NRI-NRT

దుబాయి నుండి ఎంత బంగారం తెచ్చుకోవచ్చు?

దుబాయి నుండి ఎంత బంగారం తెచ్చుకోవచ్చు?

చాలామంది దుబాయ్‌ నుంచి పుత్తడిని, బంగారు ఆభరణాలను భారత్‌కు తీసుకొస్తూ ఉంటారు. కానీ ఇండియాలో బంగారంపై దిగుమతి సుంకాన్ని చెల్లించాలి. రోజువారీ ధరించే లైట్ వేర్ బంగారు ఆభరణాలకు కస్టమ్స్ సుంకం నుండి మినహాయింపు ఉన్నప్పటికీ, బార్లు లేదా నాణేల రూపంలో బంగారం కస్టమ్ డ్యూటీ చెల్లించాల్సిందే. ఈ నేపథ్యంలో దుబాయ్‌ నుంచి గోల్డ్‌ తెచ్చుకోవాలంటే కొన్ని మార్గదర్శకాలను పాటించాలి. లేదంటే తిప్పలు తప్పవు. ఒక సంవత్సరానికి పైగా విదేశాలలో నివసిస్తున్న ఒక వ్యక్తి 20 గ్రాముల బంగారు ఆభరణాలను, లేదా 50 వేల రూపాయల విలువకు మించకుండా తీసుకురావచ్చు. అదే మహిళా ప్రయాణికులైతే ఒక లక్ష రూపాయల గరిష్ట విలువ, 40 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకురావచ్చు. కాగా కరెంట్‌ ఖాతా లోటుకు చెక్‌ చెప్పేలా బంగారంపై దిగుమతి సుంకాన్ని ఈ ఏడాది 15 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుముందు ఇది 10.75 శాతం మాత్రమే.