NRI-NRT

ఆగస్టు 14న న్యూయార్క్ లో టీ.ఎల్.సి.ఏ వనభోజనాలు

ఆగస్టు 14న న్యూయార్క్ లో  టీ.ఎల్.సి.ఏ వనభోజనాలు

తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ (టి.ఎల్.సి.ఎ)ఆధ్వర్యంలో న్యూయార్క్ లో ఆగస్ట్ 14న వనభోజనాలు నిర్వహిస్తున్నారు. న్యూయార్క్, హిక్స్ విల్ లోని కాంటియాగ్ పార్కులో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కుటుంబ సమేతంగా అందరూ పాల్గొనేలా అధ్యక్షులు జయప్రకాశ్ ఇంజపూరి ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లలకు, పెద్దలకు సరదా ఆటలు, బహుమతులు, ఫ్యామిలీ ట్రెజర్ హంట్, మెహందీ, జండా వందనం వంటి ప్రత్యేక కార్యక్రమాలతో పాటు వనభోజనాల తరహాలో పసందైన భోజనాలు అందించనున్నారు. న్యూయార్క్, న్యూజెర్సీ మరియు కనెక్టికట్ ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారందరూ టి.ఎల్.సి.ఎ నిర్వాహకులు వనభోజనాలకు ఆహ్వానిస్తున్నారు.