Movies

రీమేక్‌కు రెడీ

రీమేక్‌కు రెడీ

ఒకప్పుడు తెలుగు తెరపై తళుక్కున మెరిసిన కియారా అడ్వాణీ ఇప్పుడు బాలీవుడ్‌పైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టారు. ఇటీవలె రామ్‌చరణ్‌ – శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రంతో మరోసారి తెలుగు జనాలను అలరించనున్నారు కియారా. ప్రస్తుతం తను హీరోయిన్‌గా నటించిన ‘భూల్‌ భూలయ్య 2’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారామె. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు బదులిస్తూ ‘గతంలో ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌లో నటించాను. ఆ ఆఫర్‌ ఇప్పుడు వచ్చినా కదనకపోయేదాన్ని. ప్రాంతీయ భాషల్లో వచ్చిన చిత్రాలను హిందీలో రీమేక్‌ చేస్తే ఎక్కువ మంది ప్రేక్షకులు చూస్తారు. మంచి కథాబలం ఉన్న చిత్రాలతో వస్తే రీమేక్‌కు ఎప్పుడూ నేను సిద్ధమే’ అన్నారు కియారా.