NRI-NRT

మ‌న రెస్టారెంట్‌కు అమెరిక‌న్లు ఫిదా..

మ‌న రెస్టారెంట్‌కు అమెరిక‌న్లు ఫిదా..

అమెరిక‌న్లు ఇండియ‌న్ రెస్టారెంట్‌కు ఫిదా అయిపోయారు. అక్క‌డ దొరికే వంట‌కాలు తిని మైమ‌రిచిపోతున్నారు. ఫ‌లితంగా అమెరికాలోని చాయ్‌పానీ రెస్టారెంట్ అమెరికాలో ఈ ఏడాది అత్యుత్త‌మ హోట‌ల్‌గా ఎంపికైంది. జేమ్స్ బార్డ్ ఫౌండేష‌న్ అవార్డు కొట్టేసింది.ఈ చాయ్‌పానీ రెస్టారెంట్ నార్త్ కరోలినాలోని ఆషెవిల్లేలో ఉంది. ఇక్క‌డ ఇండియ‌న్ స్ట్రీట్ ఫుడ్‌ను అత్యంత రుచిక‌రంగా అందిస్తారు. భేల్ పూరీ, స్వీట్ పొటాటో చాట్, చికెన్ పకోడీ, సేవ్ పొటాటో దహీ పూరీ, గ్రీన్ మ్యాంగో చాట్, ఆలూ టిక్కీ చాట్‌లాంటి ప్రసిద్ధ భారతీయ స్ట్రీట్ ఫుడ్ ఇక్క‌డ ల‌భిస్తుంది. వీటితోపాటు ఫ్యూజన్ ర్యాప్స్‌, బర్గర్స్‌, వడ పావ్, క్రిస్పీ మసాలా ఫిష్ రోల్, కీమాపావ్ కూడా ఇక్క‌డ దొరుకుతుంది. వివిధ రకాల దక్షిణ భారత వంటకాలు, ఉత్తర భారత థాలీలు, డిషెస్‌, డెజర్ట్‌లను అత్యంత నాణ్య‌త‌తోపాటు రుచిక‌రంగా అందిస్తారు.జేమ్స్ బార్డ్ ఫౌండేష‌న్ అవార్డుల‌ను 2019లో ప్రారంభించారు. అమెరికా ప్ర‌జ‌ల‌నుంచి ఓటింగ్ ద్వారా బెస్ట్ రెస్టారెంట్‌ను ఎంపిక చేసి, అవార్డు ఇస్తారు. కొవిడ్ కార‌ణంగా 2020, 2021లో అవార్డులు ప్ర‌క‌టించ‌లేదు. ఈ సారి ఓటింగ్ పెట్ట‌గా చాయ్‌పానీ రెస్టారెంట్ బెస్ట్ హోట‌ల్‌గా అవార్డు గెలుచుకుంది.