NRI-NRT

“తానా”పై కోర్టులో కేసు వేసిన నూతన సభ్యులు

“తానా”పై కోర్టులో కేసు వేసిన నూతన సభ్యులు

2022లో తానాలో రికార్డు స్థాయిలో నూతనంగా సభ్యులు జేరారు. జనవరి 31 గడువు లోగా 33వేల మంది జేరగా వీరి వివరాలను పరిశీలించి మార్చి 15 కల్లా ఆమోదించాల్సింది. సభ్యత్వ పరిశీలిన సంఘం (Membership Verification Committee) మార్చి 15 గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయని కారణంగా నూతనంగా తానాలో జేరిన సభ్యులు తానా రాజ్యాంగం ద్వారా తమకు సంక్రమించిన ఒటు హక్కును కోల్పోయారు. ఇది తమ ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటు మేరీల్యాండ్‌కు చెందిన గుడిపాటి కృష్ణ, బత్తు మురళీ మోహన్, టెక్సాస్‌కు చెందిన దారపనేని హజరత్‌లు బాల్టిమోర్‌లోని మేరీల్యాండ్ కోర్టులో కేసు వేశారు.

కోర్టు తుదితీర్పు వెలువరించే వరకు నూతన సభ్యుల ఓటరు జాబితాను విడుదల చేయకుండా నిలుపుదల చేయవల్సిందిగా వీరు తమ దావాలో కోర్టును కోరారు. నేటి సాయంత్రం జరుగుతున్న తానా బోర్డులో ఈ సమస్యపై సానుకూలమైన నిర్ణయం తీసుకుని తానా గౌరవాన్ని కాపాడవల్సిందిగా సభ్యులు కోరుతున్నారు.