అని, ఆయన ముఖ్యమంత్రి కాకపోతే రాష్ట్రాన్ని కాపాడటం ఎవరి తరమూ కాదన్నారు. బాలయోగి, ప్రతిభా భారతి, అబ్దుల్‌ కలాం వంటి వారిని ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టిన తెలుగుదేశం పార్టీని లోకేశ్‌ నాయకత్వంలో, చంద్రబాబు బాటలో నడిపించాల్సింది యువతరమేనని అన్నారు. సభలో పలువురు టీడీపీ నేతలు మాట్లాడారు.

*పోలీసుల్లేకుండా గడప దాటలేని వైసీపీ నేతలు: అనిత
ఒంగోలు- పోలీసులు లేకుండా వైసీపీ నేతలు అడుగు బయట పెట్టడం సాధ్యం కావడంలేదని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఇంటింటికి రావాలంటే కనీసం 30 మంది పోలీసులు, 50 మంది వలంటీర్లు ఉండాల్సిందేనని ఎద్దేవా చేశారు. బూతుల మంత్రితో నడుస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని విమర్శించారు. పీకే పేరుతో చేసే వెధవ పనులకు వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీడీపీపై విమర్శలు చేసే వెధవలకు శుభాకాంక్షలు అంటూ ప్రసంగాన్ని ముగించారు.

* వైసీపీ సభలకు బలవంతంగా..యామినీశర్మ
మహిళలను బలవంతంగా వైసీపీ సభలకు తీసుకువెళ్తున్నారని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి యామినీశర్మ ఆరోపించారు. రాకపోతే రూ.2,500 జరిమానా విధిస్తామని బెదిరిస్తున్నారని, అందుకు తమ వద్ద ఆధారాలున్నాయని పేర్కొన్నారు. జగన్ మూడేళ్లలో ఉద్దరించిందేమీ లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో 60 నుంచి 90 శాతం కేంద్రం నిధులు ఉండగా..అన్ని పథకాలు తనవేనని జగన్ చెబుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓ వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్‌ను చంపేస్తే.. మరో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేయ్యాలని కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడని విమర్శించారు. ఎస్సీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు బొడ్డు నాగలక్ష్మి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదనే ప్రజా ప్రతినిధులు అందినకాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ మోసాలతో జనం విసిగిపోయారని పేర్కొన్నారు.

* ఆ పని చేసే వారిపై జరిమానా విధించాలి: హరీశ్‌రావు
అందమైన ఆకుపచ్చ, ఆహ్లాదకరమైన సిద్ధిపేట పట్టణం చేద్దామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శనివారం మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్మన్ కడవేర్గు మంజుల, అడిషనల్ జిల్లా కలెక్టర్ లోకల్ బాడీస్ ముజమ్మీల్ ఖాన్, వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈసమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు.

* జనసమీకరణ కోసం డ్వాక్రా గ్రూపులా?.. సోము వీర్రాజు
అధికార పార్టీ సభలకు డ్వాక్రా, మహిళా సంఘాల సభ్యులను వాడుకోవడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తప్పుబట్టారు. అలా వారిని ఆహ్వానించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అధికారిక ఉత్తర్వులు ఇచ్చిందా? అని ఏపీ చీఫ్ సెక్రటరీకి సోము వీర్రాజు లేఖ రాశారు. జనసమీకరణకు డ్వాక్రా గ్రూపులను వాడుకోవడం సరికాదన్నారు. డ్వాక్రా సంఘాలను భయపెట్టి సమావేశాలకు తీసుకురావడం పూర్తిగా చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాలను ఆహ్వానించే అధికారులను గుర్తించి వారి‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

* అందుకే చంద్రబాబును పక్కన పెట్టారు: మంత్రి నాగార్జున
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు క్విట్ జగన్ అంటున్నాడు.. మంచి చేసే జగన్‌ని సాగనంపాలా.. అందుకే చంద్రబాబును ప్రజలు ఓడించి పక్కన కూర్చోబెట్టారని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. శనివారం నరసరావుపేటలో సామాజిక బేరి సభ నిర్వహించారు. ఈసభకు వైసీపీ మంత్రులు , ఎమ్మెల్యే, నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. చంద్రబాబు తన పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎప్పుడైనా గౌరవించారా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో పరిపాలనా ఉందా అని చంద్రబాబు అడుగుతున్నాడు. అందుకే పదిహేడు మంది మంత్రులు రాష్ట్రంలో బస్సు యాత్ర చేసి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్తున్నారని మంత్రి నాగార్జున అన్నారు.

* మావోడు పెగ్గులేస్తాడు.. మీవోడు రంగులేస్తాడు: నన్నూరి నర్శిరెడ్డి
మహానాడు వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై టీటీడీపీ సీనియర్ నేత నన్నూరి నర్శిరెడ్డి వ్యగ్యస్త్రాలు సంధించారు. ‘‘మావోడు పెగ్గులేస్తాడు.. మీవోడు రంగులేస్తాడు.మాకో తిక్కడు.. మీకో పిచ్చొడు తగులుకున్నారు.తెలంగాణలో దొరల పాలన.. ఏపీలో దొంగల పాలన.మాకు సెక్రటేరీయేట్ లేదు.. మీకు రాజధాని లేదు.మావోడు పెగ్గులేస్తాడు.. మీవోడు రంగులేస్తాడు.కేసీఆర్ కన్పిస్తే బ్రేకింగ్ న్యూస్.. జగన్ తెలుగు మాట్లాడితే షాకింగ్ న్యూస్.తెలుగుదేశం జెండాని ప్రతి ఒక్కరు బలపర్చాల్సిన అవసరం ఉంది’’ అని నర్శిరెడ్డి అన్నారు..

* వైసీపీ సభలకు బలవంతంగా..యామినీశర్మ
మహిళలను బలవంతంగా వైసీపీ సభలకు తీసుకువెళ్తున్నారని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి యామినీశర్మ ఆరోపించారు. రాకపోతే రూ.2,500 జరిమానా విధిస్తామని బెదిరిస్తున్నారని, అందుకు తమ వద్ద ఆధారాలున్నాయని పేర్కొన్నారు. జగన్ మూడేళ్లలో ఉద్దరించిందేమీ లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో 60 నుంచి 90 శాతం కేంద్రం నిధులు ఉండగా..అన్ని పథకాలు తనవేనని జగన్ చెబుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓ వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్‌ను చంపేస్తే.. మరో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేయ్యాలని కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడని విమర్శించారు. ఎస్సీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు బొడ్డు నాగలక్ష్మి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదనే ప్రజా ప్రతినిధులు అందినకాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ మోసాలతో జనం విసిగిపోయారని పేర్కొన్నారు.

* పట్టణ అభివృద్ధికి పాటు పడాలి:ఎర్రబెల్లి
మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వీడి పట్టణ అభివృద్ధికి పాటు పడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. 5వ విడత పల్లె-పట్టణ ప్రగతిపై హన్మకొండ, వరంగల్ జిల్లా స్థాయి సన్నాహక సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని మాట్లాడారు.గతంలో కేవలం గంగాదేవి పల్లికే అవార్డులు వచ్చేవని చెప్పారు.ప్రస్తుతం 20గ్రామాలకు ఉత్తమ విలేజ్ అవార్డు లు వస్తున్నాయన్నారు. దేశంలో 500గ్రామాలు సెలెక్ట్ చేస్తే అందులో అన్నీ కూడా తెలంగాణలోనే ఉన్నాయన్నారు.అభివృద్ధి కానీ వాటి గురించి కాకుండా అభివృద్ధి చెందిన వాటిపై మాట్లాడాలని సూచించారు.వైకుంఠ, నర్సరీ, డంపింగ్ యార్డ్‌లు గతంలో ఉండేనా ఇది కదా తెలంగాణలో వచ్చిన మార్పు అన్నారు.ప్రతి ప్రజా ప్రతినిధుల నిధుల నుంచి ప్రతి ఏటా 10శాతం హరితహారానికి వెచ్చిస్తున్నామని చెప్పారు.సర్పంచ్‌లకు రావాల్సిన బకాయి ఫండ్స్ మంజూరు చేస్తామన్నారు.ఉపాధి హామీ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు.100మంది ఉన్న గ్రామాలకు కూడా ప్రతి ఏటా రూ.5లక్షలు మంజూరు చేస్తున్నామని ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు.