NRI-NRT

వీసా ఖర్చు లేకుండానే ఆ దేశంలో సెటిల్ అయిపోవచ్చు తెలుసా?

వీసా ఖర్చు లేకుండానే ఆ దేశంలో సెటిల్ అయిపోవచ్చు తెలుసా?

తన జీవితం ఎక్కడ బాగుంటుందంటే అక్కడికి వలస పోతూ ఉంటాడు.అది వేరే జిల్లా అయినా, రాష్ట్రమైనా.ఆఖరికి దేశమైనా.తను కన్న బిడ్డలకు ఎంతదూరమైనా ప్రయాణిస్తూ ఉంటాడు.ఎన్ని సముద్రాలైనా దాటుతాడు.అయితే ఈ క్రమంలో ప్రయాణం అనేది ఒకింత ఖర్చుతో కూడిన పని.అందుకే కొంతమంది ఈ ఖర్చుల విషయంలో కాస్త వెనక్కి తగ్గుతారు.ఇందులో ముఖ్యంగా వీసా ఖర్చు అనేది యెంత భారంగా ఉంటుందో తెలియంది కాదు.ఈ ప్రపంచంలో వున్న ఏదేశానికైనా వెళ్లాలంటే ముందు మనం వీసా ఏర్పాటుచేసుకోవలసి ఉంటుంది.విదేశాల్లోకి వెళ్లి సెటిల్ కావాలని కలలుగనేవారికి ఆ ప్రదేశం చాలా అనువైనదని.76 రోజుల పాటు పగలు.మిగతా రోజుల్లో పూర్తిగా చీకటి ఉండే భూమిపై గల ఓ అరుదైన ప్రాంతం అది.ఇలాంటి వింతైన నగరం నార్వే దేశంలో ఉంది.దాని పేరు ‘లాంగ్ ఇయర్ బైన్’.నార్వే దేశానికి ఉత్తరాన ఉన్న ఈ ద్వీప నగరానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.ఇది ఆర్కిటిక్ మహా సముద్రం మధ్యలో ఉంటుంది.ఈ దేశానికి ఉత్తర భాగాన సముద్రంలో 800 కిలోమీటర్ల దూరంలో ‘స్వాల్ బార్డ్’ అనే ప్రదేశం ఉంటుంది.అయితే ఇక్కడ జనాభా సంఖ్య చూస్తే ఒకింత ఆశ్చర్యం కలుగుతుంది.ఇక్కడ దాదాపు 2,400 మంది ప్రజలు నివవిస్తున్నారు.వీరిలో దాదాపు 50 దేశాల నుంచి వచ్చిన వలసవాదులే ఉండటం గమనార్హం.వీసా అనేది ఇక్కడి ప్రాంతానికి లేదు.ప్రపంచంలోని ఎవరైనా సరే వచ్చి ఇక్కడ నివసించవచ్చు.వీసా ప్రామాణికం లేకపోవడంతో ఇలా విదేశాల నుంచి ఇక్కడికి వలసలు ఎక్కువవుతున్నాయి.ఇక్కడున్న జనాభాలో మూడింట ఒకవంతు వసలవాదులే కావడం గమనార్హం.ఎక్కువ శాతం ఇక్కడ ఉద్యోగార్థులే నివసిస్తారు.