DailyDose

అయ్యన్న పాత్రుడుపై మండిపడ్డ జోగి రమేష్ – TNI తాజా వార్తలు

అయ్యన్న పాత్రుడుపై మండిపడ్డ జోగి రమేష్  –  TNI  తాజా వార్తలు

* మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుపై మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. మాజీ మంత్రి ఐతే ప్రభుత్వ భూముల్లో అక్రమణలు చేయొచ్చా అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. బీసీలు అయితే ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలు చేయొచ్చా? అని ఆయన ప్రశ్నించారు. స్థిరత్వం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు సంక్షేమం ప్రభుత్వమన్నారు. కౌలు రైతులను గుర్తించిన ప్రభుత్వం సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వమన్నారు. జనసేన అధినేత ప్రస్తుతం నడి రోడ్డుపై ఉన్నారని విమర్శించారు. రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. జర్నలిస్టులకు త్వరలోనే ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
* తెలంగాణ లో నెరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కర్ణాటక నుంచి తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఇవాళ, రేపు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశముందని అధికారులు తెలిపారు. ఉప్పల్, రామంతపూర్, హబ్సిగూడ, మేడిపల్లి, బొడుప్పల్, ఘట్కేసర్‌లో వర్షం కురుస్తోంది. సైదాబాద్, మలక్ పేట, చాదర్ ఘాట్‌, రాజేంద్ర నగర్. పాతబస్తీ, కోఠి, అసెంబ్లీ, నాంపల్లి, బషీర్ బాగ్‌లలో వర్షం పడుతోంది.
*ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలను ఐటీ హబ్‌గా మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆలోచిస్తున్నారని ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. ఇవాళ తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలనంతరం మీడియాతో మాట్లాడారు. పర్యటించి కొత్త పరిశ్రమలకు భూమిపూజ నిర్వహించనున్నారని ఆయన తెలిపారు. అపాచీ షూ కంపెనీ నిర్మించనున్న పరిశ్రమ వల్ల 10వేల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. పరిశ్రమల పరంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం లక్ష్యమని అన్నారు.
*మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి పై వైసీపీ ప్రభుత్వం చేసిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్స్పం దించారు. నర్సీపట్నం పులిని చూసి పులివెందుల పులి భయపడిందని అన్నారు. నోటీసులిస్తామంటూ పోలీసులు అరెస్టు డ్రామా.. దౌర్జన్యంగా ఇంటి గోడ కూల్చడం చూస్తుంటే గట్టగానే భయపడినట్లు కనిపిస్తోందని అన్నారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటనకు వచ్చిన జనజాతర.. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత చూసి జడుసుకుని పిరికిపందచర్యలు మొదలుపెట్టారని అన్నారు. మూడేళ్ల తర్వాత కూడా ప్రతిపక్ష నేతల ఇళ్లు కూల్చడం, అరెస్టు చేయడంలాంటి చర్యలకు పాల్పడుతున్న జగన్‌రెడ్డి దుస్థితి చూస్తుంటే జాలేస్తోందన్నారు. గతంలో వైసీపీ నేతల తిట్ల దండకాలను ప్రస్తావిస్తూ లోకేష్ ట్వీట్ చేశారు.
* తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం కాంప్లెక్స్‎లో కంపార్ట్‎మెంట్లు మొత్తం నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టనుంది. శనివారం శ్రీవారిని 84,982 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 46,679 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.42 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
*చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ.. భారత జట్టుతో కలసి ఐర్లాండ్‌లో పర్యటించనున్నాడు. ఈ నెల 26, 28 తేదీల్లో డబ్లిన్‌లో ఐర్లాండ్‌తో భారత్‌ రెండు టీ20లు ఆడనుంది. ఈ టూర్‌కు హార్దిక్‌ పాండ్యాను టీమిండియా కెప్టెన్‌గా ఎంపిక చేయగా.. ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ఉన్న వీవీఎస్‌ లక్ష్మణ్‌ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించనున్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీ్‌సలో టీమిండియా వెంట బీసీసీఐ సెలెక్టర్‌ సునీల్‌ జోషి ఉన్నాడు.
*ఇండోనేసియా ఓపెన్‌లో భారత షట్లర్‌ హెచ్‌ఎ్‌స ప్రణయ్‌ జోరుకు బ్రేక్‌ పడింది. సెమీఫైనల్లో ప్రపంచ 23వ ర్యాంకర్‌ ప్రణయ్‌ పరాజయం చవిచూశాడు. శనివారం జరిగిన మ్యాచ్‌లో చైనాకు చెందిన వరల్డ్‌ నెం. 35 ఝావో జున్‌పెంగ్‌ 21-16, 21-15 స్కోరుతో ప్రణయ్‌పై గెలుపొందాడు. ఈ టోర్నీలో సెమీ్‌సలో ఓడిపోవడం భారత ఆటగాడికిది రెండోసారి.
*ఆసియా ట్రాక్‌ సైక్లింగ్‌ చాంపియన్‌షి్‌పలో తొలిరోజే భారత సైక్లి్‌స్టలు అదరగొట్టారు. శనివారం ఓ స్వర్ణం సహా మొత్తం పది పతకాలు కొల్లగొట్టారు. సీనియర్‌, జూనియర్‌ ఈవెంట్లలో కలిపి ఓ రజతం, ఆరు కాంస్య పతకాలు సాధించారు. ఇక పారా ఈవెంట్లలో ఓ స్వర్ణం, రజతం, కాంస్యం దక్కించుకున్నారు. జూనియర్‌, సీనియర్‌, పారా విభాగాల్లో ఈ టోర్నీ జరుగుతోంది.
* ఒలింపిక్‌ చాంపియన్‌ నీరజ్‌ చోప్రా కోర్టనే గేమ్స్‌లో స్వర్ణ పతకం కొల్లగొట్టాడు. శనివారం జరిగిన ఈ మీట్‌లో జావెలిన్‌ను 86.69 మీటర్లు విసిరి నీరజ్‌ అగ్రస్థానంలో నిలిచాడు. అయితే ఈ మీట్‌లో 90 మీ. దూరాన్ని అందుకుంటాడని భావించినా.. అతడు దానిని మిస్సయ్యాడు.
*‘ఎన్నో ధార్మిక కార్యక్రమాలను టీటీడీ చేపడుతోంది. బడుగు, బలహీన వర్గాల్లో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించేందుకు సంస్కార కేంద్రాలను ప్రారంభిస్తే బాగుంటుంది. వీటివల్ల ఆధ్యాత్మిక, ధార్మికతతోపాటు ప్రజల్లో నైతిక విలువలు పెరుగుతాయి’ అని హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాగా.. ఆరోగ్యకరమైన పోటీతత్వంతో పనిచేసి రెండు (ఏపీ, తెలంగాణ) తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపించాలని ముఖ్యమంత్రులకు దత్తాత్రేయ సూచించారు. తిరుపతిలోని ఓ హోటల్లో ఎన్జీవో ప్రతినిధులు, ఇతర ప్రముఖులు శనివారం ఆయన్ను సన్మానించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మీడియాతో మాట్లాడారు.
*తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి చెందిన వివిధ ట్రస్టులకు శనివారం రూ.2.53 కోట్లు విరాళంగా అందింది. టీవీఎస్‌ సంస్థ చైర్మన్‌ సుదర్శన్‌.. శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయకు రూ.1.05 కోట్లు విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని చెక్‌ రూపంలో దాత తరుఫున ప్రతినిధి శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన జీవీఆర్‌ ఇన్‌ఫ్రా సంస్థ తరఫున బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్‌కు రూ.1.26 కోట్లు అందింది. అలాగే హరిబాబు, వెంకటేశ్వర్లు అనే భక్తులు రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షలను ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు అందజేశారు. ఎన్‌.రవిబాబు అనే భక్తుడి నుంచి ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.2.50 లక్షలు అందింది. విరాళాలను తిరుమలలోని దాతల విభాగంలో డిప్యూటీ ఈవో పద్మావతికి అందజేశారు.
*ఇంటర్మీడియెట్‌ ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటి దశ అడ్మిషన్లు ఈనెల నుంచి ప్రారంభిస్తారు. వచ్చే నెల వరకు అడ్మిషన్లు కొనసాగుతాయి. గడువు తేదీ కూడా అదే. జూలై నుంచి కళాశాలలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు ప్రైవేటు ఎయిడెడ్‌ ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ రెసిడెన్షియల్‌ బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ కళాశాలలు ఒకేషనల్‌ కళాశాలల్లో ఇంటర్‌ ప్రవేశాలకు ఈ తేదీలు వర్తిస్తాయని పేర్కొన్నారు.
*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్ల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే 52 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఏడుగురు అనుమానితులను రైల్వే పొలీసులు విచారిస్తున్నారు. సీసీ కెమెరా, పోలీస్ వీడియో రికార్డింగ్, మీడియా ఫుటేజ్, సోషల్ మీడియా, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మరికొంత మంది అభ్యర్థులను గుర్తించే పనిలో పోలీసులున్నారు. అల్లర్ల వెనక ఉన్న ప్రైవేటు డిఫెన్స్ అకాడమీ యాజమాన్యాల కుట్ర ఉందని కోణంలో పోలీసుల విచారణ జరుగుతోంది. ఇప్పటికే కీలక నిందితుడు ఆవుల సుబ్బారావు‌ను అరెస్టు చేశారు.
*రాష్ట్ర హైకో ర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని శనివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌కు వేదపండితులు ఆశీర్వచనం, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.
*తిరుమలలో వారంతపు రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి పెరిగిన రద్దీ శనివారం కూడా కొనసాగింది. వైకుంఠంలోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు సర్వదర్శనం భక్తులతో నిండిపోయాయి.
*నర్సీపట్నంలో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటిని ఆదివారం తెల్లవారుజామున పోలీసులు చుట్టుముట్టారు. నర్సీపట్నంలో అయ్యన్నను అరెస్ట్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. చోడవరం మినీ మహానాడులో సీఎం జగన్‎పై అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు చేశారు. దీంతో నిన్న రాత్రి అయ్యన్నకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. అయ్యన్న ఇంటి వెనకాల గోడను జేసీబీతో కూల్చివేశారు. పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని.. ప్రభుత్వ భూమిలోని రెండు సెంట్లు ఆక్రమించారని నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ నోటీసులో పేర్కొన్నారు. గోడ తొలగించడంపై అయ్యన్న కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపారు.
*తిరుమల వేంకటేశ్వరస్వామికి చెందిన వివిధ ట్రస్ట్‌లకు శనివారం రూ.2.53 కోట్లు విరాళంగా అందింది. టీవీఎస్‌ సంస్థ చైర్మన్‌ సుదర్శన్‌.. శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయకు రూ.1.05 కోట్లు విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని చెక్‌ రూపంలో దాత తరఫున ప్రతినిధి శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన జీవీఆర్‌ ఇన్‌ఫ్రా సంస్థ తరఫున బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్‌కు రూ.1.26 కోట్లు అందింది. అలాగే హరిబాబు, వెంకటేశ్వర్లు అనే భక్తులు రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షలను ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు అందజేశారు. ఎన్‌.రవిబాబు అనే భక్తుడి నుంచి ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.2.50 లక్షలు అందింది. విరాళాలను తిరుమలలోని దాతల విభాగంలో డిప్యూటీ ఈవో పద్మావతికి అందజేశారు.
*పాలిటెక్నిక్‌ ప్రవేశ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మొత్తం 1,31,608మంది పరీక్ష రాయగా 1,20,866 మంది.. (91.82శాతం) అర్హత సాధించారు. బాలురు 90.56, ఉ శఆడగా…బాలికలు 93.96శాతం పాసయ్యారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు టాప్‌ ర్యాంకులు సాధించడం విశేషం. తూర్పుగోదావరి జిల్లా కాతేరు గ్రామానికి చెందిన చల్లా సత్యహర్షిత తొలి ర్యాంకు, కాకినాడ జిల్లా వలసపాకలకు చెందిన అల్లూరి హృతిక్‌ సత్య నిహాంత్‌ రెండో ర్యాంకు సాధించారు. మూడో ర్యాంకు నలుగురికి ఉమ్మడిగా లభించింది వీరిలో కాకినాడ జిల్లా వలసపాకలకు చెందిన టెంకని సాయి భవ్యశ్రీ, కాకినాడ జిల్లా మల్లం గ్రామానికి చెందిన కందా శివమణి వినయ్‌ ఆదిత్య, తూర్పుగోదావరి జిల్లా కాతేరు గ్రామానికి చెందిన రామిశెట్టి పవిత్ర, భీమవరం జిల్లా గునుపూడికి చెందిన కాపుగంటి మనోజ్ఞ ఉన్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ఫలితాలు సాధించిన జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 98.39శాతం మంది అర్హత సాధించారు. కాకినాడ జిల్లా 89.41శాతంతో చివరిస్థానంలో నిలిచింది.
*‘మీకు సువర్ణావకాశం.. డబుల్‌ ఇంజన్‌ ట్రిక్‌, ప్రతి భారతీయుడి ఖాతాలో రూ.30 లక్షలు వేయొచ్చు (రూ.15 లక్షల చొప్పున రెండు సార్లు) అంటూ ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి కేటీఆర్‌ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. స్విస్‌ బ్యాంకుల్లో భారతీయులకు సంబంధించిన నగదు 50 శాతానికి పైగా పెరిగిందనే నివేదికపై స్పందిస్తూ.. 2009లో నల్లధనాన్ని వెనక్కి రప్పించడానికి ఓటు వేయాలని నరేంద్ర మోదీ ప్రచారానికి సంబంధించిన ట్వీట్‌తో పాటు 2015లో విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి రప్పిచడానికి చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్లు మోదీ చేసిన ట్వీట్‌నూ జత చేస్తూ మంత్రి ఈ ట్వీట్‌ చేశారు.
*అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు సృష్టించిన విధ్వంసం వల్ల సుమారు రూ.35 కోట్లకుపైగా ఆస్తులకు నష్టం వాటిల్లినట్లు రైల్వే అధికారులు ప్రాఽథమిక అంచనా వేశారు. సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటే నష్టం మరో రూ.నాలుగైదు కోట్లకు పెరగవచ్చని భావిస్తున్నారు. విధ్వంసంలో ఎనిమిది రైలింజన్లు దెబ్బతిన్నాయి. నాలుగు రైలుబోగీలు పూర్తిగా దహనమయ్యాయి. మరో 30 ఏసీ బోగీలు, 47 నాన్‌ఎసీ బోగీలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. దీంతో పాటు ఎస్కలేటర్లు, ఫ్యాన్‌లు, ఫ్లాట్‌ఫారాలపై ఉన్న దుకాణాలు, టీవీ స్ర్కీన్‌లు, డిజిటల్‌ బోర్డులు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. స్టేషన్‌లోని పార్సిల్‌ ఆఫీసు కేంద్రంపైనా నిరసనకారులు దాడులు చేయడంతో ఆయా ప్రాంతాలకు చేరవేయాల్సిన పార్సిళ్లు పూర్తిగా ధ్వంసం కావడం, కాలిపోవడం వంటివి జరిగాయని వెల్లడించారు. రూ.కోట్ల విలువైన పార్సిల్‌ చేయాల్సిన వస్తుసామగ్రి ఆందోళనకారుల ధ్వంసమైందని చెప్పారు. ‘‘స్టేషన్‌లో రెండో ఫ్లాట్‌ఫాం నుంచి ఏడో ప్లాట్‌ఫాం వరకున్న వస్తు సామగ్రి మొత్తం నిరసనకారుల దాడిలో ధ్వంసమైంది. సిగ్నలింగ్‌, ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ పాక్షికం గా దెబ్బతిన్నాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రం సికింద్రాబాద్‌ స్టేషన్‌కు రోజూ సుమారు 1.5 లక్షల మంది ప్రయాణికులు చేరుకుంటారు. మరో 1.5లక్షల మంది స్టేషన్‌ నుంచి బయల్దేరతారు. ఆందోళనకారుల హింస కారణంగా స్టేషన్‌కు వచ్చి వెళ్లే సుమారు 250 రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేయడంతో తీవ్ర నష్టం వాటిల్లింది’’ అని అధికారులు పేర్కొన్నారు.
*కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం మొత్తం రుతుపవనాలు విస్తరించాయి. కోస్తాలో కళింగపట్నం వరకు వచ్చిన రుతుపవనాలు రానున్న రోజుల్లో ఉత్తరాంధ్రలో మిగిలిన ప్రాంతాలకు విస్తరించనున్నాయి. తమిళనాడుకు ఆనుకుని బంగాళాఖాతం పరిసరాల్లో ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రుతుపవనాలు సీమ కోస్తాల్లో చురుగ్గా ఉండడంతో అనేకచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. రానున్న గంటల్లో కోస్తా సీమల్లో ఎక్కువచోట్ల వర్షాలు కురుస్తాయని అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
*డా.ఇండ్ల రామసుబ్బారెడ్డికి తిరుపతి ఎస్వీ వర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ప్రధానం చేయనున్నారు. ఈనెల గవర్నర్‌ హరిచందన్‌ డాక్టరేట్‌ ప్రదానం చేయనున్నారు. సైకియాట్రిస్ట్‌కు గౌరవ డాక్టరేట్‌ ఇవ్వడం అత్యంత అరుదు. రేపు ముగ్గురికి ఎస్వీ వర్సిటీ గౌరవ డాక్టరేట్‌లు ప్రదానం చేయనుంది. మానసిక వైద్యులుగా డాక్టర్‌ ఇండ్ల రామసుబ్బారెడ్డి ఇప్పటికే అనేక అవార్డులు అందుకున్నారు.
* సికింద్రాబాద్‌ స్టేషన్‌లో జరిగిన అల్లర్ల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఆదివారం హౌరా- సికింద్రాబాద్‌ (12703), సికింద్రాబాద్‌- ధనపూర్‌ (12791) దర్బంగ-సికింద్రాబాద్‌ (17008)లను రద్దు చేశారు. అలాగే 20న యశ్వంత్‌ పూర్‌- పాట్లీపుత్ర (22352), సికింద్రాబాద్‌- రాజ్‌పూర్‌ (12771), 21న రాజ్‌పూర్‌- సికింద్రాబాద్‌ (12772) బల్సూర్‌-తిరునెల్వెలి (22619)లను రద్దు చేసినట్టు తెలిపారు. అలాగే 21న కెఎ్‌సఆర్‌ బెంగుళూరు- న్యూ తిన్‌సుకియా( 22501), జూన్‌ 23న కన్యకుమారి- దిబ్రుగఢ్‌ ( 15905), 20, 24 తేదీల్లో కాచిగూడ-నడికూడ (07791), నడికూడ-కాచిగూడ(07792) రైళ్లను రద్దుచేసినట్టు ప్రకటించారు. కాగా, 20, 24 తేదీల్లో సికింద్రాబాద్‌-రేపల్లె (17645), రేపల్లె -సికింద్రాబాద్‌ (17646), సికింద్రాబాద్‌- తిరువనంతపురం సెంట్రల్‌ (17230) రైళ్లను రీ-షెడ్యూల్‌ చేశామన్నారు.
*అగ్నిపథ్‌ స్కీం పట్ల నిరసన పేరుతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం జరిగిన విధ్వంసం వెనుక ఆర్మీ అభ్యర్థులు కాకుండా ఇతరులు కూడా ఉన్నారా? చేయాలనుకున్న పనిని చేసి తప్పించుకున్నారా? అంటే.. చివరి వరకు అక్కడ ఉన్నవారి సంఖ్యను గమనిస్తే ఇవే సందేహాలు వస్తున్నాయి. రైల్వేస్టేషన్‌ను ముట్టడించి నిరసన తెలిపేందుకు తొలుత వచ్చిన అభ్యర్థుల్లో 85ు మంది చివరి వరకు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఉదయం 8.30 గంటల నుంచి ఒక్కొక్కరుగా ఫ్లాట్‌ఫాం నంబర్‌-1పైకి చేరుకున్నారు. నిమిషాల వ్యవధిలోనే నిప్పురాజేసి బోగీలను తగులబెట్టిభయానక వాతావరణం సృష్టించారు. అయితే ముఖానికి మాస్కులు ధరించి బోగీలకు నిప్పంటించిన తర్వాత చాలా మంది సాధారణ ప్రయాణికుల మాదిరిగా రైల్వేస్టేషన్‌ నుంచి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది.
* అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు సృష్టించిన విధ్వంసం వల్ల సుమారు రూ.35 కోట్లకుపైగా ఆస్తులకు నష్టం వాటిల్లినట్లు రైల్వే అధికారులు ప్రాఽథమిక అంచనా వేశారు. సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటే నష్టం మరో రూ.నాలుగైదు కోట్లకు పెరగవచ్చని భావిస్తున్నారు. విధ్వంసంలో ఎనిమిది రైలింజన్లు దెబ్బతిన్నాయి. నాలుగు రైలుబోగీలు పూర్తిగా దహనమయ్యాయి. మరో 30 ఏసీ బోగీలు, 47 నాన్‌ఎసీ బోగీలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. దీంతో పాటు ఎస్కలేటర్లు, ఫ్యాన్‌లు, ఫ్లాట్‌ఫారాలపై ఉన్న దుకాణాలు, టీవీ స్ర్కీన్‌లు, డిజిటల్‌ బోర్డులు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. స్టేషన్‌లోని పార్సిల్‌ ఆఫీసు కేంద్రంపైనా నిరసనకారులు దాడులు చేయడంతో ఆయా ప్రాంతాలకు చేరవేయాల్సిన పార్సిళ్లు పూర్తిగా ధ్వంసం కావడం, కాలిపోవడం వంటివి జరిగాయని వెల్లడించారు. రూ.కోట్ల విలువైన పార్సిల్‌ చేయాల్సిన వస్తుసామగ్రి ఆందోళనకారుల ధ్వంసమైందని చెప్పారు.
*రాష్ట్రంలో కొత్తగా మరో 247 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. శనివారం 24,685 టెస్టులు చేశారు. హైదరాబాద్‌లో 157, మేడ్చల్‌లో 13, రంగారెడ్డిలో 60, సంగారెడ్డిలో 5 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,912 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులున్నాయి.
*సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం జరిగిన ఆర్మీ అభ్యర్థుల ఆందోళన, విధ్వంసం, పోలీస్‌ కాల్పులపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం(హెచ్‌ఆర్‌సీ) సుమోటోగా విచారణ చేపట్టింది. జూలై 20వ తేదీ లోగా మొత్తం ఘటనపై సమగ్ర వివరాలు అందజేయాలని రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఆర్పీఎఫ్‌), గవర్నమెంట్‌ రైల్వే పోలీస్‌(జీఆర్‌పీ) అధికారులను ఆదేశించింది. కాగా, ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా 13 మంది గాయపడ్డారు. పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం కూడా జరిగింది. కాగా, ముందస్తు హెచ్చరికలు చేయకుండా ఆందోళనకారులపై కాల్పులు జరపడాన్ని తీవ్రంగా పరిగణించిన దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు.. ఆర్పీఎఫ్‌ పోలీసులను శనివారం నివేదిక కోరారు.
*సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో 5వ తరగతి ప్రవేశాలకు నిర్వహించిన టీజీసెట్‌-2022 ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఆయా గురుకుల సొసైటీల కార్యదర్శులతో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సెట్‌ ఫలితాలు విడుదల చేశారు.
*సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో 5వ తరగతి ప్రవేశాలకు నిర్వహించిన టీజీసెట్‌-2022 ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఆయా గురుకుల సొసైటీల కార్యదర్శులతో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సెట్‌ ఫలితాలు విడుదల చేశారు.
* ‘మీకు సువర్ణావకాశం.. డబుల్‌ ఇంజన్‌ ట్రిక్‌, ప్రతి భారతీయుడి ఖాతాలో రూ.30 లక్షలు వేయొచ్చు (రూ.15 లక్షల చొప్పున రెండు సార్లు) అంటూ ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి కేటీఆర్‌ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. స్విస్‌ బ్యాంకుల్లో భారతీయులకు సంబంధించిన నగదు 50 శాతానికి పైగా పెరిగిందనే నివేదికపై స్పందిస్తూ.. 2009లో నల్లధనాన్ని వెనక్కి రప్పించడానికి ఓటు వేయాలని నరేంద్ర మోదీ ప్రచారానికి సంబంధించిన ట్వీట్‌తో పాటు 2015లో విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి రప్పిచడానికి చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్లు మోదీ చేసిన ట్వీట్‌నూ జత చేస్తూ మంత్రి ఈ ట్వీట్‌ చేశారు.
*రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం-అసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌భూపాలపల్లి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురవవచ్చని వివరించింది. ఆయా జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. వరంగల్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, సిద్ధిపేట, జనగామ, సంగారెడ్డి, కరీంనగర్‌, ములుగు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం వర్షాలు కురిసినట్లు తెలిపింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ఉత్తర మధ్య కర్ణాటక నుంచి మధ్య తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని తెలిపింది.