NRI-NRT

కెనడాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులు

కెనడాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులు

కెనడాలో భారత్ రాయబార కార్యాలయాల్లో జరిగే స్వాంత్రత్య వేడుకలకు తగు భద్రతా ఏర్పాట్లు చేయాలని భారత్ కెనడా ప్రభుత్వాన్ని కోరింది. అంతేకాకుండా.. కెనడాలోని భారతీయులు జరుపుకునే వేడుకలకు కూడా భద్రత కల్పించాలని కోరింది. ఈ వేడుకలకు భద్రత కల్పించాలని కేంద్రం కోరడం ఇదే ప్రథమం. గతంలో అదనపు భద్రతా కల్పించాలని మాత్రమే కోరిన ప్రభుత్వం ఈ మారు దేశ ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా భద్రత కల్పించాలని కోరింది.

పాకిస్థాన్, ఖలిస్థాన్ అనుకూల వర్గాలు ఈ వేడుకల్లో ఆటంకాలు సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు భారత వర్గాలు తెలిపాయి. ఇక గతేడాది టొరొంటోలో పనోరమా ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన స్వాంతంత్ర్య దినోత్సవ వేడులకు కొందరు నిరసన కారులు ఆటంకాలు కలిగించారు. అంతేకాకుండా.. వాంకూవర్‌లో జరిగిన తిరంగా ర్యాలీలో నిరసనకారులు హల్‌చల్ చేశారు. అంతకుమునుపు జరిగిన గణతంత్ర దినోత్స వేడుకలకు ఖలిస్తాన్ అనుకూల వర్గాలు తమ నిరసనలతో అడ్డుకున్నాయి. ఈ ఏడాది స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పనోరమా ఇండియా టొరొంటోలో ఇండియా పరేడ్ నిర్వహించనుంది. ఓ భారీ బహిరంగ సభతో ఈ వేడుకలు ముగుస్తాయి. 2019 నాటి వేడుకల్లో 50 వేల పైచిలుకు మంది హాజరయ్యారు. ఇక బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలో ఈ మారు భారతీయులు కార్ ర్యాలీ నిర్వహించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.