DailyDose

త్వరలో నారా లోకేష్ పాదయాత్రపై నిర్ణయం – TNI తాజా వార్తలు

త్వరలో నారా లోకేష్  పాదయాత్రపై నిర్ణయం  –  TNI  తాజా వార్తలు

* తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ త్వరలో పాదయాత్రపై నిర్ణయం తీసుకోనున్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి పాదయాత్ర చేయాలని భావిస్తున్నట్లు తెలియవచ్చింది. ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటికీ తిరుగుతున్న లోకేష్‌.. సగానికిపైగా గ్రామాల్లో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో చంద్రబాబు అక్టోబర్ 2వ తేదీన పాదయాత్ర ప్రారంభించారు. అదే తేదీ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తే బాగుంటుందని పార్టీ శ్రేణులు లోకేష్‌కు చెబుతున్నట్లు సమాచారం. కాగా పాదయాత్ర ప్రారంభిస్తే మధ్యలో బ్రేక్ ఉండకూడదని లోకేష్ భావిస్తున్నారు. మంగళగిరిలో ఇంటింటికి తిరుగుతున్న కార్యక్రమం పూర్తి చేసి పాదయాత్రకు వెళ్లాలని లోకేష్ అనుచరులు భావిస్తున్నట్లు తెలియవచ్చింది.

*తన భర్తపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. చుండూరు మండలం ఆలపాడు సర్పంచ్ విజయలక్ష్మి రోడ్డుపై కూర్చోని నిరసన వ్యక్తం చేశారు. ‘‘జనసేన పార్టీ తరపున సర్పంచ్‌గా గెలవడమే తాము చేసిన తప్పా? మా చెరువులో చేపలను అక్రమంగా పట్టుకోవడమే కాకుండా మాపై కేసుల పెట్టడం ఎంతవరకు సమంజసం’’ అని విజయలక్ష్మి ప్రశ్నించారు. తన భర్తకి ఏదైనా జరిగితే..తమ కుటుంబం, పిల్లల పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు.

*పాలకులు కార్పొరేట్‌ సంస్కృతిని పెంచి పోషిస్తున్నారని.. దీనికి భిన్నంగా ప్రత్యామ్నాయం కోసం ప్రజా నాట్యమండలి కళారూపాల ద్వారా ఉద్యమించాలని ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా పోరంకిలో మూడు రోజుల పాటు జరుగనున్న ప్రజా నాట్యమండలి 10వ రాష్ట్ర మహాసభలను ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఒకే భాష, ఒకే మతం, ఒకే తిండి పేరుతో సాంస్కృతిక ఆదిపత్యం కోసం పాకులాడుతోందని, దానిలో భాగమే దేశంలో మతపరమైన విభజన కోసం మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కోనసీమకు అంబేడ్కర్‌ పేరు పెడితే ఎందుకు రచ్చ చేస్తున్నారని భాజపా, తెదేపా, వైకాపా, జనసేనలను.. కె.ఎస్‌.లక్ష్మణరావు ప్రశ్నించారు.

*తనపై అక్రమ కేసులు బనాయించి పోలీసులు వేధిస్తున్నారని చుండూరు మండలం ఆలపాడు సర్పంచ్ భర్త గద్దె బోడయ్య ఆరోపించారు. పోలీసుల తీరుకు నిరసనగా బోడయ్య నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. గతంలో కూడా తమపై తప్పుడు కేసులు పెట్టారని, తాము జనసేన పార్టీ నుంచి సర్పంచ్‌గా ఎన్నికవ్వడంతో వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు స్పందించే వరకు ట్యాంక్‌పైనే ఉంటానని చెప్పారు.

*సివిల్స్‌ -2021 తుది ఫలితాలు విడుదలయ్యాయి. అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం నిర్వహించిన పరీక్షలో 685 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. వీరిలో శృతి శర్మకు మొదటి ర్యాంకు, అంకిత అగర్వాల్‌కు రెండో ర్యాంకు, గామిని సింగ్లాకు మూడో ర్యాంకు వచ్చింది.ఈసారి అఖిల భారత సర్వీసులకు మొత్తం 685 మంది ఎంపిక కాగా.. జనరల్‌ కోటాలో 244 మంది, ఈడబ్ల్యూఎస్‌ నుంచి 73, ఓబీసీ 203, ఎస్సీ 105, ఎస్టీ విభాగం నుంచి 60 మంది ఉన్నారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్‌కు 180, ఐపీఎస్‌కు 200, ఐఎఫ్‌ఎస్‌కు 37 మంది ఎంపికయ్యారు. ఇక సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌ ఏ కేటగిరీకి 242 మంది ఎంపిక కాగా.. మరో 90 మంది గ్రూప్‌ బీ సర్వీసులకు ఎంపికైనట్లు యూపీఎస్‌సీ ప్రకటించింది.సత్తా చాటిన తెలుగువాళ్లు.. మరోవైపు సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. యశ్వంత్‌కుమార్‌రెడ్డికి 15వ ర్యాంకు రాగా.. పూసపాటి సాహిత్య (24), కొప్పిశెట్టి కిరణ్మయి (56), శ్రీపూజ (62), గడ్డం సుధీర్‌కుమార్‌రెడ్డి (69), ఆకునూరి నరేశ్‌ (117), అరుగుల స్నేహ (136), బి.చైతన్యరెడ్డి (161), ఎస్‌.కమలేశ్వరరావు (297), విద్యామరి శ్రీధర్‌ (336), దిబ్బడ ఎస్వీ అశోక్‌ (350), గుగులావత్‌ శరత్‌ నాయక్‌ (374), నల్లమోతు బాలకృష్ణ (420), ఉప్పులూరి చైతన్య (470), మన్యాల అనిరుధ్‌ (564), బిడ్డి అఖిల్‌ (566), రంజిత్‌కుమార్‌ (574), పాండు విల్సన్‌ (602), బాణావత్‌ అరవింద్‌ (623), బచ్చు స్మరణ్‌రాజ్‌ (676) ర్యాంకులు సాధించారు. రాష్ట్రానికి చెందిన పలువరికి సివిల్స్‌లో మంచి ర్యాంకులు వచ్చాయి. నర్సీపట్నానికి చెందిన మంత్రి మౌర్య భరద్వాజ్.. సివిల్స్లో 28వ ర్యాంకుతో సాధించారు. బీటెక్ చదివిన మౌర్య.. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో సివిల్స్ కోసం కృషి చేసినట్లు చెప్పారు. 28వ ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన శ్రీపూజ.. సివిల్స్‌లో 62 ర్యాంకుతో సత్తా చాటారు. పదో తరగతి వరకు రాజంపేటలోనే చదువుకున్న ఆమె.. ఆ తర్వాత విజయవాడలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. ఆమె తండ్రి వెంకటేశ్వరరావు.. పంచాయతీరాజ్ విభాగంలో పనిచేస్తున్నారు. తండ్రి ప్రోత్సాహంతోనే సివిల్స్ ర్యాంకు సాధించినట్లు పూజ తెలిపారు. కర్నూలు జిల్లా మంత్రాలయానికి చెందిన అంబిక జైన్… సివిల్స్‌లో 128వ ర్యాంకు సాధించారు. మంచి ర్యాంకు సాధించడం పట్ల ఆమె హర్షం వ్యక్తంచేశారు.

*నేడు రైల్వే కోర్టుకు మంత్రి దాడిశెట్టి రాజా, ముద్రగడ హాజరయ్యారు. 2016 తుని ఘటన కేసులో విచారణకు వీరిద్దరూ హాజరయ్యారు. ఈ కేసులో ముద్రగడ సహా 42 మంది కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణ జూన్ 23కు వాయిదా పడింది. మీడియాతో మాట్లాడేందుకు ముద్రగడ నిరాకరించారు.

*కాకినాడ జిల్లా ప్రతిపాడు మండల పరిధిలో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న పులిని బంధించేందుకు.. అటవీశాఖ చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా.. డీఈవో ఐకేవీ రాజు ఆధ్వర్యంలో 150 మంది గస్తీ కాస్తున్నారు. కాగా.. పులి సంచరిస్తున్న దృశ్యాలు ఆదివారం మరోసారి సీసీ కెమెరాలో నమోదయ్యాయి. పోతులూరు సమీపంలో 80 అడుగుల గుట్టపై పులి సంచారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

* కింగ్ జార్జ్ ఆసుపత్రిలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రి సిబ్బంది, యంత్రాలు పనితీరుపై ఆరా తీశారు. సిబ్బంది పనితీరు, ఆస్పత్రిలో వసతుల లేమి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. సమయానికి సిబ్బంది విధులకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో అపరిశుభ్రతపై కృష్ణబాబు అధికారులను నిలదీశారు.

*కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, మంత్రి దాడిశెట్టిరాజా సోమవారం విజయవాడ రైల్వే కోర్టుకు హాజరయ్యారు. 2016 తుని ఘటన కేసులో విచారణ నిమిత్తం ముద్రగడతో సహా 42 మంది కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ రైల్వే కోర్టు జూన్ 23కు వాయిదా వేసింది. కాగా మీడియాతో మాట్లాడేందుకు ముద్రగడ నిరాకరించారు.

*కృష్ణా జిల్లా గూడూరు మండలంలో ఐదుగురు వీఆర్వోలపై సస్పెన్షన్ వేటు పడింది. గూడూరు మండలంలో అక్రమ త్రవ్వకాలపై కలెక్టర్‌ భాషాకు గ్రామస్తులు, రైతులు ఫిర్యాదు చేశారు. అక్రమ త్రవ్వకాలపై సీరియస్‌గా స్పందించిన కలెక్టర్… త్రవ్వకాలను ప్రోత్సహిస్తున్న వీర్వోలను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

*పల్నాడు జిల్లా రెంటచింతలలో జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారని తెలిసి విచారానికి లోనయ్యాను అని తెలిపారు. శ్రీశైలంలో దర్శనానికి వెళ్ళి వస్తున్న వీరంతా మృత్యువాతపడటం అత్యంత బాధాకరమని ఆవేదన చెందారు. ఆ కుటుంబాలకు జనసేనాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వ్యవసాయ కూలీ పనులపై ఆధారపడి జీవించే ఆ కుటుంబాల వారిని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో గాయాల పాలైనవారికి మెరుగైన వైద్యం అందించాలి అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

*మహానాడు గ్రాండ్ సక్సెస్ ఎవరిది? ఈ మహానాడుతో లోకేష్ (Lokesh) అసలైన ముద్ర వేసుకున్నారా? ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అన్నట్లుగా లోకేష్ ఉండబోతున్నారా? టీడీపీ మహానాడు గ్రాండ్ సక్సెస్.. అధికార పార్టీ కలవరపడేలా సొంత పక్షంలో నేతలు సయితం యాక్టివ్ అయ్యేలా మహానాడు పెద్ద మెసేజ్‌నే పంపింది. టీడీపీకి మహానాడు కొత్త కాకపోయినా ఈ మహానాడు అత్యంత కీలకం. దీంతో మహనాడు నిర్వహించే ప్రాంతం నుంచి తీర్మానాల వరకు ప్రతి అంశంలో చాలా వ్యూహాత్మకంగా పార్టీ పెద్దలు వ్యవహరించారు. ముఖ్యంగా ఈ మహానాడులో అడుగడుగునా లోకేష్ మార్క్ కనిపించింది. అధినేతను ఒప్పించడం నుంచి నేతలను సమన్వయం పరచడం వరకు తెరవెనుక కృషి అద్భుత ఫలితాన్ని ఇచ్చింది.

*నందిగామ: జిల్లాలోని మున్సిపల్ కార్యాలయంలో గందరగోళం చోటు చేసుకుంది. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని టీడీపీ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి టీడీపీ కౌన్సిలర్లు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. మున్సిపల్ కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

* జీజీహెచ్‌లో మరోసారి అక్రమ వసూళ్ల వివాదం రాజుకుంది. కాన్పు కోసం వచ్చిన మహిళకు ఆమె బిడ్డను ఇచ్చేందుకు రూ.2వేలు వసూలు చేశారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు మరో రూ.2వేలు అదనంగా డిమాండ్ చేశారు. డబ్బులు అడిగే వారిని బాలింత భర్త ఫొటోలు తీశారు. భర్తపై దాడికి యత్నించి సిబ్బంది సెల్‌ఫోన్ పగలగొట్టారు. డబ్బులు ఇవ్వకపోతే బాలింత ఫొటోలు తీ
స్తామని బెదిరింపులకు సైతం పాల్పడ్డారు. చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం విజ్ఞప్తి చేసింది.
*కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ పేరు ఒక చిన్న జిల్లాకు కాదని, దక్షిణ భారత దేశానికి అంబేద్కర్ పేరు పెట్టాలని అన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగడం లేదని అన్నారు. వైసీపీ (YCP) మంత్రులది బస్సు యాత్ర కాదని.. తుస్సు యాత్రని ఎద్దేవా చేశారు. ధర్మాన ఊకదంపుడు ఉపన్యాసాలు కుర్చీలే విన్నాయన్నారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా విద్యార్థులకు స్కాలర్ షిప్‌ లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు రావని చింతా మోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

*త్వరలో ముంబైలో ‘తెలంగాణ లిటరరీ ఫెస్ట్‌’(తెలంగాణ సాహిత్య పండుగ)ను నిర్వహించనున్నట్టు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ వెల్లడించారు. మహారాష్ట్ర తెలుగు రైటర్స్‌ అసోసియేషన్‌(త్వమ్‌) ఆధ్వర్యంలో ఆదివారం ముంబైలోని కోహినూర్‌ మంగళ కార్యాలయంలో డాక్టర్‌ తాటి నరహరి కథల సంపుటి ‘34 గోఖలేరోడ్‌ నార్త్‌’, సంగెవేని రవీంద్ర ‘నిర్భంధకాలం’ కవితా సంపుటి ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ నుంచి వచ్చిన కుటుంబాలు అత్యధికంగా నివసిస్తున్న ముంబై, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో తెలంగాణ లిటరరీ ఫెస్ట్‌లను ఘనంగా జరుపుకుందామన్నారు. ముంబై నిర్మాణంలో తెలంగాణ వాళ్ల పాత్ర కీలకమైందని గుర్తు చేశారు. తెలంగాణ లిటరరీ ఫెస్ట్‌ల నిర్వహణతో పాటు తెలంగాణ సాహిత్యాన్ని అన్ని భారతీయ భాషల్లోకి అనువదించాల్సిన అవసరం ఉందన్నారు. ముంబైలో స్థిరపడిన తెలంగాణ కవులు, రచయితలు, కథకులు తెలంగాణ సాహిత్యాన్ని మరాఠి భాషలోకి అనువదించే బాధ్యత తీసుకోవాలన్నారు. దీనికి సంబంధించి త్వరలో ముంబై సాహితీవేత్తలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.

*‘పెట్రోల్‌, డీజిల్‌పై ఇప్పటికే ఎక్సైజ్‌ సుంకం తగ్గించాం. మేమే కాదు మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ధరలు తగ్గించాలి. ఇవన్నీ ఆలయం ముందు మాట్లాడటం బాగోదు. ఇక్కడ రాజకీయాలు మాట్లాడలేను’ అని కేంద్రమంత్రి హరదీప్‌ సింగ్‌ పూరి అన్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు.

*గ్రామీణ చేతివృత్తులకు ఆధునికత జోడించి ఐటీఐల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించడం ద్వారా చేతి వృత్తుల్ని బతికించడంతోపాటు యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 6 ప్రభుత్వ ఐటీఐల్లో నూతన కోర్సులు ప్రారంభించేందుకు కార్మిక శాఖ గత సెప్టెంబరులో ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తాయని విద్యార్ధులు భావించారు. కానీ, ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొత్త కోర్సులకు సంబంధించి ఇప్పటి వరకు డిజైన్‌ రూపొందించలేదు. సిలబ్‌సపైనా కసరత్తు ప్రారంభించలేదు. కోర్సుల డిజైన్‌, సిలబస్‌ రూపకల్పన, సిబ్బందికిశిక్షణ, పుస్తకాలు, ప్రాక్టికల్స్‌.. ఇలా అన్ని అంశాలు కొలిక్కి రావాలంటే కనీసం ఆర్నెల్లు పడుతుందని అంచనా. అంటే 6 ఐటీఐల్లో కొత్త కోర్సులు ఈ ఏడాదికి లేనట్లే. అవి 2023-24 విద్యా సంవత్సరంలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

*అరవై ఏడో రైల్వే వారోత్సవాల్లో దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) అత్యధికంగా ఐదు అఖిల భారత పెర్ఫార్మెన్స్‌ ఎఫిషియెన్సీ షీల్డులను కైవసం చేసుకుని, జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. గత ఏడాది వివిధ రంగాల్లో విశిష్ట పనితీరు ప్రదర్శించినందుకు ఎస్‌సీఆర్‌ సెక్యూరిటీ, సమగ్ర ఆరోగ్య సంరక్షణ, సివిల్‌ ఇంజినీరింగ్‌, స్టోర్స్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌ (కన్‌స్ట్రక్షన్‌) విభాగాల్లో షీల్డులను దక్కించుకుంది. భువనేశ్వర్‌లోని రైల్‌ ఆడిటోరియంలో శనివారం జరిగిన కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చేతుల మీదుగా ఈ అవార్డులను ఎస్‌సీఆర్‌ అందుకుంది. రైల్వే బోర్డు చైర్మన్‌ వి.కె.త్రిపాఠి తదితర సీనియర్‌ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్‌సీఆర్‌ జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌చార్జి) అరుణ్‌కుమార్‌ జైన్‌తో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు రాజారాం (సెక్యూరిటీ షీల్డు), వి.సుధాకర్‌ రావు (స్పోర్ట్స్‌ షీల్డు), సంజీవ్‌ అగర్వాల్‌ (సివిల్‌ ఇంజినీరింగ్‌ షీల్డు), అమిత్‌ గోయల్‌ (సివిల్‌ ఇంజినీరింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ షీల్డు), డాక్టర్‌ సి.కె.వెంకటేశ్వర్లు (సమగ్ర ఆరోగ్య సంరక్షణ షీల్డు) రైల్వే మంత్రి చేతుల మీదుగా షీల్డులు అందుకున్నారు. అలాగే నిరుడు విశిష్టమైన పనితీరు ప్రదర్శించిన దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ఐదుగురు అధికారులు, సిబ్బందికి కూడా రైల్వే మంత్రి అవార్డులు ప్రదానం చేశారు.

* బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ వేదిక కానుంది. జూలైలో ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇప్పటికే భేటీ అయ్యారని సమాచారం. హైటెక్స్‌, నోవోటెల్‌, ఎన్‌ కన్వెన్షన్‌ తదితర కేంద్రాల్లో ఏర్పాట్లను పార్టీ ముఖ్య నేతలు సమీక్షించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. తెలంగాణపై బీజేపీ అగ్ర నాయకత్వం పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకోబోతున్నాయని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ‘‘తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యంగా మా జాతీయ నాయకత్వం పట్టుదలతో ఉంది. ఇక్కడ అధికార మార్పిడి జరగబోతోందని, బీజేపీకి అధికారం పక్కా అంటూ రెండు రోజుల కిందట నగర పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రధాని మోదీ చేసిన ప్రకటన కూడా సాధారణమైంది కాదు. దీని వెనుక పక్కా వ్యూహం కూడా ఉంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రకటన కంటే ముందే కేంద్ర మంత్రులు, జాతీయ నేతల పర్యటనలు విస్తృతం కాబోతున్నాయి. జాతీయ నాయకత్వం సంస్థాగత అంశాలపై సునిశితంగా సమీక్షిస్తోంది. పార్టీ శ్రేణులకు నూతనోత్సాహాన్చిచ్చేలా కార్యక్రమాలు ఉండబోతున్నాయి’’ అని బీజేపీ ముఖ్య నేత ఒకరు వివరించారు.

*కోనసీమలో జరిగిన అల్లర్లపై న్యాయవిచారణ జరిపించాలని గవర్నర్‌ హరిచందన్‌ను కాంగ్రెస్‌ నాయకులు కోరారు. విజయవాడ రాజ్‌భవన్‌లో పీసీసీ ఉపాధ్యక్షుడు జంగా గౌతమ్‌, పార్టీ నాయకులు రాజీవ్‌ రతన్‌, నరహరశెట్టి నరసింహారావు, రవికాంత్‌, పి.వై.కిరణ్‌కుమార్‌ ఆదివారం గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అమలాపురం హింసాకాండపై హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో విచారణ చేయించాలని కోరారు. కాకినాడలో దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.

*కేవలం రాజధాని రైతులే కాదు, కర్నూలు రైతులు కూడా భూములు ఇచ్చారని కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్‌ కుమార్‌ అన్నారు. మంత్రుల సామాజిక న్యాయ భేరి సదస్సులో భాగంగా కర్నూలులో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి రైతులు భూములు ఇచ్చినా ఆ నీరంతా కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులే వాడుకుంటున్నారని అన్నారు. ‘‘కర్నూలు నుంచి ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది కూలీలు వలసపోతున్నారు. గుంటూరులో బస్తాలు మోయడానికి వెళ్తున్నారు. గుంటూరులో ఇటుకలు తయారు చేయడానికి వెళ్తున్నారు. వాళ్ల మేడలు మనం కట్టాలి. వాళ్లు అద్దాల మేడల్లో పట్టు పరుపులు మీద, తెల్ల పంచెలు వేసుకుని ఉరకాలి. మనమేమో బిచ్చమెత్తుకుని, పొట్టచేతపట్టుకుని గుంటూరు, విజయవాడ పోవాలి’’ అని అన్నారు.

* ‘పెట్రోల్‌, డీజిల్‌పై ఇప్పటికే ఎక్సైజ్‌ సుంకం తగ్గించాం. మేమే కాదు మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ధరలు తగ్గించాలి. ఇవన్నీ ఆలయం ముందు మాట్లాడటం బాగోదు. ఇక్కడ రాజకీయాలు మాట్లాడలేను’ అని కేంద్రమంత్రి హరదీప్‌ సింగ్‌ పూరి అన్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. 1987 నుంచి తిరుమలకు వస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఏడాది శ్రీవారి దర్శించుకుంటానని.. కరోనా కారణంగా రెండేళ్లు రాలేకపోయానన్నారు. జీవితంలో మనకు రోజూ ఎదురయ్యే ఎన్నో సమస్యలను, పరిస్థితులను డీల్‌ చేయటానికి ఇన్‌స్పిరేషన్‌ కావాలన్నారు. తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటే చాలు ఆ ఇన్‌స్పిరేషన్‌ లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో భాగంగా సేవలందిస్తున్నానని, ఈ క్రమంలో శ్రీవారికి కృతజ్ఞతలు తెలుపుకునేందుకు వచ్చినట్టు తెలిపారు. అంతకుముందు ఆలయంలో కేంద్రమంత్రికి శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటాన్ని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అందజేశారు.

*పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జూలై 4న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృతోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రముఖ చారిత్రక కట్టడాలు, సమరయోధులు జన్మించిన ప్రాంతాల సందర్శనలో భాగంగానే ప్రధాని వస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ విలేకరులకు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు మూడు లక్షల మంది జనం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నేటి యువతకు ఆనాటి స్వాతంత్య్ర పోరాటాలను వివరించడమే లక్ష్యంగా 75 ఏళ్ల స్వాతంత్ర్యోత్సవాల నిర్వహణ సాగుతోందన్నారు. ఈ సందర్భంగా విప్లవవీరుడు అల్లూరి జ్ఞాపకాలను గౌరవించడం కోసమే ప్రధాని హాజరవుతున్నారని శ్రీనివాసవర్మ తెలిపారు.

* ‘పెట్రోల్‌, డీజిల్‌పై ఇప్పటికే ఎక్సైజ్‌ సుంకం తగ్గించాం. మేమే కాదు మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ధరలు తగ్గించాలి. ఇవన్నీ ఆలయం ముందు మాట్లాడటం బాగోదు. ఇక్కడ రాజకీయాలు మాట్లాడలేను’ అని కేంద్రమంత్రి హరదీప్‌ సింగ్‌ పూరి అన్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. 1987 నుంచి తిరుమలకు వస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఏడాది శ్రీవారి దర్శించుకుంటానని.. కరోనా కారణంగా రెండేళ్లు రాలేకపోయానన్నారు. జీవితంలో మనకు రోజూ ఎదురయ్యే ఎన్నో సమస్యలను, పరిస్థితులను డీల్‌ చేయటానికి ఇన్‌స్పిరేషన్‌ కావాలన్నారు. తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటే చాలు ఆ ఇన్‌స్పిరేషన్‌ లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో భాగంగా సేవలందిస్తున్నానని, ఈ క్రమంలో శ్రీవారికి కృతజ్ఞతలు తెలుపుకునేందుకు వచ్చినట్టు తెలిపారు. అంతకుముందు ఆలయంలో కేంద్రమంత్రికి శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటాన్ని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అందజేశారు.

* పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జూలై 4న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృతోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రముఖ చారిత్రక కట్టడాలు, సమరయోధులు జన్మించిన ప్రాంతాల సందర్శనలో భాగంగానే ప్రధాని వస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ విలేకరులకు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు మూడు లక్షల మంది జనం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నేటి యువతకు ఆనాటి స్వాతంత్య్ర పోరాటాలను వివరించడమే లక్ష్యంగా 75 ఏళ్ల స్వాతంత్ర్యోత్సవాల నిర్వహణ సాగుతోందన్నారు. ఈ సందర్భంగా విప్లవవీరుడు అల్లూరి జ్ఞాపకాలను గౌరవించడం కోసమే ప్రధాని హాజరవుతున్నారని శ్రీనివాసవర్మ తెలిపారు.

*తిరుమలలో భక్తుల రద్దీ శనివారంతో పోల్చుకుంటే ఆదివారం మోస్తరుగా తగ్గింది. శనివారం సాయంత్రం తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడగా ఆదివారం ఉదయానికి రద్దీ చాలా వరకు తగ్గింది. శనివారం సాయంత్రం అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయి క్యూలైన్‌ వెంగమాంబ నిత్యాన్నదాన భవనం వరకు దాదాపు రెండున్నర కిలోమీటర్లు మేర వ్యాపించిన విషయం విదితమే. ఆదివారం సాయంత్రానికి నిత్యాన్నదాన భవనం నుంచి ఎస్‌ఎంసీ జనరేటర్‌ వరకు క్యూలైన్‌ తగ్గింది. దాంతో సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో రద్దీ తగ్గినప్పటికీ తిరుమల క్షేత్రం భక్తులతో సందడిగానే కనిపిస్తోంది. ఆలయం, మాడవీధులు, రోడ్లు, నిత్యాన్నదానం భవనం, అఖిలాండం, లడ్డూకౌంటర్‌ ప్రాంతాల్లో రద్దీ అధికంగా ఉంది.

*జులై 4న ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి రానున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమంలో పాల్గొన‌నున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి‌కి పీఎంవో సమాచారం ఇచ్చింది. జూన్ రెండో వారంలో పర్యటన పూర్తి షెడ్యూల్ ఖరారు అవుతుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము‌ వీర్రాజు తెలిపారు.

* ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఆదివారం సందడి నెలకొంది. వివిఽధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. తల్లులకు చీరె, సారె, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, పూలు, పండ్లు, బెల్లం సమర్పించారు. యాట మొక్కులు చెల్లించుకున్నారు. చల్లగా చూడాలని వనదేతలను వేడుకున్నారు. కుటుంబ సమేతంగా వంటావార్పు చేసుకొని సేద తీరారు. గద్దెల వద్ద సరైన సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కనీస సౌకర్యాలైన తాగునీరు, మరుగుదొడ్లు లేక అవస్థ పడ్డారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు నానా తంటాలు పడాల్సి వచ్చింది. మరోవైపు మేడారంలో దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

* రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికై నిర్వహించిన ప్రవేశ పరీక్ష (పాలిసెట్‌-2022) ప్రశాంతంగా ముగిసిందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 404 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1,38,189 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా, వారిలో 1,31,627(95.25శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. బాలురు 85,852 మంది నమోదు చేసుకోగా, వారిలో 82,339 మంది పరీక్షకు హాజరయ్యారు. బాలికలు 52,337 మంది నమోదు చేసుకోగా, వారిలో 49,288 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రాథమిక కీని జూన్‌ 2వ తారీఖున వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు పోలా భాస్కర్‌ తెలిపారు. జూన్‌ 10వ తేదీలోపు ఫలితాల విడుదల చేసేందుకు అన్ని చర్యలూ చేపట్టినట్లు పేర్కొన్నారు.

* ‘అన్న క్యాంటీన్‌’ ద్వారా రెండు రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు యూఎ్‌సఏ ఎన్‌టీఆర్‌ ఫ్రెండ్‌ సర్కిల్‌ నేతలు ఉయ్యూరు శ్రీనివాసరావు, వినయ్‌ జొన్నలగడ్డ తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ఆదివారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్న నందమూరి తారకరామారావు ప్రారంభించిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం స్ఫూర్తితో రెండు రూపాయలకే భోజనం అందించాలని తాము నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ రెండు క్యాంటీన్ల ద్వారా రోజూ వెయ్యి మందికి రెండు రూపాయలకే భోజనం అందిస్తామని వారు తెలిపారు. అక్షయపాత్ర ఫౌండేషన్‌కు కాంట్రాక్టు అప్పగించామని చెప్పారు.

*మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ధన్యవాదాలు తెలిపారు. మహానాడును చూసి గ్రామస్థాయి పార్టీ కార్యకర్తలో కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రకు ప్రజల నుంచి స్పందన కరువైందని పేర్కొన్నారు

*దేవనకొండ తహసీల్దార్ ఇంద్రాణిని సస్పెండ్ చేశారు. గుండ్లకొండ, వెలమకూరు గ్రామాల్లోని 169 ఎకరాల ప్రభుత్వ భూమిని పలువురికి ధారాదత్తం చేశారని ఏబీఎన్‌లో ప్రసారమైన కథనానికి జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. వారు భూ అక్రమాలపై విచారణ జరిపి ఇంద్రాణిపై చర్యలు తీసుకున్నారు.

*బెజవాడలో మాజీమంత్రి వెల్లంపల్లి అనుచరులు ఏలూరు రోడ్డులోని ఓ బిల్డింగ్‌ను కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. బిల్డింగ్‌పై కోర్టులో విచారణ జరుతుండగా.. వెల్లంపల్లి అనుచరుల దౌర్జ్యనానికి పాల్పడుతున్నారని, పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారని బాధితులు వాపోతున్నారు. వెల్లంపల్లి అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

*నాగబాబు జూన్ 1 నుంచి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. 1వ తేదీ శ్రీకాకుళం జిల్లా, 2న విజయనగరం జిల్లా, 3 న విశాఖపట్నం జిల్లాలోని పలు నియోజకవర్గాలలో పర్యటిస్తారు. జనసేన కార్యకర్తల సమావేశాల్లో పాల్గొంటారు. పార్టీ భవిష్యత్ కార్యకలాపాల గురించి దిశానిర్దేశం చేస్తారు. నాగబాబు సమక్షంలో జనసేన‌ పార్టీలో వివిధ పార్టీలు నాయకులు చేరనున్నట్లు సమాచారం.

*జగన్ ప్రభుత్వం చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర నాల్గవ రోజు ఆదివారం నంద్యాలలో జరిగింది. అయితే మంత్రుల సభ వెలవెలబోయింది. శ్రీనివాస్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభకు జనం కరువయ్యారు. సభలో కనీసం రెండు వరుసల కుర్చీలు కూడా నిండలేదు. మంత్రుల సభ అట్టర్ ప్లాప్ అయింది. ఈ సభకు వైసీపీ నేతలు కష్టపడి జనాలను తీసుకువచ్చారు. అయితే మంత్రులు మాట్లాడే సమయానికి వచ్చిన జనం కూడా వెనుదిరిగారు. సభలో జనం లేకపోవడంతో కేవలం ఇద్దరు మంత్రులే మాట్లాడారు. కర్నూలులోనూ మంత్రుల సభ వెలవెలబోయింది.

* ప్రపంచంలో ప్రతి సంవత్సరం 90 లక్షల మంది మరణాలకు కారణమయ్యే గుండె జబ్బు ప్రపంచంలోనే అతిపెద్ద కిల్లర్ అని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆదివారం విజయవాడలో జరిగిన రమేష్ హాస్పిటల్స్ “కార్డియాలజీ అప్‌డేట్ సమ్మిట్”లో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. దేశంలో దాదాపు 5.5 కోట్ల మంది ప్రజలు కొన్ని రకాల గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఆరవ వంతు భారత్‌లోనే ఉన్నారని, ప్రతి పది మందిలో ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నారన్నారు. సరైన విధానాలు, పారిశుద్ధ్య పరిస్థితులు లేకపోవడం ఆందోళనకరమన్నారు.

*కేరళ లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనుకున్న తేది కన్నా మూడు రోజుల ముందే ప్రవేశించాయన్నారు. కేరళలో పలు జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో కేరళ అంతటా విస్తరించే అవకాశం ఉందని, వారం రోజుల తర్వాత క్రమంగా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాలో ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

* మహిళా కార్మికులకు రాత్రి వేళల్లో విధులను పురమాయించొద్దంటూ యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూపీ కార్మికశాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాత్రి 7 గంటల తర్వాత ఉదయం 6 గంటల్లోపు మహిళా కార్మికులకు నైట్‌ షిఫ్టులు ఉండకూడదు. తప్పనిసరి అనుకుంటే మహిళా కార్మికుల అనుమతి తప్పనిసరి. అంగీకరించకుంటే వారిని విధుల్లోంచి తీసేయకూడదు. ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, మిల్లుల్లో రాత్రి విధులు నిర్వర్తించే మహిళా కార్మికులకు ఉచిత భోజన, రవాణా సదుపాయాలతో పాటు భద్రత కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యానిదే.

*భారత్‌కు బిహార్‌ ‘బంగారు గని’ అట! జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా చెబుతున్న మాట ఇది. ఆ రాష్ట్రంలోని జమూయ్‌ జిల్లాలో 27.6 టన్నుల ముడి ఖనిజం సహా 222.88 మిలియన్‌ టన్నుల బంగారు నిక్షేపాలున్నాయని నిర్ధారించింది. ఇది మొత్తంగా దేశంలోని బం గారు నిక్షేపాల్లో 44 శాతానికి సమానమట! అంటే.. భారత్‌లోకెల్లా భారీ బంగారు నిక్షేపాలున్న రాష్ట్రం బిహారేనని తేల్చింది. దీనిపై స్పందించిన బి హార్‌ సర్కారు.. గనుల అన్వేషణకు అనుమతివ్వాలని నిర్ణయించింది.

*రాజకీయ నాయకులపై నమోదైన కేసులను సత్వరం పూర్తి చేయాలని కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఇందుకు పలు మార్గదర్శకాలను సూచించింది. రాజకీయ నేతలు, పలుకుబడి కల్గిన వ్యక్తులకు సంబంధించిన కేసులను, తీవ్రమైన పరిణామాలున్న కేసులను 90 రోజుల్లో తేల్చాలని సూచించింది. ఇందుకు 17 మార్గదర్శకాలను జారీ చేసింది. సాక్ష్యాధారాల పరిశీలన, ఫిర్యాదులకు సంబంధించిన ఆధారాల సేకరణ వంటి ప్రక్రియలు పూర్తి చేయాలని సూచించింది. పెట్టీ కేసులను 60 రోజుల్లోనూ, సీరియస్‌ కేసులను 90 రోజుల్లోనూ తేల్చాలని జస్టిస్‌ సునీల్‌దత్‌ యాదవ్‌ గడువు విధించారు.. ఈ నెల 17న ఎమ్మెల్యే అభయ్‌కుమార్‌ పాటిల్‌పై సుజిత్‌ ముల్గుండ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించే సమయంలో ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ఎమ్మెల్యేకు సంబంధించిన అవినీతిపై 2012లో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత బెళగావి సౌత్‌ నుంచి అభయ్‌కుమార్‌ పాటిల్‌ రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం ఏసీబీ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

* శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తజనం పోటెత్తారు. అమావాస్యతో పాటు సోమవారం కలిసిరావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంది. రాహు-కేతు కాలసర్పదోష నివారణ పూజలకుభక్తులు బారులు తీరారు. స్వామిఅమ్మవార్ల దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు కిక్కిరిశారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.