Movies

అలియాభాట్ ఆసక్తికర వ్యాఖ్యలు

అలియాభాట్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రస్తుతం భారతీయ చిత్రసీమ మొత్తం కష్టాల్లోనే ఉందని, అంతా సర్దుకోవడానికి కాస్త సమయం పడుతుందని చెప్పింది అగ్ర కథానాయిక అలియాభట్‌. ఆమె నిర్మాతగా వ్యవహరిస్తూ నటించిన ‘డార్లింగ్స్‌’ చిత్రం నేడు ఓటీటీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న అలియాభట్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.హిందీ సినిమా ఆధిపత్యానికి దక్షిణాది సినిమాలు బ్రేక్‌ వేశాయన్న ప్రశ్నకు స్పందిస్తూ ‘భాషా భేదాలతో సంబంధం లేకుండా మంచి కంటెంట్‌ ఉన్న సినిమాల్నే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దక్షిణాదిలో సక్సెస్‌ రేట్‌ ఎక్కువగా ఉన్నా..అక్కడ కూడా చాలా సినిమాలు ఫెయిల్‌ అవుతున్నాయి. హిందీలో మాత్రం ఆశించిన ఫలితాలు రావడం లేదు. కొద్ది రోజులు ఓపిక పడితే హిందీ సినిమాకు మంచి రోజులొస్తాయి’ అని చెప్పుకొచ్చింది.