NRI-NRT

నాలుగవ రోజు గణపతి సేవలో తరిస్తున్న గుత్తికొండ శ్రీనివాస్, ఐకా రవి

నాలుగవ రోజు గణపతి సేవలో తరిస్తున్న గుత్తికొండ శ్రీనివాస్, ఐకా రవి

కాణిపాకం దేవాలయం పునర్నిర్మాణానికి రూ.10కోట్ల భారీ విరాళాన్ని అందించిన అమెరికాకు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రులు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్ లు గత ఐదు రోజుల నుండి కుటుంబ సభ్యులతో కాణిపాకంలోనే నివాసం ఉంటూ మహాకుంభాభిషేకం ఉత్సవాలలో ప్రతినిత్యం పాలుపంచుకుటున్నారు. నాలుగవ రోజు గురువారం నాడు మహా కుంభాభిషేకం ఉత్సవాలను ఉదయం చతుర్వేద పారాయణంతో ప్రారంభించారు. కళశారాధన, లఘు పూర్ణాహుతి, నీరాజన మంత్రం పుష్పం, గ్రామదేవత పూజ, ఘనపూజ, స్వర్ణ కలశ, ప్రతిష్ట పుణ్యఃవచనం, మృత్సం గ్రహణం, అంకురార్పణ, రక్షాబందనం పూజలు నిర్వహించారు. మహా కుంభాభిషేకం ఉత్సవాల్లో భాగంగా ప్రతినిత్యం పెద్ద ఎత్తున భక్తులకు అన్నసమారాధన చేస్తున్నారు. 21వ తేదీన జరిగే మహా కుంభాభిషేకం ఉత్సవాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాల్గవ రోజు (గురువారం)జరిగిన పూజలకు సంబందించిన చిత్రాలు ఇవి.
298960494-2310271099126457-3227298631188418498-n
299168523-2310271062459794-3545558651009575784-n
299182177-2310271212459779-8025311102128172992-n
299193483-2310270982459802-806448580511078082-n
299228052-2310271265793107-2040163260993174075-n
299731828-2310271295793104-1893134210496791072-n
299769844-2310271179126449-7245497368478536056-n
299773592-2310271019126465-348879853026685612-n