NRI-NRT

అమెరికాలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

అమెరికాలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

అమెరికాలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా జరిగింది. యూఎస్‌ఏ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స్వామి వారి కళ్యాణం తిరుమల నుంచి వచ్చిన టీటీడీ అర్చకుల చేతుల మీదుగా సంప్రదాయ బద్ధంగా జరిగింది. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ తరం పిల్లలకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పాటు ఆధ్యాత్మిక భావాన్ని కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యంగా స్వామి వారి వేడుకల్ని నిర్వహించగా..ప్రముఖ గాయని శోభారాజు తన గానంతో భక్తుల్ని అలరించారు.
a5
ఈ కార్యకార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు భువనేశ్, కన్వెన్షన్ కన్వీనర్ సుధీర్ బండారు, కిరణ్ పోశామ్, ఆంధ్ర ప్రభుత్వ ప్రతినిధులు రత్నాకర్ పండుగాయల,హరి ప్రసాద్ లింగాల, మేడపాటి వెంకట్, వైఎస్సార్‌సీపీ కన్వీనర్ రమేష్ రెడ్డి వల్లూరి తదితరులు పాల్గొన్నారు.
a4