NRI-NRT

టైమ్స్ స్క్వేర్ వద్ద ఘనంగా తానా బతుకమ్మ

2022 TANA Batukamma At New York Times Square

న్యూయర్క్ లోని టైమస్క్వేర్ వద్ద తానా ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. సుందరంగా అలంకరించిన 20 అడుగుల బతుకమ్మ ఆకట్టుకుంది. న్యూయార్క్-న్యూజెర్సీల నుండి ప్రవాసుల సౌకర్యార్థం తానా బస్సులను ఏర్పాటు చేశారు. కనెక్టికట్, అట్లాంటాల నుండి కూడా ప్రవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనసూయ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మంగ్లీ బతుకమ్మ పాటలు అకట్టుకున్నాయి. మిమిక్రీ రమేష్ ప్రదర్శన అలరించింది. తానా కల్చరల్ కోఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి, మాజీ అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి, తదుపరి అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ, RVP వంశీ వాసిరెడ్డి, ఫౌండేషన్ కోశాధికారి లక్ష్మి దేవినేని తదితరులు పాల్గొన్నారు.