DailyDose

అల్లూరి జిల్లాలో 134 కిలోల గంజాయి పట్టివేత – TNI నేర వార్తలు

అల్లూరి జిల్లాలో 134 కిలోల గంజాయి పట్టివేత  – TNI  నేర వార్తలు

* ఏపీలోని అల్లూరి జిల్లా లబ్బురు జంక్షన్‌లో పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. ద్విచక్ర వాహనాలపై గంజాయిని తరలిస్తున్న నలుగురు ఒడిశా వాసులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు స్మగర్లు అక్కడి నుంచి పారిపోయారు. పట్టుకున్న వారి వద్ద నుంచి 134 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 2.60 లక్షలు ఉంటుందని వివరించారు.

*దేశ రాజ‌ధాని ఢిల్లీలో భారీ ప్ర‌మాదం చోటుచేసుకుంది. వాయువ్య ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో గురువారం మ‌ధ్యాహ్నం 21 మంది పిల్ల‌ల‌తో వెళుతున్న స్కూల్ బ‌స్‌, మూడు కార్లు మంట‌ల్లో చిక్కుకున్నాయి. ప్ర‌మాదం గురించి మ‌ధ్యాహ్నం 2.15 గంట‌ల‌కు ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నామ‌ని అగ్నిమాప‌క అధికారులు తెలిపారు.

*బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం అడవిపాలెంలో దారుణం చోటుచేసుకుంది. మహంకాళరావు(42) అనే పెద్ద కుమారుడు రోజూ తాగివచ్చి వేధిస్తున్నాడని అతని తల్లి కర్రతో కొట్టి చంపింది. అనంతరం చిన్న కుమారుడి సహాయంతో మృతదేహాన్ని పూడ్చిపెట్టింది.

*పిడుగుపాటుకు 14 మంది మరణించారు. మరో 16 మంది గాయపడ్డారు. ఉత్తర్ప్రదేశ్లోని వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం ఈ ఘటనలు సంభవించాయి. మృతుల్లో బాందా నుంచి నలుగురు, ఫతేపుర్ నుంచి ఇద్దరు, బల్రాంపుర్, ఛందౌలి, బులంద్శహర్, రాయ్ బరేలీ, అమేఠీ, కౌశాంబి, సుల్తాన్పుర్, చిత్రకూట్ జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు

*కర్ణాటకలోని ఉడుపి జిల్లా శిరూరు టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరగ్గా.. అంబులెన్స్లోని నలుగురు మరణించారు. టోల్గేట్ వద్ద ఒక లేన్కు బారికేడ్లు అడ్డుపెట్టిన సిబ్బంది అంబులెన్స్ రావడం గుర్తించి హుటాహుటిన వాటిని తొలిగించారు. వేగంగా వస్తున్న అంబులెన్స్ డ్రైవర్.. కాస్త వేగం తగ్గించేందుకు బ్రేక్ వేశాడు. అయితే రోడ్డుపై వర్షపు నీరు నిలిచి ఉండటం వల్ల ఆ వాహనం అదుపు తప్పింది. అక్కడే ఉన్న ఓ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో అంబులెన్స్ కోసం రోడ్డు క్లియర్ చేసేందుకు ప్రయత్నించిన ఓ సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు

*సైదాబాద్‌ క్రాంతినగర్‌లో యూట్యూబర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూట్యూబ్‌లో వ్యూస్‌ పెరగడం లేదంటూ డ్రిపెషన్‌తో డీనా అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటీ గ్వాలియర్‌లో డీనా ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. గేమ్‌ ఆడుతూ తన బాధను చెప్పుకున్న డీనా.. ఆ క్రమంలో ఐదు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించాడు.

*కడప: జిల్లాలోని పులివెందులలో దారుణం జరిగింది. పులివెందుల నుంచి కదిరికి వెళ్ళేరోడ్డులో ట్రాన్స్ జెండర్‌ పై 15 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. దాడి చేసి మరీ అత్యాచారం జరిపి కంప చెట్లలో పడేసి వెళ్లారని బాధితురాలి తరపున ట్రాన్స్ జెండర్లు వెల్లడించారు. పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో న్యాయం కోసం ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ట్రాన్స్ జెండర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరంలేక దిశయాప్‌ కు కాల్ చేసిన తర్వాత స్పందించారని తెలిపారు. అత్యాచారం ఘటనలో తమకు న్యాయం చేయకపోతే పులివెందుల ట్రాన్స్ జెండర్స్ అందరం కలసి ఆత్మహత్య చేసుకుంటామని ట్రాన్స్‌ జెండర్లు మీడియాకు తెలియజేశారు.

*రంగారెడ్డి జిల్లోలోని చేవెళ్లలో పేకాటరాయుళ్లపై పోలీసులు కొరడా ఝులిపించారు. చేవెళ్లలోని మొయినాబాద్‌లో పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. మొయినాబాద్‌లో ఉన్న ఓ ఫాంహౌస్‌లో పేకాటాడుతుండగా 13 మందిని అరెస్టు చేశారు. మరో నలుగురు పరారయ్యారని అధికారులు తెలిపారు. నిందితుల నుంచి రూ.9 లక్షల 97 వేలు, 15 సెల్‌ఫోన్లు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందులను స్టేషన్‌కు తరలించామని, పరారైవారికోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు

*నిత్య పెళ్ళికొడుకు శివ శంకర్ బాబును గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రాష్ట్రాల్లో కలిపి 13 మంది యువతులను శివ శంకర్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లిళ్లు చేసుకొని శారీరక సుఖాన్ని అనుభవించి వారి నుంచి డబ్బులు తీసుకొని పారిపోతూ మోసానికి పాల్పడ్డాడు. అతడిపై హైదరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, గుంటూరు, విజయవాడలో కేసులు నమోదు అయ్యాయి. ఇటీవల కాలంలో శివశంకర్ బాబును అరెస్ట్ చేయాలంటూ బాధిత మహిళలను రోడ్డెక్కారు. అమెరికాలో ఉన్న యువతిని కూడా శివశంకర్ మోసం చేశాడు. హైదరాబాద్ చెందిన అమెరికాలో ఉంటున్న యువతి దగ్గర్నుంచి 35 లక్షలకు నిత్యపెళ్లికొడుకు వసూలు చేశాడు. శివశంకర్ బాబు స్వస్థలం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి.

*హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మబండలో అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. ఇంటి గ్రిల్స్ తొలగించి మరీ దుండగుడు దొంగతనానికి పాల్పడ్డాడు. దొంగ అలజడితో ఇంటి యజమాని నిద్రలేవడంతో గమనించిన దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా సీసీ కెమెరాలు ఆధారంగా ఇంటి యజమాని దొంగను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పాడు. దుండగుడు ఎల్లమ్మ బండలోని పీజేఆర్ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌గా గుర్తించారు. దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*Kadapa: మండలంలోని తంగేడుపల్లెలో ఒకరి నుంచి 49 అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ రాజారమేష్‌ తెలిపారు. అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి అక్రమ మద్యం విక్రయిస్తున్న అతన్ని అరెస్టు చేసి 49 బాట్లిను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

*చెన్నూరు: రామనపల్లెలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న శ్రీనివాసులరెడ్డిని అరెస్టు చేసి అతని నుంచి 11 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. బుధవారం రామనపల్లెలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న విషయం తెలిసి దాడి చేయడంతో శ్రీనివాసులరెడ్డి బాటిళ్లతో పట్టుబడ్డాడని ఆయన తెలిపారు. అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌ నిమిత్తం పంపినట్లు తెలిపారు.

*హైవే పక్కన నిలిపి ఉన్న లగేజీ ఆటోలో రూ.2.70 లక్షలు నగదు, సెల్‌ఫోన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు డ్రైవర్‌ ఒంగోలు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన ఒంగోలు సమీపంలోని మూక్తినూతలపాడు వెళ్లే అడ్డరోడ్డు వద్ద బుధవారం రాత్రి రెండు గంటల సమయంలో జరిగింది. నెల్లూరు జి ల్లా గుడ్లూరు మండలం పురేటిపల్లికి చెందిన బత్తుల అనీల్‌కుమార్‌ ఏపీ39 యూుుఈ1073 నంబరు గల ఆటోలో తన గ్రామానికి చెందిన రైతుల పత్తిని గుంటూ రు తీసుకెళ్లాడు. అక్కడ 30 కింట్వాళ్ల పత్తిని విక్రయించగా రూ.2.70 నగదు వచ్చింది. ఆ మొత్తాన్ని ఆటోలోని డ్యాష్‌ బోర్డులో ఉంచి, అక్కడే సెల్‌ఫోన్‌ పెట్టి రాత్రి 1.30 సమ యంలో రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపివేసి నిద్రపోయాడు. అయితే 2 గంటల సమ యంలో నిద్రలేచి చూసే సరికి నగదు, సెల్‌ఫోన్‌ కనిపించలేదు. దీంతో వెంటనే తాలు కా పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*ఓ మైనర్‌ బాలికకు ఆమె తల్లి బలవంతపు పెళ్లిచేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై బాలిక తండ్రి ఖమ్మం వన్‌టౌన్‌ పోలీసులను, చైల్డ్‌వెల్ఫేర్‌ కమిటీకి ఫిర్యాదు చేశాడు. నగరానికి చెందిన ఓబాలిక తల్లిద ండ్రులు కొంతకాలంగా విడిగా ఉంటున్నారు. వారి కూతురు(16) తల్లి దగ్గరే ఉంటోంది. ఈ క్రమంలో ఆ బాలిక ఓ యువకుడిని ప్రేమించగా తండ్రికి తెలియ కుండా బాలిక తల్లి వారిద్దరికీ వివాహం జరిపించి జగిత్యాలకు తరలించింది. ఈ విషయంపై బాలిక తండ్రి వన్‌టౌన్‌ పోలీసులు, చైల్డ్‌వెల్ఫేర్‌ కమిటీకి ఫిర్యాదు చేయడంతో వారు తల్లిని, బాలికను పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అనంతరం ఈ వివాహానికి కారకులైన సుమారు పదిమందితో పాటు వివాహం చేసుకున్న యువకుడిపై కూడా కేసు నమోదు చేసినట్టు తెలిసింది. కాగా ఈవిషయం బాలిక తరఫు పెద్దమనుషులను పిలిపించి వారిలో ఆరుగురికి కులాచారం ప్రకారం ఒక్కొక్కరికి రూ.1100 చొప్పున జరిమానా విధించినట్లు బాలిక తండ్రి ఆరోపిస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

*అదేపనిగా సెల్‌ఫోన్‌ చూస్తుం డటంతో, అతడిని మందలించిన కుటుంబసభ్యులు అతడి వద్దనున్న సెల్‌ఫోన్‌ను లాక్కోవడంతో మనస్తాపానికి గురైన బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో బుధవారం జరిగింది. పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల ఏరియాకు చెందిన బానోత్‌ శివలోకేష్‌కళ్యాణ్‌(14) 9వతరగతి చదువు తున్నాడు. బుధవారం పాఠశాల బంద్‌ కావడంతో ఇంట్లోనే ఉన్న అతడు అదేపనిగా సెల్‌ఫోన్‌ను చూస్తున్నాడు. సాయంత్రం 4గంటల సమయంలో అతడిని మందలించిన కుటుంబ సభ్యులు, అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను తీసుకు న్నారు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లోని చివరిగదిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు. ఆలస్యంగా గుర్తించిన కుటుంబ సభ్యులు ఆ బాలుడుని ప్రభుత్వ వైద్య శాలకు తరలించగా అప్పటికే బాలుడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.

*హైవే పక్కన నిలిపి ఉన్న లగేజీ ఆటోలో రూ.2.70 లక్షలు నగదు, సెల్‌ఫోన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు డ్రైవర్‌ ఒంగోలు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన ఒంగోలు సమీపంలోని మూక్తినూతలపాడు వెళ్లే అడ్డరోడ్డు వద్ద బుధవారం రాత్రి రెండు గంటల సమయంలో జరిగింది. నెల్లూరు జి ల్లా గుడ్లూరు మండలం పురేటిపల్లికి చెందిన బత్తుల అనీల్‌కుమార్‌ ఏపీ39 యూుుఈ1073 నంబరు గల ఆటోలో తన గ్రామానికి చెందిన రైతుల పత్తిని గుంటూ రు తీసుకెళ్లాడు. అక్కడ 30 కింట్వాళ్ల పత్తిని విక్రయించగా రూ.2.70 నగదు వచ్చింది. ఆ మొత్తాన్ని ఆటోలోని డ్యాష్‌ బోర్డులో ఉంచి, అక్కడే సెల్‌ఫోన్‌ పెట్టి రాత్రి 1.30 సమ యంలో రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపివేసి నిద్రపోయాడు. అయితే 2 గంటల సమ యంలో నిద్రలేచి చూసే సరికి నగదు, సెల్‌ఫోన్‌ కనిపించలేదు. దీంతో వెంటనే తాలు కా పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*అనంతపురం జిల్లా శింగనమల చెరువులో తల్లి, ఇద్దరు పిల్లల మృతదేహాలు బుధవారం లభ్యమయ్యాయి. వీరి మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం జిల్లా పామిడి మండలం ఎదురూరు గ్రామానికి చెందిన సంజమ్మ, రామాంజనేయులు దంపతుల కూతురు కవితకు పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు గ్రామానికి చెందిన రామాంజనేయులుతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు సంతోష్‌ కుమార్‌, కూతురు భార్గవి ఉన్నారు. నాలుగు రోజుల క్రితం దంపతుల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇద్దరు పిల్లలతో కలిసి కవిత ఇంటి నుంచి వచ్చేసింది. శింగనమల చెరువులో బుధవారం ఉదయం కవిత (35), సంతోష్‌ కుమార్‌ (11), భార్గవి (5) మృతదేహాలు కనిపించాయి.

*అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం కొత్తభల్లుగుడ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో వంతల అమృత(12) అనే విద్యార్థిని బుధవారం మృతిచెందింది. భస్కీ పంచాయతీ గయిబంద గ్రామానికి చెందిన అమృత సెలవుల అనంతరం వారం క్రితం పాఠశాలకు వచ్చింది. మూడు రోజుల క్రితం జ్వరం రావడంతో సిబ్బంది మాత్రలు ఇచ్చారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని మంగళవారం చెప్పడంతో అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. శ్వాస సమస్య ఎక్కువగా ఉన్నందున విశాఖపట్నం కేజీహెచ్‌కు తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. ఇందుకు తల్లిదండ్రులు నిరాకరించి ఇంటికి తీసుకు వెళ్లిపోయారని, బుధవారం ఉదయం అమృత మృతి చెందిందని ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు రాధ తెలిపారు.

*జాతీయరహదారిలో ఎమర్జెన్సీ రన్‌వేపై మంత్రి ఎస్కార్ట్‌ వాహనం ఢీకొని మోటార్‌ సైకిలిస్టు మృతిచెందాడు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పీ.గుడిపాడు వద్ద హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వర్థినేనివారిపాలెంకు చెందిన బేల్దారి మేస్ర్తి గంగవరపు శ్రీను(50) ద్విచక్రవాహనంపై గుంటూరు వైపు వెళుతూ మధ్యలో పి.గుడిపాడు వైపు తిరిగాడు. అదే సమయంలో నెల్లూరు వైపు వెళ్తున్న మంత్రి గుడివాడ అమరనాథ్‌ కాన్వాయ్‌లోని ఎస్కార్ట్‌ వాహనం వేగంగా ఢీకొట్టింది. దీంతో శ్రీను ఎగిరిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదంలో మృతుని సెల్‌ఫోన్‌ పూర్తిగా ధ్వంసం కాగా మేదరమెట్ల ఎస్‌ఐ శివకుమార్‌ ఆ సిమ్‌ను తీసి వేరే ఫోన్‌లో వేసి వివరాలు సేకరించారు. మృతుడి కుమారుడు విజయవాడలో చదువుతుండగా, భార్య హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలిసింది. మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*హైవే పక్కన నిలిపి ఉన్న లగేజీ ఆటోలో రూ.2.70 లక్షలు నగదు, సెల్‌ఫోన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు డ్రైవర్‌ ఒంగోలు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన ఒంగోలు సమీపంలోని మూక్తినూతలపాడు వెళ్లే అడ్డరోడ్డు వద్ద బుధవారం రాత్రి రెండు గంటల సమయంలో జరిగింది. నెల్లూరు జి ల్లా గుడ్లూరు మండలం పురేటిపల్లికి చెందిన బత్తుల అనీల్‌కుమార్‌ ఏపీ39 యూుుఈ1073 నంబరు గల ఆటోలో తన గ్రామానికి చెందిన రైతుల పత్తిని గుంటూ రు తీసుకెళ్లాడు. అక్కడ 30 కింట్వాళ్ల పత్తిని విక్రయించగా రూ.2.70 నగదు వచ్చింది. ఆ మొత్తాన్ని ఆటోలోని డ్యాష్‌ బోర్డులో ఉంచి, అక్కడే సెల్‌ఫోన్‌ పెట్టి రాత్రి 1.30 సమ యంలో రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపివేసి నిద్రపోయాడు. అయితే 2 గంటల సమ యంలో నిద్రలేచి చూసే సరికి నగదు, సెల్‌ఫోన్‌ కనిపించలేదు. దీంతో వెంటనే తాలు కా పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో విషాదంలో అద్భుతం జరిగింది. లారీ టైర్ల కిందపడి ఎనిమిది నెలల గర్భిణీ మృతి చెందగా ఆమె పొట్టలోని శిశువు మృత్యుంజయురాలిగా ప్రాణాలతో బయటపడింది. ఆ పసికందును హుటాహుటిన ఫిరోజాబాద్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. శిశువు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆ పాపకు కేవలం సాదారణ చికిత్స అవసరమని తెలిపారు. ఈ విషాద సంఘటన జిల్లాలోని బర్తపారా గ్రామంలో గురువారం జరిగింది. మృతురాలు ఆగ్రాకు చెందిన కామిని(26)గా పోలీసులు గుర్తించారు. తన తల్లిగారింటికి భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొట్టినట్లు చెప్పారు. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి అదుపుతప్పి బాధితురాలి భర్త లారీని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. దాంతో కామిని రోడ్డుపై పడిపోయిందని, లారీ ఆమెపై నుంచి వెళ్లినట్లు చెప్పారు. తల్లి పొట్టలోంచి బయటపడిన చిన్నారి ప్రాణాలతో ఉండటం గమనించి ఆసుపత్రికి తరలించారని, ప్రస్తుతం శిశువు, ఆమె తండ్రి చికిత్స పొందుతున‍్నట్లు పోలీసులు తెలిపారు

*కారు, జీప్‌ మధ్య రేస్‌ ఒకరి ఉసురు తీసింది. రేస్‌లో పాల్గొన్న జీప్‌, క్యాబ్‌ను ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మరణించాడు. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం రాత్రి కొట్టెక్కాడ్ ప్రాంతంలో మహీంద్రా థార్, బీఎండబ్ల్యూ మధ్య ఈ రేస్‌ జరిగింది. ఆ రెండు వాహనాలు రోడ్డుపై వేగంగా దూసుకెళ్లాయి.కాగా, ఒక కుటుంబం గురువాయూర్ నుంచి క్యాబ్‌లో తమ ఊరికి తిరిగి వెళ్తున్నారు. అయితే మహీంద్రా థార్, బీఎండబ్ల్యూ పక్కపక్కనే వేగంగా వస్తుండాన్ని గమనించిన క్యాబ్‌ డ్రైవర్‌ తన వాహనాన్ని రోడ్డు పక్కకు మళ్లించి నిలిపాడు. అయినప్పటికీ మహింద్రా థార్‌ జీప్‌ వేగంగా వచ్చి ఆగి ఉన్న ఆ క్యాబ్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో క్యాబ్‌ ముందు సీట్లో కూర్చొన్న వ్యక్తి ఈ ప్రమాదంలో చనిపోయాడు. ఈ ప్రమాదం ధాటికి వెనుక సీట్లో కూర్చొన్న మృతుడి భార్య కారు నుంచి ఎగిరి రోడ్డుపై పడింది. మృతుడి భార్య, కుమార్తె, మనుమరాలు, క్యాబ్‌ డ్రైవర్‌ గాయపడ్డారు.

* అన్నమయ్య జిల్లాలో పోలీసులపై ఎర్రచందనం స్మగర్లు దాడికి పాల్పడ్డారు. జిల్లాలోని పీలేరు మండలం చీపాటివారిపల్లె వద్ద అటవి ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టిన పోలీసులకు ఎర్రచందనం స్మగర్లు, కూలీలు తారాస పడ్డారు. లొంగిపోవాలని పోలీసుల చేసిన హెచ్చరికలు పట్టించుకోకుండా వారిపై రాళ్లు, గొడ్డళ్లు, వేటకొడవళ్లతో దాడికి యత్నించారు. చివరకు పోలీసులు 17 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.