Politics

అసమర్థుడి పాలన వల్లే ఇలాంటి పరిస్థితి – TNI రాజకీయ వార్తలు

అసమర్థుడి పాలన వల్లే ఇలాంటి పరిస్థితి – TNI  రాజకీయ వార్తలు

*ఇదే గోదావరి వరద ఉద్ధృతి సమయంలో చంద్రబాబు నాయుడు గాని సీఎంగా ఉండి ఉంటే.. ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించేవారని.. ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ పరిస్థితిని అదుపు చేసేవారని.. తెదేపా నేత దేవినేని ఉమ అన్నారు. సీఎం జగన్‌ అసమర్థ పాలన కారణంగానే నేడు ఈ స్థాయిలో వరద బాధితులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. గోదావరి వరద అంచనాలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. పోలవరం నిర్వాసితులను ప్రభుత్వం గాలికొదిలేసిందని తెదేపా నేత దేవినేని ఉమ ధ్వజమెత్తారు. జూన్, జులైలో వరదలొస్తాయనే కనీస స్పృహ కూడా లేదని విమర్శించారు. అసమర్థుడి చేతిలో పాలన ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద పరిస్థితిని కూడా అంచనా వేయలేని స్థితిలో ఉన్నారని మండిపడ్డారు.

*ఏపీలో బినామీలతో లిక్కర్‌ బిజినెస్‌ : పవన్‌ కల్యాణ్‌
ఆంధ్రప్రదేశ్‌లో బినామీ పేర్లపై లిక్కర్‌ బిజినెస్‌ నడుస్తుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆరోపించారు. ఇవాళ భీమవరంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మద్యపాన నిషేధం అని చెప్పి జగన్‌ మాట తప్పారని విమర్శించారు. లిక్కర్‌పై భారీగా ధరలుపెంచడంతో మద్యం ద్వారా ప్రభుత్వానికి రూ. 30 వేల కోట్ల ఆదాయం వస్తుందని వెల్లడించారు.నాడు నేడు పేరిట ప్రభుత్వ పాఠశాలలో 55వేల కోట్లు ఖర్చు చేశామని వైఎస్‌ జగన్‌ గొప్పలు చెప్పుకుంటున్నారని, వరల్ట్‌ ఆర్గనైజేషన్‌ వెల్లడించిన జాబితాలో విద్యలో ఏపీ ముందు వరుసలో ఎందుకు లేదని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినవారిపై దాడులు చేయిస్తున్నారని పవన్‌ ఆరోపించారు.

*కేసీఆర్ స్టేట్‌మెంట్‌లో సెన్స్‌ లేదు: ఉత్తమ్ఇ
తర దేశాల క్లౌడ్ బరెస్ట్‌ కుట్రతో వరదలు వచ్చాయని కేసీఆర్ సిల్లి కామెంట్స్‌ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. వరదలకు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ మునిగిపోయిందన్నారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. క్లౌడ్ బరెస్ట్‌ సాధ్యమయ్యేది కాదన్నారు. కేసీఆర్ స్టేట్‌మెంట్‌లో సెన్స్‌ లేదని ఆయన విమర్శించారు.

*దేశ భవిష్యత్‌ని ధ్వంసం చేస్తున్నారు: రాహుల్ గాంధీ
దేశంలోని నిరుద్యోగాన్ని పెంచుతూ కోట్లాది కుటుంబాల నమ్మకాల్ని బద్దలు కొట్టడమే కాకుండా నియంతృత్వంతో దేశ భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని మోదీ ప్రభుత్వం పై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్కా నిస్టేబుల్ జనరల్ డ్యూటీ-2018 అభ్యర్థులు నిరసన చేస్తున్న వీడియోను ఆదివారం తన ట్విట్టర్ ఖాతాలో రాహుల్ గాంధీ షేర్ చేస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘‘ప్రశ్నలు అడగవద్దు. నోరు మెదపవద్దు. శాంతిపూర్వకంగా నిరసన చేపట్టవద్దు. కొత్త ఇండియాలో హక్కుల కోసం డిమాండ్ చేస్తే అరెస్ట్‌లు చేయబడతాయి. యువతను నిరుద్యోగం వైపు మళ్లిస్తూ కోట్లాది కుటుంబాల నమ్మకాల్ని బద్దలు కొడుతున్నారు. ఈ నియంతృత్వ ప్రభుత్వం దేశ భవిష్యత్‌ను ధ్వంసం చేస్తోంది’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

*Polavaram నిర్వాసితులను Chandrababu పరామర్శిస్తారు: Devineni Uma
లవరం నిర్వాసితులను తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు పరామర్శిస్తారని మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గురు, శుక్రవారాల్లో నిర్వాసితులను చంద్రబాబు పరామర్శిస్తారన్నారు. గోదావరి వరద బాధితులకు అండగా నిలవాలని.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇప్పటికే నారా భువనేశ్వరి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారన్నారు. పండ్లు, తినుబండారాలు, మంచినీటిని ఎన్టీఆర్ ట్రస్ట్భవన్ సిద్ధం చేసింది. సీఎం జగన్ అసమర్థతతో వేలాది మంది ప్రజలు ముంపులో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరాన్ని వరదలో ముంచేసి చారిత్రాత్మక తప్పిదం చేశారని, సీఎం జగన్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.

*ఆలయాలకే శఠగోపం పెట్టేందుకు సిద్ధమైన Jagan Sarkar: Ramakrishna
ఆలయాలకు శఠగోపం పెట్టేందుకు జగన్ సర్కార్ సిద్ధమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రూ. 500 కోట్లు లక్ష్యంగా దేవాలయాల ఎఫ్డీలను రద్దు చేయమని ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు ఇవ్వటం తగదన్నారు. రాష్ట్రంలోని 15 వేల దేవాలయాల ఫిక్స్‌డ్ డిపాజిట్లు రద్దుచేసి, సిజిఎఫ్‌ కు బదలాయించాలనుకోవడం దుర్మార్గమన్నారు. జగన్ సర్కార్ నిర్ణయంతో ఏపీ (AP)లోని ఆలయాల పరిస్థితి దయనీయంగా మారే ప్రమాదం ఉందన్నారు. గత దేవాదాయశాఖ మంత్రి సిజిఎఫ్ నిధులను మళ్లించినట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

*గుంతలకు YCP రంగులతో ముగ్గులు వేసిన Janasena
తాడేపల్లి మండలం, పాతూరు ప్రధాన రహదారిపై జనసేన నేతలు వినూత్న నిరసన చేపట్టారు. అనేక గ్రామాలను కలిపే పాతూరు ప్రధాన రహదారిపై ఉన్న గుంతలకు వైసీపీ రంగుల తో ముగ్గులు వేశారు. హ్యాష్‌ ట్యాగ్ గుడ్‌ మార్నింగ్‌ సిఎం సార్‌ అంటూ ముఖ్యమంత్రిని నిద్ర లేపుతున్నామని జనసేన నేతలు చిల్లపల్లి శ్రీనివాస్ ఇతర నేతలు, కార్యకర్తలు అన్నారు. ‘‘ప్రభుత్వ భవనాలకు మీరు వైసీపీ రంగులు వేశారు…. కోర్టులు మొట్టికాయలు వేశాయి….మేము జనసేన నేతలుగా రోడ్లకు వైసీపీ రంగులు వేస్తున్నాం… ఈ రోడ్లను బాగుచేస్తే మిమ్మల్ని నిందించం.. సన్మానం చేస్తాం.. సీఎం నివాసం తాడేపల్లి ప్యాలెస్‌కు అర కిలో మీటర్‌ దూరంలో ఉన్న ఈ రోడ్డు పరిస్థితి చూడండి సిఎం సార్‌’’.. అంటూ నిరసన తెలిపారు.

*వైసీపీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది: బుద్దా వెంకన్న
వైసీపీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని టీడీపీ నేత బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టిస్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ మద్యం తాగి ప్రజలు చనిపోయారని, బాధితుల పరామర్శకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారని అని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేయాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.బాపట్ల జిల్లా రేపల్లె సమీపంలోని పోటుమెరక గ్రామంలో మద్యం తాగి గరికపాటి నాంచారయ్య (75), రేపల్లె రత్తయ్య (57) మృతి చెందారు. బాధితుల కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే టీడీపీ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. నిజనిర్ధారణ కమిటీ సభ్యులను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. మాజీమంత్రి నక్కా ఆనంద్బాబు , మాజీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌, రేపల్లె టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావులను హౌస్ అరెస్ట్ చేశారు. రేపల్లెలో నిరసనలు, ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. నిరసనలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

*వాహనమిత్రపై సీఎం ప్రచారం సిగ్గుచేటు: గొట్టిముక్కల
వాహనమిత్ర పేరుతో వందలో పది మందికి రూ.10వేల చొప్పున ఇచ్చి.. రాష్ట్రంలోని డైవర్లందరి జీవితాలను ఉద్ధరించినట్లు సీఎం జగన్‌రెడ్డి ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటని టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టిముక్కల రఘురామరాజు విమర్శించారు. రాష్ట్రంలో 10లక్షల మందికిపైగా రిజస్టర్డ్‌ డ్రైవర్లున్నారని, కానీ కేవలం 2.61లక్షల మందికే వాహన మిత్ర ఇచ్చి, దాదాపు 8లక్షల మంది డ్రైవర్లను దగా చేస్తున్నారని ధ్వజమెత్తారు.

* జగన్‌ పాలనలో నియోజకవర్గానికో గాలి జనార్దన్‌రెడ్డి: నక్కా ఆనందబాబు
జగన్‌ పాలనలో రాష్ట్రంలో నియోజకవర్గానికో గాలి జనార్దన్‌రెడ్డి తయారయ్యాడని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. వైకాపా మైనింగ్‌ మాఫియా రాష్ట్రంలోని కొండల్ని, గుట్టల్ని మాయం చేస్తూ.. ఇదేంటని ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేస్తోందని విమర్శించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో వైకాపా అజెండా దోచుకో… దాచుకో అన్న చందంగా ఉంది. ప్రజాధనాన్ని, ప్రకృతిని వనరులను యథేచ్చగా లూఠీ చేస్తున్నారు. 150 నియోజకవర్గాల్లో యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌ జరుగుతోంది. హైకోర్టులో వీటిపై వ్యాజ్యాలు నమోదయ్యాయి. విశాఖలో రుషికొండ ప్రాంతం కనుమరుగైంది. మన్యం ప్రాంతంలో వైవీ సుబ్బారెడ్డి రూ.15 వేల కోట్ల బాక్సైట్‌ కుంభకోణానికి తెరలేపారు. బమిడికలొద్ది నుంచి భారతి సిమెంట్స్‌ కోసం వందలాది లారీల లెటరైట్‌ తరలిస్తున్నారు. శేఖర్‌రెడ్డి అన్న బినామీని పెట్టుకొని జగన్‌ ఇసుకను దోచేస్తున్నారు. వీటన్నింటిపై న్యాయవిచారణ వేయాలి’ అని ఆనందబాబు పేర్కొన్నారు.

*కేసీఆర్ పాల‌న ఆక్ర‌మ‌ణ‌ల‌కు అడ్డాగా మారింది: విజయశాంతి
CM కేసీఆర్ పాల‌న ఆక్ర‌మ‌ణ‌ల‌కు అడ్డాగా మారిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. ఎక్క‌డ చూసినా అధికార పార్టీ నాయ‌కులు అడ్డ‌గోలుగా సర్కారీ భూములను ఆక్రమించుకుంటున్నారని, రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి భూములను ఇష్టారాజ్యంగా అమ్ముకుంటున్నారని ఆమె ఆరోపించారు. రాములమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు యథాతథంగా..”కేసీఆర్ పాల‌న ఆక్ర‌మ‌ణ‌ల‌కు అడ్డాగా మారింది. ఎక్క‌డ చూసినా అధికార పార్టీ నాయ‌కులు అడ్డ‌గోలుగా సర్కారీ భూములను ఆక్రమించుకుంటున్నరు. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి భూములను ఇష్టారాజ్యంగా అమ్ముకుంటున్నరు. భూదాన్‌ భూములతో పాటు, ప్రాజెక్టుల్లో భూమి కోల్పోయిన వారికి పునరావాసం కల్పించేందుకు సేకరిస్తున్న భూములను సైతం రికార్డుల నుంచి మాయం చేసే కుట్ర చేస్తున్నరు. పేదలకు పంపిణీ చేసిన భూదాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌� భూములకు పట్టాలు ఇప్పించేందుకు ఏకంగా సీసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ స్థాయిలోనే పైరవీలు నడిపిస్తున్నరు. అధికార పార్టీ నేతల కన్నుసన్నల్లోనే జరుగుతున్న ఈ అక్రమాలకు సహకరించని ఆఫీసర్లపై ఇటీవల బదిలీ వేటు పడుతోంది. దేవరకొండ డివిజన్‌ పరిధిలోని దేవరకొండ, చింతపల్లి మండలాల్లో జరిగిన భూదందాలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. చింతపల్లి మండలం కుర్మేడులోని 247 సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌�లో భూదాన్‌ భూములు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నయి. వందల ఎకరాల్లోని భూములను మాయం చేసేందుకు రూలింగ్‌ పార్టీకి చెందిన ముఖ్య నేతతో చేతులు కలిపిన పలువురు రియల్టర్లు… రికార్డులనే తారుమారు చేస్తున్నరు. ఈ సర్వే నంబర్‌లో భూదాన్‌ భూములు ఉన్నయని… అవి ధరణి వెబ్‌సైట్‌లో కనిపించకుండా నిషేధిత జాబితాలో చేర్చారు. వాటికి సంబంధించిన సర్వే నంబర్‌ సీసీఎల్‌ఏ రికార్డుల్లో లేకపోవడంతో… పథకం ప్రకారం అక్కడి నుంచి నో ఆబ్జక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌ తెప్పించారు. దీని ఆధారంగా ఫైల్‌ను చింతపల్లి తహసీల్దార్‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపించారు. సీసీఎల్‌ఏ నుంచి ఎన్‌వోసీ ఉండడంతో 247 సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిజిస్ట్రేషన్లకు గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఆ భూముల్లో రియల్టర్లు భారీ స్థాయిలో వెంచర్లు వేస్తున్నరు. రాష్ట్రం మొత్తం ఇలానే భూదాన్ భూముల‌ను అధికార పార్టీ నాయ‌కులు ఆక్ర‌మించుకుంటున్నరు. కేసీఆర్… నీ అక్రమాల ఆట‌లు ఇంకెంతోకాలం సాగ‌వు. త్వరలోనే తెలంగాణ స‌మాజ‌ం నీ స‌ర్కార్‌కు త‌గిన గుణపాఠం చెబుతుంది.” అని విజయశాంతి అన్నారు.

*వైసీపీకి ప్రత్యేక చట్టం ఏమన్నా ఉందా?: శ్రవణ్కుమార్రా
ష్ట్ర ప్రభుత్వంపై జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు శ్రవణ్కుమార్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జులై 30న ఒంగోలు ఏబీఎం గ్రౌండ్స్లో బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ (YCP) ప్లీనరీకి కూడా ఇటువంటి నిబంధనలు పెట్టారా?.. రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యేక చట్టం ఏమన్నా ఉందా? అని శ్రవణ్కుమార్ప్ర శ్నించారు. వైసీపీ అరాచకాలను ప్రశ్నిస్తే వేధింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. వైసీపీ దురాగతాలపై ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు.. ఒంగోలు సభలో గళం విప్పుతారని శ్రవణ్కుమార్ తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం అంబేడ్కర్‌ 131వ జయంతి రోజున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ ‘జై భీమ్‌ భారత్‌’ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు చేసిన నిందితులను శిక్షించలేని దుర్మార్గపు పరిపాలన రాష్ట్రంలో కొనసాగుతోందని ధ్వజమెత్తారు. దళితుల సమస్యలు పరిష్కరించని, దాడులపై స్పందించని వైసీపీలోని దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలను ఓడించడమే లక్ష్యంగా పార్టీని స్థాపించినట్టు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు.

*agan గాల్లో తిరిగితే ప్రజల కష్టాలు తెలియవు: చంద్రబాబు
సీఎం జగన్‌ గాల్లో తిరిగితే ప్రజల కష్టాలు తెలియవని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రజలు పీకల్లోతు వరదల్లో మునిగి ఉన్నారని, జగన్ మాత్రం కాలికి మట్టి అంటకుండా గాల్లో తిరుగుతున్నారని మండిపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వరదల ప్రభావం, ప్రజల పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. 6 జిల్లాల్లో 550కి పైగా గ్రామాల్లో గోదావరి వరద ప్రభావం ఉందని ఆయన తెలిపారు. వరదపై ప్రభుత్వ సన్నద్దత లేదని, బాధితులకు సాయమూ చేయలేదని మండిపడ్డారు. వరద బాధితులను ఆదుకోవడంలో జగన్ సర్కార్ విఫలమైందని దుయ్యబట్టారు. విపత్కర పరిస్థితుల్లో మంత్రులు, ప్రభుత్వ పెద్దల నిరంతర పర్యవేక్షణ ఏది? అని ప్రశ్నించారు. ఓ నాలుగు రోజులు ప్రజలకు ఆహారం, మంచినీరు ఇవ్వలేరా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

*జేబుల్లోంచి డబ్బులు ఇవ్వడం మాకేమీ సరదా కాదు: పవన్‌
ఏపీ అభివృద్ధే జనసేన ధ్యేయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ప్రకటించారు. వైసీపీ లేని రాష్ట్రాన్ని చూడబోతున్నామని జోస్యం చెప్పారు. కోనసీమ జిల్లా మండపేటలో జనసేన రైతు భరోసా యాత్ర చేపట్టింది. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పవన్‌ పరామర్శించారు. 60 మంది కౌలు రైతు కుటుంబాలకు రూ.లక్ష ఆర్థికసాయం అందించారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ కౌలు రైతులకు ప్రభుత్వం రూ.7 లక్షల బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ముద్దుల మామయ్యను మళ్లీ ఆదరిస్తారా? అని సీఎ జగన్ ఉద్దేశించి ప్రశ్నించారు. జేబుల్లోంచి డబ్బులు ఇవ్వడం తమకేమీ సరదా కాదని పేర్కొన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇచ్చేందుకు సీఎం సిద్ధంగా లేరని చెప్పారు. తప్పు జరిగినప్పుడు ఎదిరించే శక్తి లేకుంటే మనుగడ ఉండదని హెచ్చరించారు. తప్పులను ఎత్తిచూసే బాధ్యతను యువత తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ తనకు ఆదర్శమని పవన్ కల్యాణ్‌ ప్రకటించారు.

*విలీనంతో బాలికలకు విద్య దూరం: కావలి గ్రీష్మ
రాష్ట్రంలో పాఠశాలల విలీనంతో ఆడపిల్లలకు విద్యను దూరం చేసే పరిస్థితి కల్పించారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ అన్నారు. జగన్‌రెడ్డికి ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను భర్తీ చేయకపోగా, ఉన్న టీచర్లకు ఇతర డ్యూటీలు వేస్తున్నారని మండిపడ్డారు

*వాహనమిత్రపై సీఎం ప్రచారం సిగ్గుచేటు: గొట్టిముక్కల
హనమిత్ర పేరుతో వందలో పది మందికి రూ.10వేల చొప్పున ఇచ్చి.. రాష్ట్రంలోని డైవర్లందరి జీవితాలను ఉద్ధరించినట్లు సీఎం జగన్‌రెడ్డి ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటని టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టిముక్కల రఘురామరాజు విమర్శించారు. రాష్ట్రంలో 10లక్షల మందికిపైగా రిజస్టర్డ్‌ డ్రైవర్లున్నారని, కానీ కేవలం 2.61లక్షల మందికే వాహన మిత్ర ఇచ్చి, దాదాపు 8లక్షల మంది డ్రైవర్లను దగా చేస్తున్నారని ధ్వజమెత్తారు.

*దేవుడి పేరు స్మరిస్తూ.. సొమ్ము కాజేస్తారా?: సోము
భక్తి, శక్తి కేంద్రాలైన హిందూ దేవాలయాల పట్ల మీ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు అధర్మంగా ఉందని ముఖ్యమంత్రి జగన్‌కు రాసిన బహిరంగ లేఖలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. ఆలయాల్లో భక్తులు దేవుడికి సమర్పించిన సొమ్మును కామన్‌ గుడ్‌ ఫండ్‌ లోకి మార్చడమంటే హిందువుల పట్ల మీకున్న ద్వేషానికి నిదర్శనమని పేర్కొన్నారు.. దేవుడు అన్నీ చూస్తుంటాడని నిత్యం పలికే ముఖ్యమంత్రి హిందూ దేవుళ్ల సొమ్ము కాజేసేందుకు ప్రయత్నించడం ఎంత వరకూ సమంజసమని నిలదీశారు.

*అప్పటి వరకు జనాలు బతికేలా లేరు: లోకేశ్‌
జగన్‌రెడ్డి పంపే ఫ్యామిలీ డాక్టర్‌ వచ్చేలోగా జనాలు బతికేలా లేరని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. శనివారం ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘సాక్షి’ రాత మాయా ప్రపంచం నుంచి బయటికొచ్చి వాస్తవం చూస్తే తేంపల్లిలో మరణ మృదంగం కనిపిస్తుంది. విషజ్వరాలతో వారం రోజుల్లో ఆరుగురు మృతి చెందారు. వాంతులు, విరేచనాలతో 70 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మాటల ముఖ్యమంత్రి, ప్రకటనల ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి? బటన్‌ నొక్కి డయేరియా, విషజ్వరాలు తగ్గించేస్తారా?’ అంటూ లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

*దోచుకో.. దాచుకో అజెండాతో వైసీపీ: ఆనందబాబు
దోచుకో.. దాచుకో అనేదే వైసీపీ అజెండా అని టీడీపీ నేత, మాజీమంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. రాష్ట్రంలోని 150 నియోజకవర్గాల్లో యథేచ్చగా అక్రమ మైనింగ్‌ కొనసాగుతుందని ఆరోపించారు. శనివారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

*కాకినాడ సెజ్‌లో ఫార్మా పరిశ్రమలొద్దు: యనమల
కాకినాడ సమీపంలోని కాకినాడ సెజ్‌లో ఫార్మా తయారీ పరిశ్రమలు పెట్టకుండా నిరోధించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు శాసన మండలి ప్రతిపక్ష నేత, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన ఈ మేరకు ట్రైబ్యునల్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఆదర్శ కుమార్‌ గోయల్‌కు లేఖ రాశారు.