Politics

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్పై పోటీ చేస్తా – TNI రాజకీయ వార్తలు

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్పై పోటీ చేస్తా  – TNI  రాజకీయ వార్తలు

*వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌పై పోటీ చేస్తానని.. భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ఈటల వెల్లడించారు. పశ్చిమ బంగాలో సువేందు అధికారి ఫలితం.. తెలంగాణలో పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తంచేశారు.మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీ చేస్తానన్నారు. సీఎం ఇలాకా గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ముందే చెప్పానన్న ఈటల.. ఇందుకోసం గజ్వేల్లో సీరియస్గా వర్క్ చేస్తున్నట్లు తెలిపారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మాటామంతిలో మాట్లాడిన ఆయన.. ఈ మేరకు వెల్లడించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈటల పేర్కొన్నారు. పశ్చిమ బంగాలో సువేందు అధికారి దృశ్యం.. తెలంగాణలో పునరావృతం అవుతుందని జోస్యం చెప్పారు. బంగాల్‌లో మాదిరిగానే ముఖ్యమంత్రిని ఇక్కడ ఓడించాలని వ్యాఖ్యానించారు.”గజ్వేల్ నుంచి పోటీ చేస్తా అని ముందే చెప్పాను. ఇందుకోసం గజ్వేల్‌లో సీరియస్‌గా వర్క్ చేస్తున్నా. కేసీఆర్‌ను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సువేందు అధికారి దృశ్యం తెలంగాణలో పునరావృతం అవుతుంది. బంగాల్‌లో మాదిరిగానే ముఖ్యమంత్రిని ఇక్కడ ఓడించాలి.

*అన్యాయాన్ని సరిదిద్దాం… సహజ మైత్రిని పునరుద్ధరించాం: దేవేంద్ర ఫడ్నవిస్
జరిగిన అన్యాయాన్ని సరిదిద్దామని, సహజ మైత్రిని పునరుద్ధరించామని బీజేపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ అన్నారు. సీఎం ఏక్‌నాథ్‌ షిండేతో కలిసి ఢిల్లీకి వచ్చిన ఆయన బీజేపీ కేంద్ర నేతలను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తన పార్టీ గతంలో తనను సీఎంగా చేసిందని, ప్రస్తుతం పార్టీ అవసరాలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. ‘దీనికి పెద్ద మనసుతో సంబంధం లేదు. నేను మా నాయకుల సూచనలన్నింటినీ పాటిస్తాను. ఏక్‌నాథ్‌ షిండే మా నేత, సీఎం. నేను షిండేతో ఉన్నాను. ఆయన నేతృత్వంలో మేం చాలా బాగా పని చేస్తాం’ అని అన్నారు.

*బీజేపీతో కలిసి వెళ్లాలని ఉద్ధవ్‌ను అభ్యర్థించాం: ఏక్‌నాథ్ షిండే
సహజ మిత్రపక్షమైన బీజేపీతో కలిసి వెళ్లాలని ఉద్ధవ్ ఠాక్రేను మూడు, నాలుగు సార్లు అభ్యర్థించినట్లు శివసేన తిరుగుబాటు నేత, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే తెలిపారు. మహా వికాస్‌ అఘాడీ (కూటమి)పై అసంతృప్తికి గురైన పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు ముందు ఉద్ధవ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని అన్నారు. బీజేపీ మద్దతులో సీఎం అయిన షిండే, రెండు రోజుల పర్యటనకు ఢిల్లీ వెళ్లారు. మంత్రి వర్గ విస్తరణపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి బీజేపీ కేంద్ర నేతలను కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌తోపాటు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. ప్రధాని మోదీతో కూడా వీరిద్దరు సమావేశం కానున్నారు.

*వైసీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన అచ్చెన్న
వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ నేత అచ్చెన్నాయుడు సూటిగా ప్రశ్నించారు. 56 కార్పొరేషన్లతో మూడేళ్లలో ఖర్చు చేసిందెంత? అని ప్రశ్నించారు. శనివారం అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ బీసీ సబ్‌ప్లాన్‌ నిధులు మళ్లించడం సామాజిక న్యాయమా? అని ప్రశ్నించారు. ఎస్సీ సబ్‌ ప్లాన్‌ ద్వారా మూడేళ్లలో ఖర్చు చేసిందెంత అని నిలదీశారు. 11,500 ఎకరాల అసైన్డ్‌ భూములు లాక్కొవడం న్యాయమేనా? అని ప్రశ్నించారు. మాజీ సీఎం చంద్రబాబు కాఫీ తోట పెంచితే.. జగన్‌ గంజాయి తోట పెంచారని దుయ్యబట్టారు. మైనార్టీ సంక్షేమ నిధులు రూ.1,483 కోట్లు మళ్లింపు నిజం కాదా? అని మరోసారి ప్రశ్నించారు. 10 మందికి పదవులిచ్చి వేలమందిని చంపడం సామాజిక న్యాయమా? అని అచ్చెన్నాయుడు సూటిగా ప్రశ్నించారు

*విద్యాలయాలకు నాణ్యమైన బియ్యాన్నే సరఫరా చేయాలి:Gangula
తెలంగాణలో సివిల్ సప్లైస్ ఉన్నతాధికారులు విద్యాలయాలకు అందిస్తున్న బియ్యంపై పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ని ర్ధిష్ట ఆదేశాలు జారీచేసారు. విద్యాలయాలు, గురుకులాలు ప్రారంభం కాబోతున్ననేపథ్యంలో గత మూడు నెలలుగా నిల్వ ఉన్న బియ్యం నాణ్యతను సివిల్ సప్లైస్ జేసీ, డీఎం, విద్యాశాఖకు చెందిన ఎంఈవోలు, ప్రిన్సిపాళ్లు, హెచ్ఎంలతో కలిసి పరీక్షించాలని ఆదేశించారు, తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న విద్యాలయాల్లో ఈ తనిఖీలు చేపట్టాలన్నారు, ఎక్కడైనా బియ్యం నాణ్యత సరిగా లేకపోతే వెంటనే వాటిని పాతబియ్యంతో మార్చి వేయాలని ఆదేశించారు. ఈ విధుల్లో ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు

*పోడుభూముల వివాదం త్వరగా పరిష్కరించాలి: Etala
పోడుభూముల వివాదం త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ (TRS) ప్రభుత్వం బ్రోకర్గా మారిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం వేల ఎకరాల భూమిని గుంజుకుని అమ్మకుంటుందని ఆరోపించారు. వారసత్వంగా వచ్చిన భూములను కూడా లాక్కుంటున్నారని దుయ్యబట్టారు. దళితుల కళ్లల్లో మట్టికొడుతున్నారని మండిపడ్డారు. లక్షల అసైన్డ్ భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ చేస్తున్నారని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు

*మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బుద్ధి లేదా?: Kalva
ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి కాదు జగన్ మోసపు రెడ్డి అని టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాల్వ శ్రీనివాసులుకు ఛాలెంజ్ వేసే సత్తా కాపు రామచంద్రరెడ్డికి లేదన్నారు. ‘‘మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బుద్ది లేదా… పోలీసులను అడ్డుపెట్టుకొని మమ్మల్ని ఆపుతావా? మమ్మలి అడ్డుకోవడం అంటే ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకున్నట్లే’’ అని అన్నారు. పట్టుదల తెగింపులో టీడీపీ కార్యకర్తలు ఎక్కడ వెనక్కి తగ్గరని స్పష్టం చేశారు. పోలీసులు ఇంత అన్యాయంగా అడ్డుకుంటున్నారని… న్యాయస్థానానికి పోయి పాదయాత్ర కార్యక్రమం చేపడుతామన్నారు. బీటీపీకి నీళ్లిచే పాలన రాబోతుందని.. చంద్రబాబు పాలన వస్తుంది బైరావని తిప్ప ప్రాజెక్ట్‌కు కృష్ణా జాలాలు తీసుకువస్తామని కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. కాల్వను అడ్డుకున్న పోలీసులు…జీడిపల్లి భైరవానితిప్ప ప్రాజెక్ట్ పనులు గత మూడు సంవత్సరాలుగా ముందుకు సాగని పరిస్థితి నెలొంది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం రైతులతో కలిసి గుమ్మగట్ట నుంచి బీటీ ప్రాజెక్టు వరకు పాదయాత్ర చేపట్టేందుకు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు సిద్ధమవగా… పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పాదయాత్రకు వెళ్తున్న కాల్వను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది

*వైసీపీ ఓటమిని ఎవ్వరూ ఆపలేరు: Tulasi reddy
మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలలో 95 శాతం అమలు చేశామని వైసీపీ ప్లీనరీలో ముఖ్యమంత్రి జగన్ చెప్పడం పచ్చి అపద్ధమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ‘‘బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత’’ అన్నట్లున్నాయ్ జగన్ వ్యాఖ్యలు అని మండిపడ్డారు. వాస్తవంగా 95 శాతం అమలు చేయలేదని… రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమిని ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు. వైసీపీ ప్లీనరీ సభను జగన్ భజన సభ, విజయమ్మ వీడ్కోలు సభ, వైసీపీ చివరి ప్లీనరీ సభగా చెప్పవచ్చన్నారు. తల్లిని అవమానపరిచిన తనయుడిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. వైసీపీ గౌరవాధ్యక్ష పదవి నుంచి అగౌరవంగా తొలగించారని తెలిపారు. ఇప్పటికైనా జగన్ భజన బృందానికి కనువిప్పు కలగాలని తులసిరెడ్డి హితవుపలికారు.

*కుటుంబ జోలికి వస్తే రెండింతలు స్పందిస్తాం: విజయసాయిరెడ్డి హెచ్చరిక
టీడీపీ నాయకులు వైసీపీ కుటుంబ సభ్యులు, వ్యక్తిగత వ్యవహారాల జోలికి వస్తే అంతకు రెండింతలు ప్రతిస్పందిస్తామని వైసీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికైనా కుటుంబాల జోలికి వెళ్లవద్దని, రాజకీయాలు రాజకీయాలుగానే చూడాలని సూచించారు. షర్మిల పార్టీకి మద్దతు తెలపడానికి విజయమ్మ వైసీపీ పార్టీ నుంచి వైదొలిగిందని అన్నారు. విజయమ్మ షర్మిల మద్దతు తెలుపడంలో తప్పేమిలేదని పేర్కొన్నారు.అవసరానికి వాడుకుని వైసీపీ పార్టీ నుంచి వదిలివేయడం ఏపీ సీఎం జగన్‌కు అలవాటే నని టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న అన్నారు. నిన్న చెల్లి, ఇవాళ కన్న తల్లిని బయటకు గెంటేశారని పేర్కొన్నారు. బాబాయి ను ఎవరైనా చంపగలుగుతారా, తల్లి, చెల్లిని ఎవరైనా దూరం చేస్తారా అని ప్రశ్నించారు. బాబు చేసిన ఈ వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి స్పందించారు

*మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బుద్ధి లేదా?: Kalva
ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి కాదు జగన్ మోసపు రెడ్డి అని టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాల్వ శ్రీనివాసులుకు ఛాలెంజ్ వేసే సత్తా కాపు రామచంద్రరెడ్డికి లేదన్నారు. ‘‘మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బుద్ది లేదా… పోలీసులను అడ్డుపెట్టుకొని మమ్మల్ని ఆపుతావా? మమ్మలి అడ్డుకోవడం అంటే ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకున్నట్లే’’ అని అన్నారు. పట్టుదల తెగింపులో టీడీపీ కార్యకర్తలు ఎక్కడ వెనక్కి తగ్గరని స్పష్టం చేశారు. పోలీసులు ఇంత అన్యాయంగా అడ్డుకుంటున్నారని… న్యాయస్థానానికి పోయి పాదయాత్ర కార్యక్రమం చేపడుతామన్నారు. బీటీపీకి నీళ్లిచే పాలన రాబోతుందని.. చంద్రబాబు పాలన వస్తుంది బైరావని తిప్ప ప్రాజెక్ట్‌కు కృష్ణా జాలాలు తీసుకువస్తామని కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు.

*KCR పాలనలో అందరికీ ఇబ్బందులే: విజయశాంతి
కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నేత విజయశాంతి తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను రాములమ్మ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తప్పుబడుతూ ఉంటారు. ‘‘తాజాగా డ్రైవర్‌ కం ఓనర్ల అద్దె కార్లకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులివ్వడం లేదు. నెలల తరబడి చార్జీ డబ్బులు పెండింగ్లో ఉన్నా… అస్సలు వారిని పట్టించుకోవట్లేదు, దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్లో ఇదే పరిస్థితి. యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ స్కీంను అది నుంచే కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోంది సుమారు 10వేల మంది డ్రైవర్లు… ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.30 కోట్ల కోసం ఎదురుచూస్తున్నరు. మంత్రులు, ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా వారు పట్టించుకున్న పాపాన పోలేదు. దాంతో వారి అవసరాలకి చేతిలో డబ్బుల్లేక కుటుంబం గడవడం కష్టంగా మారిందని వాపోతున్నరు. 2017 తర్వాత మంత్లీ చార్జీ పెంచకపోవడంతో గిట్టుబాటు కావడం లేదంటున్నరు’’ అని విజయశాంతి తెలిపారు.‘‘గవర్నమెంట్ ఆఫీసర్ల కోసం అద్దె వెహికిల్‌కు జిల్లాల్లో అయితే నెలకు రూ.33 వేలు, హైదరాబాద్‌లో రూ.34 వేలుగా రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణయించింది. అధికారులు నెల రోజుల వరకు 2,500 కిలోమీటర్లు తిప్పుకోవచ్చు. అంతకంటే ఎక్కువ తిరగడానికి వీల్లేదు. ఇలా తిరిగిన దానికి ప్రతీ నెలా హైర్‌ చార్జీలు చెల్లించాలి. కానీ చాలా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో నెలలు గడుస్తున్నా డ్రైవర్లకు అద్దె చార్జీలు మాత్రం ఇవ్వడం లేదు. కొన్ని డిపార్ట్మెంట్స్లో ఏకంగా ఏడాది దాటినా పైసలు పత్తా లేవు. కేసీఆర్… నువ్వు చేప్పే బంగారు తెలంగాణ అంటే ఇదేనా? ఏదో ఉపాధి ల‌భిస్తుంద‌ని అప్పో స‌ప్పో చేసి కార్లు కొంటే… వారికి ఇప్ప‌డు నెల గ‌డ‌వడమే క‌ష్టంగా మారింది. దీనికేం స‌మాధానం చెబుతావు కేసీఆర్? ఇప్పటికైన మొండి వైఖరి ప‌క్క‌న పెట్టి వారికి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించు. కేసీఆర్ స‌ర్కార్ చేసే అనాలోచిత నిర్ణ‌యాల‌ను తెలంగాణ స‌మాజం చూస్తునే ఉంది…. త్వరలోనే సారును, కారును షెడ్‌కు పంపించ‌డం ఖాయం’’ అని విజ‌యశాంతి హెచ్చరించారు.

*95 శాతం మేనిఫెస్టో అమలు చేశామని చెప్పడం అబద్ధం: Yanamala
జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో జరుగుతున్న వైసీపీ ప్లీనరి సమావేశాల నేపథ్యంలో యనమల ఇలా మాట్లాడారుఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?‘‘నవరత్నాల పేరుతో జగన్ ప్రజలను మోసగిస్తున్నాడు. సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేసింది రూ.లక్షా 50 వేల కోట్లు కాగా అప్పుగా తెచ్చిన రూ.5 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? వైసీపీ ప్లీనరీలో ఆత్మస్తుతి పరనింద తప్ప ప్రజాప్రయోగం లేదు. ప్లీనరీ కోసం ప్రజాధనం, ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం చేశారు. ప్లీనరీలో నిత్యావసరాల ధరల పెరుగుదల, పన్నుల పెంపు, సంపూర్ణ మధ్య నిషేధం, ఉద్యోగాల భర్తీ, మహిళలపై పెరిగిపోతున్న అఘాయిత్యాల గురించిన ప్రస్తావనే లేదు. 95 శాతం మేనిఫెస్టో అమలు చేశామని చెప్పడం పూర్తి అబద్దం’’ అని యనమల పేర్కొన్నారు.

*agan పార్టీ నుంచి అమ్మను తరిమేశాడు: చంద్రబాబు
సీఎం జగన్‌ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నగరిలో ఆయన రోడ్‌షో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజకీయాల కోసం జగన్‌ అందర్నీ వాడుకుని వదిలేశారని ధ్వజమెత్తారు. బాబాయ్‌ను చంపాడు.. అమ్మను పార్టీ నుంచి తరిమేశాడని దుయ్యబట్టారు. ఏం సాధించావని ప్లీనరీ పెట్టుకున్నావు జగన్‌ అని ప్రశ్నించారు. పోలీసులను పెట్టుకుని తిరగడం కాదని, నాడు ముద్దులు పెట్టినప్పుడు ఎలా తిరిగావో ఇప్పుడు అలా తిరుగుచూద్దామని హెచ్చరించారు. జనాగ్రహం ఏమిటో అప్పుడు జగన్‌కు తెలుస్తుందన్నారు. జగన్‌ మద్యంలో విషపదార్థాలు ఉన్నట్లు ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందని తెలిపారు. జే బ్రాండ్‌పై వైసీపీ (YCP) ప్లీనరీలో సమాధానం చెప్పాలని చంద్రబాబు సవాల్ విసిరారు. అరాచక పాలన పోవాలంటే తాను ఒక్కడినే పోరాడితే చాలదని, ప్రజలు అండగా నిలబడాలని, ఇంటికొకరు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

*ఫ్రెండ్లీ ప్రభుత్వం వైసీపీ సర్కార్కు సహకరించాలి: బొత్స
ఫ్రెండ్లీ ప్రభుత్వం వైసీపీ సర్కార్కు సహకరించాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ఉన్న ఖాళీ మైదానంలో ఏర్పాటు చేసిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తుందన్నారు. జాతీయ విద్యావిధానాన్ని అనుసరించి మార్పులు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రాథమిక విద్యా విధానంలో మార్పులను కొందరు హేళన చేస్తున్నారని, పోటీలో నిలబడలేని స్థితికి మన విద్యా విధానాన్ని గత పాలకులు తెచ్చారని విమర్శించారు.

*ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన సీఎం: వర్ల
ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రి వై.ఎ్‌స.జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్లీనరీలో ప్రతిపక్ష నేతను దూషించడానికే సమయం కేటాయించరని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగం పేలవంగా ఉందని విమర్శించారు. చంద్రబాబును నిందిస్తూ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. పతనావస్థలో ఉన్న రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ప్రస్తావించకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు. ప్రజా సమస్యలను చర్చించాలని, ప్రభుత్వ భవిష్యత్తు ప్రణాళికను తెలియజేయాలని వర్ల డిమాండ్‌ చేశారు.

*అన్నదాతను నిండా ముంచి.. రైతు దినోత్సవాలా?: సోమిరెడ్డి
‘‘రైతుల్ని నిండా ముంచేసి, మళ్లీ రైతు దినోత్సవాలు నిర్వహించడం దేనికి? అన్నదాతలకు తీరని అన్యాయం చేసిన వైసీపీ ప్రభుత్వానికి రైతు దినోత్సవం జరుపుకునే అర్హత లేదు’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ‘‘జగన్‌రెడ్డి మూడేళ్ల పాలనలో రైతులను కుప్ప కూల్చేశారు. ప్రభుత్వం వ్యవసాయాన్ని ముంచేసింది. దేశవ్యాప్తంగా అమలయ్యే అనేక వ్యవసాయ పథకాలను ఏపీలో లేకుండా చేసి, రైతులకు తీరని నష్టం చేశారు. మూడేళ్లలో రైతుల కోసం రూ.1.27 లక్షల కోట్లు ఖర్చు పెట్టామంటున్న ప్రభుత్వం అందులో రూ.50 వేల కోట్లు ధాన్యం కొనుగోలుకు ఖర్చు చేశామనడం విడ్డూరంగా ఉంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు మూడేళ్లలో ఎంత బడ్జెట్‌ కేటాయించారు? ఎంత ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని సోమిరెడ్డి డిమాండ్‌ చేశారు.

*విద్యార్థులు రోడ్డెక్కే పరిస్థితి తేవొద్దు: లక్ష్మీనారాయణ
స్కూళ్ల విలీనానికి వ్యతిరేకంగా విద్యార్థులు రోడ్డెక్కే పరిస్థితి తీసుకురావొద్దని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జగన్ సర్కారును కోరారు. పిల్లలు సమీప పాఠశాలల్లో చదువుకునే పరిస్థితి ఉండాలని, పరీక్షలు రాయాలి.. మార్కులు సంపాధించాలనే విధానం సరైందికాదన్నారు. ఏపీలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

*‘అమ్మఒడి’ నుంచి తప్పించుకోడానికా ?: నాగబాబు
ఏపీలో పాఠశాలల విలీనంపై జనసేన పీఎసీ సభ్యుడు నాగబాబు స్పందించారు. జగన్ సర్కారు తీరును ఎండగట్టారు. జగన్ 8 వేలకు పైగా స్కూళ్లకు తాళాలు వేసి భావి భారత పౌరులకు విద్యను దూరం చేస్తున్నారని విమర్శించారు. ఇలా చేయడం అమ్మఒడి ఫథకం నుంచి తప్పించుకోవడానికా ?..లేక టీచర్‌ పోస్టుల సంఖ్య తగ్గించడానికా అని ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలోనే ఇప్పటికే 711 స్కూళ్లను మూసేశారని చెప్పారు. బడి కోసం పిల్లలను రోడ్డుపై కూర్చోపెట్టిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు.

*నిత్యావసరాల ధరల పెరుగుదలకు కారణం కేంద్ర ప్రభుత్వమే : బుగ్గన
ఏపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి వైసీపీ ప్లీనరీలో మాట్లాడారు. కరోనాకు తెగించి రాష్ట్రం కోసం ఢిల్లీ వెళ్లి డబ్బులు తెచ్చామని చెప్పారు. అమ్మఒడి, వసతిదీవెన, నాడు-నేడు వద్దని ప్రతిపక్షాలు చెప్పగలవా? అని ప్రశ్నించారు. పెట్రో ధరలు దేశవ్యాప్తంగా పెరిగాయని, నిత్యావసరాల ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వమే కారణమని పేర్కొన్నారు. ఏపీలో మద్యం ధరలు ఎక్కువేనని అంగీకరించారు. రాజధానికి గత ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.2 వేల కోట్లేనని చెప్పారు. ఉపాధి పనులకు నిధులు చెల్లిస్తున్నామని చెప్పిన బుగ్గన కోవిడ్ సమయంలో పంచాయతీ నిధులతో కరెంట్ బిల్లులు కట్టామని తెలిపారు. ఏపీని శ్రీలంకతో పోల్చడం అసమంజసమన్నారు.

*విద్యుత్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తాం: జగదీశ్‌రెడ్డి
కేంద్రం ఎన్ని అవరోధాలు సృష్టించినా విద్యుత్‌ సంస్థలను రక్షించుకుంటామని, అన్ని వర్గాలకు నిరంతర విద్యుత్‌ అందిస్తామని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. 1999 నుంచి ఇప్పటి వరకు విద్యుత్‌ సంస్థల్లో నియమితులైన 18 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలంటూ రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల ఫోరం ప్రతినిధులు శుక్రవారం మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తామన్నారు. విద్యుత్‌ ఉద్యోగులందరికీ పెన్షన్‌ విధానం సాధ్యాసాధ్యాలు తెలుసుకుంటామన్నారు

*వాళ్ల త్యాగాల వల్లే మనకు స్వేచ్ఛ: ఈటల
స్వాతంత్య్ర ఉద్యమంలో త్యాగాలు చేసిన వారిని ఎల్లవేళలా స్మరించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ‘ఐ స్టాండ్‌ ఫర్‌ వారియర్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన ‘జైహో’ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ఢిల్లీలో ప్రారంభించారు. నాటి త్యాగధనుల వల్లే మనం ఈ రోజు స్వేచ్ఛను అనుభవిస్తున్నామని తెలిపారు. వారి ఆశయాలను, ఆలోచనలను రాబోయే తరాలకు తెలియజేయాలని సూచించారు.

*రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో నష్టపోతున్న రైతులు: కేంద్ర మంత్రి
రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్‌ బీమా యోజనను రాష్ట్రం అమలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్‌చౌదరి దుయ్యబట్టారు. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం ఉచిత హామీలు ఇచ్చి రైతులను మోసం చేస్తుందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిందని తప్పుబట్టారు. ప్రధాని నరేంద్రమోదీ రైతులకు తక్కువ ధరకే ఎరువులను అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అదేవిధంగా కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతులకు రూ.6 వేలు పెట్టుబడి సాయంగా ఇస్తున్నట్లు కైలాష్‌ చౌదరి పేర్కొన్నారు.

*Revanth Reddy ఒక దొంగ: షర్మిల
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. లోటస్పాండ్లో వైఎస్‌ఆర్‌టీపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘‘రేవంత్‌రెడ్డి ఒక దొంగ. ఒక మోసకారి. ఓటుకు నోటు కేసులో దొరికిన వారి వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్కు కేటాయించిన స్థలాన్ని సీఎం కేసీఆర్ వెనక్కు లాక్కున్నారు. రాజశేఖర్‌రెడ్డి చనిపోతే తెలంగాణలో 400 మంది చనిపోయారు. ప్రస్తుత టీఆర్ఎస్ భవన్ను ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి కాదా?.. వైఎస్సార్ గౌరవార్థం హైదరాబాద్లో స్థలం కేటాయించాలని కోరుతున్నాం. ప్రస్తుతం టీఆర్ఎస్లోని సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్ను రాజకీయ నాయకులుగా చేసింది వైఎస్సార్ కాదా?.. వైఎస్సార్ను కాంగ్రెస్ అవమానించిన విషయం నిజం కాదా?.. రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు కావాలని, వైఎస్సార్కు ఎలాంటి గౌరవం ఇవ్వలేదు. హైదరాబాద్ (Hyderabad)లో రాజశేఖర్రెడ్డికి ఎలాంటి గౌరవప్రదమైన ప్లేస్ లేదు’’ అని షర్మిల పేర్కొన్నారు.

*త్యాగం లేకపోతే వ్యర్థం: ఈటల రాజేందర్‌
మానవ సమాజం త్యాగాల పునాదులపై ఏర్పడిందని, త్యాగం లేకపోతే వ్యర్థమని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. ఐ స్టాండ్ ఫర్ వారియర్స్ కార్యక్రమంలో ఈటల పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయహో ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో పుడతారు, చస్తారు.. కానీ కొందరే గుర్తుంటారని పేర్కొన్నారు. త్యాగధనులను గుర్తు చేసుకోవాలని సూచించారు. ఆగస్ట్ 15న మధ్యాహ్నం 12 గంటలకు దేశ ప్రజలంతా లేచి నిలబడి, జాతీయ గీతం అలాపించాలని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.