DailyDose

కూతురి నోట్లో కుంకుమ పోసిన ఘటనలో.. చిన్నారి మృతి! – TNI నేర వార్తలు

కూతురి నోట్లో కుంకుమ పోసిన ఘటనలో.. చిన్నారి మృతి!  – TNI  నేర వార్తలు

*నెల్లూరు జిల్లాలో పూజల పేరుతో.. కూతురు నోట్లో కుంకమ పోసి, గొంతు నులిమిన ఘటనలో.. బాధిత చిన్నారి (4) ప్రాణాలు కోల్పోయింది. చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందిన చిన్నారి పునర్విక.. పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కూతురు గొంతు నులిమిన తండ్రి వేణును అదుపులోకి తీసుకున్నారు.

*తెలంగాణలోని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు కువైట్ నుంచి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి వద్ద రూ.86 లక్షల విలువైన 1.64 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని పేస్టు రూపంలో చేసి నల్లకవర్‌లో పెట్టి, లోదుస్తులు, సాక్సులో తీసుకెళ్తుండగా తనిఖీ చేసి పట్టుకున్నారు.

*సేలం జిల్లా కొళత్తూరు, వీరభద్రన్‌ కోట్టైలో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అన్నంలో విషం పెట్టి భార్య చంపేసింది.

*తూత్తుకుడి జిల్లా కయిత్తారు సమీపంలో బుధవారం వేకువజామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఆమ్నీ బస్‌ డ్రైవర్‌ సహా ముగ్గురు మృతి చెందారు.

* మ‌హిళ‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని బంగారు గొలుసుల‌ను అప‌హ‌రిస్తున్న అంత‌ర్ జిల్లా దొంగ‌ల ముఠాను న‌ల్ల‌గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంద‌ర్భంగా దొంగ‌ల ముఠాను మీడియా ఎదుట ప్ర‌వేశ‌పెట్టారు. అనంత‌రం ఎస్పీ రేమా రాజేశ్వ‌రి మీడియాతో మాట్లాడారు.

* మధ్యప్రదేశ్‌ చింద్వారాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరా వాహనం బావిలో పడిపోగా.. ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి ఉన్నది. మరో ఆరుగురు గాయపడ్డారు. చింద్వారా జిల్లాలోని మోఖెడా పోలీస్ స్టేషన్ పరిధిలోని కొడమావు గ్రామంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నది. గురువారం ఉదయం బావిలో నుంచి ఏడుగురి మృతదేహాలతో పాటు వాహనాన్ని పోలీసులు వెలికి తీశారు.

*బాపట్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిజాంపట్నం వద్ద బోటులో సుమరు 40 మంది సభ్యులు గల ఓ కుటుంబం సముద్ర స్నానానికి వెళ్లారు. ఒక్కసారిగా బోటు అలల తాకిడికి గురి కావడంతో బోటులో ఉన్న సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ తోపులాటలో బోటులో ఉన్న నలుగురు చిన్నారులు సముద్రంలో పడి గల్లంతయ్యారు.

*శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం ప‌ట్టుబ‌డింది. రూ. 86 ల‌క్ష‌ల విలువైన 1.64 కిలోల బంగారాన్ని క‌స్ట‌మ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కువైట్ నుంచి వ‌చ్చిన ఓ మ‌హిళ వ‌ద్ద బంగారం స్వాధీనం చేసుకున్న‌ట్లు అధికారులు తెలిపారు. లోదుస్తులు, సాక్సులో బంగారం దాచి త‌ర‌లిస్తున్న‌ట్లు గుర్తించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. మ‌హిళ‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

*ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. సుల్తాన్‌పూర్ వ‌ద్ద ఓ మినీ బ‌స్సు.. మ‌రో వాహ‌నాన్ని ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో 26 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌టనాస్థ‌లికి చేరుకుని క్ష‌త‌గాత్రుల‌ను స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బాధితులంతా ఖ‌మ్మం జిల్లాకు చెందిన‌వారిగా యూపీ పోలీసులు గుర్తించారు.

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు పేకాట స్థావరాలపై దాడులు చేశారు. దమ్మపేట మండలంలోని గాంధీనగర్ పామాయిల్ తోటలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి పోలీసులు కేసు నమోదు చేశారు. పేకాట ఆడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

*పాతబస్తీలోని బహదూర్‌పుర పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్‌ వీరంగం సృష్టించింది. షరీఫ్‌ అనే వ్యక్తిపై కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. గొడవపడొద్దన్నందుకు షరీఫ్‌పై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తీవ్రగాయాలతో ఉన్న షరీఫ్‌ని స్థానికులు ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న గంజాయి బ్యాచ్‌ కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.

*కరీంనగర్జి ల్లాలోని హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామ సర్పంచ్ బింగి కరుణాకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పద్మశాలి కులానికి చెందిన భూమి విషయంలో మనస్తాపం చెందిన కరుణాకర్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కులానికి చెందిన స్థలంలో మరో వ్యక్తి నిర్మాణం చేపట్టాడు. ఈ వ్యవహారంపై సర్పంచ్‌ను కులస్థులు నిలదీయడంతో కరుణాకర్ తీవ్ర మనస్థాపానికి గురై బలవన్మరణానికి యత్నించాడు. సర్పంచ్ పరిస్థితి విషమంగా ఉండటంతో జమ్మికుంట ఆస్పత్రికి తరలించారు.

*బాన్సువాడ మండలం తిర్మలాపూర్లో దారుణ హత్య జరిగింది. వాటర్ మ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్న ఇండ్ల బాలరాజ్ అనే వ్యక్తిని డంపింగ్ యార్డులో గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేశారు. తాడుతో కాళ్లూచేతులు కట్టేసి గొంతు కోసి.. పొడిచి చంపేశారు. బాలరాజ్.. గ్రామపంచాయతీలో వాటర్ మ్యాన్గా పని చేస్తున్నాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

*రాష్ట్ర సచివాలయంలో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగం ఇప్పిస్తానని లక్షలు దండుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 5 నకిలీ ఉద్యోగ నియామక పత్రాలతో పాటు నిందితుడికి సంబంధించి రెండు బ్యాంక్ పుస్తకాలు, ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏపీ ట్రాన్స్‌కోలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఇద్దరు వ్యక్తుల వద్ద నిందితుడు నలభై లక్షలు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బద్వేలు రూరల్ పోలీసులు… నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించారు.

*సింగ్‌నగర్‌లో చెత్త ఫ్లాంట్ తరలించాలని సీపీఐ డిమాండ్‌పై స్పందించడం లేదంటూ ఆ పార్టీ నేతలు ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడికి పిలుపిచ్చారు. దీంతో ర్యాలీగా బయలుదేరిన దోనేపూడి శంకర్ , ఇతర నాయకుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా దోనేపూడి శంకర్ మాట్లాడుతూ చెత్త ఫ్లాంట్‌ను తరలించాలని అనేకసార్లు ఆందోళన చేశామని, స్థానిక ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని అన్నారు. అందుకే ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడికి పిలుపిచ్చామన్నారు. తమను చూసి ప్రభుత్వం భయపడుతోందని, అడుగడుగునా పోలీసు బలగాలతో అడ్డుకుంటోందని అన్నారు. ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నా జగన్ ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. అక్రమ అరెస్టులతో తమ పోరాటాన్ని అడ్డుకోలేరని, చెత్త ఫ్లాంట్‌ను తరలించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని దోనేపూడి శంకర్ స్పష్టం చేశారు.

*ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మండలం నాయుడుపల్లి ఎస్సీ కాలనీలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివాహానికి పెద్దలు అంగీకరించక పోవడంతో ప్రేమజంట పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించింది. ఈ ఘటనలో ప్రియుడు కోట్ల యాకోబు మృతి చెందగా.. ప్రియురాలు కోటమ్మ పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

*అనంతపురం నగర శివారులోని వడియంపేట వద్ద అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ప్రభుత్వ అస్పత్రిలోని అత్యవసర విభాగానికి క్షతగాత్రులను తరలించారు. కాగా.. ఐసీయూలో డాక్టర్, సిబ్బంది అందుబాటులో లేరు. కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేకపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయినా కూడా వైద్య అధికారులు పట్టించుకోవడం లేదు.

* విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. బాపట్ల సూర్యలంక బీచ్ నుంచి బోటులో 40 మంది బంధువులు కలిసి సరదాగా ఎంజాయ్ చేయడానికి సముద్రంలోకి వెళ్లారు. సముద్రంలో అలల తాకిడికి నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. వారిలో ఒక పాప మృతదేహం లభ్యమైంది. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. గల్లంతైన మరో ఇద్దరు చిన్నారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా.. నిజాంపట్నం వద్ద సముద్ర స్నానానికి వచ్చి నలుగురు గల్లంతయ్యారు.

*టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారం చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్సటెన్షన్ కోసం ఢిల్లీలో లాబీయింగ్ చెయ్యడానికి 300 శ్రీవారి కల్యాణోత్సవం లడ్డూలను ఢిల్లీకి తరలించారంటూ కొద్దిరోజుల క్రిత్తం టీటీడీ ఈవోపై సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరిగింది. టీటీడీ ప్రతిష్టకు భంగం కలగడంతో పాటు టీటీడీ ఉద్యోగుల మనోభావాలు, ఆత్మగౌరవం దెబ్బ తిన్నెలా మెసెజ్‌ను వైరల్ చేశారంటూ పోటు అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 505(1)(b) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మెసేజ్‌ను సామాజిక మాధ్యమాలలో వైరల్ చేసిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో ఎంతటి వారు ఉన్నా వారిని కచ్చితంగా అరెస్ట్ చేస్తామన్నారు. టీటీడీపై దుష్ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

*ప్రకాశం: జిల్లాలో భారీగా పట్టుబడ్డ అక్రమ మద్యం బాటిళ్లను ఎస్పీ మల్లికా గర్గ్ ఆధ్వర్యంలో ధ్వసం చేశారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని బుధవారం ఒంగోలులోని అగ్రహారం సమీపంలో ఉన్న గ్యాస్ గోడౌన్ హై వేబ్రిడ్జి వద్ద రోడ్డుపై పేర్చి, ఎస్పీ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. అక్రమ మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

* చాక్లెట్లు ఇస్తానని ఆశచూపి.. మాయమాటలు చెప్పి ఎనిమిదేళ్ల బాలికను ఇంట్లోకి తీసుకెళ్లిన 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. హైదరాబాద్‌లోని బోయినపల్లిలో నివాసముండే మహబూబ్‌ పాషా(60) తన ఇంటిలో కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బాధిత బాలిక సరుకులు కొనుగోలుకు మంగళవారం రాత్రి అతని దుకాణానికి వెళ్లింది. చాక్లెట్లు ఇస్తానని బాలికను ఇంట్లోకి పిలిచిన పాషా.. అసభ్యంగా ప్రవర్తించి, ఆపై అత్యాచారయత్నం చేశాడు. పాషా నుంచి తప్పించుకున్న ఆ బాలిక ఏడుస్తూ ఇంటికి వెళ్లి… తల్లికి జరిగిన విషయం చెప్పింది. దీంతో బాధిత బాలిక తల్లితండ్రులు బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో చట్టం కింద కేసును నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.