Movies

షారుఖ్‌ ఇంటిపై సల్మాన్ కన్ను!

షారుఖ్‌  ఇంటిపై సల్మాన్ కన్ను!

ముంబయిలోని షారుఖ్‌ఖాన్‌ నివాసం ‘మన్నత్‌’కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అరేబియా సముద్రానికి అభిముఖంగా సకల విలాసాలతో కూడిన ఈ భవనం ముంబయిలోని ఖరీదైన నివాసాల్లో ఒకటని చెబుతారు. చాలా ఏళ్ల క్రితమే షారుఖ్‌ఖాన్‌ ఈ బంగ్లాను కొనుగోలు చేశారు. అయితే తొలుత ఈ ఇంటిని సల్మాన్‌ఖాన్‌ తీసుకోవాలనుకున్నారట. ఒక్కడికే అంత పెద్ద ఇల్లు ఎందుకని తండ్రి వారించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడట.ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు సల్మాన్‌ఖాన్‌. ‘కెరీర్‌లో నిలదొక్కుకుంటున్న తొలి రోజులవి. సముద్రతీరానికి దగ్గరగా ఉన్న ఆ బంగ్లాను చూస్తే ముచ్చటేసేది. ఆ ఇల్లు అమ్మకానికి పెట్టినప్పుడు తొలుత నా దగ్గరకే వచ్చారు. కొనడానికి అన్ని రకాలుగా సిద్ధమైపోయా. చివరకు నాన్న సలహాతో వొద్దనుకున్నా’ అని సల్మాన్‌ఖాన్‌ తెలిపారు. ఆరు అంతస్తుల ఆ బంగ్లాకు షారుఖ్‌ఖాన్‌ భార్య గౌరీఖాన్‌ దాదాపు రెండొందల కోట్లతో ఇంటీరియర్‌ డెకరేషన్‌ చేయించింది. షారుఖ్‌ఖాన్‌ అభిమానుల సందడితో మన్నత్‌ పరిసరాలు ఎప్పుడూ బిజీగా కనిపిస్తాయి.