Movies

కళ్యాణ్ రామ్ కు… ఎన్టీఆర్ ప్రశంసలు

కళ్యాణ్ రామ్ కు… ఎన్టీఆర్ ప్రశంసలు

అభిమానులే మా ఆస్తిపాస్తులు. వాళ్ల ఆనందం కోసమే సినిమాలు చేస్తుంటాం’’ అన్నారు ఎన్టీఆర్‌. కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటించిన ‘బింబిసార’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘రెండున్నరేళ్ల క్రితం కల్యాణ్‌ అన్న ఫోన్‌ చేసి ‘చాలా ఆసక్తికరమైన కథ విన్నా. నువ్వు కూడా వింటే బాగుంటుంది అని చెప్పాడు. అలా ‘బింబిసార’ కథ నేను విన్నాను. ఎంత కసిగా ఆ కథ చెప్పాడో.. అంతకంటే గొప్పగా వశిష్ట ‘బింబిసార’ మలిచాడు. కల్యాణ్‌ అన్న కెరీర్‌ ‘బింబిసార’కి ముందు. తరవాత అనుకోవాల్సిందే. ఈ సినిమాకు కల్యాణ్‌ రామ్‌ రక్తం ధారబోశాడు. ఆయన తప్ప.. ఈ పాత్రకు న్యాయం చేయగల నటుడు లేడు.. ఉండడు కూడా’’ అన్నారు. కల్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ ‘‘పాతాళ భైరవి, భైరవ ద్వీపం, జగదేకవీరుడు – అతిలోక సుందరి లాంటి మంచి సోషియో ఫాంటసీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడమే మా పయ్రత్నం. ఈసారి ఎవరినీ నిరుత్సాహ పరచను. 200 శాతం అభిమానులంతా గర్వంగా భావిస్తార’’న్నారు…!!_