Business

బెజవాడ విమాన ప్రయాణీకులకు బంపర్ న్యూస్

బెజవాడ విమాన ప్రయాణీకులకు బంపర్ న్యూస్

అక్టోబర్ 29 నుండి వారానికి 2 రోజులు విజయవాడ నుండి దుబాయ్ కి డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభం.
విజయవాడ-ముంబాయి, విజయవాడ-వారణాసి గతంలో గల ఫ్లైట్స్ ను తిరిగి పునరుద్ధరించాలని, ఢిల్లీకి ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉన్నందున మరొక ఫ్లైట్ అదనంగా వేయాలని నిర్ణయించారు.
విజయవాడ(గన్నవరం) విమానాశ్రయంలో ఎయిర్ పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం మచిలీపట్నం MP వల్లభనేని బాలశౌరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో గత మార్చ్ 11 న జరిగిన సమీక్షా సమావేశం యొక్క మినిట్స్ ను సంబంధిత అధికారులు చదివి వినిపించారు.ఈ సందర్భంగా MP బాలశౌరి మాట్లాడుతూ, గతంలో ప్రయాణీకుల సౌకర్యార్థం డ్యూటీ ఫ్రీ షాప్ లను ప్రారంభించాలని, అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం ఫారెక్స్ కౌంటర్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. గత మీటింగ్ లో నూతన టెర్మినల్ భవన నిర్మాణ పనులు 21 శాతం పూర్తయితే, గత 6 నెలల కాలంలో కేవలం 10 శాతం పనులు మాత్రమే పూర్తి కావడం పట్ల బాలశౌరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత ప్రాజెక్ట్ మేనేజర్ మరియు కాంట్రాక్టర్ ఈ విషయంలో శ్రద్ధ వహించి త్వరిత గతిన పనులు పూర్తి చేయాలని సూచించారు.
వచ్చే జూలై నాటికి టెర్మినల్ పనులన్నీ పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. విమానాశ్రయంలో ఫ్రీ వైఫై గురించి ప్రయాణీకులకు తెలిసే విధంగా మైక్ అనౌన్స్ మెంట్ చేయాలని, సైన్ బోర్డు లు ఏర్పాటు చేయాలని MP కోరారు. ప్రయాణీకుల నుండి అధిక ధరలు వసూలు చేస్తున్న ట్రావెల్స్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉబర్, వోలా వంటి సంస్థల వాహనాలను విమానాశ్రయ పరిధిలోకి ప్రవేశించ డానికి అనుమతించాలని, ప్రయాణీకుల 5 నిమిషాలు ఆలస్యం అయినా విమానంలోకి అనుమతించాలని సూచించారు. విమాాశ్రయం పరిధిలో ఒక కోటి రూపాయల ఖర్చుతో కమ్యూనిటీ హాల్ నిర్మి స్తామని తెలిపారు. ఈ సమావేశంలో కృష్ణాజిల్లా కలెక్టర్ శ్రీ రంజిత్ బాషా, SP శ్రీ పల్లె జాషువా, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ పాల్గొన్నారు