DailyDose

TNI నేటి నేర వార్తలు

TNI  నేటి నేర వార్తలు

🌹ఒక సాధారణ దొంగకు రాజకీయ దొంగకు మధ్య ఉండే తేడా ఏమిటి.?

🌹 సాధారణ దొంగ
మీ డబ్బు దోచుకుంటాడు, పర్సు, చేతి గడియారం, బంగారు గొలుసు మొదలైనవి దోచుకుంటాడు.

🌹 రాజకీయ దొంగ
మీ భవిష్యత్తును, మీ జీవితాన్ని, విద్యా ఉపాధిని, ఆరోగ్యాన్ని, వ్యాపారాన్ని దోచుకుంటాడు.

🌹 చిత్రమేమిటంటే…
సాధారణ దొంగ ఎవరిని దోచుకోవాలో తానే ఎంచుకుంటాడు.

🌹నిన్ను దోచుకునే రాజకీయ దొంగను నువ్వే ఎంచుకుంటావు.

🌹 సాధారణ దొంగను
పోలీసులు తరిమి తరిమి పట్టుకుంటారు.

🌹రాజకీయ దొంగకు ఏ హాని కలుగకుండా పోలీసులే కాపాడుతుంటారు.

మన సమాజంలో ఉన్న విచిత్ర పరిస్థితి ఇది.

🌸మేం “గుడ్డి వాళ్ళం” కాదని మనం గుడ్డిగా అంటాం.

ఈ వ్యవహారమంతటిలోనూ మహా మూర్ఖపు విషయం ఏమిటంటే…
మనం సాధారణ దొంగను అసహ్యించుకుంటాం, చావగొడతాం.

🌹రాజకీయ దొంగను ప్రేమిస్తాం, వాడి కోసం మనం పరస్పరం కొట్టుకుచస్తాం.

ఇదీ నేటి సమాజం తీరు

కుదువ వ్యాపారి దుకాణానికి ఖన్నం వేసిన దుండగులు

చిత్తూరు జిల్లా:

గంగాధరనెల్లూరు మండల కేంద్రంలోని చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారిలో ఓ కుదువ వ్యాపారికి చెందిన దుకాణానికి ఆదివారం రాత్రి ఖన్నం వేసిన గుర్తు తెలియని దుండగులు..

దుకాణం యజమాని బాలురాం ఘటనా స్థలానికి చేరుకోగా దుకాణానికి ముందువైపు ద్వారానికి వేసినతాళాలు వేసినట్లుగా ఉంది..

దుకాణానికి వెనుక వైపు నుండి గోడకు కన్నం వేసి ఉండడాన్ని చూసిన యజమాని ఒక్కసారిగా నివ్వెరపోయారు..

సిఐ మద్దయ్యచారి, ఎస్ఐ శ్రీనివాసులు ఘటనా స్థలాన్ని సిబ్బందితో కలిసి పరిశీలిస్తున్నారు..

ఇప్పటికే ఘటనా స్థల పరిశీలనలో.. ఐడి పార్టీ సిబ్బంది

క్లూస్ టీం కు సమాచారం ఇచ్చిన పోలీసు అధికారులు..

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Andhra Pradesh Fire: ఏపీలో అగ్ని ప్రమాదం..36 ఈ-బైకులు దగ్ధం

Andhra Pradesh Fire: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 36 ఈ-బైకులు దగ్ధమయ్యాయి. ఈ ఘటన పార్వతిపురం జిల్లా, పాలకొండ పట్టణంలో సోమవారం ఉదయం జరిగింది.స్థానికంగా మనం మోటార్స్ అనే ఒక ఈ-బైక్స్ షో రూమ్ ఉంది.ఇందులో దీపావళి స్పెషల్ సేల్ సందర్భంగా విక్రయించేందుకు దాదాపు 36 ఈ-బైకులు, బ్యాటరీలు వంటివి సిద్ధం చేసి ఉంచారు. అయితే, సోమవారం వేకువఝామున షో రూమ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడి బైకులు, బ్యాటరీలు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను ఆర్పేశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు భావిస్తున్నారు.
దీనికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో దగ్ధమైన మొత్తం బైకులు, ఇతర ఆస్తి విలువ దాదాపు రూ.50 లక్షలు ఉంటుందని షో రూమ్ నిర్వాహకులు తెలిపారు.

అంత్యక్రియలు పూర్తైన కొడుకు తిరిగొచ్చాడు, నెల్లూరులో విచిత్ర ఘటన

దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత శవం లేచొచ్చింది. పూడ్చిపెట్టిన శవం మనిషి రూపంలో కళ్లముందు కనపడే సరికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భయపడిపోయారు. ఊరివారంతా హడలిపోయి పరుగులెత్తారు.

దింపుడు కళ్లెం ఆశతో శవానికి దహన సంస్కారాలు చేసేముందు, మూడుసార్లు పేరు పెట్టి పిలవడం హిందూ సంప్రదాయం. చనిపోయినవారు బతికొస్తారని కాదు కానీ, అది ఆచారంగా భావిస్తుంటారు. అయితే అలాంటి ఆచారం కాస్తా ఇప్పుడు నెల్లూరులో నిజమైంది. దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత శవం లేచొచ్చింది. పూడ్చిపెట్టిన శవం మనిషి రూపంలో కళ్లముందు కనపడే సరికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భయపడిపోయారు. ఊరివారంతా హడలిపోయి పరుగులెత్తారు. ఇదేదో కల్పిత కథ కాదు, సీరియల్ లో, సినిమాల్లో జరిగింది అంతకంటే కాదు, నిజ జీవితంలో జరిగిన వాస్తవం. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వడ్లమూడిలో జరిగిన యదార్థ ఘటన.

మనుబోలు మండలం వడ్లపూడి గ్రామంలో పాలేటి వెంకయ్య, రమాదేవి దంపతులు. రమాదేవి గ్రామ సర్పంచ్. వారికి ఇద్దరు పిల్లలు. పెద్ద కొడుకు పేరు సుమంత్, రెండో కొడుకు పేరు సతీష్. ఇటీవల రెండో కొడుకు సతీష్ కుటుంబ సభ్యులపై అలిగి ఇంట్లోనుంచి వెళ్లిపోయాడు. అతనికోసం కుటుంబ సభ్యులు గాలించారు. తెలిసినవారికి ఫోన్ చేశారు, స్నేహితుల్ని ఆరా తీశారు. కానీ ఫలితం లేదు. మూడు రోజులుగా జాడ తెలియలేదు. అయితే వీరు వెదికే క్రమంలో వెంకటాచలం వెంకటాచలం మండలం కనుపూరు చెరువులో ఓ శవం కనిపించింది. ఆ శవం పోలికలు సతీష్ లానే ఉన్నాయి. దీంతో కుటుంబ సభ్యులు శవాన్ని తీసుకొచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు. అంతా అయిపోయాక చిన్న కర్మ కూడా నిర్వహించారు. సతీష్ ఫొటోకి దండవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.

సీన్ కట్ చేస్తే..?

శనివారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. అక్కడ సీన్ కట్ చేస్తే.. ఆదివారం సతీష్ ఇంటికి తిరిగొచ్చాడు. పూడ్చేసిన శవం ఎలా లేచొచ్చిందంటూ తల్లిదండ్రులు కంగారు పడ్డారు. ఊరిలో సతీష్ ని చూసినవారంతా దెయ్యం అంటూ పారిపోవడం విశేషం. కుటుంబ సభ్యులు కూడా సతీష్ ని చూసి దెయ్యం అనుకున్నారు. పరుగులు తీశారు. ఆ తర్వాత అసలు విషయం బయటపడింది.

సతీష్ ఎలా తిరిగొచ్చాడు..?

ఆదివారం సతీష్.. ఇంటికి తిరిగొచ్చాడు. అసలిన్ని రోజులు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడనే విషయం తానే స్వయంగా చెప్పుకొచ్చాడు. అలిగి వెళ్లిన తాను స్నేహితుల దగ్గర ఉన్నానని చెప్పాడు సతీష్. ఫోన్ కూడా స్విచాఫ్ చేసి నాలుగు రోజులుగా రూమ్ లోనే ఉండిపోయాయని అన్నాడు. తీరా ఊరిలోకి వస్తే అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయని తెలుసుకుని పరుగు పరుగున ఇంటికొచ్చానని చెప్పాడు. సతీష్ ని చూసి మొదట భయపడిన కుటుంబ సభ్యులు ఆ తర్వాత ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
చనిపోయాడనుకున్న కొడుకు బతికి రావడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఆ మృతదేహం ఎవరిది..?

అయితే సతీష్ గా పొరబడి అంత్యక్రియలు చేసిన మృతదేహం ఎవరిదనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సతీష్ మృతదేహం అనుకుని తల్లిదండ్రులు కూడా భ్రమపడ్డారు, శవాన్ని పూడ్చేశారు. కానీ ఇప్పుడు సతీష్ బతికి రావడంతో పూడ్చిపెట్టిన ఆ శవం ఎవరిదనేది తేలడంలేదు. దీనిపై పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ శవాన్ని వెలికితీసే పనిలో పడ్డారు.

ఇటీవల విశాఖపట్నంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పట్ల పోలీసులు ఎక్కడా దురుసుగా ప్రవర్తించలేదని నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఈ నెల 15న విశాఖలో పవన్ కల్యాణ్ పర్యటన తర్వాత పరిణామాలపై దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు.

కొందరి సామాజిక మాధ్యమాల అకౌంట్లను, వ్యక్తులను గుర్తిస్తున్నామని వెల్లడించారు. అసత్య ప్రచారాలతో శాంతిభద్రతల సమస్య సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులపై జనసేన నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని స్పష్టం చేశారు.
కుట్ర ప్రకారమే ఎయిర్ పోర్టులో దాడి జరిగినట్టు విచారణలో తేలిందని సీపీ చెప్పారు. మంత్రి రోజాపై దాడి చేయాలనుకున్నారు గానీ, ఆమె పీఏకు గాయమైందని తెలిపారు. ఆ రోజున విశాఖలో పవన్ పర్యటనకు అనుమతి ఉంది కానీ, ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. డీజే, భారీ జనసమీకరణ, డ్రోన్ల వినియోగానికి అనుమతి లేదని వివరించారు.
ర్యాలీకి అనుమతి లేదని, విరమించుకోవాలని కోరితే వినలేదని సీపీ శ్రీకాంత్ వెల్లడించారు. విశాఖలో నాలుగు గంటల పాటు రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయిందని, విమాన ప్రయాణికులు, సామాన్యులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారని తెలిపారు.
పెందుర్తి సీఐ గాయపడ్డారని, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయని అన్నారు. ఈ ఘటనపై 6 వేర్వేరు కేసులు నమోదు చేశామని, 100 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు.