NRI-NRT

బహ్రెయిన్‌లో ఘనంగా తెలంగాణా రాష్ట్ర అవతరణ సంబరాలు

Auto Draft

బహ్రెయిన్‌లో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ప్రధాన కార్యదర్శి పుప్పాల లింబద్రి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముందుగా అమరవీరులను స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కేకును కట్ చేసి ఆనందోత్సాలతో ఆవతరణ వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు వెంకటేష్ బొలిశెట్టి మాట్లాడుతూ బహ్రెయిన్‌లో తెలంగాణా రాష్ట్ర ఆవతరణ దినోత్సవాలు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా వుందని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం అసువులు బాసిన ఎందరో మహనీయుల త్యాగఫలమే తెలంగాణ అన్ని అన్నారు.
A10
సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల కారణంగా విజయపథంలో దూసుకెళ్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ముఖ్యంగా తెలంగాణా ఉద్యమంలో ఎన్నారైల పాత్ర ఎనలేనిదని, ఇక్కడ జరిగిన ఉద్యమానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. బహ్రెయిన్‌లో ఘనంగా తెలంగాణా రాష్ట్ర అవతరణ సంబరాలుతెలంగాణ అభివృద్దే ధ్యేయంగా, యువతకు ఉపాధి ఉద్యోగాల్లో అవకాశాల కోసం అహార్నిశలు కష్టపడుతూ ప్రపంచంలో అన్ని దేశాల్లో ప్రఖ్యాతి గాంచిన పెద్ద పెద్ద పరిశ్రమలను, వేల కోట్లపెట్టుబడులను తెలంగాణకు తీసుకొస్తున్న ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావుకు ఎన్నారై టీఅర్ఎస్ పక్షాన హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యుల నడ్డివిరుస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్యానికి రానున్న కాలంలో ప్రజలు సరైన గుణపాఠం చెపుతారన్నారు. దేశ ప్రయోజనాలకోసం మార్పు అవసరమని, జాతీయ స్థాయిలో ప్రత్యామ్యాయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. భాగవంతుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆ శక్తి ఇవ్వాలని ఎన్నారైల పక్షాన కోరుకుంటున్నామని చెప్పారు. ఈ వేడుకల్లో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు వెంకటేష్ బొలిశెట్టి, ప్రధాన కార్యదర్శి పుప్పాల లింబద్రి, కార్యదర్శులు సంగేపు దేవన్న, చెంన్సమనేని రాజేందర్, ఇతర తెరాస నాయకులు పాల్గొన్నారు.