NRI-NRT

ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా కూడా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధం

ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా కూడా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధం

ఫేస్‌బుక్మాతృ సంస్థ మెటా కూడా ట్విట్టర్ బాటలో పయనిస్తోందా అంటే అవునంటోంది వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించిన నివేదిక.మార్క్ జుకర్‌బర్గ్ మెటా సంస్థ కూడా ఈ వారంలో పెద్ద ఎత్తున తమ ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. మెటా ప్లాట్ ఫాం బుధవారం కల్లా ఉద్యోగుల తొలగింపును ప్రకటిస్తుందని అంటున్నారు.మార్క్ జుకర్‌బర్గ్ మెటావర్స్ పెట్టుబడులు ఫలించటానికి దాదాపు ఒక దశాబ్దం పడుతుందని భావిస్తున్నందున ఈలోగా ఖర్చులను తగ్గించుకోవడానికి హైరింగ్, షట్టర్ ప్రాజెక్టులను స్తంభింపచేయాలని యోచిస్తున్నట్లు భోగట్టా.ఇందులో భాగంగా ఈ వారం పెద్ద స్థాయి ఉద్యోగుల తొలగింపుప్రారంభించాలని మెటా సంస్థ యోచిస్తోంది. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించడం, టిక్‌టాక్ నుంచి పోటీ, ఆపిల్ సంస్థ నుంచి గోప్యతా మార్పులు, మెటావర్స్‌పై భారీ వ్యయం గురించి ఆందోళనలతో మెటా పోరాడుతున్నందున ఈ సంస్థకు నిరాశాజనకమైన దృక్పథం ఏర్పడింది.మెటా యొక్క వాటాదారు ఆల్టిమీటర్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ మార్క్ జుకర్‌బర్గ్‌కు బహిరంగ లేఖలో గతంలో కంపెనీ ఉద్యోగాలు, మూలధన వ్యయాలను తగ్గించడం ద్వారా క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.అధిక వడ్డీ రేట్లు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఐరోపాలో ఇంధన సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించడంతో ఇటీవల మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్, ట్విట్టర్, స్నాప్ లతో సహా పలు సాంకేతిక కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించాయి. దీంతో పాటు కొత్తగా ఉద్యోగుల నియామకాలను కూడా తగ్గించాయి