DailyDose

గుడివాడలో 29న చంద్రబాబు సభ – TNI తాజా వార్తలు

గుడివాడలో 29న చంద్రబాబు సభ –  TNI  తాజా వార్తలు

* తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బహిరంగ సభ కృష్ణా జిల్లా గుడివాడలో ఈ నెలలో జరగనుంది. ఆయన జిల్లాల పర్యటనలో భాగంగా ఈసారి ఈ నెలాఖరులో కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా గుడివాడలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అక్కడ జిల్లా స్థాయి మహానాడు ఏర్పాటు చేసి, ఆ సందర్భంగా 29న బహిరంగ సభ పెడుతున్నారు. మచిలీపట్నంలో 30న ఆ పార్లమెంటు పరిధిలోని ఏడుఅసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. పొరుగు జిల్లాలోని ప్రత్తిపాడు, పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జూలై 1న క్షేత్ర స్థాయి సమస్యల పరిశీలన, ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమాలు ఉంటాయని టీడీపీ వర్గాలు తెలిపాయి.

*కోనసీమ జిల్లాకు చెందిన వైకాపా రాష్ట్ర కార్యదర్శి రుద్రరాజు వెంకటరామరాజుతోపాటు పలువురు నేతలు వైకాపాకు రాజీనామా చేశారు. పార్టీ కోసం పని చేసిన వారిని పక్కన పెట్టి.. జనసేన నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారని వెంకటరామరాజు ఆరోపించారు. అందుకే తనతోపాటు వెయ్యి మంది కార్యకర్తలు వైకాపాకు రాజీనామా చేస్తునట్లు తెలిపారు.

*తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, రాష్ట్ర మంత్రి జోగి రమేష్, రాష్ట్ర భాజపా సహా ఇంఛార్జ్ సునీల్ థియోధర్, గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర కామత్, కర్ణాటక మాజీ మంత్రి రేవన్నాలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి.. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

*ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణపై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కేసుల ఉపసంహరణను సవాల్‌ చేస్తూ.. హైకోర్టులో ఏపీజేఎఫ్‌ అధ్యక్షుడు చెవులు కృష్ణాంజనేయులు పిటిషన్‌ వేశారు. న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్‌ పిటిషన్‌పై వాదనలు వినిపించారు. పీపీతో సంబంధం లేకుండా డీజీపీ, కలెక్టర్‌ ఆదేశాలతో.. కేసులు ఎలా తొలగిస్తారని న్యాయవాది ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేసులు తొలగించాలంటే.. హైకోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉందని శ్రవణ్‌కుమార్‌ పేర్కొన్నారు. హైకోర్టు అనుమతి లేకుండా కేసులు ఎలా తొలగించారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఎన్ని కేసుల తొలగింపునకు హైకోర్టు అనుమతి తీసుకున్నారని ప్రశ్నించింది. ఎన్ని ఉపసంహరించారన్న దానిపై అఫిడవిట్ వేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఓటర్లకు డబ్బుల పంపిణీ, అధికారులపై దాడుల కేసులు కూడా.. తొలగించారని ధర్మాసనం దృష్టికి శ్రవణ్‌కుమార్ తీసుకొచ్చారు. ప్రభుత్వం అఫిడవిట్ వేయకుంటే కేసులో ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.

*ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంటర్మీడియట్‌ ఎగ్జామ్స్‌ -2022 ఫ‌లితాలు వచ్చేశాయ్‌. బుధ‌వారం మ‌ధ్యాహ్నం విజ‌య‌వాడ‌లో విద్యాశాఖ మంత్రి బొత్స‌ స‌త్య‌నారాయ‌ణ ఏపీ ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను విడుద‌ల‌ చేసి.. మీడియాతో ఫలితాల గురించి మాట్లాడారు.ఫస్టియర్‌లో 2,41,591 మంది పాస్‌ కాగా, ఫస్టియర్‌లో 54 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. సెకండియర్‌లో 2,58,449 మంది పాస్ కాగా, 61 ఉత్తీర్ణత శాతం రికార్డు అయ్యింది. ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉంది.
ఉత్తీర్ణతలో కృష్ణా జిల్లా టాప్‌గా నిలిచిందని, రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం జూన్‌ 25వ తేదీ నుంచి జులై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.రికార్డు స్థాయిలో 28 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. జవాబు పత్రాల మూల్యాంకనాన్ని వేగంగా, జాగ్రత్తగా పూర్తి చేశారు.

*’విచారణకు హాజరుకాలేను.. వాయిదా వేయండి’.. ఈడీకి సోనియా లేఖ
కరోనా అనంతర సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావడాన్ని వాయిదా వేయాలని సోనియా గాంధీ.. ఈడీ అధికారులను కోరారు. ఈ మేరకు లేఖ రాసినట్లు ఆ పార్టీ నేత జైరాం రమేశ్ వెల్లడించారు. మనీలాండరింగ్ కేసులో విచారణను కొద్దిరోజులు వాయిదా వేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేఖ రాశారు. ఇటీవలే కరోనా బారినపడి కోలుకున్న నేపథ్యంలో.. పూర్తి ఆరోగ్యంగా మారేంతవరకు తనను విచారణకు హాజరుకావడాన్ని మినహాయించాలని కోరారు. నేషనల్ హెరాల్డ్ కేసులో జూన్ 23న విచారణకు హాజరుకావాలని సోనియాకు ఈడీ ఇదివరకే సమన్లు పంపింది. అయితే, ఈడీ ముందుకు సోనియాగాంధీ వెళ్లే అవకాశాలు లేవని పార్టీ వర్గాలు తెలిపాయి.”కొవిడ్ అనంతర ఆరోగ్య సమస్యలతో సోనియాగాంధీ బాధపడుతున్నారు. సుమారు తొమ్మిది రోజుల పాటు సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కరోనాతో పాటు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సమస్యల నేపథ్యంలో సోనియా విశ్రాంతి తీసుకోవాలని డిశ్చార్జి సమయంలో వైద్యులు సూచించారు. అందుకే కొద్దివారాల పాటు విచారణకు హాజరుకావడాన్ని వాయిదా వేయాలని ఈడీకి సోనియా లేఖ రాశారు” అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.

*కడప: నగరంలోని మృత్యుంజయకుంటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాలువల విస్తరణలో భాగంగా ఇళ్ల కూల్చివేతను బాధితులు అడ్డుకున్నారు. జేసీబీ యంత్రానికి అడ్డుగా నిలబడి ఎమ్మార్వోను నిలదీశారు. ముందు నగరంలో జలమయమయ్యే ప్రాంతాల్లో కాల్వ విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధితులను నిలువరించే క్రమంలో పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దౌర్జన్యంగా ఇండ్ల కూల్చివేతను స్థానికులు ఖండించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. సీఎంకు మహిళలు శాపనార్థాలు పెట్టారు. ఓట్లు అడగడానికి వస్తారుగా… అప్పుడు బుద్ధి చెబుతామని మహిళలు హెచ్చరించారు

*దావణగెరె జిల్లాలోని జగళూరు తాలూకా విద్యాశాఖ బసవనగౌడ పాటిల్, అతని సోదరుడు బళ్లారి వెంకటరెడ్డిలు ఉద్యోగం ఇప్పిస్తామని రూ.1.2 కోట్లు వసూలు చేసి మోసగించారని బెంగళూరు కృష్ణరాజపురానికి చెందిన వ్యాపారి నాగేంద్రరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రామ్మూర్తినగర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వీరు పరిచయం అయ్యారని, తమకు చాలామంది ప్రభుత్వ అధికారులు తెలుసని చెప్పారన్నారు. తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కావాలని అడిగితే ఇద్దరూ కలిసి రూ.1.02 కోట్లు తీసుకున్నారని, ఇప్పటివరకు ఉద్యోగం ఇప్పించలేదని బాధితుడు తెలిపాడు.

*దాచేపల్లి మండలం నడికూడి ఇండస్ట్రీస్ ఎస్టేట్‌ లో స్థానికులు ఆందోళనకు దిగారు. ఎస్టేట్‌లోని కెమికల్ ఫ్యాక్టరీల వ్యర్దాల వల్ల నీరు కలుషితమవుతోంది. స్థానికులు రోగాల భారీన పడుతున్నారు. విషయాన్ని ఎన్ని సార్లు గురజాల ఎమ్మెల్యే కాసు కృష్ణా రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. స్థానికుల ఆందోళనతో ఎస్టేట్‌లో కలెక్టర్ పర్యటించారు. స్థానికుల సమస్యలు వినకుండా జిల్లా కలెక్టర్ వెళ్లిపోయారు. కలెక్టర్ తీరుకు వ్యతిరేకంగా స్థానికులు నినాదాలు చేశారు.

*రాజమండ్రిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై మురుగు నీరు పొంగి ప్రవహిస్తోంది. కంబాల చెరువు, శ్యామల సెంటర్, ఆదెమ్మదిబ్బ, రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ రహదారులు జలదిగ్బంధమయ్యాయి. వర్షం కారణంగా తెల్లవారుజాము నుంచి విద్యుత్ సరపరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.

*జహీరాబాద్‌లోని నిమ్జ్‌లో వెమ్ టెక్నాలజీ పరిశ్రమకు మంత్రి కేటీఆర్ (KTR) బుధవారం భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… రక్షణ రంగం పరిశ్రమల హబ్ హైదరాబాద్ అని అన్నారు. డిఫెన్స్ కారిడార్‌ను హైదరాబాద్ – బెంగళూర్ మధ్య ఏర్పాటు చేయాలని కోరినా కేంద్రం పట్టించుకోలేదని తెలిపారు. బుందేల్ ఖండ్‌కు అర్హతలు లేకున్నా… అధికారం చేతిలో ఉందనే డిఫెన్స్ కారిడార్‌ను కేంద్రం ఇచ్చిందని మండిపడ్డారు. మౌలిక వసతులు లేకుండా డిఫెన్స్ కారిడార్ ఇవ్వగానే పెట్టుబడులు తరలిరావన్నారు. ప్రగతిశీల రాష్ట్రం అయిన తెలంగాణ‌ను కేంద్రమే ప్రోత్సహించాలని మంత్రి అన్నారు.

*సంగారెడ్డి: జిల్లాలో నిమ్జ్ భూ బాధితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 35 మంది ఎల్గోయి, మామిడిగి వాసులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో రాయికోడ్ పోలీస్స్టేషన్ ఎదుట బాధిత కుటుంబాలు ఆందోళన చేపట్టాయి. జహీరాబాద్లో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా… రాయికోడ్ పోలీస్‌స్టేషన్ వద్ద భూ బాధితుల వీడియోలు చిత్రీకరించకుండా మీడియాను కూడా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై మీడియా ప్రతినిధులు మండిపడుతున్నారు.

*కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రిత్వ శాఖ నూతన భవనం ‘వాణిజ్యభవన్’ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గురువారం ప్రారంభించనున్నారు. ఉదయం జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా నేషనల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్ పోర్ట్ రికార్డ్ ఫర్ ఈయర్లీఅనాలసిస్ ఆఫ్ ట్రేడ్(ఎన్ఐఆర్ వై ఏటీ) పోర్టల్ ను కూడా ప్రధాని ఆవిష్కరించనున్నట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పోర్టల్ ద్వారా స్టేక్ హోల్డర్స్ కు ఒక వేదికలా ఇది ఉపయోగ పడుతుందని తెలిపారు.

*సీఎం వైఎస్ జగన్‌ను డీఎస్సీ1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు కలిశారు. ఉద్యోగాలు ఇవ్వడంపై సీఎంకు డీఎస్సీ98 అభ్యర్థులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడారు. డీఎస్సీ98లో అర్హత పొందిన వారికి ఉద్యోగం ఇస్తామని పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. 24 ఏళ్లనుంచి ఉన్న సమస్యను సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారని కొనియాడారు. 1998 డీఎస్సీ అభ్యర్థులు సీఎం జగన్‌కు రుణపడి ఉంటారని పేర్కొన్నారు.

* ప్రధాని బెంగళూరులో ఒకరోజు పాల్గొన్న కార్యక్రమాల కోసం బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) చేసిన ఖర్చు ఎంతో తెలుసా..? అక్షరాలా 23 కోట్ల రూపాయలు. ఇలా ఎందుకు ఖర్చు అయిందని ఆశ్చర్యపోతున్నారా…? ప్రధాని మోదీ బెంగళూరు నగరంలో ఏకధాటిగా పలు కార్యక్రమాల్లో నాలుగు గంటలపాటు పాల్గొన్నారు. ఇందుకో సం ప్రధాని సంచరించే మార్గాల్లో రహదారుల ఆధునికీకరణ కోసం ఆగమేఘాలమీద బీబీఎంపీ వారం ముందే రంగంలోకి దిగింది. రమారమి 14 కిలోమీటర్ల మేర ఫుట్‌పాత్‌లను, తారురోడ్లను వీధిదీపాలను ఏర్పాటు చేసింది. ప్రధాని ప్రయాణించే మార్గంలో రహదారులను అద్దంలా మెరిసేలా చేసేందుకు ఈ మొత్తాన్ని ఖర్చు చేసింది. ప్రధాని పర్యటన ఒక కారణమైనా ప్రజలకు ఈ రహదారులు నిత్యం ఉపయోగపడతాయని బీబీఎంపీ అధికారులు అంటున్నారు. ప్రత్యేకించి ప్రధాని ప్రయాణించిన మార్గంలో వీధి దీపాలకు ఆగమేఘాల మీద మరమ్మతులు చేశారు. నిన్నటివరకు చీకట్లో ఉన్న అనేక ప్రాంతాలు విద్యుద్దీపాల కాంతులతో ధగధగలాడాయి. ప్రధాని ప్రయాణించిన మార్గంలో గుంతల పూడ్చివేత, తారురోడ్డు, రహదారుల ఆధునికీకరణకు రూ.14 కోట్ల వరకు అయినట్టు తెలుస్తోంది. నగర స్వచ్ఛత ఇతరత్రా పనులకోసం రూ.9 కోట్ల దాకా ఖర్చు చేశారు. దీనిపై ఆమ్‌ ఆద్మీ పార్టీ స్పందిస్తూ ప్రధాని నెలలో ఒకసారి నగరంలో నాలుగుమూలలా సంచరిస్తే నగరంలోని అధ్వాన్న రోడ్లకు కొంతమేరకైనా విముక్తి లభిస్తుందని ట్వీట్‌ చేయడం గమనార్హం.

*అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా నేతృత్వంలో హైకోర్టులో యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జస్టిస్‌ మిశ్రా మాట్లాడుతూ.. నూతనోత్సాహాన్ని అందించే యోగాను ప్రతీఒక్కరూ నిత్యం ఆచరించాలన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జానకిరామిరెడ్డి, హైకోర్టు బార్‌ అసోసియేషన్లు అధ్యక్షుడు ఘంటా రామారావు, రిజిస్ట్రార్లు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
*ఈ ప్రపంచానికి భారత్‌ అందించిన గొప్ప సంపద యోగా అని, దీనికి ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉందని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ చెప్పారు. రాజ్‌భవన్‌లో యోగా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. 35 ఏళ్లుగా తాను యోగాను క్రమం తప్పకుండా అభ్యసిస్తున్నానని చెప్పారు.

*అగ్నిపథ్‌ పథకంతో దేశానికి, యువతకు ప్రమాదం ఉందని సీపీఐ రాజ్యసభ పక్ష నేత బినయ్‌ విశ్వం అన్నారు. విజయవాడ దాసరి భవన్‌లో మంగళవారం అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథి బినయ్‌ విశ్వం మాట్లాడుతూ అగ్నిపథ్‌ పథకాన్ని వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. నాలుగేళ్లు సైనికులుగా పనిచేసినవారు తర్వాత ఏం చేయాలని ప్రశ్నించారు. బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ కలిసి మాజీ సైనికులను వినియోగించి మారణహోమం సృష్టించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ముప్పుతో వామపక్షాల తరఫున ప్రజలను చైతన్యవంతులను చేయాలని పిలుపునిచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రం సైనిక ఉద్యోగాలను నిర్వీర్యం చేస్తోందన్నారు. సైనిక వ్యవస్థను కార్పొరేట్‌ రంగానికి కట్టబెట్టే యత్నంగా ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఈనెల 24న అగ్నిపథ్‌పై ఆందోళనకు సంయుక్త కిసాన్‌ మోర్చా దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపునకు మద్దతు ఇస్తున్నామన్నారు.

*ఆధునికరక్షణ అవసరాలకు అనుగుణంగా భారత సైనికి బలాన్ని పెంచుకోవడం, శత్రు దేశాల కుట్రలను తిప్పికొట్టేందుకే అగ్నిపథ్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌ అన్నారు. దేశ రక్షణకు ఎంతో ఉపయుక్తమైన ఈ పథకాన్ని ప్రశంసించాల్సింది పోయి ప్రజల్లో అనేక అపోహలు కలిగించి, యువతను రెచ్చగొట్టేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీయేతర రాష్ట్రాల్లోనూ, ప్రతిపక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు కొన్ని రాజకీయ శక్తులు పూనుకున్నాయని అన్నారు. ‘‘మన దేశంలో ఉన్న సైనికుల సగటు వయస్సు ఇతర దేశాల సగటు వయస్సుతో పోల్చితే ఎంతో తక్కువ. సమర్థవంతంగా, చురుకుగా యుద్ధరంగంలో దూకి వేగంగా ప్రత్యర్థిపై దాడి చేయగల శక్తి కలిగిన వారు సైన్యంలో తగ్గిపోతున్నారు. మన దేశంలో ప్రతి డివిజన్‌లో ఇలాంటి వారు 8,829 మంది ఉంటే పాకిస్తాన్‌లో 2,307 మంది ఉన్నారు.

*రైల్వే ఏడీజీ కుమార్‌ విశ్వజీత్‌ రచించిన ‘అతీత్‌ కా దామన్‌’ పుస్తకం తెలుగు (గతం నీడలు) అనువాదం మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇప్పటికే ఆయన రచించిన పలు పుస్తకాల్లో ‘ఆతంక్‌ వాద్‌’ అనే శోధ గ్రంధం.. ‘మా తుఝే సలామ్‌’ అనే దేశభక్తి గీతాల సంపుటి బాగా ప్రాచుర్యం పొందాయి.

*కొవిడ్‌తో మరణించిన ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు జాప్యం లేకుండా కారుణ్య నియామకాలపై ఆదేశాలు జారీచేయాలని ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం తాడేపల్లిలో సీఎం అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ నెలాఖరులోపు నియామకాల ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నా అమలుకావడం లేదని తెలిపారు. పాఠశాల విద్య, ఎయిడెడ్‌, మున్సిపల్‌, మోడల్‌ స్కూల్స్‌ తదితర సంస్థల్లో అవసరమైన ఖాళీలు లేనందున, ఇతర శాఖల్లో నియామకాలకు అవకాశం ఇవ్వాలని కోరారు.

*రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం పంపిన 14వ, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.7,660 కోట్లును రాష్ట్ర ప్రభుత్వం సొంత పథకాలకు వాడేసుకుందని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. సర్పంచ్‌ల చెక్కులపై సంతకాలు లేకుండా, గ్రామ పంచాయతీల తీర్మానాలు లేకుండా సర్పంచ్‌ల సీఎ్‌ఫఎంఎస్‌ ఖాతాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.7,660 కోట్లు తీసుకుందని కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌కు రాసిన లేఖలో వైవీబీ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల ఖాతాలు జీరో బ్యాలెన్స్‌ చూపించడంతో సర్పంచ్‌లు షాక్‌కు గురయ్యారన్నారు. కేంద్ర ప్రభుత్వం పంపించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడం.. 14వ, 15వ ఆర్థిక సంఘాల నిబంధనలకు, రాజ్యాంగ విరుద్ధమని, చట్ట వ్యతిరేకమని అన్నారు.

*హైదరాబాద్‌ నగర శివార్లలోని దుండిగల్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. బహదూర్‌పల్లిలో రోడ్డుపై బ్రేక్‌డౌన్‌ అయిన డీసీఎంను బైక్‌ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. మృతుడిని సంతోష్‌గా గుర్తించారు. సూరారం నుంచి గండిమైసమ్మ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

*కబ్జాలకు కేరా ఫ్‌గా వైసీపీ నేతలు మారిపోయారని టీడీపీ జాతీ య అధికార ప్రతినిధి పట్టాభిరాం ఆరోపించారు. మంగళవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు ‘‘రాష్ట్రంలో ఎవరు ఎక్కడ కబ్జా చేసినా చర్యలు తప్పవని చెప్పిన సీఎం జగన్‌రెడ్డికి వైసీపీ నేతలు చేసే కబ్జాలు, అక్రమాలు కనిపించవా? చర్యలంటూ మొదలుపెడితే ముందు పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోనే కొనసాగించాలి. పెద్దిరెడ్డి నేతృత్వంలోనే కుప్పంలో అక్రమ మైనింగ్‌ జరుగుతోంది. విశాఖలో రుషికొండకు గుండు కొట్టినట్టు, జీడీ నెల్లూరులో గుట్టలు మింగేస్తున్నారు. పీలేరులో రూ.400 కోట్ల విలువైన భూమి కబ్జా చేశారని మా పార్టీ నేత నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి నిరూపిస్తే పట్టించుకున్న పాపాన పోలేదు. విదేశీ వ్యవహారాల సలహాదారు జ్ఞానేంద్రరెడ్డి బంధువులు 290 ఎకరా లు కబ్జా చేశారు. చివరికి అటవీ భూములను కూ డా వదిలిపెట్టడం లేదు. ఒకప్పుడు జిరాక్స్‌ షాపు నడుపుకునే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నేడు రూ.కోట్లకు పడగలెత్తాడు’’ అని విమర్శించారు.

*పాఠశాలల పునఃప్రారంభాన్ని ప్రభుత్వం ఒక రోజు వాయిదా వేసింది. జూలై 4న బడులు తెరుస్తారని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే, అదేరోజున రాష్ర్టానికి ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో ఆ తర్వాతి రోజు(5న) పాఠశాలలు పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని విద్యాశాఖ మంత్రి తెలిపారని ఉపాధ్యాయ సంఘాలు వెల్లడించాయి. అయితే, పాఠశాల విద్యాశాఖ మాత్రం దీనిపై ఎలాంటి ఉత్తర్వులూ విడుదల చేయలేదు.

*రాష్ట్రంలో వచ్చే ఎన్నికలు డబ్బుకి, వ్యక్తిత్వానికి మధ్య జరిగేవని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో మంగళవా రం జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రజల సంపదను దోచుకుని ఆ ధనంతో రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలవాలని వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మూడేళ్ల వైసీపీ పాలనలో ప్రజాస్వామ్య విలువలను గాలికి వదిలేశారు. వైసీపీ సీఎం జగన్‌కు, ఆయన భార్య కు ఉండేందుకు అన్ని ప్యాలె్‌సలు ఎందుకు? ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాన ని, అమరావతినే రాజధానిగా ఉంటుందని జగన్‌ చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిలో దోచుకోవడానికి ఏమి లేకపోవడంతో మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు’’ అని యనమల ఆరోపించారు.

*డీఎస్సీ 2018 నోటిఫికేషన్‌ ద్వారా ఎంపికైన స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థుల తాత్కాలిక ప్రాధాన్య జాబితాను జిల్లాలకు పంపించారు. ఈ జాబితాను క్రీడాప్రాధికార సంస్థ (శాప్‌) వెబ్‌సైట్‌లో ఉంచారు. జాబితాపై అభ్యర్థుల నుంచి ఏమైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే శాప్‌ ఎండీకి మెయిల్‌ చేయాలని సూచించారు. అయితే ఇప్పటికైనా ఈ నియామకాల ప్రక్రియ ఓ కొలిక్కి వస్తుందా? అనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో వెలువడిన 2018 డీఎస్సీలోని అన్ని కేటగిరీల ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ పూర్తయిపోయింది. కానీ స్పోర్ట్స్‌ కోటాలో ఎంపికైన అభ్యర్థులకు మాత్రం ఇప్పటివరకు పోస్టింగులు ఇవ్వలేదు. ఈ కోటా కింద ఉన్నవే తక్కువ పోస్టులు. కానీ ఇప్పటివరకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్‌ ఇవ్వలేదు. వీరి స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లను ఒకసారి శాప్‌ పరిశీలించింది. ఆ తర్వాత జిల్లా విద్యాశాఖాధికారులు కూడా పరిశీలించారు. ఆ తర్వాత ఇవన్నీ కాదు.. మళ్లీ శాప్‌ పరిశీలించాలన్నారు. ఇప్పుడదీ పూర్తిచేసి తాత్కాలిక ప్రాథమిక జాబితాను విడుదల చేశారు. అయిత త్వరలోనే పాఠశాలలు తెరవనున్నారని అప్పటికైనా ఈ పోస్టులు భర్తీ చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

*సీఎం జగన్‌, ఆయన సతీమణి భారతికి వాటా ఉన్న సరస్వతీ పవర్‌కు మైనింగ్‌ లీజ్‌ పునరుద్ధరణకు అనుమతిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ అప్పీల్‌ వేసేందుకు అనుమతించాలని ఎంపీ రఘురామకృష్ణం రాజు హైకోర్టును కోరారు. ఈ క్రమంలో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం, పిటిషనర్‌ కుమ్మక్కై కోర్టు నుంచి తమకు అనుకూలంగా ఉత్తర్వులు పొందడం న్యాయస్థానాన్ని బాధితురాలిని చేయడమేనని వ్యాఖ్యానించింది. ఆ సందర్భంలో థర్డ్‌ పార్టీ.. సంబంధిత ఉత్తర్వులను సవాల్‌ చేయవచ్చా? లేదా? అనేది తేల్చాల్సి ఉందని పేర్కొంది. థర్డ్‌ పార్టీ అప్పీల్‌ అర్హతపై అధ్యయనం చేసి వాదనలు వినిపించాలని ఇరుపక్షాల న్యాయవాదులకు సూచించింది. విచారణను జూలై 20కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది.

*పాతబస్తీలో ఓ మహిళా తహసీల్దార్‌పై చేతబడికి యత్నించారన్న వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. నగరంలోని ఓ మండల మహిళా తహసీల్దార్‌ చిత్రపటం క్షుద్రపూజలు చేసిన స్థలంలో లభ్యం కావడంతో కలకలం రేగింది. ఈనెల 17న మధ్యాహ్నం ఓ వ్యక్తి బార్క్‌సలోని బడా శ్మశానవాటికలో బంధువు సమాధికి పూలు సమర్పించడానికి వెళ్లాడు. అక్కడ సమాధిపై క్షుద్ర పూజలు జరిగినట్లుగా ఆనవాళ్లు, కొన్ని వస్తువులు కనిపించాయి. వెంటనే అతను ఓ వ్యక్తిసాయంతో సమాధిపై ఉన్న మూటను తీసుకుని ఇంటికి వెళ్లాడు. మూటను తెరవగా అందులో పలు వస్తువులతోపాటు మహిళా తహసీల్దార్‌కు చెందిన చిత్రపటం కనిపించింది. దాని వెనక ఉర్దూ, అరబీలో రాసిన పదాలున్నాయి. దీంతో మహిళా తహసీల్దార్‌పై చేతబడికి పూనుకున్నారనే వార్త సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది.

*మూడో రోజు కూడా వర్షం కురవడంతో పలు రోడ్లు జలమయమయ్యాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా చెన్నై సహా 21 జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని నగరం చెన్నైలో గత ఆదివారం నుంచి రాత్రి వేళల్లో ఉరుములు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షం కురుస్తోంది. మంగళవారం ఉదయం ఆకాశం మేఘావృతంగా మారి మధ్యాహ్నం ఒక్కసారిగా దట్టమైన మబ్బులు కమ్ముకుని భారీ వర్షం కురిసింది. కోడంబాక్కం, వడపళని, కోయంబేడు, ప్యారీస్‌, పెరంబూర్‌, టి.నగర్‌, సైదాపేట, మైలాపూర్‌, అన్నానగర్‌ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పాఠశాలలు వదిలే సమయం కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టి.నగర్‌ హబీబుల్లా రోడ్డుపై నీరు చేరడంతో వాహనచోదకులు అవస్తలు పడ్డారు. రోడ్లపై నిలిచిన నీటిని తొలగించే పనులను కార్పొరేషన్‌ సిబ్బంది చేపట్టారు.

*అప్ఘానిస్థాన్‌, పాకిస్థాన్‌ దేశాలను బుధవారం వచ్చిన భూకంపం వణికించింది.రెండు దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది.ఆగ్నేయ అప్ఘానిస్థాన్‌లోని ఖోస్ట్ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో 51 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని యూఎస్‌ జియోలాజికల్ సర్వే తెలిపింది.ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో నమోదైందని యూఎస్‌ పేర్కొంది. ఈ భూకంపం ప్రభావం వల్ల ఇప్పటివరకు ఆస్తి నష్టం, మరణాల గురించి తక్షణ సమాచారం లేదు.పాకిస్థాన్, అప్ఘానిస్థాన్ దేశాల్లోని 119 మిలియన్ల మంది ప్రజలు ఈ భూకంపం బారిన పడ్డారని యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. ఇస్లామాబాద్‌తో పాటు పాక్ దేశంలోని ఇతర ప్రాంతాల్లో స్వల్ప తీవ్రతతో భూకంపం సంభవించినట్లు పాకిస్థాన్ అధికారులు పేర్కొన్నారు.

*కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం కొత్తగా 403 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 400 పైచిలుకు కేసులు నమోదవ్వడం నాలుగు నెలల తర్వాత ఇదే తొలిసారి. గత ఫిబ్రవరి 19న 401 కేసులు వచ్చాయి. కాగా, ఇటీవలే పాఠశాలలు పునఃప్రారంభం కాగా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 26,704 కొవిడ్‌ టెస్టులు చేయగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,375కు చేరింది. కొత్తగా నమోదైన 403 కేసుల్లో హైదరాబాద్‌లోనే 240 పాజిటివ్‌లు ఉన్నాయి. రంగారెడ్డిలో 103, మేడ్చల్‌లో 11, కేసులొచ్చాయి. మరోపక్క, రోజువారీ కొవిడ్‌ వ్యాప్తి రేటు 1.57 శాతానికి చేరగా, ఇది ప్రమాదానికి సూచనని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాలు నమోదు కాకపోవడం ఊరట కలిగించే అంశం. మరోపక్క, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి మంగళవారం 16,190 మంది కరోనా టీకా తీసుకున్నారు.

*రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ వర్శిటీలను పట్టించుకోకుండా.. ప్రైవేట్‌ వర్శిటీలకు ఎందుకు అనుమతులు ఇస్తున్నారని ఆమె ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో రాణిరుద్రమ మంగళవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులదే కీలకపాత్ర అనిఅదే స్పూర్తితో బాసర విద్యార్థులు పోరాటం చేశారని పేర్కొన్నారు.

*డీఎస్సీ 2018 నోటిఫికేషన్‌ ద్వారా ఎంపికైన స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థుల తాత్కాలిక ప్రాధాన్య జాబితాను జిల్లాలకు పంపించారు. ఈ జాబితాను క్రీడాప్రాధికార సంస్థ (శాప్‌) వెబ్‌సైట్‌లో ఉంచారు. జాబితాపై అభ్యర్థుల నుంచి ఏమైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే శాప్‌ ఎండీకి మెయిల్‌ చేయాలని సూచించారు. అయితే ఇప్పటికైనా ఈ నియామకాల ప్రక్రియ ఓ కొలిక్కి వస్తుందా? అనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో వెలువడిన 2018 డీఎస్సీలోని అన్ని కేటగిరీల ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ పూర్తయిపోయింది. కానీ స్పోర్ట్స్‌ కోటాలో ఎంపికైన అభ్యర్థులకు మాత్రం ఇప్పటివరకు పోస్టింగులు ఇవ్వలేదు. ఈ కోటా కింద ఉన్నవే తక్కువ పోస్టులు. కానీ ఇప్పటివరకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్‌ ఇవ్వలేదు. వీరి స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లను ఒకసారి శాప్‌ పరిశీలించింది. ఆ తర్వాత జిల్లా విద్యాశాఖాధికారులు కూడా పరిశీలించారు. ఆ తర్వాత ఇవన్నీ కాదు.. మళ్లీ శాప్‌ పరిశీలించాలన్నారు. ఇప్పుడదీ పూర్తిచేసి తాత్కాలిక ప్రాథమిక జాబితాను విడుదల చేశారు. అయిత త్వరలోనే పాఠశాలలు తెరవనున్నారని అప్పటికైనా ఈ పోస్టులు భర్తీ చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

*లింగసముద్రంలోని కేజీబీవీ విద్యాలయంలో 2022-23 విద్యా సంవత్సరానికి జూనియర్‌ ఇంటర్‌లో ప్రవేశాలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన ట్లు ప్రత్యేకాధికారి జ్యోతి తెలియజేశారు. జూనియర్‌ కళాశాల మంజూరు చేస్తూ హెచ్‌ఈసీ గ్రూపులో మాత్రమే ప్రవేశాలకు ఉత్తర్వులు ఇచ్చినట్లు ఆమె తెలిపారు. విద్యార్థినులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

*శ్రీకాకుళం: జిల్లాలోని ఉద్దానంలో జనంపై దాడిచేసిన ఎలుగుబంటి మృతి చెందింది. విశాఖకు తరలిస్తుండగా ఎలుగుబంటి మృతిచెందినట్లు అటవీ అధికారులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ఎలుగుబంటిని ఆస్పత్రికి తరలించారు. ఎలుగుబంటికి వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. తీవ్ర గాయాలతో ఎలుగుబంటి చనిపోయినట్లు వైద్యుల నిర్థారించారు.

*పల్నాడు: జిల్లాలోని సత్తెనపల్లి మండలం వెన్నేదేవి గ్రామంలో దారుణఘటన చోటుచేసుకుంది. కూతురుపై వేట కోడవలితో బాబాయ్ కోటయ్య దాడికి పాల్పడ్డాడు. ఆస్తి గోడవల నేపథ్యంలో రోడ్డుపై దాడి చేశాడు. బాధితురాలు కోటమ్మ (45)ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. 30సెంట్లు స్థలం వద్ద వివాదం చోటుచేసుకుంది. గ్రామస్థుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనకు సంబంధించి వివరాలను అడిగితెలుసుకున్నారు. కేసు ననమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

*నాగర్‌కోయిల్‌-కాచిగూడ(16354) రైలును జూన్‌ 2 నుంచి.. కాచిగూడ-నాగర్‌కోయిల్‌ వీక్లీ రైలు(16353)ను జూన్‌ 3 నుంచి పునరుద్ధరిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. అలాగే.. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌- శ్రీమాతా వైష్ణో దేవి కాట్రా(16031) జులై 3నుంచి, శ్రీమాతా వైష్ణో దేవి కాట్రా-ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ వీక్లీ రైలు(16032)ను జులై 5 నుంచి నడుతామని పేర్కొన్నారు.

*ఇస్రో యువికా ప్రొగ్రాంకు హాజరైన తెలంగాణ విద్యార్థులు, పలువురు యువ శాస్త్రవేత్తలతో ఈ నెల 27న సంభాషణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌, ట్రైనింగ్‌ మండలి తెలిపింది. ఈ మేరకు టీఎ్‌ససీఈఆర్టీ డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు హైదరాబాద్‌, జూబ్లీహిల్స్‌లోని అంబేద్కర్‌ వర్సిటీలో జరుగుతుందని, టీ-సాట్‌ ద్వారా ప్రసారం అవుతుందని వెల్లడించారు.

*తెలంగాణ ఉద్యమం విజయవంతమైన తర్వాత, జరిగిన కొన్ని మంచి పనుల్లో ఒకటి… కొన్నేళ్లుగా పరాధీనమైన ఈ నేల చరిత్రను తిరిగి పొందే ప్రయత్నం బలంగా కొనసాగుతుండ డం’’ అని ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌ హర్షం వ్యక్తం చేశారు. డా. రియాజ్‌ రచించిన ‘తెలంగాణ చరిత్ర – సంస్కృతి – ఉద్యమం’ తెలుగు, ఆం గ్ల పుస్తకాలను మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగా ణ సాంస్కృతిక, రాజకీయ, ఉద్యమ చరిత్రమీద కొన్నివందల, వేల పుస్తకాలు వెలువడాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు. తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు ఆచార్య కోదండరాం మాట్లాడుతూ ఉద్యమ ఆకాంక్షలో ప్రధానమైన ఉద్యోగ అవకాశాల కల్పన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా సాకారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

*రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని బురదనీరు సరఫరా కాకుం డా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు అధికారులు యుద్ద ప్రాతిపదికన ఫిల్టర్‌బెడ్‌లో పనులను చేపట్టారు. పట్టణ సమీపంలోని కరకవాగు ఫిల్టర్‌బెడ్‌లో ఎప్పుడో సుమారు 20 సంవత్సరాల క్రితం చేపట్టిన పనులకు అధి కారులు ఇప్పుడు తాజాగా మరోసారి చేపట్టారు. మున్సిపల్‌ జనరల్‌ఫండ్‌ నిధులు రూ. 30లక్షల వ్యయంతో చేపట్టిన పనులు 20 రోజులకుపైగా సాగుతున్నాయి.

*తెలంగాణలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 403 కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం 7,69,704 కేసులు నమోదు కాగా, కరోనా వైరస్‌తో 4,111 మరణించారు. కరోనా కేసులు పెరుగుతున్నాయి.. అప్రమత్తంగా ఉండాలని, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ సూచించారు.

*అప్ఘానిస్థాన్‌ పాకిస్థాన్‌ దేశాలను బుధవారం వచ్చిన భూకంపం వణికించింది.రెండు దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది.ఆగ్నేయ అప్ఘానిస్థాన్‌లోని ఖోస్ట్ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో 51 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని యూఎస్‌ జియోలాజికల్ సర్వే తెలిపింది.ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో నమోదైందని యూఎస్‌ పేర్కొంది. ఈ భూకంపం ప్రభావం వల్ల ఇప్పటివరకు ఆస్తి నష్టం, మరణాల గురించి తక్షణ సమాచారం లేదు.పాకిస్థాన్, అప్ఘానిస్థాన్ దేశాల్లోని 119 మిలియన్ల మంది ప్రజలు ఈ భూకంపం బారిన పడ్డారని యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. ఇస్లామాబాద్‌తో పాటు పాక్ దేశంలోని ఇతర ప్రాంతాల్లో స్వల్ప తీవ్రతతో భూకంపం సంభవించినట్లు పాకిస్థాన్ అధికారులు పేర్కొన్నారు.
*కేరళలో సంచలనం సృష్టించిన బంగారం స్మగ్లింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో ముఖ్యమంత్రి కు టుంబ సభ్యుల పాత్ర ఉందని అందువల్ల సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్‌ ప్రధానికి లేఖ రాశారు. స్మగ్లింగ్‌లో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ఎం.శివశంకర్‌కు ముఖ్యమంత్రికి ఆయన భార్య కుమార్తెలకు ప్రమేయం ఉందని ఆరోపించారు. వారి ప్రయోజనాల కోసం తనను బలిపశువును చేశారని తెలిపారు. దారుణమైన ఈ స్మగ్లింగ్‌కు ఐఏఎస్‌ అధికారి శివశంకరే కారణమని ఆరోపించారు.

* కృష్ణాజిల్లా మచిలీపట్నం.మూఢుస్థంబాల సెంటర్లో హత్యాయత్నం.బీరు సీసాలతో దాడి చేసిన ప్రత్యర్ధులు గాయపడిన వ్యక్తి ఆవుల ఫణి కుమార్ (26), పాతరామన్నపేటకు చెందిన వ్యక్తిగా గుర్తింపు. నడుములో బీరుసీసాతో పొడిచినట్లుగా తెలుస్తుంది.మూడు స్తంభాల సెంటర్లో వైన్ షాపు వద్ద జరిగిన ఘర్షణలో గాయపడినట్లు సమాచారం.స్నేహితులు బైకుపై ఆసుపత్రికి తీసుకు వచ్చి చికిత్స చేయిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ రిఫరల్ చేసిన వైద్యులు.

* తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు సమర్పించిన దేశవ్యాప్తంగా గల కేజీబీవీ హాస్టల్ అన్యాక్రాంతం కాకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామని టీటీడీ ఏర్పాటుచేసిన ల్యాండ్ కమిటీ చైర్మన్ రిటైర్డ్ జడ్జి శ్రీధర్ రావు తెలిపారు. జెఈఓ సదా భార్గవి నేతృత్వంలో ఈ విభాగంలో ప్రత్యేక అధికారి మల్లికార్జున ఇతర అధికారులు కమిటీ సూచనలను అమలు చేశారని దేశవ్యాప్తంగా గల 970 ఆస్తులను ప్రత్యక్షంగా పరిశీలించి రక్షణ చర్యలు చేపట్టాలని ప్రశంసించారు తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథిగృహంలో మంగళవారం ల్యాండ్ కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా జస్టిస్ కె శ్రీధర్ రావు మాట్లాడుతూ 2021 జనవరి 21న కమిటీ మొదటి సమావేశం జరిగిందన్నారు.ఈ ఓటింగ్ సంవత్సర కాలంలో 29 ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన రూ.23 కోట్ల విలువైన 20.45 ఎకరాలను టీటీడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. 109 ఆస్తులను టీటీడీ లీజుకు ఇవ్వడం వల్ల రూపాయలు 4 .15 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు.

* టర్ ఫలితాలు విడుదల. రికార్డ్ స్థాయిలో 28 రోజుల్లోనే ఫలితాలు ప్రకటన. ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల. ఫస్టియర్, సెంబర్ ఇయర్ కలిపి పరీక్షలు రాసిన 10 లక్షల మంది విద్యార్థులు. ఫస్టీయర్‌లో 54 శాతం ఉత్తీర్ణత. సెకండ్ ఇయర్‌లో 61 శాతం మంది పాస్. ఫస్టీయర్ లో బాలురు 49 శాతం , బాలికలు 60 శాతం పాస్. సెకండర్ ఇయర్‌లో బాలికలు 68 శాతం పాస్. ఉత్తీర్ణతలో బాలికలదే పై చేయి. ఏపీ ఇంటర్ .. జూన్ 25 నుంచి జూలై 5వ తేదీ. వరకు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫీజులు చెల్లింపులు . ఆగస్టు 3 నుంచి 12వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్లలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ/బెటర్మెంట్ పరీక్షలు.

*కృష్ణాజిల్లా మచిలీపట్నం ..కాలేజి పై నుండి దూకి ఆత్మహత్య యత్నం చేసుకున్నట్లు సమాచారం. నడుము, కాళ్ళు,చేతులు విరిగడంతో హుటాహుటిన విజయవాడ ఆసుపత్రికి తరలింపు. కారణాలు, విద్యార్థి వివరాలు తెలియాల్సి ఉంది.