DailyDose

అంతర్రాష్ట్ర దొంగను పట్టించిన హైదరాబాద్‌ బిర్యానీ – TNI నేర వార్తలు

అంతర్రాష్ట్ర దొంగను పట్టించిన హైదరాబాద్‌ బిర్యానీ  – TNI  నేర వార్తలు

*చాదర్‌ఘాట్‌ నగరంలో ఇంటి తాళాలను పగులగొట్టి విలువైన నగలు, నగదు దోచుకెళ్లే అంతర్రాష్ట్ర దొంగను హైదరాబాద్‌ బిర్యానీ పట్టించింది. అదెలా అనుకుంటున్నారా.. మలక్‌పేట పోలీ్‌సస్టేషన్‌లో తూర్పు మండలం అదనపు డీసీపీ శ్రీనివా్‌సరెడ్డి ఆ వివరాలను గురువారం వెల్లడించారు. మలక్‌పేట పరిధిలోని వెంకటాద్రినగర్‌ కాలనీలో నివాసముంటున్న కారు మెకానిక్‌ సయ్యద్‌ ఇఫ్తేకారుద్దీన్‌ మే 14న ఇంటికి తాళం వేసి నగరంలోని తన మామ ఇంటికి వెళ్లి వచ్చాడు. ఇంటి తాళాలు పగిలి ఉన్నట్లుగా గుర్తించి మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన క్రైంపోలీసులు చోరీ జరిగిన ఇంటి సమీపంలో నమోదైన మొబైల్‌ కాల్‌ డేటాను సేకరించారు. మొబైల్‌ నంబర్‌పై కూపీ లాగి నిందితుడిని కర్ణాటకలోని మైసూర్‌ హలే కేసరేలో నివాసముంటున్న సయ్యద్‌ ఐజాజ్‌ ఎలియాస్‌ ఇమ్రాన్‌ (27)గా గుర్తించారు. నగరంలో తాళం వేసిన ఇళ్లను గుర్తించి, తాళం పగులగొట్టి విలువైన నగలు, నగదును దోచుకొని పారిపోతాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే దోచుకున్న నగలు, నగదుతో తిరిగి వెళ్లే సమయంలో అతనికి ఇష్టమైన హైదరాబాద్‌ బిర్యానీని ఆరగించడం అలవాటు. పలు సందర్భాలలో మలక్‌పేట సోహైల్‌ హోటల్‌ నుంచి జొమాటో ద్వారా మెహదీపట్నంలోని ప్రైవేటు ట్రావెల్స్‌కు బిర్యానీ తెప్పించుకుని, ఆ ట్రావెల్స్‌ నుంచి బెంగళూరుకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకునేవాడు. వీటి లావాదేవీలు మొబైల్‌ నంబర్‌ ద్వారా జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. కాల్‌డేటా ఆధారంగా మలక్‌పేట క్రైం ఇన్‌స్పెక్టర్‌ నానునాయక్‌తో కూడిన క్రైం పోలీసుల బృందం బెంగళూరులో నిందితుడు సయ్యద్‌ ఐజాజ్‌ ఉన్నట్లుగా గుర్తించి పట్టుకున్నారు. అతడి నుంచి రూ.2.50లక్షలు, 85 గ్రాముల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి నగరంలో జరిగిన తొమ్మిది కేసులతో సంబంధమున్నట్లుగా గుర్తించారు. మలక్‌పేట ఏసీపీ వెంకటరమణ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో క్రైం ఇన్‌స్పెక్టర్‌ నానునాయక్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

*ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. పొలం వద్దకు వెళ్తున్న సోదరులు విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నాదమ్ములు.. ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుల్లో ఒకరు ఇంజినీరింగ్ పూర్తి చేసుకోగా.. మరో యవకుడు ఇంకా చదువుతున్నాడు. చేతికందివచ్చిన కుమారులిద్దరూ మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతంగా మారింది.

*చిత్తూరులో గురువారం రాత్రి 11 గంటల సమయంలో స్థానిక సంతపేటలోని మాజీ మేయర్, తెదేపా నగర అధ్యక్షురాలు కఠారి హేమలత అనుచరుడైన పూర్ణ ఇంట్లో గంజాయి ఉందంటూ సోదా చేశారు పోలీసులు. విషయం తెలిసి అక్కడికి వచ్చిన హేమలత తన అనుచరులతో కలిసి పోలీసు జీపు వెనుక బైఠాయించారు. అయినా జీపును రివర్స్‌ చేసి పోనివ్వమని సీఐ ఆదేశించారని, దీంతో వాహనం హేమలత కాళ్లపై నుంచి వెళ్లిపోయిందని ఆమె అనుచరులు ఆరోపించారు.

*విజయవాడలోని కృష్ణలంక ప్రాంతంలో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పొలాలకు వేసే గుళికల మందు ఇద్దరు పిల్లలకు ఇచ్చిన తల్లి.. అనంతరం తానూ తీసుకుంది. లారీ డ్రైవర్గా పని చేస్తున్న భర్త గోపాలకృష్ణ ఇంటికి వచ్చి చూసేసరికి భార్య, ఇద్దరు పిల్లలు విగతజీవులై కనిపించారు. ఆత్మహత్య చేసుకునే ముందు లక్ష్మి సూసైడ్ లేఖ రాసింది. తన భర్త మద్యానికి బానిసై తనను, తన పిల్లలను పట్టించుకోవట్లేదని సూసైడ్ లేఖలో లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది.

*తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని భాకరాపేట కనుమలో తిరుపతి-మదనపల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ, ద్విచక్ర వాహనం దగ్ధమయ్యాయి. ఓ లారీ కదిరి నుంచి నెల్లూరుకి మొక్కజొన్న పొట్టుతో వెళ్తుంది. భాకరాపేట కనుమ దారిలో దయ్యాలకోన వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. అనతంరం కొంతదూరం బైకును లాక్కెళ్లింది. ఈ క్రమంలో చెలరేగిన మంటల్లో రెండు వాహనాలు కాలిపోయాయి. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.

*వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఇద్దరు క్రికెట్‌ కోచ్‌లు సస్పెన్షన్‌కు గురయ్యారు. కడప క్రికెట్ అసోసియేషన్కు అనుబంధంగా నడుస్తున్న ప్రొద్దుటూరు సబ్ సెంటర్లో ఓ బాలిక క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటుంది. అయితే ఆ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో క్రికెట్ అసోసియేన్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇద్దరు కోచ్లను సస్పెండ్ చేసినట్లు ప్రొద్దుటూరు క్రికెట్ యూత్ క్లబ్ నాయకులు వెల్లడించారు. వారి స్థానంలో మహిళా కోచ్‌లను నియమించినట్లు తెలిపారు.

*పాతబస్తీకి చెందిన 17ఏళ్ల బాలిక నగరంలో ఉండే పెదనాన్న ఇంటికి తరచూ వెళుతూండేది. గత జనవరి నెలలో ఆ బాలికపై పెదనాన్న కుమారుడు(36) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన అతడి స్నేహితుడు కూడా ఆ బాలికను భయపెట్టి అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి ఇద్దరూ పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇటీవల బాలిక ఆరోగ్యం కాస్త నలతగా ఉండడంతో.. ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆరునెలల గర్భవతని తెలిసింది. దీంతో తల్లిదండ్రులు ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పింది. పెదనాన్న కుమారుడు, అతని స్నేహితుడు పలుమార్లు అత్యాచారం చేశారని తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

*శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో చోరీ జరిగింది. మూడు హుండీలను పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు నగదును ఎత్తుకెళ్లారు. నగదుతో పాటు సీసీ ఫుటేజ్‌కు సంబంధించిన హార్డ్ డిస్క్‌ లను సైతం దొంగలు ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

* అమలాపురంలో కిలాడీ లేడీ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 16న భీమనపల్లి నుండి అమలాపురం వస్తు ఉండగా ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ బ్యాగ్‌ను కిలాడి లేడీ దొంగిలించింది. అమలాపురం పట్టణ పోలీస్టేషన్‌లో బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దొంగను పట్టుకున్నారు. మహిళా దొంగ నుండి రూ.7.5 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు పట్టణ సీఐ కొండలరావు తెలిపారు. తిరుపతికి చెందిన కోయ లక్ష్మీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ వెల్లడించారు.

*ఖమ్మం: జిల్లాలో డ్రగ్స్ కలకలం రేగింది. ఇద్దరు యువకుల నుంచి 10 గ్రామలు డ్రగ్స్‌ పట్టుబడింది. అలాగే నిందితుల దగ్గర డ్రగ్స్‌తోపాటు గంజాయి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న ఎక్సైజ్‌ పోలీసులు ఎక్సైజ్‌ పోలీసులు ఇద్దరు యువకులను విచారిస్తున్నారు.

*రాష్ట్రంలో రహదారులు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది ద్విచక్రవాహనదారులు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదం పెళ్లింట విషాదం నింపింది. ఆగి ఉన్న లారీని ఓ ద్విచక్రవాహనం వేగంగా ఢీకొట్టిన ఘటనలో వరంగల్‌ జిల్లా ఇల్లంద గ్రామానికి చెందిన గడ్డల మధుకర్‌(22), జనగామ జిల్లా తమ్మడపెల్లి(ఐ)కి చెందిన గర్దాసి గణేష్‌(22) మరణించారు. మృతులిద్దరూ వరసకు అన్నదమ్ములు. మధుకర్‌ అన్న వివాహం రిస్పెషన్‌ కోసం కూరగాయాల కొనేందుకు వరంగల్‌ బయలుదేరిన వీరిద్దరూ ప్రమాదానికి గురయ్యారు. ఇక, మేడ్చల్‌ జిల్లా అవుశాపూర్‌ వద్ద ఓ ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ యువతి, ఇద్దరు యువకులు చనిపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. జనగాం జిల్లా సింగరాజుపల్లికి చెందిన పాలడుగు నవీన్‌(25), మేడ్చల్‌ జిల్లా కొత్తపల్లికి చెందిన దాసరి నవీన్‌(23) హైదరాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటున్నారు.

* పాతబస్తీకి చెందిన 17ఏళ్ల బాలిక నగరంలో ఉండే పెదనాన్న ఇంటికి తరచూ వెళుతూండేది. గత జనవరి నెలలో ఆ బాలికపై పెదనాన్న కుమారుడు(36) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన అతడి స్నేహితుడు కూడా ఆ బాలికను భయపెట్టి అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి ఇద్దరూ పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇటీవల బాలిక ఆరోగ్యం కాస్త నలతగా ఉండడంతో.. ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆరునెలల గర్భవతని తెలిసింది. దీంతో తల్లిదండ్రులు ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పింది. పెదనాన్న కుమారుడు, అతని స్నేహితుడు పలుమార్లు అత్యాచారం చేశారని తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

*పాతబస్తీకి చెందిన 17ఏళ్ల బాలిక నగరంలో ఉండే పెదనాన్న ఇంటికి తరచూ వెళుతూండేది. గత జనవరి నెలలో ఆ బాలికపై పెదనాన్న కుమారుడు(36) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన అతడి స్నేహితుడు కూడా ఆ బాలికను భయపెట్టి అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి ఇద్దరూ పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇటీవల బాలిక ఆరోగ్యం కాస్త నలతగా ఉండడంతో.. ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆరునెలల గర్భవతని తెలిసింది. దీంతో తల్లిదండ్రులు ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పింది. పెదనాన్న కుమారుడు, అతని స్నేహితుడు పలుమార్లు అత్యాచారం చేశారని తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది

* ఇంటర్‌ పరీక్ష తప్పామని మనస్తాపం చెంది ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు విద్యార్థులు, శ్రీసత్యసాయి జిల్లాలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం పుచ్చకాయలపల్లి గ్రామానికి చెందిన వజ్రాల అశోక్‌రెడ్డి (18) మార్కాపురంలోని ఒక ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదివాడు. బుధవారం విడుదలయిన ఫలితాల్లో అశోక్‌రెడ్డి ఫెయిలయ్యాడు. దీంతో మనస్తాపం చెందిన అతను గురువారం గ్రామ సమీపంలో ఉన్న సుంకేసుల డ్యాం వద్దకు వెళ్లి పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పెద్దహుల్తి గ్రామానికి చెందిన చాకలి చంద్రశేఖర్‌ (16) పత్తికొండ పట్టణంలోని ఏపీ మోడల్‌ స్కూల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదివాడు. ఫెయిల్‌ కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. గురువారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీసత్యసాయి జిల్లా ఓబుళదేవరచెరువు మండ లం ఉగ్గిరెడ్డిపల్లికి చెందిన శ్రీలత(16) స్థానికంగా ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదివింది. తన స్నేహితురాలితోపాటు అక్క ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులయ్యారని, తాను మాత్రం ఫెయిలయ్యాయని తీవ్ర మనస్తాపం చెందింది. స్థానికంగా ఉన్న అంజనేయస్వామి దేవస్థానం వద్దకు వెళ్లి అక్కడే ఉన్న బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.

*విజయవాడ నగరంలోని కృష్ణలంక బాలాజీ నగర్‌లో విషాదఘటన చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనకు కుటుంబ కలహాలే కారణమని ఆరోపణలు వస్తున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటనకు గల కారణాలను అడిగితెలుసుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

* కరోనా ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఆదేశించారు. టీకాలకు కొరత లేదని, అర్హులందరికీ బూస్టర్‌ డోసులు కూడా ఇవ్వాలని పేర్కొన్నారు. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో వెయ్యికిపైగా యాక్టివ్‌ కేసులున్నాయి. దేశంలో కొత్తగా 13,313 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 38 మంది చనిపోయారు.

* అగ్నిపథ్‌ పథకం దేశాన్ని తీవ్రం గా దెబ్బతీస్తుందని పరమ్‌వీర్‌ చక్ర అవార్డు గ్రహీత, కెప్టెన్‌ బనా సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల కాంట్రాక్టు అగ్నిపథ్‌ పథకం భారతీయ సైన్యాన్ని నాశ నం చేస్తుందని, పాకిస్థాన్‌, చైనాకు లబ్ధి కలిగిస్తుందని అన్నారు. ఆ పథకం వల్ల దేశం భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన ట్వీట్‌ చేశారు. ఆయన చేసిన ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. అనంతరం తన ట్వీట్‌ను ఆయన తొలగించారు. సియాచిన్‌ హీరోగా ఆయనకు పేరు ఉంది.

*మయన్మార్‌ పదవీచ్యుత నేత ఆంగ్‌సాన్‌ సూచీ (77) గృహ నిర్బంధం ఏకాంతవాస శిక్షగా మారింది! నైపీడాలోని ఓ జైలుకు ఆమెను తరలించినట్టు జుంటా ప్రభుత్వ అధికార ప్రతినిధి జామిన్‌తున్‌ వెల్లడించారు. క్రిమినల్‌ చట్టాల ప్రకారం సూచీని బుధవారం నుంచి జైలులో ఏ కాంతంగా ఉంచినట్టు వివరించారు. నిరుడు తిరుగుబాటులో పదవీచ్యుతురాలైన సూచీని.. నైపీడాలో గృహనిర్బంధంలో ఉంచారు.