NRI-NRT

హంగ్‌కాంగ్‌లో వైభవంగా భారత స్వాతంత్ర్య దినోత్సవం

హంగ్‌కాంగ్‌లో వైభవంగా భారత స్వాతంత్ర్య దినోత్సవం

76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా, కాన్సుల్ జనరల్ మిస్ సత్వంత్ ఖనాలియా హాంగ్‌కాంగ్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమానికి మద్దతుగా హాంకాంగ్‌లోని ప్రవాసులు స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ‘హర్ ఘర్ తిరంగ’ సామూహిక ప్రచారంతో జరుపుకున్నారు.

OFBJP హాంకాంగ్ మరియు చైనా అధ్యక్షుడు సోహన్ గోయెంకా మాట్లాడుతూ “భారతదేశాన్ని భారతీయుల వద్దకు తీసుకెళ్లడం మా లక్ష్యం. హాంకాంగ్‌లోని ప్రతి భారతీయుడికి త్రివర్ణ పతాకాన్ని పంపిణీ చేస్తున్నాం. ఓFభ్ఝ్ఫ్ హాంకాంగ్ మరియు చైనా ప్రతి భారతీయుడి ఇళ్లు మరియు కార్యాలయాలకు 6000 కంటే ఎక్కువ త్రివర్ణ పతాకాలను పంపిణీ చేశాయి. హాంకాంగ్‌లో స్థిరపడిన భారతీయులంతా మాతృభూమిని కీర్తిస్తూ స్వాతంత్య్ర అమృత మహోత్సవాన్ని సంతోషంగా జరుపుకున్నారు.” అని పేర్కొన్నారు.

ఉపాధ్యక్షుడు, రాజు సబ్నానీ, రమాకాంత్ అగర్వాల్, అజయ్ జకోటియా, రాజు షా, కుల్దీప్ ఎస్. బుట్టార్, సోనాలి వోరా ప్రచారానికి మద్దతుగా నిలిచారు. OFBJP హాంకాంగ్ మరియు చైనా ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ మాట్లాడుతూ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.