Movies

జీవితం ఓ ఉత్సవం

జీవితం ఓ ఉత్సవం

సీనియర్‌ కథానాయిక కాజోల్‌ సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉంటున్నది. గత ఏడాది ఓటీటీ ఫిల్మ్‌ ‘త్రిభంగ’ ద్వారా ప్రేక్షకుల్ని పలకరించిన ఆమె తాజాగా ‘సలామ్‌ వెంకీ’ అనే చిత్రంలో నటిస్తున్నది. మహిళా ప్రధాన కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సీనియర్‌ నటి రేవతి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్‌ 9న థియేటర్లలో విడుదలకానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను ఈ నెల 14న రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో కాజోల్‌ తన భర్త పాత్రను పోషించిన విశాల్‌ జెత్వాస్‌ను వీల్‌ఛెయిర్‌లో తీసుకెళ్తు కనిపిస్తున్నది.ఈ పోస్టర్‌పై కాజోల్‌ స్పందిస్తూ ‘నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. సుజాత, వెంకటేష్‌ దంపతులు ప్రయాణానికి అందమైన దృశ్యరూపం. ఎన్ని కష్టాలొచ్చినా జీవితం ఓ ఉత్సవం అనే భావనకు అద్దం పడుతుంది’ అని పేర్కొంది. కాజోల్‌ వంటి గొప్ప నటితో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని రేవతి ఆనందం వ్యక్తం చేసింది.