DailyDose

TNI నేటి నేర వార్తలు

TNI నేటి నేర వార్తలు

నవంబర్ 1 నుండి జిల్లా లో ప్లాస్టిక్ ఫ్లెక్సీ లు నిషేధం…
ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు..
జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరిక
ప్రకాశం జిల్లా
కాలుష్య రహిత సమాజం కోసం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ప్రభుత్వం నవంబర్ 1 వ తేదీ నుండి ప్రకాశం జిల్లా లో ప్లాస్టిక్ నిషేధం అమలు చేయాలని, ప్లాస్టిక్ ఫ్లెక్సీ లు ఏర్పాటు చేయరాదని ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు అని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరించారు. బుధవారం ఆయన ఆమేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ప్లెక్సీ ప్రింటింగ్ యాజమాన్యాలతో చర్చించారు..ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేష్ గా తీర్చి దిద్దడం లో జిల్లా అగ్ర గామిగా ఉండేందుకు ప్రజలు సహకరించాలని ప్లాస్టిక్ ఫ్లెక్సీ లు నిషేధం అమలు లో ప్రతి ఒక్కరూ భదుత తీసుకోవాలని వారు పిలుపు ఇచ్చారు.జిల్లా లో ఎక్కడయినా ప్లాస్టిక్ ఫ్లెక్సీ నిషేదానికి ప్రతి ఒక్కరూ సహకరులిచాలన్నారు.అన్ని మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీ అధికారులు, పాలక వర్గాల్లో లాంఛనంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీ లు నిషేధం అమలు లో భాధ్యత తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ కోరారు.

ఏలూరు జిల్లా…..ప్రమాదకరస్థాయిలో కళ్ళచెరువు వంతెన,,ఏలూరు జిల్లా ,కామవరపుకోట మండలం. కళ్ళ చెరువు ,రంగాపురం మధ్యప్రధాన రహదారి వంతెన ప్రమాదకరంగా మారింది ఈ వంతెన మీదగా ఆసన్నగూడెం ,పోలాసగూడెం ,బాధరాల ,ఏములపల్లి ,ముడిచెర్ల పలు గ్రామాలకు సంబంధించి రోజుకి వేల సంఖ్యలు ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. స్కూల్ కి వెళ్ళవలసిన పిల్లలు బస్సుల కోసం అగచాట్లు పడుతున్నారు సంబంధిత అధికారులు స్పందించి వంతెనను బాగు చేయగలరని ప్రజలు కోరుతున్నారు

పల్నాడు జిల్లా పోలీస్…

🚩 పల్నాడు జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు – పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ గారు,.

✳️ ది.21.10.2022 తేదీన జరగబోయే అమరవీరుల దినోత్సవ నిర్వహణకు సంబంధించి నరసరావుపేటలోని స్థానిక మునిసిపల్ మైదానంలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించిన శ్రీ ఎస్పీగారు.

✳️ పల్నాడు జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీ రామచంద్రరాజు గారి పర్యవేక్షణలో ఏఆర్ డిఎస్పీ శ్రీ చిన్ని కృష్ణ గారి ఆధ్వర్యంలో అడ్మిన్ ఆరై రమణా రెడ్డి గారు పరేడ్ కమాండర్ గా చేపట్టిన స్మృతి పరేడ్ రిహార్సల్స్ కార్యక్రమాన్ని శ్రీ ఎస్పీగారు పరిశీలించారు.

✳️ తదనంతరం అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి గుర్తుగా స్థాపించిన స్థూపానికి శ్రీ ఎస్పీగారు గౌరవ వందనం సమర్పించుట.

✳️ అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ పోలీస్ బ్యాండ్ వారు స్మృతి గీతాన్ని ఆలపించగా,పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీస్ వారు కొద్ది నిముషాలు మౌనం పాటించుట.

✳️ తదనంతరం పోలీస్ అమరవీరుల త్యాగాలను గుర్తుకు తెచ్చుకుంటూ వారి కుటుంబ సభ్యులను సన్మానించుట మొదలగు ఘట్టాలను పరిశీలించి,అమరవీరుల త్యాగాలను ప్రజలందరూ స్మరించుకునే విధంగా ఘనంగా నిర్వహించే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని ఏఆర్ అదనపు ఎస్పీ గారిని,ఏఆర్ డిఎస్పీ గారిని శ్రీ ఎస్పీగారు అదేసించినారు.

✳️ మైదానంలో కార్యక్రమానికి సంబంధించిన స్టేజ్ నిర్మాణం,వీఐపీలు మరియు వీవీఐపీలను ఆహ్వానించే కార్యక్రమము మొదలగు వాటిని జాగ్రత్తగా చేపట్టాలని సూచించారు.

✳️ ఈ కార్యక్రమంలో శ్రీ ఎస్పీగారితో పాటు ఏఆర్ అదనపు ఎస్పీగారు, ఏఆర్ డిఎస్పీ గారు,ఆరైలు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

చోరీ కేసులో నిందితుడి అరెస్టు

– 28 సెల్ ఫోన్లు, రూ.500 నగదు స్వాధీనం

– కేసు వివరాలు వెల్లడించిన సీఐ పి.శ్రీను

ఇబ్రహీంపట్నం: స్థానిక స్మార్ట్ ఈ – వరల్డ్ షోరూంలో చోరీకి పాల్పడిన పాత నేరస్థుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ పి.శ్రీను కేసు వివరాలను వెల్లడించారు. కడప జిల్లా, పోరుమామిళ్ల గ్రామం సుందరయ్య కాలనీకి చెందిన సయ్యద్ షాహిద్ బాషా (22) పాత నేరస్తుడు. ఇతనిపై వినుకొండ పోలీస్ స్టేషన్ లో ఐదు, నరసరావుపేట పోలీస్ స్టేషన్ లో మూడు, గిద్దలూరు గడివేముల పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్కటి చొప్పున చోరీ కేసులు నమోదయ్యాయి. చెడు వ్యసనాలకు బానిసైన షాహిద్ బాషా డబ్బులు కోసం నేరాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే నిందితుడు విజయవాడ వచ్చి ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించాడు. స్థానిక ఎన్టీటీపీఎస్ రోడ్ లోని స్మార్ట్ ఈ – వరల్డ్ షాపు మూసి ఉండటం గమనించి ఈనెల 16వ తేదీ రాత్రి 11:30 గంటల సమయంలో షాపు పైన రూఫింగ్ షీట్స్ పై రంధ్రం చేసి 28 సెల్ ఫోన్లు, రూ.35 వేలు నగదు దొంగిలించి పరారయ్యాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. అతని నుంచి 28 సెల్ ఫోన్లు, రూ.500 స్వాధీనం చేసుకున్నారు. చోరీ జరిగిన రెండు రోజుల్లోనే కేసును ఛేదించి నిందితుడిని పట్టుకున్న సీఐ పి.శ్రీను, ఎస్సై యు.పాపారావు, క్రైమ్ సిబ్బంది పి.ఆంజనేయులు, జె.కనకారావు, గోపి, అబ్దుల్ రహమాన్, కె.శ్రీనులను పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, అడిషనల్ డీఎస్పీ – 2 కె.శ్రీనివాసరావు, పశ్చిమ జోన్ ఏసీపీ డాక్టర్ కె.హనుమంతరావు అభినందించారు.

విజయవాడ నోవా కాలేజీ విద్యార్థుల నిరసన..

తమకు న్యాయం చేయాలని కాలేజీ ఎదుట ధర్నాకు దిగిన విద్యార్థులు

నోవా కాలేజ్ యాజమాన్యం మా ముందుకు రావాలని రోడ్డు మీద నినాదాలు…

ఫార్మసీ ౩ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు…

కళాశాలలో కనీస సౌకర్యాలు, పరిశోధన కేంద్రాలు, అధ్యాపకలు లేరని, తమ చదువు నాశనం అయిపోతుందని ఆందోళన…

మూడు సంవత్సరాలుగా ఏదో ఒకటి చెప్పి కాలయాపన చేస్తున్న నోవా కాలేజ్ యాజమాన్యం…

తమకు న్యాయం జరగపోతే జాతీయ రహదారి పై ధర్నా కు సిద్ధమన్న విద్యార్థులు..

పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్న వినని ఫార్మసీ విద్యార్థి విద్యార్థినులు..

🔥 బ్రేకింగ్🔥

చిత్తూరు

బదిలీ చేస్తే నేను వెళ్లిపోవాలా

▪️ కుర్చీ ఇచ్చే ప్రసక్తే లేదంటున్న డి ఈ ఓ పురుషోత్తం

▪️ తన చాంబర్ కు తాళాలు వేసి విజయవాడకు ఉడాయించిన పురుషోత్తం.

▪️ ప్రభుత్వ ఉత్తర్వులు దిక్కరిస్తున్న వైనం ….

▪️ ప్రభుత్వం నుండి ఆదేశాలు అందినప్పటికీ బాధ్యతలు చేపట్టలేకపోతున్న విజయేంద్ర రావు ….

▪️ గందరగోళంలో విద్యాశాఖ..

▪️ జిల్లా కేంద్రంలోనే ఈ వింత పరిస్థితి…

▪️ విద్యాశాఖ పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తం…

▪️ పురుషోత్తం అదే పోస్టులో కొనసాగేందుకు లాబీయింగ్?

▪️ నూతన డీఈవో విజయేంద్రరావు కు ఉత్తర్వులు వచ్చి నాలుగు రోజులు అయినప్పటికీ బాధ్యతలు చేపట్టలేకపోతున్న వైనం…