Politics

బండి సంజయ్ పై జగ్గారెడ్డి ఫైర్ – TNI రాజకీయ వార్తలు

బండి సంజయ్ పై జగ్గారెడ్డి ఫైర్  – TNI రాజకీయ వార్తలు

*బండి సంజయ్ పై ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కాల్పులకు బాధ్యులు ఎవరు? అని ప్రశ్నించారు. సికింద్రాబాద్ పోలీసు కాల్పుల్లో మరణించిన రాకేష్ ఇంటికి ధైర్యం ఉంటే బీజేపీ నేతలు రావాలని సవాల్ విసిరారు. ‘అగ్నిపథ్‌’ రద్దయ్యేవరకు బీజేపీ నేతలను అడ్డుకుంటామని ప్రకటించారు. రాకేష్ డెడ్ బాడీ మీద టీఆర్‌ఎస్ జెండా ఎందుకు కప్పారు? అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం చంపితే.. టీఆర్ఎస్ శవయాత్రల రాజకీయం చేస్తోందని జగ్గారెడ్డి మండిపడ్డారు. ‘అగ్నిపథ్‌’ వ్యతిరేక ఆందోళనలో పోలీసు కాల్పులకు బలైన దామెర రాకేష్‌కు భిన్న వర్గాలు శనివారం కన్నీటి వీడ్కోలు పలికాయి. టీఆర్‌ఎస్‌ నేతల ఆధ్వర్యంలో వరంగల్‌ నుంచి దబీర్‌పేట వరకు అంతిమయాత్ర ఆద్యంతం ఉత్కంఠ, ఉద్విగ్నభరితంగా సాగింది. రాకేశ్‌ భౌతికకాయం ఉన్న వాహనాన్ని అనుసరిస్తూ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు వాహనాల్లో ర్యాలీగా వెళ్లారు. ఇక నగరంలో ఎంజీఎం మార్చురీ నుంచి వెంకట్రామ జంక్షన్‌ వరకు జరిగిన శవయాత్ర ఉద్రిక్తంగా సాగింది. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు హోరెత్తాయి. పలుచోట్ల ప్రధాని నరేంద్రమోదీ దిష్టి బొమ్మ దహనం చేశారు. పోచమ్మ మైదాన్‌ సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వ బీఎస్‌ఎన్‌ఎల్‌ భవనంపైన టీఆర్‌ఎస్‌ శ్రేణులు చెప్పులు, రాళ్ళు విసరడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

*ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే.. అయ్యన్న ఇంటిపై చీకటి దాడులు: చంద్రబాబు
చోడవరం మినీమహానాడు వేదికగా.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే అయ్యన్న ఇంటిపై చీకటి దాడులు చేయించారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తెలుగుదేశంలో బలమైన బీసీ నేతలే లక్ష్యంగా.. జగన్ రెడ్డి అక్రమ కేసులు, అరెస్టులు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అయ్యన్నపాత్రుడి ఇంటిగోడ కూల్చివేత.. ముమ్మాటికీ కక్ష సాధింపేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. తెలుగుదేశంలో బలమైన బీసీ నేతలే లక్ష్యంగా.. జగన్ రెడ్డి అక్రమ కేసులు, అరెస్టులు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చోడవరం మినీమహానాడు వేదికగా.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే అయ్యన్న ఇంటిపై చీకటి దాడులు చేయించారని.. చంద్రబాబు మండిపడ్డారు. అయ్యన్న ప్రశ్నల్లో.. ఏ ఒక్కదానికీ జగన్ సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరని చంద్రబాబు ఆక్షేపించారు. అందువల్లే కూల్చివేతలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడికి మద్దతుగా ఉంటామని భరోసా ఇచ్చారు.మా సీనియ‌ర్ నేత‌, మాజీమంత్రి చింత‌కాయ‌ల‌ అయ్య‌న్న‌పాత్రుడి ఇంటిగోడ అర్ధ‌రాత్రి జేసీబీతో కూల్చివేత‌ ముమ్మాటికీ వైసీపీ క‌క్ష సాధింపే. టిడిపిలో బ‌ల‌మైన బీసీ నేత‌ల‌ని ల‌క్ష్యంగా చేసుకుని అక్ర‌మ కేసులు, అరెస్టులు, దాడుల‌కి @ysjagan పాల్ప‌డుతున్నారు.

*బ్రేకుల్లేని బుల్డోజర్లా.. లోకేశ్ వారిని తొక్కేస్తారు: పట్టాభి
రాజకీయ కక్షసాధింపులో భాగంగానే అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చేశారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. వైకాపా అక్రమాలు ఇంకా ఎంతో కాలం సాగవని హెచ్చరించారు. తప్పు చేసిన జగన్తో సహా ఇతర వైకాపా నేతలను.. బ్రేకుల్లేని బుల్డోజర్లా నారా లోకేశ్ తొక్కేస్తారని అన్నారు.చంద్రబాబుకు పెరుగుతోన్న ఆదరణ చూసి జగన్ సైకోలా మారుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. జగన్ చరిత్ర, ఆయన తాత చరిత్ర కబ్జాతోనే మొదలైందని విమర్శించారు. జింకా వెంకట నరసయ్య అనే బీసీ వ్యక్తికి చెందిన గనులను కబ్జా చేయలేదా ? అని సీఎం జగన్ను నిలదీశారు. జింకా వెంకట నరసయ్యను జగన్ తాత రాజారెడ్డి హత్య చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. బీసీ వ్యక్తులను హత్యలు చేసి వారి శవాల మీద నడిచి రాజకీయం చేసిన చరిత్ర జగన్దని ధ్వజమెత్తారు. ఇడుపులపాయలో అసైన్డ్ భూములను కబ్జా చేసిన చరిత్ర వైఎస్ కుటుంబానిదని ఆరోపించారు.వైకాపా అక్రమాలు ఇంకా ఎంతో కాలం సాగవని.., బ్రేకుల్లేని బుల్డోజర్లా తప్పు చేసిన జగన్తో సహా వైకాపా నేతలను నారా లోకేశ్ తొక్కేస్తారని హెచ్చరించారు. అయ్యన్నపాత్రుడి ఇంటిగోడ కూల్చివేత.. ముమ్మాటికీ కక్ష సాధింపేనని అన్నారు. అయ్యన్నది భూములు దానం చేసిన చరిత్ర అని.., పేదలకు భూములివ్వటంతో కృతజ్ఞతగా అక్కడి ప్రజలు ఓ ఊరికి అయ్యన్నపాలెం అనే పేరు పెట్టుకున్నారని గుర్తు చేశారు. న్యాయం కోసం దళిత టీచర్ వస్తే.. కనీసం ఆమెను చూడనైనా చూశారా? అని సీఎం జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

*పువ్వాడ ఒక కంత్రీ మంత్రి: YS Sharmila
మంత్రి పువ్వాడ అజయ్ వర్సెస్ వైఎఆర్‌టీపీ షర్మిల అన్నట్లు తలపడుతున్నారు. ఈ ఇద్దరు ఒకరిపై మరొకరు సవాళ్లు ప్రతి సవాళ్లు విసుకుంటున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ మంత్రి పువ్వాడపై తీవ్రమైన విమర్శలు చేశారు. ‘‘పువ్వాడ ఒక కంత్రీ మంత్రి. పువ్వాడ వైద్య కళాశాలకు ఇబ్బందని ప్రభుత్వ మెడికల్ కాలేజీని రానివ్వడం లేదు. మెడికల్ సీట్లు రూ.3 కోట్లకు అమ్ముకుంటున్నారు. వైఎస్సార్ బిడ్డకు బయ్యారంలో భాగం ఉందన్న.. ప్రచారంలో వాస్తవం లేదు’’ షర్మిల తెలిపారు. ఇటీవల ఖమ్మం నిర్వహించిన సభలో షర్మిల మాట్లాడుతూ పువ్వాడ అజయ్‌ కుమార్ వేధింపులతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఖమ్మం లో నియంత పాలన సాగుతోందని ఆమె మండిపడ్డారు. భూకబ్జాలెన్ని చేసినా పువ్వాడకు ధనదాహం తీరట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణమంత్రి మంత్రి పువ్వాడకు ఆర్టీసీ పరిస్థితేంటో అర్థంకాదలేదని ఎద్దేవాచేశారు. పోలీసులను పువ్వాడ పని వాళ్లలా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఖమ్మం ప్రజలకు మంత్రి పువ్వాడ చేసిందేమీ లేదని షర్మిల మండిపడ్డారు.

*జగన్‌ సైకోలా వ్యవహరిస్తున్నాడు: పట్టాభి
రోజురోజుకి తన ప్రభుత్వం పట్ల ప్రజల్లో వస్తున్నవ్యతిరేకత … చంద్రబాబుకు లభిస్తున్న ఆదరణ తట్టుకోలేక జగన్‌ మోహన్‌ రెడ్డి ఒక సైకోలా వ్యవహరిస్తున్నాడని టీడీపీ నాయకుడు పట్టాభి విమర్శించారు. అయ్యన్నపాత్రుడిది మచ్చలేని కుటుంబం అని..ఆయనపై ఎన్ని కేసులు పెట్టినా బెదరకుండా జగన్‌పై పోరాటం చేస్తున్నారని తెలిపారు. అయ్యన్నపాత్రుడు ఆక్రమించుకుంది 0.2 సెంట్లు…. అంటే 10 గజాలు లోపేనని.. దీనికి వంద మంది పోలీసులు, జేసీబీలు, ఐపీఎస్‌ అధికారులు అవసరమా? అని ప్రశ్నించారు. పోలీస్‌ వ్యవస్థ అంటే వైసీపీ చేతి కర్రగా మారడం బాధాకరమన్నారు.

*జగన్‌ది రాక్షస పాలన: వర్ల రామయ్య
సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన ప్రజావ్యతిరేక పాలనకు నిదర్శనమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పేర్కొన్నారు. ‘‘అయ్యన్నపాత్రుడు తప్పు చేస్తే చట్టo ఉంది. దాని ప్రకారం చర్యలు తీసుకోండి. అంతే గాని, ఏదో వంకతో ఇంటి ప్రహరీని వందలాది మంది పొలీసులతో వచ్చి జేసీబీతో కూల్చడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడమే. ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు. మీరేమి ప్రత్యేకo కాదు’’ అని పేర్కొన్నారు.

*ఏపీలో బుల్డోజర్ రాజకీయాలకు తెర తీయడం దుర్మార్గం: రామకృష్ణ
ఏపీలో బుల్డోజర్ రాజకీయాలకు తెర తీయడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటిని బుల్డోజర్‌తో కూల్చడాన్ని ఖండిస్తున్నామన్నారు. మోడీ సర్కార్ బుల్డోజర్ రాజకీయాలను ఏపీలో జగన్ సర్కార్ అనుసరించటం విచారకరమన్నారు. ప్రతిపక్షాల విమర్శలను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కోవాలేగాని ఈ తరహా బ్లాక్మెయిలింగ్ సరికాదన్నారు.

*వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది: బీజేపీ నేత
నెల్లూరు జిల్లాలో రాష్ట్ర మంత్రులు ఉండి కూడా ఏ మాత్రం అభివృద్ధి నోచుకోలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్య కుమార్ అన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ ప్రాంతానికి ఏమి అభి వృద్ధి చేయలేదన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీకి ఓటమి భయంతో వీధికో ఎమ్మెల్యే, గ్రామానికో మంత్రితో ప్రచారం చేయిస్తున్నారని చెప్పారు. మరో వైపు రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటినుండి రైతులు చాలా కష్టాలు పడుతున్నారని చెప్పారు. ఇసుక మాఫియా..లిక్కర్మా ఫియా.. మైనింగ్ మాఫియా, రివర్స్ టెండరింగ్ మాఫియా.. వైసిపి ప్రభుత్వమే ఓ మాఫియా అన్నారు. మద్యం షాపుల్లో నగదు లావా దేవీలు ఉంటే గోల్‌మాల్ చేయొచ్చని ఆన్ లైన్‌లో పేమెంట్లు అందుబాటులో ఉంచలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్ లేదన్నారు. అలాగే ప్రజలకు రక్షణ లేదని పేర్కొన్నారు.

*నర్సీపట్నం పులిని చూసి.. పులివెందుల పిల్లి భయపడింది: లోకేశ్
మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చడంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటనకు వచ్చిన జన జాతర, ప్రభుత్వంపై వస్తున్న ప్రజా వ్యతిరేకత చూసి పిరికిపంద చర్యలు మొదలెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయన్నపాత్రుడిపై వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నర్సీపట్నం పులిని చూసి పులివెందుల పిల్లి భయపడిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. నోటీసులు ఇస్తామంటూ పోలీసుల డ్రామా, దౌర్జన్యంగా ఇంటి గోడ కూల్చడం చూస్తుంటే జగన్ గట్టిగానే భయపడినట్టు కనిపిస్తుందని విమర్శించారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటనకు వచ్చిన జన జాతర, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత చూసి పిరికిపంద చర్యలు మొదలెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయన్నపాత్రుడిపై వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మూడేళ్ల తరువాత కూడా ప్రతిపక్ష నేతల ఇళ్లు కూల్చడం, అరెస్టులనే నమ్ముకున్న జగన్ రెడ్డి దుస్థితి చూస్తుంటే జాలేస్తుందన్నారు.

*అయ్యన్న పాత్రుడి ఇంటి గోడ కూల్చడం కక్షపూరిత చర్యే: బోండా ఉమ
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన విజయవంతం కావడంతో వైసీపీ ప్రభుత్వం ఉలికిపాటుకు గురైంది. టీడీపీ కార్యక్రమాలకు జనం భారీగా వస్తుండడంతో అటు సీఎం జగన్, ఇటు వైసీపీ మంత్రులు, పార్టీ ప్రతినిధుల్లో ఆందోళన మొదలైంది. ప్రజల నుంచి చంద్రబాబుకు లభిస్తున్న మద్దతును చూసి సీఎం జగన్ ఓర్వలేక, టీడీపీ నేతలపై పరోక్షంగా కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ ఆరోపించారు. చోడవరం మినీ మహానాడులో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఆయన ఇంటి గోడను కూల్చడం దారుణమన్నారు. ప్రతిపక్ష నేతల గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా 70 ఏళ్ల అయ్యన్నపై రేప్ కేసు పెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదన్నారు. ఎన్ని రకాలుగా అణిచేసే ప్రయత్నం చేసినా లాభం ఉండదన్న విషయాన్ని వైసీపీ మంత్రులు గుర్తించాలన్నారు.

*జగన్‌ది రాక్షస పాలన: వర్ల రామయ్య
సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన ప్రజావ్యతిరేక పాలనకు నిదర్శనమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పేర్కొన్నారు. ‘‘అయ్యన్నపాత్రుడు తప్పు చేస్తే చట్టo ఉంది. దాని ప్రకారం చర్యలు తీసుకోండి. అంతే గాని, ఏదో వంకతో ఇంటి ప్రహరీని వందలాది మంది పొలీసులతో వచ్చి జేసీబీతో కూల్చడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడమే. ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు. మీరేమి ప్రత్యేకo కాదు’’ అని పేర్కొన్నారు.

*agan ప్రతీకారానికి అంతమెపుడో తెలియటం లేదు: Jawahar
ముఖ్యమంత్రి జగన్ ప్రతీకారానికి అంతమెపుడో తెలియటం లేదని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ అన్నారు. అయ్యన్న పాత్రుడు ఇంటి గోడను కూల్చడంపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ అయ్యన్నపై జగన్ పోలీసులతో దాడి చేయటం పిరికి పంద చర్య అన్నారు. ముఖ్యమంత్రి ప్రతీకారానికి బడుగులు, దళితులు బలవుతున్నారని, శని, ఆదివారం బుల్ డోజర్స్ దినంగా ప్రకటించాలని అన్నారు. మాస్క్‌లు అడిగితే దళితులను చంపారని, పరిపాలనా లోపాలను ప్రశ్నిస్తే అయ్యన్న ఇళ్ళపై పడ్డారని మండిపడ్డారు. సీఎం జగన్ పద్దతిగా మార్చుకోపోతే ఫలితం అనుభవిస్తారని జవహర్ అన్నారు.

*ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన Cm Bommai
ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల రాష్ట్ర పర్యటన నేపథ్యంలో బెంగళూరు రహదారులు ముస్తాబయ్యాయి. సోమవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి మోదీ బెంగళూరుకు వస్తున్నారు. సాయంత్రం దాకా పలు కార్యక్రమాల్లో పాల్గొని మైసూరుకు వెళతారు. ప్రధానమంత్రి రాక నేపథ్యంలో నగర వ్యాప్తంగా రోడ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సుదీర్ఘ కాలంగా గుంతలుగా ఉండే బళ్లారి రోడ్డుకు మరమ్మతులు చేశారు. రద్దీ ప్రాం తం కావడంతో నాలుగు రోజులుగా రాత్రివేళల్లో పనులు సాగుతున్నాయి. బెంగళూరు విశ్వవిద్యాలయంలో అంబేడ్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ను ప్రారంభించేందుకు వెళుతున్న తరుణంలో నాణ్యతగా పనులు చేపట్టారు. ప్రధానమంత్రి కార్యక్రమాలను ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడుతూ ఎస్‌పీజీ మార్గదర్శకాలకు అనుగుణంగా నే ఏర్పాట్లు చేశామన్నారు. కొమ్మఘట్టలో ప్రధాని కార్యక్రమ స్థలాన్ని పరిశీలించారు. బెంగళూరు సబర్బన్‌ రైల్వే ప్రాజెక్టు కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉండేదని ఎట్టకేలకు పూర్తి అవుతోందన్నారు. తాజాగా కొవిడ్‌ కేసులు పెరుగుతున్నందున సభాప్రాంగణంలో పాల్గొనేవారు కొవిడ్‌ టెస్టు చేయించుకోవాలని, సభకు హాజరయ్యేవారు అవసరం లేదన్నారు. తనతో సహా మంత్రులు, అధికారులందరికి ఈ నిబంధన వర్తిస్తుందన్నారు. మైసూరులో సోమవారం సుత్తూరుమఠంతోపాటు చాముండేశ్వరి కొండలను సందర్శించనున్న తరుణంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. యూనివర్సిటీలో సభకు అధ్యక్షత వహిం చే మంత్రి సోమణ్ణ పేరు లేకపోవడంపై ఆయన మండిపడ్డారు. కార్యక్రమం కేంద్రానిదైనా, రాష్ట్రానిదైనా ప్రోటోకాల్‌ లేకుంటే ఎలాగని ప్రశ్నించారు. ఆదివారంలోగా శిలాఫలకం మారలేదంటే స్వయంగా ధ్వంసం చేస్తానని ఆ శాఖ కమిషనర్‌ ప్రదీప్‌పై విరుచుకుపడ్డారు.

*బీసీలపై కక్ష సాధింపులో భాగమే కూల్చివేతలు: యనమల
రాష్ట్రంలోని బీసీలను అణచివేయడమే ధ్యేయంగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం జరిగిన మహానాడులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే అయ్యన్న పాత్రుడి ఇంటి గోడ కూల్చడం సిగ్గుచేటన్నారు. అక్రమ కట్టడమైతే.. తెల్లవారు జామున 4 గంటలకు ఆర్డీవో, ఎస్పీ సహా వందలాది మందితో రావాల్సిన అవసరం ఏమిటి.? యనమల ప్రశ్నించారు. జగన్ తుగ్లక్ ప్రభుత్వంపై పోరాడుతూనే.. బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని చెప్పారు.

*ప్రజా స్పందనను ఓర్వలేకే.. కొల్లు రవీంద్ర
చంద్రబాబు నిర్వహిస్తున్న మినీమహానాడు కార్యక్రమాలకు వస్తున్న ప్రజా స్పందనను చూసి సీఎం జగన్ ఓర్వలేకపోతున్నాడని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. టీడీపీ నాయకులపై వైసీపీ ప్రభుత్వం అక్రమ అరెస్టులు, ఇల్లు కూల్చివేతలకు పాల్పడుతుందన్నారు. ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు కలిగించినా ప్రజా పక్షాన తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అయ్యన్న పాత్రుడి ఇంటిని పోలీసులు చుట్టుముట్టి గోడ కూల్చారని తెలిపారు. అయ్యన్న పాత్రుడిపై ప్రభుత్వం పదే పదే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు పేర్కొన్నారు. పోలీసులు ప్రజా రక్షణ వదిలేసి వైసీపీ అనుకూల విధానాలకు వత్తాసు పలుకుతుండడం దారుణమన్నారు.

*విద్యార్థుల డిమాండ్లన్నీ పరిష్కరించదగినవే: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
ఆర్జీయూకేటీ విద్యార్థులతో చర్చలు సఫలమైనట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. విద్యార్థుల డిమాండ్లను ఒప్పుకున్నామని తెలిపారు. విద్యార్థుల డిమాండ్లన్నీ పరిష్కరించదగినవేనని చెప్పారు. సోమవారం నుంచి క్లాస్‌లకు హాజరవుతామని విద్యార్థులు పేర్కొన్నారు. విద్యార్థులకు మంత్రులు కేటీఆర్‌, సబిత కూడా భరోసా ఇస్తారని చెప్పారు. ఆర్జీయూకేటీ వీసీ నియామకంపై కొన్ని ఇబ్బందులున్నాయని చెప్పారు. అలాగే ఇబ్బందులను విద్యార్థులకు వివరించామన్నారు. ఆర్జీయూకేటీకి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

*రేపు జంతర్ మంతర్‌లో ఆందోళన: రేవంత్ రెడ్డి
కేంద్రం ‘‘అగ్నిపథ్’’ స్కీంను విరమించుకోకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ అవగాహన లోపం, కేంద్ర ప్రభుత్వ అనాలోచిత చర్య వల్ల అగ్నిపథ్‌ను తీసుకువచ్చారని పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్లలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరామని చెప్పారు. ఆందోళనలో గాయపడ్డ విద్యార్థులను పరీక్ష‌లకు అనర్హులుగా ప్రకటించకుండా అనుమతి ఇవ్వాలని, నాన్ బెయిలబుల్ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అల్లర్లలో చనిపోయిన రాకేష్ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు.

*అగ్నిపథ్‌పై కేంద్రం పునరాలోచించాలి: హనుమంతరావు
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లో అల్లర్ల ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు స్పందించారు. అగ్నిపథ్ పై కేంద్రం మరోసారి ఆలోచించాలని కోరారు. ‘ఘటన దురదృష్టకరం’‘సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లో జరిగిన ఘటన దురదృష్టకరం. అగ్నిపథ్‌ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేయడంతో కడుపు మండిన నిరుద్యోగులు విధ్వంసానికి పాల్పడ్డారు. చనిపోయిన రాకేష్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. రాకేష్‌కు నివాళి అర్పించడానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడం కరెక్ట్ కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం శవాల మీద కూడా రాజకీయం చేస్తోంది.’’ అని హనుమంతరావు పేర్కొన్నారు.

*సికింద్రాబాద్ హింసాకాండ కుట్రే: విజయశాంతి
సైన్యంలో నియామకాల కోసం కేంద్రం కొత్తగా తెచ్చిన ‘అగ్నిపథ్‌’పై ఆర్మీ అభ్యర్థులు ఆగ్రహంతో రగిలిపోయారు. పక్కా ప్రణాళిక ప్రకారం దాదాపు రెండు వేల మంది సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించి పలు రైళ్లను ధ్వంసం చేశారు. ఇంజన్లు, బోగీలకు నిప్పు పెట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్లవర్షం కురిపించారు. వారిని అదుపులోకి తెచ్చేందుకు ఆర్పీఎఫ్‌ కానిస్టేబుళ్లు జరిపిన కాల్పుల్లో.. వరంగల్‌ జిల్లాకు చెందిన యువకుడు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. ‘అగ్నిపథ్‌’ అభ్యర్థులు చేసిన అల్లర్ల వెనుక కుట్ర ఉందని బీజేపీ నేత విజయశాంతి అనుమానం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసంపై ఆమె సోషల్ మీడియాతో తీవ్రంగా స్పందించారు.

*బండి సంజయ్‌ది మూర్ఖపు, దుర్మార్గపు మాటలు: మంత్రి Gangula
అగ్నిపథ్ అంశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ది మూర్ఖపు, దుర్మార్గపు మాటలు అని మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… యువతను రెచ్చగొట్టకుండా బండి సంజయ్ ఆచితూచి మాట్లాడాలని హితవుపలికారు. అగ్నిపథ్ స్కీంను కేంద్రం పునరాలోచించాలని తెలిపారు. ఆందోళనలు జరిగిన రాష్ట్రాల మీద దుమ్మెత్తి పోయడం కరెక్ట్ కాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఆందోళనలు జరిగాయని.. దానికి కూడా టీఆర్‌ఎస్ పార్టీ కారణమా అంటూ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు.

*నోట్ల రద్దు తర్వాత మరో పెద్ద తప్పు: వినోద్‌
కేంద్రం అమలు చేసిన డీమానిటైజేషన్‌ (పెద్ద నోట్ల రద్దు) కంటే ఇప్పుడు అగ్నిపథ్‌ పథకం తీసుకురావడం మరో బ్లండర్‌ (పెద్ద తప్పు) అని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్‌ బి. వినోద్‌కుమార్‌ అన్నారు. ‘అగ్నిపథ్‌’ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈమేరకు శనివారం ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సుదీర్ఘ లేఖ రాశారు. ప్రతిసారి మోదీ ప్రభుత్వం సైన్యాన్ని అపహాస్యం చేస్తూ దాని నుంచి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కానీ.. అగ్నిపథ్‌ను తెచ్చిన కేంద్రానికి ఈసారి యువత సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కాగా, రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ వర్సిటీ ప్రాంగణంలో జంతువుల బ్లడ్‌ బ్యాంక్‌తో సహా జంతువుల ఆరోగ్య పరిరక్షణ కోసం బ్లడ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ను నెలకొల్పే విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళతానని వినోద్‌ కుమార్‌ అన్నారు. శనివారం మంత్రుల నివాసంలో ఆల్‌ ఫర్‌ ఎనిమల్‌ ఫౌండేషన్‌ ఫౌండర్‌ శ్రీలక్ష్మి భూపాల్‌, ఎనిమల్‌ బ్లడ్‌ లైన్‌ ఫౌండర్‌ శివకుమార్‌ వర్మలు తనతో భేటీ అయిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మరోవైపు.. మోదీ నియంత పాలనకు త్వరలోనే దేశ ప్రజలు చరమగీతం పాడనున్నారని ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌ అన్నారు. టీఆర్‌ఎ్‌సఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మొన్న రైతులు, ఇప్పుడు నిరుద్యోగులు.. ఇలా మోదీ సర్కారును కూల్చేందుకు ప్రజలు ఉద్యమానికి సిద్ధమవుతున్నారని హెచ్చరించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మాట్లాడుతూ.. కేంద్రం తప్పుడు నిర్ణ యంవల్ల నిరుద్యోగులు ఆందోళనలకు దిగితే.. రాష్ట్ర బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్‌ వల్లే విధ్వంసం జరిగిందని చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

*చంద్రబాబు సవాల్‌కు సిద్ధమా?: Varla Ramaiah
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ క్రమంలోనే ‘‘సామాజిక న్యాయం, సంక్షేమంపై బహిరంగ చర్చకు ప్రతిపక్ష నేత చంద్రబాబు సవాల్‌ విసిరారు. దీనికి మీరు సిద్ధమైతే వేదిక ఏర్పాటు చేయండి’’ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య శుక్రవారం ట్వీట్‌ చేశారు. ‘‘బహిరంగ చర్చకు సిద్ధమైతే సమయం తెలియజేయండి. మా పార్టీ తరపున ఇద్దరం వస్తాం. మీ తరపున ఇద్దరు మంత్రులను పంపండి. న్యాయ నిర్ణేతలుగా ఇద్దరు విశ్రాంత ఐఏఎస్‌లుంటారు. మీరు సిద్ధమా?’’ అని వర్ల రామయ్య తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

*కౌలురైతుల కుటుంబాలకు రేపు ఆర్థికసాయం: నాదెండ్ల
వైసీపీ పాలనలో 3 వేల మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ మండిపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వట్లేదన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డ 80 మంది కౌలురైతుల కుటుంబాలకు రేపు పవన్ ఆర్థిక సాయం అందిస్తారని తెలిపారు.

*అప్పులు తప్ప అభివృద్ధి ఏది?: బుడ్డా రాజశేఖరరెడ్డి
శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నవరత్నాలలో ఎన్ని రత్నాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయని ప్రశ్నించారు. లక్షల కోట్ల అప్పులు తప్ప అభివృద్ధి ఎక్కడా జరగడం లేదన్నారు. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే శ్రీశైలం అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం శ్రీశైలం క్షేత్రాన్నిఅభివృద్ధి చేయకపోగా.. భక్తులు ఇచ్చే కానుకలు, క్షేత్ర ఆదాయాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. గడపగడపకు కార్యక్రమం పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు.

*రైతుల పంటల బీమా పంపిణీలో అవకతవకలు: B.Tech Ravi
రైతుల పంటల బీమా పంపిణీలో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీకి చెందిన రైతులకు పంటల బీమా అందలేదన్నారు. రైతులు నిలదీస్తారనే సీఎం జగన్ పులివెందుల పర్యటన రద్దు చేసుకున్నారని తప్పుబట్టారు. పలువురు రైతులకు పంటల బీమా మంజూరు కాలేదని తెలిపారు. రీ సర్వే చేసి అర్హులకు బీమా మంజూరు చేయాలని బీటెక్ రవి డిమాండ్ చేశారు.

*ప్రధాని నరేంద్రమోడీ జాతికి క్షమాపణ చెప్పాలి: Ramakrishna
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతికి క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణడిమాండ్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… విజయవాడలో యువజన, విద్యార్థి నేతలను నిన్నటి నుండి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించడాన్ని ఖండిస్తున్నామన్నారు. భారత సైన్యంలో కాంట్రాక్టు విధానాన్ని అమలు చేసే అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని అన్నారు. పెద్ద నోట్ల రద్దు దగ్గర నుండి నల్ల వ్యవసాయ చట్టాల వరకు కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిరంకుశ విధానాలకు తెరతీసిందని మండిపడ్డారు. అరెస్టు చేసిన ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులను తక్షణం విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

*అగ్నిపథ్ అనేది ఒక సాకు మాత్రమే..: Somuveerraju
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఆందోళనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ధ్వంస రచన ఒక పధకం ప్రకారం జరిగిందనేది స్పష్టంగా కనపడుతోందన్నారు. అగ్నిపథ్ అనేది ఒక సాకు మాత్రమే అని… విధ్వంసం వారి లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. విదేశీ శక్తులు ఇక్కడ ఉన్న కొన్ని వర్గాలు కలిపి చేస్తున్న విధ్వంసంగా భావించాల్సి వస్తుందన్నారు. మీడియా ద్వారా వస్తున్న ఆడియో పరిశీలిస్తే ఒక గంటలో మొత్తం ధ్వంసం చేయాలని ఆడియో ఆదేశాలు వచ్చాయి అంటేనే అర్థం అవుతోందని అన్నారు. రాష్ట్రంలోని విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి తదితర రైల్వే స్టేషన్‌లలో భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. రైల్వే ప్రయాణికులకు పూర్తి రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టాలని సోమువీర్రాజు అన్నారు.

*గడప గడపకూ కార్యక్రమంలో రెచ్చిపోయిన Vellampalli
గడపగడపకు మన ప్రభుత్వం ఈ కార్యక్రమంలో తాజా మాజీ మంత్రి వెల్లంపల్లికి ఎదురుదెబ్బ తగిలింది. గడప గడపకూ వెళ్లిన సమయంలో మీరు పదిహేను వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని.. తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ఓ ఇంజనీర్ వెల్లడించారు. దీంతో వెల్లంపల్లి రెచ్చిపోయారు. వెంటనే స్థానిక సీఐని పిలిపించి సదరు ఇంజినీర్‌ను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సాక్ష్యాలు లేకుంటే కేసు పెట్టాలని హుకుం జారీ చేశారు. ఎవడో చెప్పింది విని మాట్లాడవద్దని వెల్లంపల్లి అనుచరులు సైతం ఇంజినీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజనీర్ మాటలకు కంగుతిన్న వెల్లంపల్లి అనుచరులు హంగామా సృష్టించారు. ఇంజినీర్ వ్యాఖ్యలతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. పోలీసులు ఇంజనీర్‌ను ప్రశ్నిస్తున్నారు.

*నోట్ల రద్దు తర్వాత మరో పెద్ద తప్పు: వినోద్‌
కేంద్రం అమలు చేసిన డీమానిటైజేషన్‌ (పెద్ద నోట్ల రద్దు) కంటే ఇప్పుడు అగ్నిపథ్‌ పథకం తీసుకురావడం మరో బ్లండర్‌ (పెద్ద తప్పు) అని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్‌ బి. వినోద్‌కుమార్‌ అన్నారు అగ్నిపథ్‌ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈమేరకు శనివారం ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సుదీర్ఘ లేఖ రాశారు. ప్రతిసారి మోదీ ప్రభుత్వం సైన్యాన్ని అపహాస్యం చేస్తూ దాని నుంచి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కానీ.. అగ్నిపథ్‌ను తెచ్చిన కేంద్రానికి ఈసారి యువత సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కాగా రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ వర్సిటీ ప్రాంగణంలో జంతువుల బ్లడ్‌ బ్యాంక్‌తో సహా జంతువుల ఆరోగ్య పరిరక్షణ కోసం బ్లడ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ను నెలకొల్పే విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళతానని వినోద్‌ కుమార్‌ అన్నారు. శనివారం మంత్రుల నివాసంలో ఆల్‌ ఫర్‌ ఎనిమల్‌ ఫౌండేషన్‌ ఫౌండర్‌ శ్రీలక్ష్మి భూపాల్‌ ఎనిమల్‌ బ్లడ్‌ లైన్‌ ఫౌండర్‌ శివకుమార్‌ వర్మలు తనతో భేటీ అయిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మరోవైపు.. మోదీ నియంత పాలనకు త్వరలోనే దేశ ప్రజలు చరమగీతం పాడనున్నారని ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌ అన్నారు. టీఆర్‌ఎ్‌సఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మొన్న రైతులు ఇప్పుడు నిరుద్యోగులు.. ఇలా మోదీ సర్కారును కూల్చేందుకు ప్రజలు ఉద్యమానికి సిద్ధమవుతున్నారని హెచ్చరించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మాట్లాడుతూ.. కేంద్రం తప్పుడు నిర్ణ యంవల్లనిరుద్యోగులు ఆందోళనలకు దిగితే.. రాష్ట్ర బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్‌ వల్లే విధ్వంసం జరిగిందని చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.