ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై ఆక్రమణకు దిగిన తర్వాత పుతిన్ దేశం విడిచి ఎటూ వెళ్లలేదు. అయితే తొలిసారి రష్యా అధ్యక్షుడు విదేశీ టూర్‌కు వెళ్లనున్నారు. దానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. తజకిస్తాన్, తుర్కమెనిస్తాన్ దేశాలకు పుతిన్ వెళ్లనున్నట్లు సమాచారం. తజక్ రాజధాని డుషాన్బేలో అధ్యక్షుడు ఎమ్మోమాలి రెహ్మాన్‌ను పుతిన్ కలవనున్నట్లు అధికారులు తెలిపారు. అష్ఘాబాట్‌లో జరగనున్న కాస్పియన్ దేశాల నేతల సదస్సుకు కూడా హాజరవుతారు. దీంట్లో అజర్‌బైజాన్, కజకస్తాన్, ఇరాన్, తుర్కమెనిస్తాన్ దేశాలు ఉన్నాయి.
విదేశీ టూర్‌కు వెళ్లనున్న పుతిన్
