NRI-NRT

వీనులవిందుగా…సింగపూర్ బతుకమ్మ సంబురం

2022 TCSS Singapore Batukamma

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు సంబవాంగ్ పార్క్లో శనివారం నాడు కన్నుల పండువగా జరిగాయి. ఈ సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు ఎన్నారైలు పెద్దసంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడారు. అందంగా ముస్తాబైన బతుకమ్మలకు ఫర్నిచర్ వరల్డ్ వారు బహుమతులు అందజేశారు. సమన్వయకర్తలుగా గడప రమేశ్, సునీత రెడ్డి, రోజా రమణి, దీప నల్ల, రజిత రెడ్డి, నిర్మల రెడ్డి, అనుపురం శ్రీనివాస్ నంగునూరి సౌజన్య,పద్మజ నాయుడులు వ్యవహరించారు. “సింగపూర్ బతుకమ్మ సింగారాల బతుకమ్మ” పాటను ఆవిష్కరించారు. కాసర్ల శ్రీనివాసరావు రచించగా శ్రావ్య అత్తిలి ఆలపించారు.

అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్ కుమార్, రోజా రమణి, నంగునూరి వెంకట రమణ, మరియు కార్యవర్గ సభ్యులు, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, శశిధర్ రెడ్డి, పెరుకు శివ రామ్ ప్రసాద్, కాసర్ల శ్రీనివాస్, శ్రీధర్ కొల్లూరి, భాస్కర్ నడికట్ల, శివప్రసాద్ ఆవుల, రవి కృష్ణ విజాపూర్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.