ScienceAndTech

బ్యాంకు స్టేట్‌మెంట్లు తనిఖీ చేస్తున్న ఐటీ కంపెనీలు

బ్యాంకు స్టేట్‌మెంట్లు తనిఖీ చేస్తున్న ఐటీ కంపెనీలు

ఐటీ సంస్థల్లో మూన్‌లైటింగ్‌ వివాదం ఇప్పట్లో సమిసిపోయేలా లేదు. ఇప్పటికే కొన్ని ఐటీ కంపెనీలు ఫ్రెషర్లకు భారీ షాకిచ్చాయి. ఇంటర్వ్యూల్లో సెలక్ట్‌ అయిన ఫ్రెషర్లకు అపాయిట్మెంట్‌ లెటర్లు ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ తిరిగి వెనక్కి తీసుకున్నాయి. తాజాగా డెలాయిట్‌ సంస్థ ఆఫర్లను లెటర్లను ఇప్పట్లో ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న ఆర్ధిక సంక్షోభం కలవరానికి గురి చేస్తున్న వేళ.. ఐటీ సంస్థలు ఆఫర్‌ లెటర్లను వెనక్కి తీసుకోవడం చర్చాంశనీయమైంది. అయితే ఆర్ధిక సంక్షోభం కాదని, మూన్‌లైటింగ్‌ కారణమంటూ ఐటీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల రెండేసి జాబులు చేస్తున్న 300మంది ఉద్యోగుల్ని విప్రో తొలగించింది. ఆ తర్వాత దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగులపై ఓ కన్నేశాయి. ఫేక్‌ ఎక్స్‌పీరియన్స్‌ పెట్టిన ఉద్యోగుల్ని గుర్తించడం, బ్యాంక్‌ స్టేట్మెంట్లు పరిశీలించి ఇటీవల ఉద్యోగం పొందిన వారికి తిరిగి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇవన్నీ కొలిక్కి వచ్చేంత వరకు ఫ్రెషర్ల నియామకాలు చేపట్టవద్దని కంపెనీలు నిర్ణయించుకున్నాయి. ఆఫర్‌ లెటర్లను రద్దు చేస్తే ఇండస్ట్రీ నుంచి తప్పుడు సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతో..వాటిని తిరిగి తీసుకుంటున్నాయి.